Thursday, 14 August 2014

2014 సాధారణ ఎన్నికలు ` రాజకీయ పరిస్థితులు

          16వ లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత లోక్‌సభ మే 31న ముగుస్తుందని, 16వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మార్చి 15న ప్రారంభమవుతుందని, ఏడు దశల్లో దేశవ్యాపితంగా ఎన్నికలు జరుగుతాయని, 8 లక్షల పోలింగ్‌ బూత్‌లలో 12 లక్షల ఈవీఎంల ద్వారా 78 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొంటారని, పోలింగ్‌కు మూడు వారాల ముందు ఎన్నికల నోటిఫికేష్‌ జారీ చేస్తామని, పోలింగ్‌కు ఆరు వారాల ముందు ఎన్నికల తీదీలను ప్రకటిస్తామని, అప్పటి నుండి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని, జూన్‌ 1 కల్లా 16వ లోక్‌సభ ఏర్పాటవుతుందని భారత ఎన్నికల ప్రధాన కమిషన్‌ ప్రకటించింది.
       2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని జనవరి 3న ఢల్లీిలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. గత పదేళ్ళల్లో ప్రధాని అధికారికంగా నిర్వహించిన మూడవ విలేకరుల సమావేశం ఇది. ‘‘వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థిని కాదని, యుపిఏ`3లో కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారని, రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి అర్హుడని, గ్రామీణ ఉపాధిహామీపథకం` లోక్‌పాల్‌బిల్లు` సమాచారహక్కు చట్టం కంటే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందమే తనకు అత్యంత ఆనందకరమైనదని, పాలనలో అక్రమాలు జరిగినమాట నిజమేనని, నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయలేకపోయామని, మిగిలిన ఐదు నెలల కాలంలో సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెల్తామని మన్మోహన్‌ ప్రకటించారు.
           2014 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంటే రాహుల్‌ను ప్రధానిగా ముందుకు తెచ్చే విధంగా పార్టీ వ్యూహరచన  చేసింది. ఎన్నికల అనంతరమే ప్రధానిని ప్రకటిస్తామని, రాహుల్‌కు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పజెప్పుతున్నట్లు జనవరి 16న జరిగిన సిడబ్ల్యుసీలో నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో నిరుద్యోగానికి, దారిద్య్ర పెరుగుదలకు 14.9.2012న ఎఫ్‌డిఐ రాకపై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం చేసింది. ఎఫ్‌డిఐ ప్రవేశాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. కేంద్రంపై ఆందోళనలు రాకుండా ఈ పరిమితి పెట్టారు.
10 లక్షల జనాభా కలిగిన 51 పట్టణాలలోని చిల్లర దుకాణాలకే ఇది పరిమితం చేసారు. చిల్లర దుకాణాల్లోకి 30శాతం దేశీయ ఉత్పత్తుల సమీకరణ చేయాలి. మిగిలిన 70శాతం విదేశీ దిగుమతుల ద్వారా సేకరించాలి. అనగా విదేశీ దిగుమతులకు ప్రోత్సాహం కల్పించడానికి ఎఫ్‌డిఐ (ఫారెన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) ద్వారా దేశీయ చిల్లర దుకాణాలదారులను కోట్ల సంఖ్యలు నిరుద్యోగులు చేయతలపెట్టారు.
         బహుళబ్రాండ్ల రిటేయిల్‌ వర్తకంలో 51శాతం, బ్రాడ్‌కాస్టింగ్‌లో 74శాతం, విమానయాన రంగంలో 49శాతం,  ప్రభుత్వ కంపెనీల విక్రయం, విద్యుత్‌ పవర్‌ ట్రేడిరగ్‌ ఎక్స్‌చేంజీలలో 49శాతం పెంచారు. అంతకు ముందు సింగిల్‌ బ్రాండ్‌లో 51శాతం ఉండగా దానిని 100శాతానికి పెంచారు. 25 మహా, నవరత్న కంపెనీల నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి జమచేయాలని ప్రధాని ఆదేశం. దేశ బడ్జెట్‌కు లోటును పూడ్చుకోవడానికి లాభాల్లో ఉన్న ప్రభుత్వ కంపెనీలలోని నిల్వను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కేంద్రం కుట్రలు కొనసాగిస్తున్నది. పైగా  ప్రభుత్వ కంపెనీల విక్రయాన్ని ‘‘వాటాల ఉపసంహరణ’’ పేరుతో నిధులు సేకరిస్తున్నారు.
నాలుగు ప్రభుత్వ కంపెనీల విక్రయం :
       ప్రభుత్వ రంగంలోని నాలుగు సంస్థలను ఎఫ్‌డిఐల అనుమతి పేరుతో విక్రయం,  ఆయిల్‌ ఇండియా 10శాతం అమ్మకంతో రు. 15000 కోట్లు,  హందుస్థాన్‌ కాపర్‌లో 9.59శాతం, నాల్కోలో 12.15శాతం, ఎంఎంటిసిలో 9.33శాతం అమ్మకం చేయడానికి 2013`14లో రు.30వేల కోట్ల వాటాల విక్రయానికి నిర్ణయించారు. ఎన్‌టిపిసి (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌), నాల్కో (నేషనల్‌ అల్యూమినియం కార్పొరేషన్‌) , ఎంఎన్‌టీసి (మహా నిగమ్‌ టెలీ కమ్యూనికేషన్‌), సెయిల్‌ ఇంజనీర్స్‌ ఇండియా (స్టీల్‌ అథారిటీ) కంపెనీలలో 2013 నాటికే వాటాలు ఉపసంహరించాలని, అలాగే రాష్ట్రీయ కెమికల్‌ రిఫైనరీస్‌ కూడా అమ్మకానికి పెట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ నవరత్న కంపెనీల్లోని వాటాలను అమ్మి, బహుళజాతి సంస్థలకు లాభాలు చేకేర్చిపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
2014`15 కేంద్ర బడ్జెట్‌ :
         2014`15కు రు. 17,63,214 కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టింది. అందులో రు.5,55,322 కోట్లను ప్రణాళికా బడ్జెట్‌గా చూపింది. ఇందులో పన్నులు రు.11,67,131 కోట్లు కాగా, అప్పులపై చెల్లిస్తున్న వడ్డీలు 4,27,001 కోట్లుగా ఉన్నది. 2013`14లో రివైజ్డ్‌ అంచనాల ప్రకారం పన్నులు రు.10,29,252 కోట్లు కాగా, అప్పులపై చెల్లించడానికి కేటాయించిన వడ్డీలు 3,80,066 కోట్లుగా ఉన్నది. మన ఆదాయ వ్యయాల్లో ప్రజలపై భారాలు వేసి వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నది. అంతేకాక ప్రణాళికా బడ్జెట్‌ ప్రణాళికేతర బడ్జెట్‌లో సగానికి తగ్గింది. సంక్షేమ పథకాలకు కేటాయింపులే తప్పా, నిధుల విడుదల లేదు. ఆహార భద్రతా చట్టానికి అదనంగా 25వేల కోట్లు కావాలని కోరారు. ఆహార భద్రత క్రింద రు.1,15,948.99 కోట్లు కేటాయింపు చూపారు. ఇందులో పెద్దమొత్తం నిధుల దుర్వినియోగం కావడమే తప్ప, అర్హతగల ప్రజలకు అందడం లేదు. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి భిన్నంగా దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి మాత్రమే ఆహార భద్రత కల్పిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రు.28, పట్టణ ప్రాంతాల్లో రు.36లు రోజువారీ ఆదాయం మించినవారిని దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నట్లు ప్రకటిస్తామన్నారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు సబ్సిడీ లేకుండా రు. 2,55,708 కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరంపై 208 కోట్లు మాత్రమే పెంచడం జరిగింది. శాస్త్ర`సాంకేతిక అభివృద్దికి 8,643,36 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ రోజు భారత ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక సలహాలను, నూతన ఆవిష్కరణలను ధనిక దేశాల నుండి దిగుమతి  చేసుకుంటున్నది.
        విద్యారంగానికి కేటాయింపులు పరిశీలిస్తే ప్రాథమిక విద్యకు రు.54,485.10కోట్లు, ఉన్నత విద్యకు రు.26,956 కోట్లు మాత్రమే కేటాయించారు. 1947లో మొదటి ప్రభుత్వం రానున్న 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యతను నిర్మూలిస్తామని ప్రకటించింది. కానీ, ఆరు దశాబ్ధాలు పూర్తయినా నేటికీ భారతదేశ స్థాయిలో విద్య కేటాయింపులు తగ్గడంతో 74.04శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 67.66 శాతం మాత్రమే ఉన్నది. భారత సగటుకు 10శాతం తక్కువగా ఉన్నది.
1961`2011 గణాంకాల ప్రకారం అక్షరాస్యత శాతాలు ఈ విధంగా ఉన్నాయి.
సం॥రం    భారత్‌    ఆంధ్రప్రదేశ్‌
1961    28.3    21.19
1971    34.45    24.57
1981    43.57    29.94
1991    52.21    44.09
2001    64.83    60.47
2011    74.04    67.066
విద్యాభివృద్దికి కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే నిధుల కొరతను సృష్టించి నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో నిరుద్యోగం అనివార్యం. ఆ అనివార్యతను కొనసాగించడానికే ఆరు దశబ్ధాలు గడిచినా దేశం పూర్తి అక్షరాస్యతను సాధించలేకపోతుంది. 5వ తరగతిలోనూ, 10వ తరగతిలోనూ డ్రాపౌట్స్‌ ఎక్కువగా ఉంటున్నది. వివిధ దేశాల్లో విద్యారంగానికి కేటాయింపులు ఈ విధంగా ఉంటున్నాయి.
కెన్యా 21.90శాతం
ఘనా 20.10శాతం
శ్రీలంకా 13
మయన్‌మార్‌ 15
ఇటియోపియా 14.4
మలావి    15.8
భారత్‌    2.3
పై కేటాయింపులు గమనిస్తే విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న లక్ష్యశుద్ది కనపడుతుంది. 
రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పరిస్థితి:
         12 రాష్ట్రాలలో కాంగ్రెస్‌, 5 రాష్ట్రాలలో బిజెపి, మిగిలిన 11 రాష్ట్రాలలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌(మార్చి 1, 2014), ఢల్లీిలలో (ఫిబ్రవరి 2014) రాష్ట్రపతిపాలన కొనసాగుతున్నది. పుదుచ్చెరిలో ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ నుండి రాహుల్‌గాంధీ, బిజెపి నుండి మోడి అప్పుడే ప్రచారం ప్రారంభించారు. వీటికి ప్రత్యామ్నాయంగా 11 పార్టీలతో సిపిఐ(ఎం) పార్టీ చొరవతో మూడవ ఫ్రంట్‌ ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడవ ఫ్రంటుపై బిజెపి తన దాడులు ఎక్కుపెట్టింది. మూడవ ఫ్రంటు రంగంలో ఉంటే తన గెలుపుకు ఆటంకమని భావిస్తున్నది.
 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు
1) ఆంధ్రప్రదేశ్‌         : 2009లో ఎన్నికలు జరిగాయి.
2) అరుణాచల్‌ ప్రదేశ్‌     : 2009 నవంబర్‌` నంబంతుకీ
3) అసోం         : 2011 ` తరుణ్‌గోగాయ్‌
4) హర్యానా         : 2009 ` భూపేందర్‌సింగ్‌
5) హిమాచల్‌ ప్రదేశ్‌     : 2012 ` వీరభద్రాసింగ్‌
6) కేరళ             : యుడిఎఫ్‌తో 2011` పోలాంచాందీ
7) మహారాష్ట్ర         : ఎన్‌సిపితో ` పృద్వీరాజ్‌ఛవాన్‌
8) మణిపూర్‌         : 2012 ` వోక్రాం ఇబోబీసింగ్‌
9) మేఘాలయ         :2013 ` ముకుల్‌సంగ్మా
10) మిజోరాం         : 2008 ` హులతాన్‌ హవ్లా
11) ఉత్తరఖండ్‌         : 2012 ` విజయ్‌ బహుగుణ
12) కర్నాటక         : 2013 ` సిద్ధిరామయ్య సిఎం
బిజెపి పాలిత రాష్ట్రాలు
1) చత్తీస్‌ఘడ్‌         : 2013 ` రమణిసింగ్‌
2) గోవా         : 2012 ` మనోహర్‌ పారికార్‌
3) గుజరాత్‌         : 2012 ` నరేంద్రమోడి
4) మధ్యప్రదేశ్‌         : 2013 నవంబర్‌ ` శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
5) రాజస్థాన్‌         : 2013 నవంబర్‌ ` మహారాణి సిందియా

ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలు
1) త్రిపుర         : సిపిఎం 2013 ` మానిక్‌సర్కార్‌
2) తమిళనాడు         : ఎఐడిఎంకె 2011మే ` జయలలిత
3) నాగాలాండ్‌         : నాగాఫ్రంట్‌ 2013 ` నైపూర్‌రియో
4) బిహార్‌         : జెడి(యు) ` 2011 ` నితిష్‌
5) జమ్మూ Ê కాశ్మీర్‌     : జెకె నేషనల్‌ కాన్ఫరేన్స్‌ ` 2009 ` ఓమర్‌ అబ్దుల్లా
6) పంజాబ్‌         : అకాళీదల్‌, బాదల్‌ `2007 ` ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌
7) యుపి         : ఎస్‌.పి ` 2013 ` అఖిలేష్‌ యాదవ్‌
8) వెస్ట్‌ బెంగాల్‌         : టిఎంసి  ` 2011 ` మమత
9) సిక్కిం         : సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ` 2009 ` పవన్‌కుమార్‌ చామ్లిన్‌
10) ఒరిస్సా         : బిజూ జనతాదళ్‌ ` 2000 ` నవీన్‌ పట్నాయక్‌
11) రaార్ఖండ్‌        : ఘార్ఖండ్‌ ముక్తిమోర్చా 2013` హేమంత్‌ సోరెన్‌
కేంద్రపాలిత ప్రాంతాలు
1) పుదుచ్చెరి     : ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌ 2011
2) చండిఘడ్‌  
3) అండమాన్‌ నికోబార్‌
4) దాద్రా & నగర్‌ హవేలి
5) డామన్‌ & డయ్యూ
6) లక్షదీప్‌
7) డిల్లీ      : 2013నవంబర్‌ `(ఆఫ్‌)  కేజ్రీవాల్‌`2014 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన.
ఆంధ్రప్రదేశ్‌ విభజన చివరి అంకం కొనసాగుతున్నది. ఫిబ్రవరి 18 మరియు 21తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో రాష్ట్ర విభజన బిల్లు మూజివాణి వోటుతో ఆమోదించబడిరది. రాష్ట్రపతి ఆమోదముద్ర 1 మార్చి 2014న పడిరది. బిల్లును గెజెట్‌లో ప్రకటించారు. రాష్ట్రాల అవతరణకు ‘‘ఆపాయింటెడ్‌’’తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ బిల్లుకు అదనంగా 1. ఉత్తర తెలంగాణ, రాయలసమీలకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా, పోలవరం ముంపు గ్రామాలను తూర్పుగోదావరిజిల్లాకు మార్చడానికి ఆర్డినెన్స్‌లు తెస్తానని కేంద్రం చెబుతున్నది. దీంతో విభజన చట్టబద్దత పొందింది. విభజనకు కేంద్ర ప్రభుత్వం ఉప సంఘాలను రాష్ట్ర స్థాయిలో నియమించింది. ఆస్తులు మరియు అప్పుల పంపిణీతోపాటు, సిబ్బంది పంపిణీకి ఉప సంఘాలు కృషి ప్రారంభించాయి. అపాయింటెడ్‌ తేదీతో విభజన ప్రక్రియ ముగిస్తుంది. కానీ ఒకటి రెండు సంవత్సరాలపాటు విభజన అంశాల పంపిణీ కొనసాగుతూనే ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర విభజన ముగిసింది.  గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వల్ల ఎలాంటి ప్రజా సమస్యలు పరిష్కారం కావిడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో రాష్ట్రంలో 1 మార్చి 2014 నుండి రాష్ట్రపతి పాలనను విధించింది.
ప్రస్తుతం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపి కూటములు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నవి. వీటికి దీటుగా మూడవ ఫ్రంటును సిపిఐ(ఎం) పార్టీ 11 లౌకిక పార్టీలతో కలిసి ఏర్పాటు చేసింది. మరిన్ని లౌకిక పార్టీలు మూడవ ఫ్రంటులోకి వచ్చే అవకాశం ఉంది. మూడవ ఫ్రంటు ముందు కనీస కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.
  ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రచార నినాదాలుగా రూపొందించి, కాంగ్రెస్‌`బిజేపీలను ఓడిరచడానికి కృషి సాగిస్తున్నది.
ప్రత్యామ్నాయ కార్యక్రమం:
1) భూ సంస్కరణల అమలు, మిగులు భూముల పంపిణీ. పేదలందరికీ నివాస స్థలాల ఏర్పాటు. బలవంతపు భూ సేకరణ రద్దు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు, తక్కువ వడ్డీ రుణాలు.
2) ఉపాధి కల్పనే లక్ష్యంగా వస్తు తయారీ, మౌలిక వసతుల రంగాల్లో భారీగా ప్రభుత్వ పెట్టుబడులు. మైనింగ్‌, చమురు రంగాల జాతీయీకరణ.
3) పకడ్బంధీగా పన్నుల వసూలు, పన్ను ఎగవేత మార్గాల నివారణ. స్పెక్కులేటీవ్‌ ద్రవ్య పెట్టుబడుల నియంత్రణ. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల రద్దు.
4) ప్రతి కుటుంబానికి కిలో రెండు రూపాయల గరిష్ట ధరకు 35 కేజీల ఆహార ధాన్యాలను అందించేలా సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు. ఆ మేరకు ఆహార భద్రతా చట్టం రూపకల్పన.
5) రాజ్యాంగాన్ని, మతాన్ని విడివిడిగా ఉంచడమే లౌకికవాదం మౌలిక సూత్రంగా రాజ్యంగంలో మార్పులు, మతోన్మాద శక్తులను అరికట్టేందుకు కఠిన చర్యలు.
6) విద్య, ఆరోగ్య రంగాలకు భారీగా బడ్జెటరీ కేటాయింపులు. విద్య, ఆరోగ్య రంగాల ప్రయివేటీకరణ నిలుపుదల. విద్యా హక్కు చట్టం అమలును తప్పనిసరి చేస్తూ  చర్యలు.
7) ఉన్నత స్థాయిల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు స్వతంత్య్ర దర్యాప్తు అధికారంలో లోక్‌పాల్‌ చట్టం.
8) అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు. పార్లమెంట్‌, చట్టసల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు దళిత హక్కుల రక్షణ. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, మైనార్టీలకు రిజర్వేషన్ల కల్పించేందుకు రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సుల అమలు. ఆదివాసీల ఐదు, ఆరో షెడ్యూల్‌ హక్కుల పరిరక్షణ.
9) కార్మిక హక్కుల పరిరక్షణ. కనీస వేతనాలు, సామాజిక భద్రతా చర్యల అమలు, కాంట్రాక్ట్‌`క్యాజువల్‌ కార్మిక విధానం రద్దు.
10) స్వాతంత్ర విదేశాంగ విధానం అమలు.
28.02.2014
సారంపల్లి  మల్లారెడ్డి

Sarampally Mallareddy

ఆరుదశాబ్దాలు గడిచినా త్రాగునీరు నోచని ప్రజలు

       2010`11 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రు.9000 కోట్లు ‘‘జాతీయ గ్రామీణ అభివృద్ధి త్రాగునీటి పథకం’’ కింద కేటాయించి దేశంలోని అన్ని గ్రామాలకు రక్షత త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణాభివృధ్ధిశాఖ పథకం రూపొందించింది. ముఖ్యంగా దళిత, గిరిజన పల్లెలకు, మురికా వాడలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ నిధులలో 20శాతం రాష్ట్రాలకు కేటాయిస్తూ, రాష్ట్రాలు వారి పథకాలకు 50:50 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కోరింది. ఇప్పటికే అనేక గ్రామాలకు త్రాగునీటి సౌకర్యంలేదు. ప్రజలు 10`12 కి.మీ వెళ్ళి త్రాగునీరు తెస్తున్నారు. ఒక వ్యక్తికి రోజుకు 40 లీటర్ల నీరు అవసరం. కానీ 10లీటర్ల లోపు లభ్యత లేని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే 1500 వరకు ఉన్నాయి. ఆరు దశాబ్దాలు గడిచినా మన ప్రభుత్వాలు త్రాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయాయి. భూగోళంపైనున్న ప్రతి ప్రాణికి నీరు అవసరం. నీటి లభ్యత తగినంత ఉంది. కానీ ప్రభుత్వాలు వినియోగంలోకి తేకపోవడంతో అనేక మంది అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. ఈ పరిస్థితులు గమనించి 1.3.92న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం మార్చి 23ను త్రాగునీటి దినంగా పిలుపిచ్చింది. ప్రపంచంలో మొదటిసారి 22మార్చి 1993న ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచంలో 78.3 కోట్ల మందికి రక్షిత నీరు లేదు. 7 లక్షల మంది పిల్లలు కులుషిత నీరు త్రాగి డయోరియాతో యేటా మరణిస్తున్నారు. అనగా రోజుకు 2000 మంది పిల్లలు మరణిస్తున్నారు. దీనిని నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఉద్యమం చేపట్టింది. అనేక ధనిక దేశాలు పేద దేశాలకు గ్రాంట్ల రూపంలో త్రాగునీటి పరిష్కారానికి నిధులు ఇస్తున్నాయి. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.
ఆర్శనిక్‌ మందులు, ఫ్లోరైడ్‌ నీరు, చౌడు కలిసిన నీరు(సెలినిటి) ఇనుము తదితర ఖనిజ లవణాలు కలిసిన నీరు, నైట్రేట్స్‌ మరియు బ్యాక్టీరియా కలుషితం జరిగిన నీటిని త్రాగునీటిగా వినియోగిస్తున్నాం. భారత దేశస్థాయిలో 11.51 లక్షల గ్రామాలకు రక్షిత నీరు ఉన్నట్టు, 5.70 లక్షల గ్రామాలకు పాక్షికంగా సరఫరా చేస్తున్నట్టు, 1.44 లక్షల గ్రామాలు కలుషిత నీటిని వినియోగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 85శాతం భూగర్భ జలాలపైననే ఆధారపడి ఉన్నారు. 35శాతం పైపు వాడుతున్నారు. 12శాతం మాత్రమే రక్షిత నీటి ట్యాపులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత 34,700 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు లభ్యత ఉండగా, 14,112 మిలియన్‌ క్యూబిక్‌ మిటర్లు మాత్రమే వినియోగిస్తున్నాం. అనేక పథకాలు ప్రవేశపెట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఈ విధంగా వున్నాయి.
1)     అత్యవసర గ్రామీణ నీటి సరఫరా పథకం(ఎఆర్‌డబ్ల్యుఎస్‌). దీనిని భారత ప్రభుత్వం 1972`73లో             ప్రారంభించి 1973`74లో ఉపసంహరించింది. తిరిగి 1977`78లో కొనసాగించింది. 2009`10లో ఈ పథకం పేరు ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి (నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ వాటర్‌ ప్రాజెక్టు)గా మార్చారు.
2)     కనీస అవసర కార్యక్రమం(ఎమ్‌ఎన్‌పి). ఐదవ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ త్రాగునీటి సరఫరా  కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ముఖ్యంగా దళితులు, గిరిజనుల సబ్‌ప్లాన్‌ నిధులను వినియోగించి   త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి.
3)     ప్రధానమంత్రి గ్రామోదయ యోజన గ్రామీణ నీటి సరఫరా పథకం(పిఎమ్‌జివై`ఆర్‌డబ్ల్యుఎస్‌పి), దీనిని             2000`01లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన కింద ప్రారంభించింది. ఈ  పథకానికి ఎమ్‌ఎన్‌పి(దళిత, గిరిజన సబ్‌ప్లాన్‌) నిధులను కూడా కలిపారు.
4)     నాబార్డ్‌(ఆర్‌ఐడిఎఫ్‌), 2000`01 సంవత్సరం నాబార్డ్‌ ఆర్థిక సహాయంతో గ్రామీణ త్రాగునీటి పథకాలు             ప్రారంభించారు. ఇందులో నాబార్డు 85శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15శాతం భరించాలి.
5)     అంబేద్కర్‌ జీవనధార(ఎజెడి), ప్రధానంగా దళిత, గిరిజనులు నివసించే ప్రాంతాలకు గ్రామీణ త్రాగునీటి             పథకం వర్తింప చేయడానికి దీనిని ఉద్దేశించారు.
6)     హడ్కో 2004`05లో (హౌసింగ్‌ Ê అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (హడ్కో) నుండి గ్రామీణ  త్రాగునీటి పథకాలకు మరియు సమస్యాత్మక గ్రామాలకు త్రాగునీటి సరఫరాకు ఆర్థిక సహాయం  చేస్తారు.
7)     ఎడారి అభివృద్ధి కార్యక్రమం(డిడిపి), కేంద్ర ప్రభుత్వం 100శాతం సహాయంతో అనంతపూర్‌ జిల్లాలో             ప్రజలకు, పశువులకు త్రాగునీటి సహకారానికి నిధులు కేటాయించాలి.
8)     స్వజలధార కార్యక్రమం, 25 డిసెంబర్‌ 2002న ప్రధాన మంత్రి వాజ్‌పేయిగారు  ఆంధ్రప్రదేశ్‌,                 ఆదిలాబాద్‌ జిల్లా ఆవాల్‌పూర్‌ గ్రామంలో త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం మూడు  మాసాలు నడవగానే మూతపడిరది. ఇలాంటి పథకాలను మరిన్ని గ్రామాలలో పెట్టడానికి ప్రయత్నించి  విఫలం చెందారు. పై కేంద్ర ప్రభుత్వ పథకాలే కాక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారానూ, ప్రణాళికా   నిధుల ద్వారానూ అనేక పథకాలు చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు. చివరికి గ్రామాలలో త్రాగునీటి  సౌకర్య కల్పనకు పథకాలు రూపొందించారు. అయినా ఇంతవరకూ త్రాగునీటి సమస్య పరిష్కరించబడలేదు.
ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి :
రాష్ట్రంలో 8.46 కోట్ల జనాభా (2011) ఉండగా 6.40 కోట్ల మంది గ్రామాలలో నివసిస్తున్నారు. 6 జిల్లాలలో గిరిజనులు అడవి ప్రాంతాలలో నివసిస్తున్నారు. నేటికీ గ్రామిణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలోనూ నివసించే ప్రజల త్రాగునీటి పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా ఉంది. 4`5 కి.మీల నుండి తెచ్చుకున్న నీటిని బహు జాగ్రత్తగా వాడుకోవాలి. మొత్తం గ్రామాలు 72,147 ఉండగా (21,634 గ్రా.పం) రోజుకు తలసరి 40లీటర్లు వినియోగించే గ్రామాలు 36,727 ఉన్నాయి. 10`39లీ. వినియోగించే గ్రామాలు 34,074 ఉన్నాయి. మిగిలినవి 10లీ లోపు వినియోగించే గ్రామాలు. 210 పట్టణాలకు కల్పించిన త్రాగునీటి వనరులు పట్టణ ప్రాంతాలకు కల్పించలేదు. మొత్తం గ్రామాలలో 3,33,123 చేతి పంపులు, 46,451 పిడబ్ల్యుఎస్‌ స్కీమ్‌లు, 462 సిపిడబ్ల్యుఎస్‌ స్కీమ్‌లు, 51 నీటి పరిక్షా కేంద్రాలు పని చేస్తున్నాయి. కానీ ఇందులో 35శాతం చేతి పంపులు పని చేయడం లేదు. రిపేర్లు చేయడానికి గ్రామపంచాయితీల వద్ద నిధులు లేక గ్రామాలలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది. యేటా మార్చి నెల ప్రవేశించినప్పటి నుండి జూలై ఆఖరు వరకు గ్రామాలలో త్రాగునీరు లభ్యత లేదు. జనగామా నియోజకవర్గంలోని పట్టణాలకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నియోజకవర్గంలోని గ్రామాలకు నీటిని ఫీల్టర్‌ చేయకుండానే, డీ`ఫ్లోరైడ్‌ చేయకుండానే సరఫరా చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఉన్న ఆరోగ్యం కూడా దెబ్బతిని ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చెక్‌డ్యాంలు, ఊటచెరువులు, ఉపరితల కుంటలు, వర్షపు కుంటలు, రీఛార్జ్‌ కుంటలు, భారీ మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది.
1969`2007 వరకు త్రాగునీటికి రాష్ట్రంలో 65.83 కోట్ల వ్యయం జరిగింది. ఈ దిగువ పనులు చేసారు.
(1) హాండ్‌పంపులు (2) ఎస్‌విఎస్‌ (సింగిల్‌ విలేజ్‌) స్కీమ్‌లు (3) ఎంవిఎస్‌  (బహుళ గ్రామాలు) స్కీమ్‌లు
ఉపరితల నీటి వినియోగం 23% మరియు  భూగర్భజలాలు 72% వినియోగంలోకి తేవడానికి అంచనా వేసారు.


        రాష్ట్రంలో మొత్తం గ్రామాలు 72147 ఉండగా 50శాతం గ్రామాలకు కూడా రక్షిత నీరు లేదు. ఆ ప్రయత్నమే లేదు. పథకాలెన్ని ప్రవేశపెట్టినా గ్రామీణ నీటి  సరఫరా నేటికీ పూర్తికాలేదు. ఇక పట్టణాల సంగతి సరేసరి. 210 పట్టణాల్లో త్రాగునీటి కన్నా మురుగునీటి పారుదల  సమస్యగా ఉంది. సీవరేజ్‌ బోర్డువారు త్రాగునీరు ` డ్రైనేజీ (సానిటేషన్‌) రెండు వ్యవస్థలను నిర్వహిస్తున్నారు. రకరకాల పథకాలతో ప్రవేశపెట్టిన త్రాగునీటి పథకాలు, శానిటేషన్‌ పథకాలు మధ్య దళారీలు కాజేస్తున్నారు. పట్టణాల్లో  కాంట్రాక్టర్లే మున్సిపాలిటీలను కార్పొరేషన్ల నిధుల వ్యయంపై పెత్తనం చెలాయిస్తున్నారు. చివరకు త్రాగునీటిని వ్యాపారంగా మార్చివేసారు.
త్రాగునీటి వ్యాపారం :
సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో త్రాగునీటిని వ్యాపార సరుకుగా మార్చివేశారు. బహుళజాతి సంస్థలు ఈ రంగంపై గుత్తాధిపత్యం కలిగి వేల కోట్లు ఆర్జిస్తున్నారు. సోయూజ్‌ లియోన్నాయిస్‌, మెక్‌డోనాల్డ్‌, కోకోకోలా(కిన్‌లే) పెప్సి, మోన్‌శాంటో, థామస్‌వాటర్‌, నార్త్‌వెస్ట్‌వాటర్‌, వివిండ్‌ఎన్విరాన్‌మెంట్‌, ఎన్‌రాన్‌, కింగ్‌ఫిషర్‌ లాంటి సంస్థలు వేల కోట్ల త్రాగునీటి వ్యాపారం సాగిస్తున్నాయి. టాటా కంపెనీతో యురేకా ఫోర్బ్స్‌ జాయింట్‌ వెంచర్‌గా కలిసి నీటి వ్యాపారం సాగిస్తున్నారు. వీరంతా త్రాగునీటి వ్యాపారం చేయడం ఫలితంగా ప్రభుత్వం ఉచితంగా రక్షిత త్రాగునీటిని అందించే పథకాలకు అడ్డుపడుతున్నారు. గ్రామీణ రక్షిత పథకాలను చేపట్టి దశాబ్దాలు గడిచినా పెండిరగులో పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ బహుళజాతి సంస్థలు ఏర్పాటు చేసిన 56 మందుల తయారీ కంపెనీలు వదులుతున్న కాలుష్యం త్రాగునీటిలోకి చేరినట్టు పరిశోధనల ద్వారా తెలిసింది. మద్యం తయారీకి వేల కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. 1లీ బీరు తయారు చేయడానికి 10లీ ల నీరు కావాలి. ప్రస్తుతం త్రాగునీరు రు.15`20 ఉండగా లీటరు పాలు గ్రామాలలో రు.15`20 అమ్ముతున్నారు. ప్రస్తుతం నీటి వ్యాపారం ప్రపంచవ్యాపితంగా యేటా 400 కోట్ల డాలర్ల వ్యాపారం సాగుతున్నది. గ్రామాలలో డీ`ఫ్లోరైడేషన్‌ చిన్న యంత్రాలను పెట్టి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. వీరు సరఫరా చేసే నీటికన్నా బోరునీరు వినియోగం మంచిదని పరిశీలకులు చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రతి కుటుంబం త్రాగునీరు కొనుగోలుపైననే ఆధారపడి వుంటున్నారు.
హైదరాబాదు పట్టణ త్రాగునీటి సమస్య :
హైదరాబాదు నగరంలో సంపన్నుల కాలనీలో ఎలాంటి ఆటంకం లేకుండా అధిక మొత్తంలో నీరు సరఫరా అవుతుండగా పేదలు నివసించే బస్తీలలో సరఫరా తక్కువగా ఉంటుంది. సంపన్న కాలనీవాసులు సరఫరా అవుతున్న నీటిని వాహనాలు కడగడానికి, చెట్లకు పెట్టడం, స్విమ్మింగ్‌ఫూల్స్‌, పెంపుడు జంతువులకు స్నానం చేయించడం లాంటి వాటికి వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాదు పట్టణానికి ఈ దిగువ విధంగా రోజుకు మిలియన్‌గాలన్లు  నీరు వస్తున్నది.
1) ఉస్మాన్‌సాగర్‌ ` 25 ఎంజిడి
2) హిమాయత్‌సాగర్‌ ` 14 ఎంజిడి
3) కృష్ణా ఫేజ్‌ 1 `90 ఎంజిడి
4) కృష్ణా ఫేజ్‌ 2 ` 90 ఎంజిడి
5) మంజీరా(సింగూరు) ` 120 ఎంజిడి
మొత్తం 340 ఎంజిడిలు వస్తున్నాయి. ప్రస్తుతం 700 ఎంజిడిలు రోజుకు కావాలి. ప్రపంచంలో ఇంత వత్యాసం ఎక్కడా లేదు. మూడవ దశగా కృష్ణా నుండి రు.1670 కోట్లతో 1.6.2013న కిరణ్‌కుమార్‌రెడ్డిగారు మూడవదశ మరో 90 ఎంజిడిలకు శంఖుస్థాపన చేశారు. పనులు సాగుతున్నాయి. పట్టణ జనాభా పెరిగిపోతున్నది. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాలలో పట్టణానికి ఆనుకొని ఉన్నవాటికి త్రాగునీటి సౌకర్యంలేదు. ప్రస్తుతం మెట్రోపాలిటన్‌ మరో 600 చ. కి.మీలకు వ్యాపించి ఉంది. మరో 100చ. కిమీ పెరగబోతున్నది. ప్రస్తుతం హైదరాబాదులో 5.3 లక్షల పంపుసెట్ల కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. బచావత్‌ తీర్పు ప్రకారం కృష్ణా జలాల నుండి హైదరాబాదుకు త్రాగునీటికి సంవత్సరానికి 3.90 టిఎంసిలు మాత్రమే తీసుకురావాలి. కానీ ఇప్పటికీ ఇప్పటి మూడు దశలు రోజుకు 270 ఎంజిడిల నీటిని రాబడుతున్నారు. అనగా సంవత్సరానికి 16 టిఎంసిల కృష్ణా జలాలను వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్‌ నీటి లెవెల్‌ 511 అడుగులు ఉన్నప్పుడు డెడ్‌స్టోరేజీ 175 టిఎంసిలు ఉంటాయి. వీటిని వినియోగించరాదని జి.వో 69/1996లో అఖిలపక్షం ఆమోదంతో తెచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో డెడ్‌స్టోరేజీ నుండి త్రాగునీటిని వినియోగించవచ్చు.
        హైదరాబాదు పట్టణానికి గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 120 ఎంజిడి గోదావరి ఉపనది మంజీరా నుండి నగరానికి వస్తున్నాయి. అనగా సంవత్సరానికి 7 టిఎంసిలు తెస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత ఇంద్రావతిలు కలిసిన తరువాత నీరు పుష్కలంగా ఉంటుంది. యేటా 4000 టిఎంసిల వరకు సముద్రంపాలవుతున్నాయి. ప్రాణహిత కలిసిన తరువాత(కాళేశ్వరం నుండి) 30 కి.మీల దిగువన గోదావరిపై కంతాలపెల్లి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట నుండి హైదరాబాదు పట్టణానికి 50 టిసిఎంల నీటిని తెచ్చే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి ఆటంకాలు లేవు. మనం వినియోగించకున్నా నీరు వృధాగా సముద్రం పాలవుతాయి. కంతాలపెల్లి ప్రాజెక్టుకు 19.2.2009న రాజశేఖరరెడ్డిగారు శంఖుస్థాపన చేశారు. G85 మీటర్ల ఎత్తు నుండి నల్లగొండ జిల్లాలోని ఆలేరు నదిపై నిర్మించే బేగంపేట రిజర్వాయర్‌, G 520మీ వరకు 4 ఎత్తిపోతల ద్వారా నీటిని తేవాలి. కంతాలపెల్లి నుండి ఆలేరుకు 170 కి.మీ దూరం కాగా ఆలేరు నుండి హైదరాబాదుకు 70కి.మీ దూరం ఉంటుంది. అనగా కంతాలపెల్లి నుండి 240 కి.మీ లలో హైదరాబాదుకు త్రాగునీటిని అందించవచ్చు.
         హైదరాబాదులో త్రాగునీటి వ్యాపారం పెద్దఎత్తున సాగుతున్నది. ఈ వ్యాపారవేత్తలు మెట్రో త్రాగునీటిని కూడా తమ వ్యాపారానికి వినియోగించుకుంటున్నారు. కిన్‌లే కంపెనీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజుకు 1కోటి రూపాయల లాభం సంపాదిస్తున్నది. గ్రామస్తులకు మాత్రం త్రాగునీటి ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.
          త్రాగునీటి వనరుల కల్పనకు ప్రస్తుతమున్న పథకాలన్నిటినీ ఒక ఎజెండా కిందకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను, విదేశీ సహాయాన్ని అన్నింటిని ఒకే వ్యవస్థ ద్వారా వ్యయం చేయాలి. వివిధ వ్యవస్థల కింద చెపట్టడం వలననే ఈ దుస్థితి కొనసాగుతున్నది. త్రాగునీటి వ్యాపారాన్ని నిషేధించాలి. బహుళజాతి సంస్థలను త్రాగునీటి వ్యాపారం చేయకుండా కట్టుదిట్టం చేయాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
సారంపల్లి మాల్లారెడ్డి
20.04.2012

2014`15 కేంద్రబడ్జెట్‌ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతుందా.?

2014`15 సంవత్సరానికి ఆర్థిక మంత్రి చిదంబరం 20 ఫిబ్రవరి 2014న లోక్‌సభలో ఓట్‌ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్‌ రూ.15,90,434 కోట్లు కాగా రూ. 2014`15 బడ్జెట్‌ను రూ. 17,63,214 కోట్లకు పెంచి పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇందులో వ్యవసాయ రంగానికి ప్రణాళికా బడ్జెట్‌ క్రింద రూ. 21,609కోట్లు, పరిశోదనలకు రూ. 3,415 కోట్లు, పశు సంవర్థనకు రూ.2,074 కోట్లు కలిపి మొత్తం రూ. 27,098కోట్లు చూపారు. గత సంవత్సరంపై రూ. 3,616 కోట్లు అదనంగా చూపారు. ప్రణాళికేతర బడ్జెట్‌గా రూ. 2865 కోట్లు చూపారు. ప్రణాళికా బడ్జెట్‌లో వ్యవసాయ ప్రణాళికా బడ్జెట్‌ 4.88 శాతంగా వుంది. మొత్తం బడ్జెట్‌ను పరిశీలించినప్పుడు మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ బడ్జెట్‌లో వ్యవసాయ బడ్జెట్‌ 1.70 శాతం మాత్రమే. గత సంవత్సరంపై బడ్జెట్‌ పెరిగినా గత సంవత్సరం కేటాయించిన శాతం కంటే తక్కువే. అందువల్ల వ్యవసాయ రంగం వృద్ధిరేటు కూడా తగ్గుతూనే ఉంది.
వ్యవసాయ గ్రోత్‌రేటు (2004`05సంవత్సర ధరల ప్రకారం)
2010`11         8.9 శాతం
2011`12        6.7 శాతం
2012`13        4.5 శాతం
2013`14        4.9 శాతం
ఉత్పత్తి తగ్గుతునప్పటికి ప్రాధాన్యతా రంగానికి నిధులు కేటాయించడానికి సుంకంగా లేదు. ఆహార దాన్యాల ఉత్పత్తి 2011`12లో 25.93 కోట్ల టన్నులు కాగా 2012`13లో 25.54కోట్ల టన్నులకు తగ్గింది. సహాకార రుణాలు పెద్దఎత్తున పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ వాస్తవ సాగు దార్లకు రుణాలు అందటం లేదు. వ్యవసాయ అవసరాల పేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొంది ఇతర వ్యాపారాలకు మళ్ళించిన వారి రుణాలు, కోల్డ్‌ స్టోరేజీలకు, భారీ యంత్రాలకు (హార్‌వెస్టర్స్‌)కు, భూమి సాగు చేయని భూ యజమానులు తీసుకున్న రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణిస్తున్నారు. వాస్తవానికి బ్యాంకులిచ్చిన వ్యవసాయ రుణాలలో 50శాతం కూడా వాస్తవ సాగు దార్లకు చేరడంలేదు.
రుణ పంపిణీ ఈ విధంగా ఉంది రూ. కోట్లలో
2003`04        86,981
2011`12        5,11,029
2012`13        6,07,375
2013`14        7,35,000
2014`15 సంవత్సరానికి గతం కన్నా తక్కువగా 7 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. 2013`14 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపుదల చేస్తూ 25.54కోట్ల టన్నుల నుండి 25.30 కోట్ల టన్నులకు పెరుగు తుందని అంచనా వేసారు రబ్బీ పంట ఇంకా చేతికి రావలసి ఉంది. 2013`14లో వ్యవసాయ ఎగుమతులు 41 బిలియన్‌ డాలర్లకు చేరుతాయని దిగుమతులు 20 బిలియన్‌ డాలర్లు ఆర్థిక సర్వేలో సూచించారు. వ్యవసాయ గ్రోత్‌రేటు జిడిపిలో 3.1 శాతంగా ఉంటుందని దీనిని నాలుగు శాతానికి పెంచడానికి ప్రయత్నిస్తామని ఆర్థిక మంత్రి చిదంబంరం తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు.


ఈ నిధులతో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదక పెరుగుతుందా.? 2013`14లో కేంద్రం రాష్ట్రాలకు రూ.11,911కోట్లు కేటాయించగా 2014`15 సంవత్సరం రూ. 4,321కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టి చూస్తే వ్యవసాయంపై కేంద్రానికున్న శ్రద్ధ కనబడుతుంది. ముఖ్యంగా పరిశోధనలకు రానురానూ నిధులు తగ్గుతున్నాయి. 2014`15కు రూ. 3,415కోట్లు మాత్రమే కేటాయించారు. ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 27 పరిశోధనా కేంద్రాలక్రింద 5,030 ఎకరాల భూమి ఉంది. 2005నుండి క్రమంగా వ్యవసాయ పరిశోధనలు తగ్గుతూ నేడు పూర్తిగా ఆపివేసారు. విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మన్‌సాంటో, డూపాయింట్‌, కార్గిల్‌, సింజెంటా లాంటి కంపెణీల పరిశోధనలపై మన ప్రభుత్వాలు ఆధారపడే దుస్థితికి నెట్టబడ్డాయి. హరిత విప్లవంలో ఐదు రెట్లు ఆహార దాన్యాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని స్వయం పోషకత్వంలోకి తెచ్చిన వ్యవసాయ విధానాలు సరళీకరించి 2005 నుండి దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి నెట్టారు. ధనిక దేశాలు తమ ఆహార దాన్యాలను మనకు అవసరం ఉన్నాలేకున్నా దిగుమతులు చేస్తూనే ఉన్నారు. వంట నూనెలు, పంచదార, పత్తి, పట్టు, ఉత్పత్తులను పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నారు. వారికి అనుకూలంగా దిగుమతి సుంకాలను కూడా పూర్తిగా రద్ధు చేసారు.
 దేశంలోకి వంటనూనెల దిగుమతులు ఇలా ఉన్నాయి. (దిగుమతులు, ఉత్పత్తి : లక్షల టన్నులలో, విలువ : కోట్ల రూపాయలలో)


దేశంలో నూనె గింజల ఉత్పత్తికి అవకాశాలున్నప్పటికీ అందుకు తగిన నిధుల కేటాయించక పోవడం వల్ల ఉత్పత్తిలో తగినంత సాధించలేక పోయాం. మన దేశీయ ఉత్పత్తి ఈ విధంగా ఉంది.
కొన్ని నూనెగింజల పంటల పరిస్థితి ఈ దిగువ విధంగా ఉంది. (లక్షల టన్నులలో)


రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సోయా పంటకు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం పత్తి, మిరప పంటల వల్ల నష్టపోతున్న రైతులకు సోయా ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. ఎకరాకు అతితక్కువ 8 క్వింటాళ్ళ నుండి 13 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. కనీస మద్దతు ధర రు.4500 ఉండాలి. అయినప్పటికీ కిలో నూనె రు.50లకు అమ్మవచ్చు. పెట్టుబడిపోగా ఎకరాకు రు.20వేలు గిట్టుబాటు అవుతుంది. ఇటు వినియోగదారులకు అటు ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో సోయా వేయడానికి రైతులు ముందుకు వచ్చినా కనీసం విత్తన సరఫరా చేయలేకపోయింది. చైనా, అమెరికాల్లో సోయా ఉత్పత్తి అత్యంత కీలకమైంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి ర్యాంకులో ఉంది. 
వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి బడ్జెట్‌లో కనీసం పది శాతం కేటాయించాలి. కనీసం పెట్టుబడి దారీ దేశాలలోని వ్యవసాయ విధానాలనైనా పాటించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
24.02.2014

ప్రభుత్వాలు మానిఫెస్టోలు అమలు జరపాలి

    తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పాలకపక్ష పార్టీగా అవతరించింది. తన మానిఫెస్టోలో ‘‘రైతులందరికీ రుణమాఫీ, 8 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, పంపుసెట్లపై సర్‌ఛార్జీ రద్దు, విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణ, నిజామాబాద్‌ జిల్లాలో చెరుకు, పసుపు పరిశోధనా కేంద్రాల ఏర్పాటు గ్రీన్‌ హౌస్‌ కల్టివేటర్‌లకు 75శాతం సబ్సిడీ, చిన్న సాగునీటి వ్యవస్థ పునరుద్ధరిస్తామని’’ టిఆర్‌ఎస్‌ ప్రకటించింది.
    అదేవిధంగా తెలుగుదేశం తన మానిఫెస్టోలో ‘‘వ్యవసాయ రుణాలమాపీపై తొలిసంతకం చేస్తానని, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, మెట్ట ప్రాంతాలకు సాగునీటి కల్పన, వాటర్‌హార్వెస్టింగ్‌, వాటర్‌షెడ్‌ పథకాలు, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్‌, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రు.1000 కోట్లతో మార్కెట్‌ ఇన్‌టర్‌వెన్షన్‌ఫండ్‌ ఏర్పాటు మరియు ఎం.ఎస్‌ స్వామినాధన్‌ చెప్పినట్టు వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర నిర్ణయం చేస్తామని’’ ప్రకటించారు.
    వాస్తవానికి రుణమాఫీలు చేయాలంటే 29.05.2014 రోజున జరిగిన బ్యాంకర్ల కమిటీ సమీక్ష ప్రకారం రైతుల బకాయిలు ఆంధ్ర ప్రదేశ్‌లో రు.87,612 కోట్లు, తెలంగాణ రాష్ట్రంలో రు.49,564 కోట్లు ఉన్నాయి. టిఆర్‌ఎస్‌ పార్టీ మరియు టిడిపి పార్టీలు ప్రకటించినట్లు రుణాలు రద్దు చేయాలంటే మొత్తం రు.1,37,176 కోట్లు రద్దు చేయాలి. ఇది రాష్ట్ర బడ్జెట్‌ నుండే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు కౌంటర్‌ గ్యారంటీ ఇవ్వడం ద్వారా రుణాలు రద్దు చేసే అవకాశం ఉంటుంది. రుణమాఫీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలనుకుంటే ఒక సంవత్సరం వాయిదా మీరిన బాకీ కాకుండా 3 సంవత్సరాలు వాయిదా మీరిన బాకీలు(ఎన్‌.పి.ఎలలు) మాత్రమే రద్దు చేస్తామంటే అది రు.22,655 కోట్లకు పరిమితం అవుతుంది. కానీ రైతులు మొత్తం రుణాలు రద్దు అవుతాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే సాగు సీజన్‌ మొదలైంది. జూన్‌ 15 నాటికి రైతులందరికీ రుణ పంపిణీ జరగాలి. ఇందులో కౌలుదారులకు మరియు ఇంత వరకు రుణం పొందని కొత్త రైతులకు రుణ సౌకర్యం కల్పించాలి. రెండు రాష్ట్రాలలో కలిపి 25 లక్షల మంది కౌలు రైతులు మరో 25 లక్షల మంది రుణం పొందని రైతులు ఉన్నట్లు బ్యాంకులు అంచనా వేశాయి. యేటా కౌలు రైతులకు రు. 2000 కోట్లు లక్ష్యంగా నిర్ణయిస్తూ 2011 నుండి నేటికీ యేటా రు.300 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేదు. కొత్త రైతులకు యేటా 100 మందికి ప్రతి బ్రాంచి రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్ణయిస్తున్నారు. ఈ విధానం వలన ఎన్ని దశాబ్దాలు గడిచినా రైతులకు తగినంత రుణం రాదు. అందువల్ల ప్రైవేటు వడ్డీలపై ఆధారపడి రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వాలు గతంలో జరిగిన లోపాలను అధిగమించాలి.
    ముఖ్యంగా వాస్తవ సాగుదారుపేరు రెవెన్యూ రికార్డులో నమోదు చేసి ప్రతివాడికి పాసుపుస్తకం ఇవ్వాలి. పాసు పుస్తకం ఉంటేనే రుణసౌకర్యంతోపాటు, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు, ప్రకృతివైపరిత్యాల పరిహారం తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వేల కోట్ల ప్రభుత్వ పథకాలు వచ్చినప్పటికీ పాసు పుస్తకాలు లేక ఆర్హతగల వాళ్ళు తమ హక్కులు కోల్పోతున్నారు. అలాగే మైనర్‌ ఇరిగేషన్‌ రిపేర్లు సంవత్సరాల తరబడి లేకపోవడం వలన చెరువు కుంటలలో నీరు నిలువ ఉండడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడంలేదు. చాలా మంది సన్న, చిన్నకారు రైతులు చిన్న నీటి వనరుల కిందనే సాగు చేస్తున్నారు. దాదాపుగా 85శాతంగా ఉన్న సన్నచిన్నకారు రైతులకు చిన్ననీటి వనరులతోపాటు లిప్టు పథకాల కింద సేద్యానికి వీలుగా సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఉభయ రాష్ట్రాలలో 1850 లిప్టు పథకాలు ఉండగా వాటి కింద 7.5 లక్షల ఎకరాలు సాగువుతున్నది. ఇందులో 50 శాతం సాగుభూమి లిప్టులు పని చేయకపోవడం వలన పడావగా మారింది. తెలంగాణ జిల్లాల్లో గల 35 వేల చెరువుల కింద 16 లక్షల ఎకరాలు సాగు కావలసిన లోకలైజ్‌ ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో గల 37 వేల చెరువుల కింద 18 లక్షల ఎకరాలు సాగు కావలసి ఉండగా 9 లక్షల ఎకరాలు సాగవుతున్నది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అదేవిధంగా రెండు ప్రభుత్వాలు ప్రకటించినట్లు నాణ్యతగల విద్యుత్తు 7`9 గంటలు సరఫరా చేసి 30 లక్షల బావుల కింద 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ కల్పించాలి.
    విత్తనోత్పత్తి రాష్ట్రంలో విత్తనాల కొరతను సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌లో ధరలు పెంచి రైతులను దోపిడీ చేస్తున్నారు. కనీస విత్తన చట్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాలు తెస్తామని తమ మానిఫెస్టోల్లో ప్రకటించారు. నాణ్యతగల విత్తనాలను రైతులకు అందజేయడానికి మార్కెట్‌ కమిటీల ద్వారా వాణిజ్యం నెరపాలి. బహుళజాతి సంస్థలను ఈ రంగం నుండి బహిష్కరించాలి. 2.5 ఎకరాల లోపు రైతులకు ఎరువులు విత్తనాలు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సన్నచిన్నకారు రైతులకు లబ్ది జరుగుతుంది.
    ఎరువుల కొరత రాబోతున్నట్టు ముందే ప్రకటిస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన ఎరువుల కేటాయింపు తగ్గించినట్లు చెప్తున్నారు. ఈ వార్తను ప్రచారంలో పెట్టి ఉన్న ఎరువులను బ్లాక్‌ మార్కెటింగ్‌ ద్వారా అధిక ధరలకు అమ్మాలనే ప్రయత్నమే తప్ప మరొకటికాదు. రాష్ట్రంలోనున్న మిక్సింగ్‌ ప్లాంట్లు నాణ్యతలేని ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. సబ్సిడీ ఎరువులను అక్రమంగా మిక్సింగ్‌ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి. కల్తీలేని క్రిమి సంహారక మందులు కనీస ధరలకు అందుబాటులో పెట్టాలి. ప్రభుత్వ పథకాల కింద చిన్న రైతులకు వ్యవసాయ యంత్రాలను 90శాతం సబ్సిడీపై ఇవ్వాలి. సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు నూర్చే యంత్రాలను రైతులకు అందుబాటులో పెట్టాలి. భారీ యంత్రాలను నిరుత్సాహపర్చాలి. చిన్న యంత్రాలను ప్రోత్సహించాలి. దీనికి ప్రతి మండలంలో అద్దె, కొనుగోలు పద్దతిపై వ్యవసాయశాఖ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి మండలంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిశీలించే ల్యాబులను ఏర్పాటు చేయాలి. వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఆదర్శ రైతుల వ్యవస్థను తొలగించి వ్యవసాయ డిప్లమా హోల్డర్లను నియమించి రైతులకు సలహాలు, సహకరించే విధంగా చూడాలి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో మధ్య దళారీల పాత్రను తగ్గించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అధిక ధర చెల్లించడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు సరుకులు అందించవచ్చు. దీనికి సివిల్‌ సప్లైయ్స్‌, మార్కెటింగ్‌ సంస్థలకు బాధ్యత అప్పజెప్పాలి. మార్కెట్‌ కమిటీలకు నేటికీ యేటా రు.500 కోట్లు పన్నులు వస్తున్నాయి. వీటిని ప్రభుత్వం ఇతర పనులకు వినియోగిస్తున్నది. అలాకాక మార్కెట్‌ యార్డునుండి గ్రామాలకు లింకు రోడ్లు, మార్కెట్‌యార్డులో త్రాగునీటి వసతులు ఏర్పాటు చేయాలి. మార్కెట్‌లకు వచ్చిన సరుకుకు నష్టం జరిగితే దానిని మార్కెట్‌ కమిటీలే భరించాలి. ఆ విధంగా రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా మార్కెట్‌ కమిటీల బాధ్యత ఉండాలి. ఉత్సాహం గల రైతు యువకులకు మార్కెట్‌ కమిటీలు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా ట్రేయినింగ్‌ క్లాసులు నిర్వహించాలి. పంటల భీమా పథకాన్ని రైతు ప్రయోజనాలకనుగుణంగా మార్పు చేసి అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పంటల భీమా విధానం రైతాంగానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు.
    పై సమస్యల పరిష్కారానికి ‘‘వ్యవసాయ అభివృధ్ధి కమిటీలను’’ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పరచాలి. ఇందులో వ్యవసాయ నిపుణులు, మహిళా రైతులు, స్థానిక ఆదర్శరైతులు సభ్యులుగా ఉండాలి. వ్యవసాయ శాఖాధికారి కన్వీనర్‌గా ఉండాలి. దీనికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ బడ్జెట్‌ విడిగా రూపొందించి శాసనసభ ఆమోదం పొందాలి. బడ్జెట్‌లో కనీసం 10శాతం నిధులు కేటాయించాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యలు పరిష్కరించడమేకాక రైతులు నష్టపోయినప్పుడు వెంటనే పరిహారం చెల్లించే విధంగా విధానాలు రూపొందించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది : 30.05.2014

నాలుగు దశాబ్దాలు గడిచినా పంటల బీమా ప్రయోగాత్మకమేనా?

2013 నవంబర్‌ 1న కేంద్ర ప్రభుత్వం ఎంఎన్‌ఎఐఎస్‌(మాడిఫైడ్‌ నేషనల్‌ అగ్రికల్చరల్‌ స్కీం)ను ప్రకటించింది. గతంలో నేషనల్‌ క్రాప్‌ ఇన్యూరెన్స్‌ మరియు రాష్ట్రీయ ఫసల్‌బీమా కార్యక్రమం పథకాలను కలిపి ఎంఎన్‌ఎఐఎస్‌ను ఏర్పాటు చేశారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, నెల్లూరు, వరంగల్‌ జిల్లాలను మాత్రమే ప్రయోగాత్మకంగా అమలు చేయ తలపెట్టారు. 2010`11లో ప్రారంభించిన ఈ పైలెట్‌ పథకానికి నేడు తూర్పుగోదావరి జిల్లాలోని వరి పంటలను కూడా తీసుకున్నారు. 2011 పంటల బీమా పథకాన్ని సమీక్షిస్తే వర్షబీమా పథకం కింద 8.82 లక్షల మంది బీమా చేసుకోగా 6.66 లక్షల మందికి క్లెయిమ్‌లు చెల్లించినట్టు ఎంఎన్‌ఐఎఎస్‌ కింది 40 వేల మంది ప్రీమియం చెల్లించగా 5 వేల మందికి క్లెయిమ్‌లు ఇచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. రెండు పథకాలకు కలిపి రైతుల నుండి వసూలు చేసిన ప్రీమియం 319.23 కోట్లు కాగా రైతులకు ఇచ్చిన క్లెయిములు 205.66 కోట్లు మాత్రమే. పంటల బీమా పథకం అంటే ప్రీమియంకు మించి క్లెయిములు వచ్చినపుడు ఏదో కారణంతో కోతలు పెట్టడం జరుగుతుంది. 2009`10లో మొదటిసారి ‘వర్షబీమా పథకం’ ప్రారంభించారు. 2010`11లో మాపిఫైడ్‌నేషన్‌  అగ్రికల్చరల్‌ ఇన్యూరెన్స్‌ పథకం ప్రయోగాత్మకంగా తెచ్చారు. ఇంత వరకు రాష్ట్రంలో పంటల బీమా పథకం వల్ల ఏరైతుకూ లాభం జరగలేదు. రుణం పొందినవారికి మాత్రమే తప్పనిసరి బీమా వర్తింపచేయడంతో వారు కూడా ప్రీమియం చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. ప్రీమియం చెల్లించడం నుండి మినహాయింపు కోరుతూ కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. నేటికీ పంటల బీమాపై అసంతృప్తిగానే ఉన్నారు.
బీమా చరిత్ర :
1970లో ధర్మనారాయణ కమిటీ పంటల బీమాపై అధ్యయనం చేసింది. అమలు కష్టసాధ్యమని, వ్యక్తిగతంగా అమలుపర్చమని కోరారు. ప్రొ॥దండేకర్‌ దీన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1972లో పంటల బీమా పథకం హెచ్‌`4 పత్తికి మాత్రమే పరిమితం చేశారు. నాటి నుండి 1999 వరకు ఇది ప్రయోగాత్మకంగా సాగింది.


(ప్రీమియం, క్లెయిములుRలక్షల రూపాయలలో)
మొదట 1985లో గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపచేశారు. 1994`99 వరకు 1రూపాయి ప్రీమియం చెల్లిస్తే రు.4 క్లెయిమ్‌ చేశారు. 2000 సంవత్సరం నుండి జాతీయ పంటల బీమా పథకాన్ని (ఎన్‌సిఐకి) అమలులోకి తెచ్చారు. ఈ పథకం కింద బీమాదారులకు క్లెయిములు రావడం అనేక చిక్కులతో ముడిపడి ఉంది. పంట నిలువుపై ఉన్నప్పుడు నష్టం జరిగితేనే క్లెయిములు చెల్లిస్తారు. పంట కోసి పొలంలోనే ఉండగా నష్టం జరిగినప్పుడు క్లెయిములు వర్తించవు. పైగా తాలూకా లేదా మండలం యూనిట్‌గా తీసుకొని నష్టాన్ని లెక్కిస్తారు. క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ ద్వారా దిగుబడిని నిర్ణయిస్తారు. గత ఐదు సంవత్సరాల సగటు పంటను (త్రెషోల్డ్‌ యీల్డ్‌) గా గుర్తించి అందులో నుండి రిస్క్‌ శాతాన్ని తగ్గిస్తారు. ఐదు సంవత్సరాల సగటుకు సమానంగా గాని ఎక్కువగా గాని దిగుబడి వచ్చినపుడు పరిహారం వర్తించదు. దీనివల్ల ఏరైతుకు బీమా వర్తించలేదు. ఢల్లీి నుండి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేంద్ర క్యాబినెట్‌ మంత్రి నాయకత్వాన పరిశీలనకు వచ్చినపుడు రైతులు, రైతు సంఘాలు బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా మార్చాలని కోరారు. ఇది జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నది. అయినప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదు.
ప్రీమియంను అనంతరం ఆహార పంటలకు 2శాతం, వాణిజ్య పంటలకు 4శాతంగా నిర్ణయించారు. రుణంపై పైమొత్తం చెల్లించాలి. ప్రీమియం వసూలు నుండి క్లెయిములు ఇచ్చే వరకు కాగితాల పని పూర్తిగా జనరల్‌ ఇన్య్సూరెన్స్‌ కంపెనీ చేస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రీమియం నుండి కొంత తీసుకుంటారు. క్లెయిములకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు రాష్ట్రం 50శాతం, కేంద్రం 50శాతం చెల్లించాలి. అనేక సందర్భాలలో కేంద్రం నిధులు వచ్చినప్పటికీ రాష్ట్రాలు తమ మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో క్లెయిముల చెల్లింపులు సంవత్సరాల తరబడి పెండిరగులో ఉన్నాయి. పంటల బీమా పథకాల పరిణామ క్రమం ఈ విధంగా ఉంది. 1. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ `1972, 2. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కార్పోరేషన్‌, 3. రాష్ట్రీయ కృషి బీమా యోజన, 4. అగ్రికల్చరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, 5. మాడిఫైడ్‌ నేషనల్‌ అగ్రికల్చరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌  వీటికి తోడు రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం 2008`09లో ప్రారంభించారు. వాతావరణ బీమా కింద చెల్లింపులు ఈ విధంగా ఉన్నాయి.(కోట్లలో)


ఈ పథకం కింద వేరుశనగ బీమాకు ఎకరాకు రు.265.20 పైసలు ప్రీమియం చెల్లించాలి. పథకం ప్రారంభించినప్పటి నుండి ప్రీమియం చెల్లించడమేతప్ప నష్టపోయిన రైతులకు పరిహారం రాలేదు. ముఖ్యంగా ఈ పథకాన్ని రాయలసీమ జిల్లాలలో వేరుశనగపై అమలు చేశారు. ఏటా 15`20 ఎకరాలలో వర్షాభావం వల్ల వేరుశనగ దెబ్బతిన్నప్పటికీ పరిహారం మాత్రం ఏదోకారణాలు చూపి తగ్గించివేశారు.
ప్రస్తుతం అమలు చేయబూనుకున్న మాడిఫైడ్‌ అగ్రికల్చరల్‌ నేషనల్‌ ఇన్సురెన్స్‌ పథకంలోకి వాతావరణ బీమా పథకం కొబ్బరి తోటల బీమా పథకాన్ని కూడా తెచ్చారు. ఈ మూడు పథకాలను కలిపి ఒకే పథకంగా రూపొందించారు. ప్రీమియంను రుణంపైగాక పంట దిగుబడి అంచనాపై నిర్ణయించారు. ఒక్కో పంటకు 14శాతం వరకు కూడా నిర్ణయించారు. ఫలితంగా ప్రీమియం బాగా పెరిగింది. 31.7.2012 నాటికి ప్రీమియం ఎకరాకు ఈ విధంగా ఉంది.


పత్తి, మిరపకు నీటిపాదుల, నీటిపారుదల లేని వాటికి రెండు ప్రీమియంలు నిర్ణయించారు. రుణం పొందినవారు తప్పనిసరిగా బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం పొందనివారికి తప్పనికాదు. సన్న చిన్నకారు రైతులకు 50శాతం ప్రీమియం సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. మిగిలిన 50శాతం రైతు చెల్లించాలి. ఇన్సురెన్స్‌ క్లెయిమ్‌ చేయడానికి ఈ దిగువ సూత్రాన్ని పాటించాలి.
త్రెషోల్డ్‌ యీల్డ్‌ ` వాస్తవ దిగుబడి
త్రెషోల్డ్‌ యీల్డ్‌
పై సూత్రం ప్రకారం త్రెషోల్‌ యీల్డ్‌లో తక్కువ రిస్క్‌ కింద 10శాతం తగ్గించాలి. మీడియం రిస్క్‌ అయినచో 20శాతం, హై రిస్క్‌ అయిన పంటలకు 40శాతం తగ్గించాలి. దీనిని ఇండెమ్నిటీ లెవల్స్‌ అంటారు. క్రాప్‌ కటింగ్‌ ఆధారంగా గత ఐదు సంవత్సరాల సగటు దిగుబడిని తీసుకొని అందులో నుండి వాస్తవ దిగుబడిని తీసివేయాలి. రిస్క్‌గా ప్రకటించిన ఇండెమ్నిటీ లెవల్స్‌ తగ్గించాలి. వచ్చిన మొత్తాన్ని ఇన్సూర్‌ చేసిన మొత్తంతో గుణకారం చేసి త్రెషోల్డ్‌ యీల్డ్‌తో భాగహారం చేయాలి. అప్పుడు క్లెయిమ్‌ మొత్తం వస్తుంది. క్రాప్‌ కటింగ్‌ చేసినపుడు మనం తప్పనిసరిగా ఉండాలి. వాతావరణ బీమా కింద వర్షాలు ఆలస్యమైనపుడు పంటవేయనపుడే 25శాతం పరిహారం చెల్లిస్తారు. మద్యలో ప్రకృతి వైపరిత్యాలకు తక్షణ పరిహారం కింద మరో 25శాతం చెల్లిస్తారు. వడగండ్ల వానకు మరియు కల్లాలలో పంటనష్టం జరిగినప్పుడు బీమా క్లెయిమ్స్‌ చేస్తారు. దీనిని కౌలుదారులకు కూడా వర్తింప చేస్తారు. ఆ విధంగా వర్షబీమా, కొబ్బరి తొటల బీమాను మాడిఫైడ్‌ నేషనల్‌ అగ్రికల్చరల్‌ ఇన్సురెన్స్‌తో జతచేశారు.
ఇతర దేశాలలో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. సగటు పంటకు దిగుబడి ఎంత తక్కువ వస్తే దానికి విలువ కట్టి రైతుకు చెల్లిస్తారు. దీనివల్ల ఎలాంటి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉండదు. క్రాప్‌ కటింగ్‌ ద్వారా సగటు పంటను నిర్ణయిస్తారు. కొత్త పథకం కింద ప్రీమియం ముతకధాన్యలకు దాదాపుగా రు.400, పప్పుధాన్యాలకు రు.200 నుండి 250 వరకు చెల్లించడానికి రైతులు ధౌర్యం చేయడంలేదు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రు.14 చొప్పున ప్రీమియం కట్టాలి. ఇందులో 50శాతం కొబ్బరి అభివృద్ధి మండలి చెల్లిస్తుంది. మరో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనిచో ఆ మొత్తాన్ని రైతులే భరించాలి. పంట నష్టాలను అంచనా వేయడానికి ప్రతి 17 కి.మీ లకు నీటి కొలత పరికరాలను పెట్టాలి. కొత్తగా దేశమంతా 5000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి ఉన్నవే సరిగా పనిచేయడంలేదు. వేళ్ళమీద లెక్కించగలిన వాళ్ళకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది.ఈ బీమా కింద వరి, సన్‌ఫ్లవర్‌, వేరుశనగ, మిరప, పెసళ్ళు, మినుములు, మొక్కజొన్న, కందులు మాత్రమే నష్టం జరిగినచో క్లెయిములు వర్తింపచేస్తారు. మిగిలిన పంటలకు వర్తింపచేయరు.
వర్షబీమా :
1. ప్రతి 17 కి.మీలకు ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొలత పరికరాలను పరిశీలించే ఉద్యోగులను నియమించాలి.
2. పంట వేసిన తరువాత 45 రోజులు వర్షం రాకపోతే ఇన్సురెన్స్‌ చేసినదాంట్లో 50శాతం చెల్లిస్తారు. ఈ తరువాత 45 రోజులకు మిగితా సగం ఇస్తారు.
3. అతి వర్షం పడి నష్టం జరిగితే ప్రాంతాలను బట్టి బీమా నిర్ణయిస్తారు.
4. సన్నచిన్నకారు రైతులకు 2.5శాతం, మిగిలిన రైతులకు 3.5 శాతం ప్రీమియం చెల్లించాలి.
5. వ్యవసాయశాఖ ద్వారాగాని, బ్యాంకుద్వారాగాని ప్రీమియం చెల్లించవచ్చు.
6. దేవాలయ భూముల కౌలుదారులకు కూడా దీనిని వర్తింపచేస్తారు.(మామూలు కౌలుదారులకు వర్తింపచేయరు.)
7. అడంగల్‌/పహాణి ఒక కాపీని జతపర్చాలి.
ఇవి ప్రస్తుతం రాయలసీమా నాలుగు జిల్లాలోని వేరుశనగ పంటకు మాత్రమే వర్తింపచేశారు.
పై వివరణ పరిశీలించినపుడు లాభాలు ఆశించి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఈ రంగంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వారు ప్రీమియం వసూలు చేయడమే తప్ప ఎలాంటి క్లెయిములు ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడంలేదు. పథకాన్ని రూపొందించినప్పుడు రైతు ప్రతినిధులతో కాని, కనీసం పార్లమెంటులోని ప్రతినిధులతోగాని లేదా శాసనసభ్యులతోగాని చర్చించకుండా ఇన్సురెన్స్‌ కంపెనీల లాభాల కొరకు ఈ బీమా పథకం ప్రకటిస్తునారే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదు. అందువల్ల పంటల బీమా పథకం ప్రయోగాలు నాలుగు దశాబ్దాలు గడిచినా నేటికీ ఏఒక్క పథకం రైతుల ప్రయోజనాన్ని రక్షించలేకపోయింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో సగటు దిగుబడి అంచనాలు ఉన్నాయి. ఆ దిగుబడికి ఎంత పంట తగ్గితే రైతువారిగా అతనికి పరిహారం చెల్లించే విధానం ఒక్కటే సరైన మార్గం. ఇది అమెరికా, చైనాల్లో కొనసాగుతున్నది. భారతదేశంలో కూడా దీన్ని వర్తింపచేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
11.05.2014

Wednesday, 13 August 2014

వ్యవసాయ ప్రణాళిక ` 2014

(1) భూ సమస్యలు
(1)     భూముల రీసర్వే సెటిల్‌మెంట్‌ చేసి వాస్తవ సాగుదారులకు హక్కు కల్పించాలి. రికార్డుల్లో నమోదు         చేయాలి.
(2)     సాగులో ఉన్నవారికి అర్హతను బట్టి పట్టాలు ఇవ్వాలి.
(3)     దళిత`గిరిజనుల భూములను సాగుకు యోగ్యంగా మార్చడానికి ‘‘చదును చేత’’ పేర నిధి         కేటాయించాలి.
(4)     అటవీ హక్కుల చట్టాన్ని చట్ట ప్రకారం గిరిజనులకు కుటుంబానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలి.         ఇంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో 4,77,315 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసినా వారికి         హక్కు పత్రాలు ఇవ్వడమే తప్ప భూమి చూపలేదు.
(5)     ప్రభుత్వ భూములను దళిత`గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. భార్యా`భర్తల పేరుతో జాయింట్‌         పట్టాల విధానాన్ని అమలు  చేయాలి.
(6)     ‘‘భూ వినియోగ కమిటీ’’ రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములను         వ్యవసాయేతర భూములుగా మార్చకుండా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని అమలు చేయాలి.
(2) కౌలు రైతులు:
(1)     ప్రస్తుత చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు జరపాలి.
(2)     కౌలుదారుల పేర్లు రికార్డుల్లో నమోదు చేయాలి.
(3)     వ్యవసాయ అధికారులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు కౌలుదారుల హక్కుల అమలులో         నిర్లక్ష్యం చేసినచో వారిపై చర్యలు తీసుకోవాలి.
(4)     కౌలుదారుల నమోదుకు రెవెన్యూ అధికారులను ఎకౌంటబులిటీ చేయాలి. చట్టంలో నిర్దేశించిన         సౌకర్యాలు కౌలుదారులకు కల్పించాలి.
(3) సాగునీటి వసతులు:
(1)     భారీ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనివ్వాలి.         ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాల్లోని మధ్యతరహా ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలి.         ‘‘రాష్ట్ర జల విధానాన్ని’’ రూపొందించాలి.
(2)     లిఫ్ట్‌ పథకాలకు 12 గంటల నాణ్యతగల విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఐడిసి (ఇరిగేషన్‌             డెవలప్‌మెంట్‌ కార్పెరేషన్‌) ద్వారా లిప్టు పథకాలను మరియు విద్యుత్‌ పంపు సెట్ల పథకాలను         నిర్వహించాలి.
(3)     మైనర్‌ ఇరిగేషన్‌ (చెరువు`కుంటలు) రిపేర్లు పూర్తిచేయాలి. దురాక్రమణకు గురైన చెరువు         `కుంటలను రికవరీ చేసి రిపేర్లు చేపట్టాలి. ఆ విధంగా భూగర్భ జలాలు పెరుగుతాయి.
(4)     వ్యవసాయ పంపుసెట్లకు 9గంటల విద్యుత్‌ సరఫరాను గ్యారెంటీ చేయాలి.
చెరువుల ఆయకట్టు
తెలంగాణ రాష్ట్రం
    100 ఎకరాలపైబడి    100 ఎకరాలలోబడి    మొత్తం


    తెలంగాణలో 35,432 చెరువుల కింద 16,75,735 ఎకరాలు సాగు కావలసి ఉండగా 2011`12లో 4,50,903 ఎకకాలు మాత్రమే సాగయ్యింది. క్రమంగా చెరువులు నిర్మూలించబడుతున్నాయి. ఫలితంగా బావుల సేద్యం పెరుగుతన్నది.
(4) రుణాలు:
(1)     అర్హతగల వారందరికీ సంస్థాగత రుణాలు ఇవ్వాలి.
(2)     1938 రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలి (అసలుకు సమానమైన వడ్డీ చెల్లించినచో రుణ         విముక్తిన్ని చేయాలి).
(3)     ప్రయివేటు రుణాలను నియంత్రించాలి.
(4)     సహకార వ్యవస్థను పటిష్ట పరిచి ప్రతి 3000 మంది సభ్యులకు ఒక సొసైటీని వికేంద్రీకరించాలి.
(5)     భూమిలేని గ్రామీణులతో సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి.
(6)     ప్రకృతి వైఫరిత్యాలు సంభవించినప్పుడు రుణ వాయిదాలకు అవకాశం ఉండాలి.
(7)     వడ్డీలేని వ్యవసాయ రుణాలు ఇవ్వాలి.
(5) ఎరువులు` క్రిమి సంహారక మందులు:
(1)     ఎరువులు`క్రిమిసంహారక మందులపై వ్యవసాయ శాఖ నియంత్రణ ఉండాలి.
(2)     తగినన్ని ఎరువులను అందుబాటులో పెట్టాలి.
(3)     ఒక హెక్టారులోపు గల రైతులకు ఎరువులు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
(4)     మిక్సింగ్‌ ప్లాంట్లను రద్దు చేయాలి.
(5)     రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచాలి.
(6) విత్తనాలు:
(1)     విత్తన రంగం నుండి బహుళజాతి సంస్థలను తొలగించాలి.
(2)     ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిశోధనా కేంద్రాల్లో విత్తన ప్రయోగాలు చేపట్టాలి.
(3)     తెలంగాణాలోని ప్రతి జిల్లాలో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించి ప్రయోగాలు         ప్రారంభించాలి.
(4)     ఇక్రిసాట్‌ ప్రయోగాలు తెలంగాణా రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలి.
(5)     విత్తనోత్పత్తి చేస్తున్న రైతులను ప్రోత్సహించి, విత్తన కంపెనీల నుండి రక్షణ కల్పించాలి.
(6)     రాష్ట్రం నుండి విత్తన ఎగుమతికి గల అవకాశాలను పరిశీలించాలి.
(8) విస్తరణ:
(1)     వ్యవసాయ శాఖ ప్రతి 1000 కుటుంబాలకు లేదా 3 గ్రామాలకు ఒక అధికారిని నియమించాలి.
(2)     భూసార పరీక్షలు జరిపి విత్తనాలు, ఎరువులు ఎలా వాడాలో రైతులకు తెలియపర్చాలి.
(3)     బహుళ పంటలను ప్రోత్సహించాలి.
(4)     క్రిమి కీటకాదుల దాడులు జరిగినచో ప్రభుత్వమే నివారణా చర్యలు చేపట్టాలి.
(5)     ప్రతి గ్రామపంచాయితీ సమావేశాలకు వ్యవసాయాధికారి హాజరు కావాలి.
(6)     ప్రభుత్వ విత్తనోత్పత్తి కేంద్రాలను నిర్వహించాలి.
(7)     మండలాన్ని నాల్గు జోన్స్‌గా చేసి ప్రతి జోన్‌ కేంద్రంలో చిన్న యంత్రాలు అద్దె, కొనుగోలు పద్దతిపై         సన్న`చిన్నకారు రైతులకు అందించాలి. భారీ యంత్రాలకు బదులు చిన్న యంత్రాలను విరివిగా         ప్రవేశపెట్టాలి. 
(8)     ఆదర్శరైతుల వ్యవస్థను రద్దు పరచి వ్యవసాయ పట్టభద్రులను నియమించాలి.
(9) మార్కెట్‌:
(1)     మార్కెట్‌ పరిధిలో రైతుల సభ్యత్వాలను నమోదు చేసి మార్కెట్‌ కమిటీలను ఎన్నికల ద్వారా         ఎన్నుకోవాలి.
(2)     మార్కెట్‌ యార్డుల్లో సరుకుల నిల్వకు కోల్డ్‌ స్టోరేజీలను, గోదాములను నిర్మించాలి.
(3)     రైతుబంధు పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి (ప్రస్తుతం ఈ పథకం క్రింద వ్యాపారుల         సరుకులకు రుణాలు ఇస్తున్నారు).
(4)     విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు మార్కెట్‌ కమిటీల ద్వారా అమ్మించాలి.
(5)     మార్కెట్‌ కమిటీలు రైతులకు శిక్షణ చేపట్టాలి.
(10) ఎగుమతి`దిగుమతులు:
    (1)     మన రాష్ట్రంలో జరుగు మిగులు ఉత్పత్తులను ఇతర ప్రాంతాలనుండి దిగుమతులు చేసుకోవడం నియంత్రించాలి.
    (2)     మన మిగులు ఉత్పత్తులను అవసరమైన చోటికి ఎగుమతి చేసే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్‌ కమిటీ     చేపట్టాలి.
    (3)     వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడిరగ్‌ చేసి ఎగుమతులకు అనుకూలంగా తయారు చేసి అమ్మించాలి.
(11) పకృతి వైఫరిత్యాలు:
    (1)     రాష్ట్రంలో కరువులు యేటా వస్తున్నాయి. కరువుల నివారణకు ‘‘రాష్ట్ర జల విధానం’’ను రూపొందించాలి     (ప్రాజెక్టుల నుండి చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల అభివృద్దితో పాటు, చెరువుల వెనుక ఒక పంట గ్యారెంటీ ఉంటుంది).
    (2)     ప్రకృతి వైఫరిత్యాల నిధిని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుండి కేటాయించాలి.
    (3)     పంటలు నష్టపోయి ఏ రైతు నిరాశ`నిస్పృహలకు గురై ఆత్మహత్యకు పాల్పడకుండా చూడాలి.
(12) వ్యవసాయ బడ్జెట్‌ :
    (1)     విత్తన, ఎరువులు, క్రమి సంహారక మందుల సబ్సిడీ ` వ్యవసాయ విస్తరణ వ్యయం, పరిశోధనలు ` సాగునీటి వనరుల నిర్మాణం, రిపేర్లు (మేజర్‌, మిడియం, మైనర్‌, లిఫ్ట్‌, పంపుసెట్ల సబ్సిడీ) ` మార్కెట్‌ జోక్యం పథకం క్రింద 5000 కోట్లు ` రైతుల ఆత్మహత్యలకు ఎక్స్‌గ్రేషియో ` రైతుల వృద్ధాప్య పెన్షన్లు,     ప్రకృతి వైఫరిత్యాల పరిహారం, హార్టీకల్చర్‌ అభివృద్ది ` పాడిపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత వృత్తులకు     సహకారం ... వీటికి కావాల్సిన నిధులను బడ్జెట్‌ నుండి కేటాయించాలి.
(13) అఖిలపక్ష కమిటీలు:
    (1)     రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో రైతులతో అఖిలపక్ష కమిటీలను వేయాలి.
    (2)     విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వారీగా అఖిలపక్ష కమిటీ వేయాలి.
    (3)     ప్రభుత్వ పథకాల అమలుకు, లాభోక్తల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎన్నుకోవాలి.
(14) పస్తుత బడ్జెట్‌ ఈ విధంగా ఉంది :
ఈ పట్టికను గమనిస్తే బడ్జెట్‌ కేటాయింపులు ఎంత భారీగా చేసి తీరా వాస్తవ వ్యయం ఎలా తగ్గిందో తెలుసుకోవచ్చు. (మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ కోట్లలో)
       

    మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ ప్రణాళికేతర, ప్రణాళిక బడ్జెట్‌ 3.5శాతం మించలేదు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయ అభివృద్ది అయ్యేనా? కేంద్రం ఆర్కేవివై క్రింద చేసిన కేటాయింపులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. బడ్జెట్‌లో 10 శాతం కేటాయించాలి. విడిగా బడ్జెట్‌ ఉండాలి.
    అందుకే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ వ్యవసాయ విధానాలను సంస్కరించాలి. సంస్కరణల పేరుతో రైతులను భూముల నుండి వెళ్ళగొట్టడం లేదా ఆత్మహత్యలకు పాల్పడేవిధంగా పరిస్థితులను సృష్టించడం చేస్తున్న ప్రభుత్వాలు కార్పోరేట్‌ అనుకూల విధానాలను పూర్తిగా మార్చాలి. సన్న,చిన్నకారు రైతులకు వ్యవసాయంపై ఆదాయం పెరిగే విధంగా చూడాలి. వ్యవసాయోపకరణాల ధరలకు, పంటల ధరలకు మధ్య సమతూకం ఉండాలి. రైతుల కుటుంబ శ్రమకు తగిన ప్రతిఫలం అందేవిధంగా ధరలు నిర్ణయించాలి. వ్యవసాయోపకరణాలను పూర్తి సబ్సిడీపై రైతులకు అందజేసినప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గుముఖంలో ఉంటాయి. ఒకవైపున ఉపకరణాల ధరలు పెంచుతూ మరోవైపున పంటలు ధరలు తగ్గిస్తూ రైతులకు హాని కల్గించే విధానాలను విడనాడాలి.

త్రాగునీరు ` సాగునీటి కల్పనే రాష్ట్రాభివృధ్ధికి కీలకం

    రాష్ట్రంలో తగినన్ని జలవనరులున్నప్పటికీ ఆరు దశాబ్దాలు గడిచినా నేటికీ 40శాతానికి మించి సాగు నీటి వనరులు కల్పించలేకపోయాం. ఉమ్మడి రాష్ట్రంలో యేటా 400`500 మండలాలు వర్షాభావ పరిస్థితుల వల్ల కరువుకు గురవుతున్నాయి. మరొక 200 మండలాల వరకు వరదలకు గురవుతున్నాయి. యేటా 500 కోట్ల రూపాయల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. గత 12 ఫిబ్రవరి 2014న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన ప్రకారం 2013 సంవత్సరంలోనే ప్రకృతి వైపరీత్యాల వల్ల రు.6500 కోట్ల విలువగల పంటలకు నష్టం వాటిల్లినట్లు, 40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించారు. జలయజ్ఞంలో తెలంగాణా ప్రాంతంలో 2005`13 జనవరి వరకు రు.28,703 కోట్లు భారీ ప్రాజెక్టుల కొరకు రు.1,597.4 కోట్లు మధ్యతరహా ప్రాజెక్టులకు వ్యయం చేశారు. ఇవి కాక మరొక రు.100 కోట్లు మైనర్‌ ఇరిగేషన్‌ల కొరకు వ్యయం చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి ఎఐబిపి నిధులు కేటాయించినప్పటికీ సక్రమైన వ్యయం చేయలేకపోతున్నాం. 2009`10 నుండి ఏటా 4000 కోట్లు రాష్ట్రానికి కేటాయించగా 1500 కోట్లు మాత్రమే వ్యయం చేసారు. ఇది కాక విదేశీ సహయక నిధులు మొదటి విడతగా మైనర్‌ ఇరిగేషన్‌కు 950 కోట్లు, మరియు 450.60 కోట్లు ప్రపంచబ్యాంకు నుండి మంజూరి అయ్యాయి. వీటిని 2010 డిశంబర్‌ నాటికి వ్యయం చేయాలి. రెండవ విడుతగా 3000 చెరువుల నిర్మాణానికి (2.5 లక్షల హెక్టార్లకు) 31.12.2012 నాటికి పూర్తి చేయడానికి ప్రపంచబ్యాంకు 217.8 మిలియన్‌ డాలర్లు మరియు 189 మిలియన్‌ డాలర్లు ఐబిఆర్‌డి మరియు ఐడిఏ క్రింద మంజూరి ఇచ్చారు. అయినా విదేశీ నిధులు వ్యయం చేసి మైనర్‌ ఇరిగేషన్‌ను రిపేరు చేయలేకపోయారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఎఐబిపి నిధులు గాని, అటు విదేశాల నుండి వచ్చిన సహాయం గాని సక్రమ వినియోగం చేయకపోవడం వలన ఇరిగేషన్‌ వ్యవస్థ ‘‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’’ అన్న చందంగా ఉంది. అదనంగా ఒక ఎకరాకు కూడా నీటి గ్యారంటీ లభ్యత కలగలేదు. తెలంగాణాలో సాగుభూమి 45.99 లక్షల ఎకరాలు 30%, సీమాంధ్రలో 39.29 లక్షల ఎకరాలు నికర సాగు ఉండగా ఇందులో 40శాతం మాత్రమే వివిధ జలవనరుల ద్వారా సాగవుతున్నది.
    తెలంగాణాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, కాకతీయ కాలువ రెండవదశ (4.40 లక్షల ఎకరాలు), వరదల కాలువ (2.20 లక్షల ఎకరాలు), దేవాదుల (6.5 లక్షల ఎకరాలు), నెట్టెంపాడు (2 లక్షల ఎకరాలు), కల్వకుర్తి (3.40 లక్షల ఎకరాలు), భీమా ఒకటి`రెండు దశలు (2లక్షల ఎకరాలు) ప్రాజెక్టులు చేపట్టి రెండు దశాబ్ధాలకు పైగా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టులకు వ్యయ అంచనా పెరుగుతూనే ఉంది. నేటికీ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పూర్తికాలేదు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు (2.20 లక్షల ఎకరాలు), రాజీవ్‌దుమ్ముగూడెం (2లక్షల ఎకరాలు), ఇందిరా దుమ్ముగూడెం (2 లక్షల ఎకరాలు) ప్రాజెక్టులు 2013 జనవరి నాటికి 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 1983లో శ్రీరాంసాగర్‌, కాకతీయ కాలువ రెండవ దశను, వరద కాల్వను ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. వాటిని 2005లో ప్రారంభించారు. నేటికీ పూర్తికాలేదు. ప్రస్తుతం అన్ని పనులు నిలిపివేసారు. మొబైల్‌ అడ్వాన్సులు పొందిన కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వం వ్యయ అంచనా పెంచాలని కోరుతున్నారు. నిజామాబాదు జిల్లాలో గోదావరి నదిపై చేపట్టబడ్డ గుత్ప, అలీసాగర్‌ ప్రాజెక్టులకు 520 కోట్లు వ్యయం చేసినా ఇంకా పూర్తి స్థిరీకరణకు (93,792 ఎకరాల స్థిరీకరణ) నోచుకోలేదు. లెండి ప్రాజెక్టుకు 200 కోట్లు వ్యయం జరిపినా పూర్తికాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వే దశలోనే ఉంది. ఆదిలాబాదు జిల్లాలో 24 మధ్యతరహా ప్రాజెక్టులు చేపట్టి రెండు దశాబ్ధాలు గడుస్తున్నది. నిర్మాణ వ్యయం పెరగడమే తప్ప, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు. విచిత్రమేమిటంటే ఈ 24 ప్రాజెక్టులు ఒక్కోటి 100 కోట్లలోపు అంచనా వ్యయం మాత్రమే. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉండగా, మైనర్‌ ఇరిగేషన్‌ పరిస్థితి మరింత అధ్వానంగా తయారువుతున్నది. చిన్నచిన్న పథకాలు కూడా పెండిరగ్‌లో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మత్తడివాగు, సుద్దవాగు, ర్యాలివాగుకు ఆదిలాబాదు జిల్లాలో నీటిని వదిలారు. కానీ  కాల్వలు లేక, ప్రాజెక్టులు పూర్తికాక ఒక్క ఎకరాకు కూడా నీరు పారలేదు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌ రెడ్డి 14 జనవరి 2013 భీమా ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టంపాడు ఎత్తిపోతలకు నీటిని వదిలాడు. ఈ రోజుకు పొలాలకు మాత్రం సాగునీరు రాలేదు. నీరు వదిలామన్న సంతృప్తితో ముఖ్యమంత్రులు ఉన్నారే తప్ప, పనులు పూర్తిచేసి పంటకాల్వలు పూర్తిచేయడం, ఎత్తిపోతలకు పంపులను ఏర్పాటు చేయడం వదిలివేస్తున్నారు. నాణ్యతలేని నిర్మాణాల వల్ల పాలెంవాగు, గుండ్లకమ్మ, కొమరంభీం ప్రాజెక్టులు మధ్యలోనే కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా బయ్యారంలో కాకతీయుల కాలం నాటి చెరువుకు గండిపడగా రెండుసార్లు రిపేర్లకు నిధులు వ్యయం చేసినా గండి మాత్రం తాత్కాలికంగానే పూడ్చారు. ఎక్కడ చూసినా నాణ్యతలేని నిర్మాణాలు సాగుతున్నాయి. ఇంజనీర్లచే సోషల్‌ ఆడిట్‌ చేయిస్తామని చెప్పారు. ఆడిట్‌మాట దేవుడెరుగు. కనీసం కాంట్రక్టర్లకు చెల్లించిన అడ్వాన్సులు కూడా తిరిగి చెల్లించకుండా కావాలనే ప్రాజెక్టులకు కాలయాపన చేస్తున్నారు. 2014 జూన్‌ 2 తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోయే కొత్త ప్రభుత్వాలు జలయజ్ఞం నిధుల వ్యయంపై నిఖరమైన చర్యలు చేపట్టకపోతే కాంట్రాక్టర్లకు లబ్దికలిగించినవారే అవుతారే తప్ప, రైతులకు మాత్రం సాగునీటి వనరులు కల్పించలేరు. ప్రజలకు త్రాగునీటిని అందించలేరు.
    తెలంగాణా రాష్ట్రంలో 35,432 చెరువుల క్రింద 16,75,735 ఎకరాలు సాగుకావాలి. 2011`12 రికార్డుల ప్రకారం పరిశీలిస్తే 4,51,273 ఎకరాలు మాత్రమే సాగయ్యింది. 27% మాత్రమే. ఆంధ్రా ప్రాంతంలో 36,700 చెరువుల క్రింద 18,55,068 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, 2011`12లో 9,06,184 ఎకరాలు మాత్రమే సాగయ్యింది. 49% మాత్రమే. మైనర్‌ ఇరిగేషన్‌ చెర్వులు చాలా వరకు కట్టలు తెగిపోయి నీరు నిల్వలేకుండా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు హస్తగతం చేసుకున్నారు. ఒక్క హైదరాబాదులోనే గతంలో 84 చెరువులు ఉండగా, నేడు 14 చెరువులకు తగ్గింది.
    లిఫ్ట్‌ పథకాలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొమ్మిది ఉన్నాయి. వీటి క్రింద 20వేల ఎకరాలు సాగుకావాలి. నల్లగొండ జిల్లాలో 42 లిఫ్ట్‌ పథకాల క్రింద 86వేల ఎకరాల స్థిరీకరణకు ప్రకటించగా 50శాతం లోపే సాగవుతున్నది. లిఫ్ట్‌ పథకాలకు 16 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని 7 గంటలే సరఫరా చేయడం వలన పంటలు పండని పరిస్థితి ఏర్పడిరది. నల్గొండ జిల్లాలో బునాదిగాని కాలువ (భువనగరి`ఆలేరు), బొల్లేపల్లికాలువ (భువనగిరి), పిలాయపల్లి కాలువ (మునుగోడు` నకిరేకల్‌), ధర్మారెడ్డి కాలువ (నకిరేకల్‌) నిర్మాణాలు చేపట్టి దశాబ్ధాలు గడిచినా ఒక్కటి కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం పనులు నిలిపివేసారు. మండలాల్లో నిరంతరం ఆందోళనలు సాగుతున్నాయి. నల్గొండ జిల్లా పడమటివైపు 700 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ నీరు తాగడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మెట్ట భూముల్లో వేసిన పండ్లతోటలు దెబ్బతినడం వలన 15 సంవత్సరాల వయస్సు గలిన వేలాది ఎకరాల నారింజ తోటలను నరికివేస్తున్నారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌, నర్సంపేట, ఘనపురం డివిజన్లలో త్రాగు`సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5,961  చెర్వుల క్రింద 2,28,749 ఎకరాలు ఆయకట్టు సాగుకావాల్సి ఉండగా ఏనాడు 25శాతానికి మించిన ఆయకట్టు సాగుకాలేదు.
    పంటలు పండకపోవడం వలన పెద్దఎత్తున వలసలు పోతున్నారు. చివరికి రుణభారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికి సాగునీటి సౌకర్యంలేకపోవడమే కారణం.

రాష్ట్ర జల విధానం రూపొందించాలి:
    రాష్ట్రం నుండి కృష్ణా, గోదావరి నదుల ద్వారా ఏటా 4`5వేల టిఎంసీల నీరు వినియోగించుకోకపోవడం ఫలితంగా సముద్రంపాలవుతుంది. బేసిన్‌ ప్రాంతం నుండి వర్షపు నీరు దిగువకు వచ్చి నదిలో కలిసిన తర్వాత తిరిగి ఆ నీటికి లిప్టులు పెట్టి ఎగువకు సాగునీటికి వినియోగించడం వ్యయంతో కూడినపని. వర్షపు నీటిని వినియోగించుకోవడానికి వీలుగా మైనర్‌ ఇరిగేషన్‌ను (చెరువులను) రిపేర్లు చేసి నీటిని నిలువ పెట్టుటకు వీలుగా మార్చాలి. భారీ`మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి 80 శాతం నీరు రాగానే తూములు, కాల్వల ద్వారా నీటిని వదిలి చెరువులను నింపాలి. ఆ విధంగా నదిలో వృధాగా పోయే నీటిని వినియోగించుకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతం చెరువులు ఎండిపోవడం వలన భూగర్భజల నీటిని అదే సందర్భంలో ఎక్కువ వినియోగించడం వల్ల వాతావరణం వేడెక్కి పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. భూగర్భ జలాలను నిర్ధిష్ట పరిధిలో నిల్వ ఉంచినప్పుడు పర్యావరణం కూడా అనుకూలంగా మారుతుంది. సాగునీటి వినియోగం కల్పించడానికి మరియు త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి లభ్యత గల నీటిని సధ్వినియోగం చేసుకునే వనరులను నిర్మించాలి. తద్వారా వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడే కరువులు నివారించబడతాయి. మరోవైపు ఏ యేటికాయేడు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారా (పూడికతీత) వరదనీటిని వెంటనే సముద్రంలోకి పంపే అవకాశం ఉంటుంది. వరద నష్టాలను తగ్గించవచ్చు. కరువుల నివారణ, వరద నష్టాల తగ్గింపు వలన వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది. అందుకు తగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని అనేక సంవత్సరాలుగా సిపిఐ(యం) మరియు రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడమే కాక, ఆందోళనలు కూడా చేసారు. అయినా ప్రభుత్వం రాష్ట్ర జల విధాన రూపకల్పనకు సిద్ధంగా లేదు. పనిభారం పెరుగుతుందని ఇరిగేషన్‌ శాఖ సిబ్బంది జల విధాన రూపకల్పనకు అభ్యంతరం చెబుతున్నారు. అదనపు సిబ్బందిని జల విధానం రూపొందించి, అమలు జరపడం ద్వారా సాగునీరు, త్రాగునీరు ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు. తద్వారా ఉపాధి పెరుగుతుంది.  గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ది జరుగుతుంది. సాగునీరు, త్రాగునీరు, ఉపాధి మరియు విద్యాభివృద్ది ద్వారా సమాజంలో నాగరికత అభివృద్ది అవుతుంది. నాగరిక సమాజంగా మారుతుంది.
    కానీ  ప్రభుత్వాలు సాగునీటితో వ్యాపారం చేసి ప్రయివేటు నీటి వ్యాపారులకు వేల కోట్లు లాభాలు కట్టబెడుతున్నది. రాష్ట్రంలో 3వేల కోట్ల రూపాయల త్రాగునీటి వ్యాపారం సాగుతున్నది. అన్ని గ్రామాలకు సాగునీటి వనరులు కల్పిస్తే వీరి వ్యాపారం దెబ్బతింటుంది. అందుకే త్రాగునీటి వ్యాపారులు శాశ్వత రక్షిత పథకాల నిర్మాణాల జాప్యానికి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్లు వ్యయం అవుతాయి. అదే మధ్య తరహా, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధుల వ్యయం తగ్గడమే కాక తక్కువ కాలంలో నిర్మాణాలు పూర్తిచేయవచ్చు. కానీ గత అనుభవాన్ని బట్టి చూస్తే మధ్య తరహా మైనర్‌ ఇరిగేషన్‌ పథకాల నిర్మాణాలు కూడా దశాబ్ధాల తరబడి ఉద్దేశ్యపూర్వక జాప్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వం నీటి తీరువా పెంచడానికి అనుగుణంగా సాగునీటి మీటర్లను ఏర్పాటు చేసింది. ప్రపంచబ్యాంకు ఆదేశితంగా ఏర్పాటు చేసిన ఈ సాగునీటి మీటర్ల వలన రైతులు నీటిని వినియోగించుకోవడానికి డబ్బు అదనంగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడు సార్లు నీటి తీరువా పెంచారు. అదే సందర్భంలో ప్రభుత్వం పంట కాల్వల రిపేర్లను నిర్లక్ష్యం చేయడం వలన పూడిక చేరి కాల్వ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్ట్‌ పథకాలకు విద్యుత్‌ సరఫరా సక్రమంగా సరఫరా లేదు. వరంగల్లు, నల్లగొండ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ కాకతీయ ఉపకాలువలన్నీ పూడిపోయాయి.
    భారీ, మధ్యతరహా, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మరియు లిష్టు పథకాలకు సవివరమైన ప్రణాళికలు రూపొందించాలి. నిర్ణీత కాలంలో వాటిని పూర్తిచేయాలి. ముఖ్యంగా ఎపిఐడిసీని పటిష్టవంతం చేసి లిప్ట్‌ పథకాలను మరియు మైనర్‌ ఇరిగేషన్‌ బాధ్యతలను వారికి అప్పగించాలి. దీనికి తగినంత మంది సిబ్బంధిని నియమించాలి. మైనర్‌ ఇరిగేషన్‌ వలన భూగర్భజలాలు పెరగడమే కాక, పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. అలాంటి పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేయడానికి ముందు రాష్ట్ర స్థాయిలో అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణీత ఎజెండాను రూపొందించాలి. బావుల సేద్యానికి భూగర్భ జలాల నిల్వకు గల అనుబంధాన్ని స్థిరంగా ఉంచడానికి మైనర్‌ ఇరిగేషన్‌ తోడ్పాటు అవసరం. ఈ సాగునీటి కల్పన ద్వారా నేడు పంప్‌సెట్లకు వినియోగిస్తున్న విద్యుత్‌లో ఎక్కువ భాగం ఆదా చేయవచ్చు. ప్రస్తుతం 25వేల మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తున్నారు. దీనిని సగానికి తగ్గించవచ్చు. తద్వారా విద్యుత్‌ కొరత నివారించబడుతుంది. బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా సాగునీటి కల్పనకు ప్రస్తుత వనరుల దృష్య్టా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
18.04.2014

అమ్మ స్ఫూర్తి మరువరానిది

         వరంగల్‌ జిల్లా నర్సంపేట తాలూకాలోని తిమ్మంపేట మా స్వగ్రామం. గ్రామంలో నాటి సామాజిక పరిస్థితులు భూస్వామ్య ప్యూడల్‌ విధానం కొనసాగింది. పటేల్‌, పట్వారీలకు  గ్రామానికి వచ్చిపోయే ప్రభుత్వ అధికారులకు దళితులు, రజకులు వెట్టిచాకిరి చేసేవారు. వెట్టిచాకిరికి ఎలాంటి జీతంగాని, కూలిగాని, పరిహారంకాని ఇవ్వకుండా ఉచితసేవలు చేసేవారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయదారులకు మేరలపై వృత్తులవారు పనిచేసి పెట్టేవారు. మాదిగ, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం, తదితర వృత్తులవారు గ్రామాన్ని తమలో తాము పంపిణీ చేసుకుని తమకు వచ్చిన కుటుంబాలకు వృత్తిపరమైన సేవలందించేవారు. ఈ సేవలు చేసినందుకు పంటల కాలంలో వారికి మేరలు ఇస్తారు. ఈ మేరల పెంపుదలకు ఉద్యమాలు చేసేవారు. మేరలు పెరిగిన తర్వాత తిరిగి పనిలోకి వచ్చేవారు. గ్రామంలో పదిసం॥ వయస్సు పైబడినవారు మొదలు 60 సంవత్సరాల  వరకు వున్న మగవారు జీతాలకు పనిచేసేవారు. జీతంక్రింద పంట ధాన్యం ఇచ్చేవారు. చిన్నపిల్లవాడికి 30కిలో జొన్నలు, పెద్దవారికి 60 కిలోల జొన్నలు నెలకు ఇచ్చేవారు. డబ్బు అవసరముంటే యజమాని వద్ద సంవత్సరానికి రూ.100కు 24 రూ. వడ్డీకి తీసుకునేవారు. వారికుటుంబాలలో పెండ్లిళ్ళు జరిగినా, ఇళ్ళు నిర్మాణం చేసుకున్నా, ఆరోగ్యపరమైన అవసరాలున్నా, యజమాని నుండి బాకీ తీసుకునేవారు. కొన్ని కుటుంబాలు బాకీ తీరక శాశ్వతంగా వారివద్దనే తక్కువరేటు జీతానికి పనిచేసే వారు. ప్రతి ఉగాదికి పాలేర్లు మారేవారు. గ్రామంలో 10,12 కుటుంబాలు వడ్డీవ్యాపారం, నాగు వ్యాపారం చేసేవారు. నాగు అనగా(జూన్‌లో బస్తావడ్లు అప్పుగా తీసుకుంటే జనవరిలో పంటపండినాక అసలు బస్తాతో సహా మరొక అర బస్తా వడ్డీగా చెల్లించాలి) ఈదోపిడి అతి తీవ్రంగా ఉండిరది. అలాగే వడ్డీ రూ.100 కు సంవత్సరానికి రూ.24`60 వరకు వసూళ్ళు చేసేవారు. నాగులు, వడ్డీలు చెల్లించలేక చాలామంది భూములు కొల్పోయారు.
    మా తల్లి, తండ్రులు సారంపల్లి రాధమ్మ, కృష్ణారెడ్డిలకు ఆరుగురు సంతానంలో ముగ్గురు ఆడవారు, ముగ్గురు మగవారు. నేను మూడవ సంతానం. మా అన్న, తమ్ముడు మాత్రమే కుటుంబంలో చదువుకున్నాం.  1964లో 13వందల ఓట్లుగలిగిన గ్రామం 1995నాటికీ 2700నాటికి పెరిగింది. అన్ని వృత్తుల వారు ఉన్న గ్రామం. ముదిరాజ్‌లు(చేపలు పట్టేవారు) దలితులు, గీత పనివారు, చాకలివారు, రెడ్డీలు, వడ్డెర, మరియు లంబాడ, సంఖ్యరీత్యా వారు సమాన కుటుంబాలుగా వున్నారు. వీరుకాక వడ్రంగం, కమ్మర తదితర అన్నివృత్తుల వారు వున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మాగ్రామంలోని వృత్తిదారుల దగ్గరకు రావడమే గాక తమ వ్యవసాయ పెట్టుబడులకు కూడా వచ్చేవారు. గ్రామంలో 13ఇరిగేషన్‌ చెరువులు ఉండడంచే పంటలు బాగా పండేవి.  1953లో మా నాన్నగారు మరణించాకా అప్పటి నుండి కుటుంబ బాధ్యత అమ్మపై పడిరది. 40 ఎకరాల భూమి ఉన్నప్పటికీ సరిగ్గా పంటలు పండకా ఏ యేటికాయేడు అతి కష్టం మీద వెళ్లదీసింది. ముగ్గురన్నదమ్ములకు చదువు చెప్పించాలని ప్రత్యేక శ్రద్ధ వహించింది. 1957లో గ్రామంలో పార్టీ ఏర్పడిరది. పార్టీ ఏర్పడడానికి మా తమ్ముడు రాజిరెడ్డి కృషి చేసాడు. అప్పటి నుండి మా కుటుంబం గ్రామ కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుగా మారింది. గ్రామానికి రాష్ట్ర`జిల్లా నాయకులు ఎవరొచ్చినా వారికి భోజన ఏర్పాట్లు చేసేది. ఇటు వ్యవసాయ శ్రమ, అటు కుటుంబ బాధ్యత ఉన్నా ఏనాడు కుటుంబ సభ్యులపై గాని, ఇతరులపై గాని కోపగించి ఎరుగరు. 1960లో అన్నదమ్ములం వేరుపడ్డాం. అప్పుటినుండి అమ్మ నాతోనే ఉంది. నాకు అన్ని విధాలా తోడుగా ఉంటూ కుటుంబ సమస్యలనే కాక రాజకీయంగా ధైర్యం కల్పించింది. నాడు కల్పించిన ధైర్యమే కమ్యూనిస్టు ఉద్యమంలో నన్నింతవానిగా చేసింది. వ్యవసాయ పనులు చేస్తూ వచ్చింది.  1964 నుండి 1972 వరకు  గ్రామంలో కాంగ్రెస్‌ వారు పోలీస్‌ క్యాంపు ఏర్పాటు చేసి కమ్యూనిస్టు పార్టీని లేకుండా చేయాలని నిర్బంధం సాగించారు. నాతో సహా అనేక మంది గ్రామం నుండి రహస్య జీవనానికి వెళ్లారు. ఆ పరిస్థితుల్లో అమ్మ ధైర్యం చెబుతూ ఉద్యమాన్ని నిలబెట్టడానికి కృషి చేసింది.
    పట్వారీ మాలీపటేల్‌ కొంతమంది వడ్డీ, నాగులకిచ్చేవారితో మిలాఖతై గ్రామంలో అరాచకాలు చేసేవారు. గ్రామంలో పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే వుంది. 1962 ఎన్నికలకు ముందు కమ్యూనిస్టుపార్టీ ఏర్పడిరది. గ్రామంనుండి తెలంగాణా సాయుధపోరాటంలో 5గురు వ్యక్తులు పాల్గొని యూనియన్‌ మిలటిరీ కాల్పుల్లో మరణించారు. 1. తోటకూరి కనకయ్య, 2. తోటకూరి బక్కయ్య, 3. కత్తి సమ్మయ్య, 4. బాశబోయిన నర్సయ్య, 5. తోటకూరి బాలరాజు పోరాటంలో ప్రాణాలర్పించారు. ఆ తర్వాత గ్రామంలో కమ్యూనిస్టులు లేకుండా అణిచివేసి నిర్భంధం సాగించారు. ఈనిర్భంధానికి వ్యతిరేకంగా కుమ్మరికుంట్ల బొందయ్య (కాజీపేటలో రైల్వే ఉద్యోగి) గ్రామానికి వచ్చి కమ్యూనిస్టుపార్టీ ప్రచారం మొదలు పెట్టాడు. దీనికి ఆకర్శితుడైన మా తమ్ముడు (రాజిరెడ్డి) పార్టీ ఏర్పాటుకు ముందుకు వచ్చాడు. నాడు ముదిరాజ్‌లు, రజకులలో కొంతమంది తోడుగా నిలిచారు. దానితో గ్రామంలో 1960లో కమ్యూనిస్టుపార్టీ ఏర్పడిరది. కమ్యూనిస్టుపార్టీ ఏర్పడినప్పటి నుండి పటేల్‌, పట్వారీలు నిర్భంధం కొనసాగించారు. కమ్యూనిస్టులపైన కేసులు పెట్టారు.
    నాకు ఊహ తెలిసినప్పటి నుండి కుటుంబం ఆర్థిక కష్టాలకు తోడు, రాజకీయ నిర్బంధం కొనసాగింది. అన్ని సందర్భాల్లోనూ అమ్మ ధైర్యంగా నిలబడిరది. గ్రామంలోని భూస్వామ్య వర్గాలు కుటుంబంపై ఎప్పుడూ కక్షగానే ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా భూములు అమ్మకుండా కాపాడిరది. 1974లో అనారోగ్యంతో మరణించింది. అమ్మ జ్ఞాపకాలు ఈ నాటికీ చెక్కుచెదరనివిగా నా మనోపలకంపై ఉన్నాయి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది. 30.07.2013

ఎన్నికల ప్రణాళికలలో భూ సమస్యకు ప్రాధాన్యత

          2014 ఏప్రిల్‌ 30న జరుగబోవు ఎన్నికలలో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలు ప్రణాళికా రచనలో తలమునకలవుతున్నారు. ప్రజాకర్షణ పథకాలను ప్రకటించి ఓట్లు సంపాదించి పాలక పక్షంగా ఎన్నికల కావాలన్న తపన ప్రధాన రాజకీయ పార్టీలలో ఉంది. ఇప్పటికే తెలుగుదేశం, లోక్‌సత్తా మానిఫెస్టోలు విడుదల చేశాయి. రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపిలు నేడోరేపో విడుదల చేస్తాయి. అఖిలభారత స్థాయిలో కాంగ్రెస్‌, సిపిఎం పార్టీలు ప్రణాళికలు ప్రకటించాయి. సిపిఎం పార్టీ మినహా మిగిలిన ఏ ప్రణాళికలో రాష్ట్రాభివృద్ధికి కీలకమైన భూ సమస్యను తప్పించి వివిధ రకాలైన ప్రజాకర్షక పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 2009 ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపి ప్రణాళికలలో భూ సమస్యనే ఊటకించలేదు. తెలుగుదేశం కూడా అదేబాటలో నడిచింది. ఉచిత కలర్‌టివిలు, వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్‌, పెన్షన్‌ల పెంపు, నిరుద్యోగ భృతి, వృత్తుల వారికి రుణమాఫీ తదితర పథకాలను పెద్దఎత్తున ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మరొక అడుగు ముందుకేసి అన్ని రకాల అప్పుల రద్దు, అందరికీ కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య, ఫీజ్‌ రియంబర్స్‌మెంట్‌, వివాహాలకు రు.50 వేలు ఆర్థిక సహాయం, అన్ని కులాల వారికి పెన్షన్‌ పథకాలు, శసనసభలో స్థానాల సంఖ్య పెంచడం, దళిత గిరిజన, మైనారిటీ, మహిళలు, బ్రాహ్మండ్లకు, యువతకు, వికలాంగులకు, ఉద్యోగులకు, రైతులకు పెద్దఎత్తున తాయిలాలు ప్రకటించారు. తెలుగుదేశం ప్రకటించిన ప్రణాళికా వ్యయం అంచనా వేస్తే రు.1.50 లక్షల కోట్లు కావాలి. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌ 1లక్ష 83 వేల కోట్లు ఉంది. విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రు.70 వేల కోట్లకు మించదు. ప్రణాళికేతర వ్యయం పోగా రు.30 వేల కోట్లు ప్రణాళికా బడ్జెట్‌ మిగులుతుంది. ఈ బడ్జెట్‌లోనే రాయితీలన్నీ తీర్చాలి. రాయితీల తీర్పుతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రాభివృద్ధికి కీలకమైన భూ సమస్యను పట్టించుకోకపోవడం వారి వర్గ నైజాన్ని దృవపరుస్తున్నది. నేటికీ తెలంగాణాలో ఫ్యూడల్‌ విధానాలే కొనసాగుతున్నాయి. 
           తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగు భూమి 1.65 కోట్ల ఎకరాలుండగా ఇందులో 2011`12 సంవత్సరం 51 లక్షల ఎకరాలు బీడు భూమిగా మారింది. అనగా సాగుభూమిలో మూడిరట ఒకటవ వంతు బీడుగా ఉంది. దీనిని సాగులోకి తేవడానికి ఎలాంటి పథకాలు ప్రణాళికలో లేవు. భూమిపై ఆధారపడిన దళిత, గిరిజనుల పరిస్థితి అత్యంత ధారుణంగా ఉంది. తెలంగాణా రాష్ట్రంలో దళిత జనాభా 50 లక్షలు కాగా వారిలో 6.8 లక్షల మందికి మాత్రమే 15 లక్షల ఎకరాల భూమి ఉంది. మిగిలిన వారికి భూమి లేదు. అదేవిధంగా గిరిజన జనాభా 27.50 లక్షలు కాగా వారిలో 5.26 లక్షల మందికి మాత్రమే 18 లక్షల ఎకరాలు ఉంది. దళిత గరిజన జనాభాలో 60శాతం మందికి ఎలాంటి భూమలు లేవు. ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూముల పంపిణీ చేసి వారి జీవనాదాయానికి గ్యారంటీ కల్పించాలని క్యాబినెట్‌ మంత్రి కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటి సూచనలను పాలకపార్టీలు బుట్టదాఖలు చేశాయి. తెలంగాణాలో నేటికీ 69శాతం జనాభా గ్రామాలలో వ్యవసాయంపై లేదా ఆధారిత వృత్తులపై ఉన్నారు. వారికి ఆదాయం గ్యారంటీ చేసినచో ఈ రాయితీలతో పనిలేదు. భౌగోళికంగా 2.48 కోట్ల ఎకరాలున్న తెలంగాణాలో 68 లక్షల ఎకరాలు  అడవులున్నాయి. కానీ వాస్తవంగా అడవులన్నీ చెట్లు లేని ఎడారులుగానే ఉన్నాయి. ఎజెన్సీ ఏరియాలో గిరిజనుల ఆదాయం ఆడవి ఉత్పత్తులపైననే ఆదారపడి ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన అటవీహక్కుల చట్టం అమలు చేయాలని అదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. అయినా వారి మొర వినే నాధుడులేదు. 2005 నుండి ఆరు విడుతలుగా రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములు పంచామని గొప్పలు చెప్పింది. తెలంగాణాలో పంపిణీ చేసింది 2.80 లక్షల మందికి 3 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ భూముల్లో అత్యధిక భాగం సాగుకు యోగ్యం కానిదే. పట్టా సర్టిఫికెట్‌లు పొందిన వారికి భూమి చూపలేదు.
             రాష్ట్రంలో భూ సంస్కరణలు అత్యంత ఘనంగా నిర్వహించామని చెప్తున్న ప్రభుత్వం గణాంకాల ప్రకారమే నవంబర్‌ 1969 నుండి నవంబర్‌ 2002 వరకు 11 లక్షల మందికి 16. 79 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇందులో 2.54 లక్షల మంది దళితులకు 3.83 లక్షల ఎకరాలు మరియు 2.72 లక్షల మంది గిరిజనులకు 4.29 లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లు చెప్తున్నాయి. కానీ ఇందులో సగం భూమి తిరిగి భూస్వాముల చేతికే తిరిగి చేరింది. లేదా ప్రజోపయోగ పనులకు ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. 1973 భూ సంస్కరణల తరువాత కూడా పంపిణీ చేసింది కలుపుకొని ఉంది. 1969 నుండి నేటి వరకు పంపిణీ చేసిన భూమి తెలంగాణాలో సుమారు 20 లక్షల ఎకరాలు మాత్రమే. ఇందులో 10 లక్షల ఎకరాలు తిరిగి భూస్వాములకే చేరింది. రాష్ట్రంలో ఇనాం భూముల రద్దు చట్టం 29/1985 అమలు చేసినా నేటికీ ఇనాందారులకు వారి భూములను వారికి పట్టాలు ఇవ్వలేదు. 81 వేల మంది ఇనాందారులకు 2.38 లక్షల ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు. ఇంకా 1.5లక్షల ఎకరాలు పట్టాలు ఇవ్వాల్సి వుంది. తెలంగాణా సాయుధ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రక్షిత కౌలుదారీ చట్టం `1955(38ఇ) ని కూడా అర్థభాగమే అమలు చేశారు. 10 లక్షల ఎకరాల భూములను తెలంగాణాలో భూములు తమ హక్కుభుక్తంలో ఉండగా 46,131 మందికి 3.51 లక్షల ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అక్షరాస్యత లేకపోవడంతో పట్టేదార్లతో దొంగవేలు ముద్రలు వేయించుకొని రక్షిత కౌలుదారుకు రాజీనామా ఇస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసు వద్ద రాజీనామా ధరఖాస్తులు రాయించుకున్నారు.
             2013 మార్చి 18న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రస్తుత సీలింగు పరిమితిని తగ్గించి 10`15 ఎకరాలకు పరిమితం చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరస్కరించింది. భూ సంస్కరణల చట్టాలను సమీక్షిస్తే పాలకవర్గాల నైజం బట్టబయలవుతుంది. 1968లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వాన భూ సీలింగు పరిమతిని కుటుంబానికి 324 ఎకరాలుగా నిర్ణయించింది. ఈ సంస్కరణల వల్ల ఎకరం భూమి కూడా పేదలకు దక్కలేదు. తిరిగి కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్ల 1973 జనవరిలో లో పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా సీలింగు కుటుంబానికి 54 ఎకరాలుగా నిర్ణయించారు. కానీ ఈ చట్టాన్ని 1975 జనవరి నుండి అమలు చేశారు.  2 సంవత్సరాల కాలయాపన వల్ల భూస్వామలు తమ భూములను వివిధ బినామీ పేర్లతో మార్పిడి చేసుకొని రక్షించుకున్నారు. 2013లో వచ్చిన చట్టం అమలుకు బహిరంగంగానే తిరస్కరించారు. మూడు దశల సంస్కరణలను పరిశీలిస్తే పేదలకు, వాస్తవ సాగుదార్లకు భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించాలన్న లక్ష్యం పాలకులకు లేదని స్పష్టమవుతుంది.  గ్యారంటీ ఆదాయాలు లేక నిరంతరం పేదలు తమ కుటుంబాల చుట్టూ తిరిగే విధంగా, తమపై ఆధారపడే విధంగా ఉండటానికి కీలకమైన భూమిని తమ చేతుల్లో అట్టి పెట్టుకుంటున్నారు. కనీసం 50 గజాల ఇండ్ల స్థలాల కొరకు తిరుగుతున్నవారు లక్షల్లో తిరుగుతున్నారు. ఏ తగాదాలేని ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసుకున్నవారిని నానా ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఇంటి సామానులు ఉండగానే గుడిసె తగులబెట్టటం, కూలికి వెళ్ళిన వారికి పోలీసు స్టేషన్‌లో నిర్బంధించడం, కేసులు పెట్టడం లాంటి కృార చర్యలకు ప్రభుత్వం పాల్పడుతున్నా పాలకులు మాత్రం పక్కా ఇండ్ల నిర్మాణం చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. పేద రైతులు భూములు వదులుకునే విధంగా వ్యవసాయ విధానాలను ప్రపంచబ్యాంకు ఆదేశాలతో రూపొందించి అమలు చేయడం వల్ల రుణభారం పెరిగిన రైతులు తప్పనిసరై భూములు వదిలి ఇతర రంగాలకు వెళ్ళిపోతున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే ప్రకారం దేశంలో ప్రతిరోజు 378 మంది రైతులు వ్యవసాయ రంగాన్ని వదిలిపోతున్నట్టు అంచనా. ఒకవైపున దారిద్య్రం తగ్గిందనడం, మరొకవైపున రేషన్‌ కార్డుల సంఖ్యను పెంచడం చూస్తుంటే ప్రభుత్వం ఏం చేప్తున్నదో, ఏం చేస్తున్నదో తెలియని పరిస్థితి.
పారిశ్రామిక అభివృద్ధిని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తెలుగుదేశం పాలనా కాలంలో 15 ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను(అల్విన్‌వాచ్‌, ఐడిపిఎల్‌, ఇందూపూర్‌ షుగర్‌, మారుతి గోల్డ్‌సిల్క్‌, ఎపి స్టీల్‌, అంతర్గామ్‌, కాగజ్‌నగర్‌, అదిలాబాద్‌, సిరిసిల్ల స్పిన్నింగ్‌మిల్లులను, రిపబ్లిక్‌ ఫోర్స్‌ ఎపి స్కూటర్స్‌, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సహకార చక్కెర మిల్లులు) మూసి వేసి 22 వేల మందికి ఉద్యోగ, ఉద్వాసన కల్పించారు. తగుదునమ్మా అని కాంగ్రెస్‌ వారు కూడా అజాంజాహి, గుంతకల్‌ స్పిన్నింగ్‌, డిబిఆర్‌ మిల్‌, రీచ్‌మిల్‌(చిలమత్తూరు) ఫ్యాక్టరీలను మూసివేసి 15 వేల మంది ఉద్యోగులను నిరుద్యోగులను చేశారు. ప్రజల నుండి ఆదాయం రాబట్టడానికి పోటీలు పడి బెల్టుషాపులను ఏర్పాటు చేశారు. ఏటా రు.20వేల కోట్ల ఆదాయం బడ్జెట్‌కు వస్తున్నది. సాగు నీటి సెస్‌ రద్దు చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ 1997లో 3 రెట్లు శిస్తు పెంచింది. వీటన్నిటి ఫలితంగా 13 లక్షల ఎకరాల భూమిని తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అతి తక్కువ రేట్లకు సేకరించాయి. ఇన్ని అకృాత్యాలకు పాల్పడ్డ పాలక పార్టీలు గ్రామీణ ప్రజల జీవనాదాయాన్ని దెబ్బకొట్టి వారిని కటిక దరిద్రులుగా మార్చివేసి, ఎన్నికలు వస్తుండగా రాయితీల ప్రకటనలు చేయడం ఆశ్చర్యం కల్గించే అంశం ఏమీకాదు. ప్రజలు సొంత కాళ్ళపై నిలబడకుండా, సొంత ఆదాయంపై బ్రతుకులు వెళ్ళదీయకుండా రాయితీలపై ఆధారపడే బ్రతుకులు కల్పించడం పాలకులు ప్రణాళికాబద్దంగా అనుసరించిన విధానాల ఫలితమే.
           నేటికీ భూ సమస్య అత్యంత కీలక సమస్యగానే ఉంది. భూదాహంతోనున్న ప్రజలకు వారి సమస్యలు పరిష్కరించకుండా రాయితీలతో కాలం వెల్లబుచ్చడానికి పాలకులు పడుతున్న పాట్లు ప్రజలు గ్రహిస్తున్నారు. ఒక శాసన సభ్యునికి నెల ఆదాయం లక్ష రూపాయలు పైగా పెంచుకోవడం, ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా కోట్లు సంపాదించడం లక్ష్యంగా ఎన్నికల బరిలోకి ఆకర్షనీయ ప్రణాళికలతో వస్తున్నారు. ప్రకృతి సహజ వనరులైన భూమిని, నీటిని వ్యాపార సరుకులుగా మార్చి వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆరు దశాబ్దాలు గడిచినా నల్లగొండ, వరంగల్‌ పశ్చిమ ప్రాంతం, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో ఫ్లోరైడ్‌ నీరు త్రాగుతూ వేలాది గ్రామాలలో 20 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి 60 సంవత్సరాల వ్యక్తిగా మారిపోతున్నారు. ఏటా రక్షిత మంచినీటికి నిధులు విడుదల చేయడమే తప్ప సమస్య పరిష్కారం మాత్రం కాదు. ఎండాకాలం వస్తున్నదంటే ట్యాంకర్లు పెట్టడం లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు పెట్టడం గమనించాలి. కృష్ణా, గోదావరి జలాలు 3 వేల టిఎంసిల వరకు వృధాగా సముద్రంపాలవుతున్నాయి. ఇవేవీ ప్రణాళికలో బూతద్దం పెట్టి వెతికినా కనబడవు. నేడు నెలకు రు.10 వేలు సంపాదిస్తున్న ఉద్యోగి కూడా 50 గజాల స్థలం కొని గ్రామాలలో ఇళ్ళు నిర్మించలేడన్నది అతిశయోక్తికాదు. నిజానికి ప్రజల మేలు కోరే పార్టీలు భూ సమస్య పరిష్కారానికి తమ ప్రణాళికలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడో 1940లో చేసిన రీ`సర్వే సెటిల్‌మెంటును నేటికీ కొనసాగిస్తున్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడగానే 1914 మేలో మొదటి సంతకం భూ రీ`సర్వే సెటిల్‌మెంట్‌పై పెట్టి ,వాస్తవ సాగుదారును రెవెన్యూ రికార్డులో నమోదు చేసి పాసు పుస్తకం ఇవ్వాలి. ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి. ఏజెన్సీ ఏరియాలోని సెక్షన్‌ 4 కింద ఉన్న భూములను గిరిజనులకు కుటుంబానికి 4 ఎకరాలు ఇవ్వాలి. మొదట ఇండ్ల స్థలాలు కేటాయించాలి. ప్రతి గ్రామానికి శాశ్వత ప్రాతిపదికపైన త్రాగునీటి సౌకర్యం కల్పించాలి. ఈ అంశాలకు ప్రణాళికలో మొదటి ప్రధాన్యత ఇవ్వాలి. అలాంటి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలనే ఎన్నుకోవాలి. భూ సమస్య పరిష్కారం ద్వారానే శాశ్వత రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. దీనికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. పైగా రాష్ట్ర జిడిపి ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది. అందరికీ ఉపాధి లభ్యమవుతుంది. అంతేకాని భ్రమలు కల్పించే ప్రణాళికలు ప్రజల ఆదాయాన్ని పెంచకపోవగా మరింత తగ్గించి దరిద్రుల సంఖ్యను పెంచుతాయి.
సారంపల్లి మల్లారెడ్డి
02.04.2014

ఎన్నికల ప్రణాళికలు ` అమలు పరుస్తున్న తీరు

          2014 మార్చి`మే నెలలలో పార్లమెంటు, కొన్ని శాసనసభల ఎన్నికలు ప్రకటించారు. అన్ని పార్టీలు ప్రణాళికల తయారీలో తలమునకలైనాయి. ప్రజాకర్షక విధానాలను ప్రకటించడానికి ప్రణాళికలకు రచనలు సాగిస్తున్నారు. ఏకంగా ప్రణాళికా రచనలకు కమిటీలను వేశారు. 1956 నుండి ప్రతి ఎన్నికలకు ప్రణాళికలు ప్రకటిస్తూనే ఉన్నారు. రాబోయే 16వ లోక్‌సభ ఎన్నికలకు ప్రణాళికల తంతు తిరిగి ప్రారంభమైంది. ఓటర్లు, మేధావులు, పార్టీల ప్రణాళికలపై దృష్టిపెట్టటడం లేదు. ప్రణాళికల్లో ప్రకటించినవి అమలు చేయకపోవడం సర్వసాధారణమైంది. ఎన్నికల ప్రచార కాలంలో ప్రణాళికలలో చెప్పినవాటిని పెద్దఎత్తున ప్రచారం చేయడం, ఎన్నికలు ఐపోయిన తర్వాత ప్రణాళికలను మూలపడవేయడం జరుగుతున్నది. చివరకు గెలిచిన పార్టీ కూడా తన ప్రణాళికలో ఏమున్నదో అమలులో అందుకు భిన్నంగా పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షం తన ఎన్నికల ప్రణాళికను అమలు జరిపించుకోవడానికి పార్లమెంటు మరియు శాసనసభలలో ఏనాడు వాదించిన పాపాన పోలేదు.
           2009 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ‘‘భారతజాతీయ కాంగ్రెస్‌’’ తన ప్రణాళికలో 1. సన్నకారు రైతుకు రాయితీతో బ్యాంకు రుణాలు, రుణమాఫీ పథకాలు, వ్యవసాయోత్పత్తి పెంచడం, వ్యవసాయాధారిత పరిశ్రమలు, పాడి పరిశ్రమ, చేపలు, రొయ్యలు, తదితరాల పెంపకం, ఉద్యాన కృషి, పట్టుగూళ్ళ పెంపకాల ప్రోత్సాహం, వృధాగా పడివున్న భూములలో అడవులు పెంచుతామని తెలిపారు. సమగ్ర పంటల భీమా పథకం, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఇండ్లవద్దనే కనీస మద్దతు ధరల అమలు, వ్యవసాయోపకరణాల ధరల తగ్గింపు, వ్యవసాయంపై ఆదాయం గ్యారంటీ చేస్తామన్నారు. 1984 భూసేకరణ చట్టానికి సవరణ తెస్తామన్నారు. సహకార సంఘాల ప్రజాస్వామీకరణకు, ఉపాధిహామీ పథకానికి సోషల్‌ ఆడిట్‌ చేస్తామన్నారు. గ్రామీణ ఆహారభద్రతా చట్టం తెస్తామన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తామన్నారు.
         2014 మార్చి నాటికి పరిశీలిస్తే 2009 ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదు. 2012 సంవత్సరంలో దేశంలో మొత్తం 13754 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 2572 మంది(19శాతం) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1997 నుండి సంస్కరణలు అమలు జరుపుతున్న సంవత్సరమే ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2004`12 సంవత్సరాలలో యేటా సగటున 2376 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే నేడు ప్రభుత్వాలు సన్నచిన్నకారు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఒకవైపు చెబుతుండగానే మరో వైపు ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.  సంస్కరణలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచకపోగా రైతులను సంక్షోభంలోకి నెట్టాయి. సన్నచిన్నకారు రైతులు వ్యవసాయ రంగం వదిలివేస్తున్నారు.
           ప్రతి సంవత్సరం 1,36,875 మంది రైతులు దేశంలో వ్యవసాయ రంగం వదిలిపోతున్నారు. అనగా రోజుకు 375 మంది వ్యవసాయరంగాన్ని వదిలిపోతున్నారు.
 దేశంలో కౌలుదార్ల సంఖ్య విస్తరిస్తున్నది. కౌలుదార్ల రక్షణకు ఎలాంటి చట్టాలు లేవు. గతంలో వామపక్షప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయనిరాకరిస్తున్నాయి. పంట దిగుబడి ఎంత వస్తుందో అంత కౌలు రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అందువల్ల రుణగ్రస్తులైన కౌలుదారులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కనీస మద్దతు ధరల నిర్ణయం` తగ్గింపు
      మార్కెట్లను ప్రైవేటీకరిస్తూ కేంద్రం సూచనల మేరకు రాష్ట్రాలు సవరణలు చేశాయి. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలు జరపాలన్న నిబందనకు నీళ్ళువదిలారు. అతితక్కువగా ప్రకటించిన కేంద్ర మద్దతు ధరలు కూడా లభ్యంకాని పరిస్థితి ఏర్పడిరది. కనీస మద్దతు ధరల నిర్ణయంలో అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. కాంప్రహెన్సివ్‌ పథకం కింద చేసిన సర్వేలో పత్తిహెక్టారుకు 17.83 క్వింటాళ్ళు రాగా క్రాప్‌ కటింగ్‌ ప్రయోగంలో 4.3 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ రెండు సర్వేలలో కాంప్రహెన్సివ్‌ సర్వేలను తీసుకోవడం ఫలితంగా 410.10 శాతం ధరలు తగ్గాయి.
ప్రకృతి వైపరీత్యాలు ` ప్రభుత్వ సహకారం.
        కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలో 3290 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణంలో 400 లక్షల హెక్టార్లకు వరద తాకిడికి గురవుతున్నాయి. సగటున 75లక్షల హెక్టార్లు పంటలు పూర్తిగా నష్టపోతున్నాయి. యేటా 16 వేల మంది చనిపోతున్నారు. కరువుల వల్ల మరో 500 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ విధంగా దాదాపు మూడోవంతు భూమి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. 1954 నుండి 2004 వరకు  20 కమీషన్లు ప్రకృతివైపరిత్యావల నివారణకు నివేదికలిచ్చాయి. ఆ సూచనల్లో ఏఒక్కటీ పాటించలేదు. ఫలితంగా నేటికీ ప్రకృతి వైపరిత్యాల బారిన యేటా లక్షల కోట్ల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి జరిగిన నష్టంలో 5శాతం కూడాలేదు. ప్రధానంగా ప్రకృతివైపరిత్యాలు జరిగిన ప్రాంతాలలో ఆత్మహత్యలు ఎక్కువగా సాగుతున్నాయి.
            రాష్ట్ర ముఖ్యమంత్రి 12 నవంబర్‌ 2013న 40లక్షల ఎకరాల్లో  రు.6500 కోట్ల పంటలు నష్టపోయినట్లు, 58 మంది మరణించినట్లు ప్రకటించారు. కేంద్రం వేయి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు. కానీ ఇంత వరకు పూర్తి పరిహారం రైతాంగానికి చెల్లించలేదు.
           4`7 నవంబర్‌ 2013న హైదరాబాదులోని హైటెక్‌సిటీలో ‘‘ప్రపంచవ్యవసాయఫోరం మహాసభ మరియు వ్యవసాయ సాంకేతిక వ్యాపార సంత’’ ఏర్పాటు చేయబడిరది. దీని నిర్వహణకు అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, అస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు స్పాన్సర్‌ చేశాయి. స్వయంగా పాల్గొన్నాయి. బేర్‌(జర్మనీ) సంస్థ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. ఈ మహసభల ముఖ్యఉద్ధేశం ‘‘సన్నచిన్నకారు రైతుల భవిష్యత్తు సుస్థిరంగా పున:ఏర్పాటు’’ అను అంశంతో జరుగుతున్నాయి. బేర్‌ సంస్థ, నోవాస్‌, మోన్‌శాంటో, ఫాంటెర్రా, ఎర్త్‌వాచ్‌ మొదలగు పెద్ద సంస్థలు ఈఫోరం నిర్వహణ బాధ్యతల్లో ఉన్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించాడు. రాష్ట్రంలో వారి వ్యాపారానికి కావలసిన అన్ని రక్షణలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆరోజే ఈ కార్యక్రమం నిర్ణయించబడిరది. ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ ఫోరం ఛైర్మన్‌ కెన్నత్‌ బెకన్‌ అధ్యక్షతన, మైకెల్‌ డోయిన(మోన్‌శాంటో వైస్‌ప్రసిడెంట్‌), థాడ్‌సిమెన్స్‌(సిఇవో, నోవాస్‌ అమెరికా), డినైన్‌బూరెల్లా (ఫాంటెర్రా)లలు ప్రధాన వక్తలుగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభం చేశారు. వ్యవసాయశాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్‌పవార్‌కు బదులు మరొక మంత్రి హాజరయ్యారు.
              2012 మార్చి 5న భారత వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రకటన ప్రకారం ‘‘పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(పిపిపిఐఎడి)’’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని 10 లక్షల సన్న చిన్నకారు రైతులకు వర్తింపచేస్తూ 2012`17 కాలంలో అమలు చేయాలి. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10వేల మంది రైతులు ఉండాలి. ఈ ప్రాజెక్టు కాలం 3`5 సం॥ల వరకు ఉంటుంది. ప్రతి రైతుకు 1లక్ష రూపాయల వరకు పెట్టుబడి ఇస్తారు. ఇందులో భారత ప్రభుత్వం 50శాతం అనగా రు.50వేలకు మించకుండా పెట్టుబడి ఇస్తుంది. డ్రిప్‌, స్ప్రింక్లర్‌, యాంత్రీకరణ, గ్రేడిరగ్‌ లాంటి పథకాలను సబ్సిడీగా ఇస్తారు.
సన్న ` చిన్నకారు రైతులకు భూములపై హక్కులు లేకుండా చేయడం, సాగునీటికి మీటర్లు పెట్టి పన్ను విధించడం, ఎరువులు`విత్తనాల ధరలు పెంచడం (నాణ్యత లోపించడం), వ్యవసాయ విస్తరణ సేవలను కుదించడం, పంట రుణాలు తగ్గించడం, మార్కెట్లలో కాంట్రాక్ట్‌ పద్దతులు ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసైనా సన్న`చిన్నకారు రైతులను భ్రమలకు గురిచేసి వారి భూములను ఏక ఖండాలుగా మార్చి కంపెనీ వ్యవసాయం చేయడానికి ఇప్పటికే రాష్ట్రంలో మూడు సార్లు ప్రయత్నం జరిగింది. ఒకసారి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు సహకార కంపెనీ వ్యవసాయం పేరుతో ఇచ్చిన ప్రతిపాదనను రైతులు వ్యతిరేకించారు. రెండవసారి మూడు గ్రామాలను ఎంచుకుని కంపెనీ వ్యవసాయం చేయ నిర్ణయించగా (వరంగల్‌, మెదక్‌, అనంతపురం) దానిని రైతులు వ్యతిరేకించారు. మూడవసారి పిపిపిఏఐడి చర్చను కేంద్రం తెచ్చింది. దానిని రైతులు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు ఈ మహాసభల ద్వారా రైతాంగాన్ని నమ్మించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అనేక దేశాల్లో చిన్న కమతాల ద్వారా ఉత్పత్తిపెరుగుతుందని వారికి అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ ఇక్కడ భారీ కమతాలపై నుండి దృష్టిని మరలించలేకుండా రాష్ట్ర`కేంద్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు దాసోహమంటున్నాయి.
వ్యవసాయ అభివృద్ధిని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఏనాడు ప్రణాళికా వ్యవసాయ బడ్జెట్‌ కింద ఏనాడూ 3.50 శాతానికి మించలేదు. ఈ బడ్జెత్‌ కేటాయింపులతో వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయా? అందువల్ల గత 5 సంవత్సరాలలో వ్యవసాయోత్పత్తులు పెరగకపోగా, పప్పులు, వంటనూనెలు లక్ష కోట్ల విలువగలవి దుగుమతి చేసుకుంటున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యవసాయ బడ్జెట్‌లను పూర్తిగా తగ్గించివేశాయి. ఫలితంగా ప్రైవేట్‌ పెట్టుబడులు పరిగి లాభాలు ప్రైవేటువారికి వెళ్ళుతున్నాయి.

వ్యవసాయ బడ్జెట్‌ (ప్రణాళిక)
సం॥    వ్య.రంగం    శాతం    ప్రణాళికబడ్జెట్‌    మొత్తంబడ్జెట్‌
2010`11    13,824    3.65    3,79,029    11,97,327
2011`12    12,482.47    3.01    4,12,375    13,04,365
2012`13    17,665.34    3.09    4,13,625    14,10,367
2013`14(రి)    19,000.00    3.08    4,75,532    15,90,434
2014`15(బి)    21,609.00    3.89    5,55,322    17,63,214

వ్యవసాయ రుణాలను తగ్గించారు. ఉపకరణాల ధరలు పెరుగుతున్న క్రమంలో వాటికి సరిపడా రుణలభ్యత లేదు.
సంవత్సరం    టార్గెట్‌    సాధించినది
2009`10    3,25,000    2,76,656
2010`11    3,75,000    3,55,550
2011`12    4,75,000    3,96,158
2012`13    5,50,000    4,20,000
2013`14    7,00,000    7,30,000
2014`15    7,00,000    `
    పెరుగుతున్న ధరలను బట్టి రుణ లభ్యత లేకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీలపై ఆధారపడుతున్నారు. ఆ విధంగా సంస్థాగత రుణాలకు రైతులు దూరమయ్యారు.
    సాగునీటిని వ్యాపార సరుకుగా మార్చేశారు. మీటర్లు బిగించారు. సాగునీటి లభ్యత లేక రైతులు తమ స్వంత పెట్టుబడితో భూగర్భజలాల ద్వారా పంటలు పండిస్తున్నారు. పంపుసెట్ల కింద పండిస్తున్న రైతులు రుణాలు పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ విధంగా ప్రత్యక్ష పన్నులు తగ్గించి, పరోక్ష పన్నులు విఫరీతంగా పెంపుదల చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఈ విధంగా ఉన్నాయి.
పన్నులు    2011`12    2012`13    2013`14
రాష్ట్ర పన్నులు    53,283    62,572    72,442
పన్నేతర రాబడి    11,694    12,864    15,393
కేంద్రం నుండి పన్నులు    17,751    20,270    24,132
గ్రాంట్లు    10,824    13,793    15,803
మొత్తం    93,553    1,09,500    1,27,772
పై రాష్ట్ర పన్నులను పరిశీలించినప్పుడు రాష్ట్ర పన్నులు పన్నేతర ఆదాయం విఫరీతంగా పెరుగుతున్నది..
ప్రస్తుతం దేశంలో పరిస్థితి
R దేశంలో 24.6 కోట్ల కుటుంబాలను సర్వే చేయగా
R 22% మందికి కాంక్రీటు కప్పు ఇండ్లు ఉన్నాయి.
R 32% మందికి పంపునీళ్ళ లభ్యత ఉంది.
R 47% మందికి మరుగుదొడ్లు ఉన్నాయి.
R 49% మంది వంట కట్టెలు ఉపయోగిస్తున్నారు.
R 17% మంది పిడకలు వంటకు వినియోగిస్తున్నారు.
R 41% మందికి మాత్రమే వంటగదులు ఉన్నాయి.
దారిద్య్ర రేఖ నిర్ణయం
2008`09లో గ్రామీణంగా రు.22.40 మరియు పట్టణ ఆదాయం రు.28.65లు రోజుకు మించితే వారు బిపిఎల్‌ కిందకురారు.  2011`12లో దీనిని కాస్త పెంచి గ్రామీణ రు.26, పట్టణ రు.32గా నిర్ణయించారు.
పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజెపి ప్రకటించిన ప్రణాళికలో రైతులను రుణవిముక్తులను గావించడానికి ఆత్మహత్యల నివారణకు భూసేకరణలో రైతుల ప్రయోజనాల రక్షణకు ఆహారభద్రతకు పోరాడుదామని ప్రకటించింది. గత 5 సంవత్సరాల పాలనలో తాను ప్రకటించిన ప్రణాళికలోని అంశాలపై పార్లమెంటులో చర్చను ప్రారంభించలేదు. రైతుల ఆత్మహత్యలు సాగుతున్నా తనకు పట్టనట్లు ఊరుకుంది. వ్యవసాయోత్పత్తుల దిగుమతులు వస్తున్నా ఆటంకపర్చలేదు. చివరకు మన మిగులు ఉత్పత్తును ఎగుమతులు చేస్తున్న సందర్భంలో వాటిని నిషేధించి దేశంలో పంటల ధరలు తగ్గడానికి(పత్తి, పంచదార) అవకాశం కల్పించారు. ఆ విధంగా రైతులు దివాళా తీసి రుణగ్రస్తులయ్యారు.
చివరికి తెలుగుదేశం, లోక్‌సత్తా లాంటి పార్టీలు కూడా తమ ప్రణాళికలను అమలు జరపడంలేదు. ప్రణాళికలు ‘‘శుభపత్రిక’’ల్లాగా ప్రచారానికి వినియోగించడమే తప్ప తిరిగి వాటి గురించి పట్టించుకున్న పార్టీలేదు.
2014లో ప్రకటించబోయే ప్రణాళికలు పాత విధానానికే కట్టుబడతాయా? లేక కనీసం వాటి అమలు కొరకు కృషి చేస్తాయా అన్నది వేచి చూడాలి.
సారంపల్లి మల్లారెడ్డి
25.03.2014

రైతాంగ సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలే శరణ్యం

(33వ అఖిలభారత కిసాన్‌సభ మహాసభల సందర్భంగా)
           అఖిలభారత కిసాన్‌సభ 33వ మహాసభలు 2013 జూలై 24`27 వరకు తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో జరగబోతున్నాయి. 32వ మహాసభ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 2010 జనవరి 07`10 మధ్య జరిగింది. గత మహాసభ రైతులు ఎదుర్కొంటున్న నాగులు కీలక సమస్యలపై కమిషన్‌లు వేసి చర్చింది. 1) వ్యవసాయ రుణాలు 2) భూ సమస్యలు(సీలింగు, ఎస్‌ఇజడ్‌), 3) విత్తనం(బహుళజాతి సంస్థల గుత్తాదిపత్యం, బిటి వంకాయ ప్రవేశం, జన్యుమార్పిడి పంటలు`పర్యావరణంపై ప్రభావం), 4) వ్యవసాయ పంటల ధరలు, పంటల భీమా అను నాలుగు సమస్యలపైన తీర్మానాలు ఆమోదించింది. నాటి మహాసభలో వ్యవసాయ రంగంలోకి బహుళజాతి సంస్థల ప్రవేశ ప్రమాదాన్ని భారత రైతాంగానికి, ప్రజలకు గుర్తింప చేసింది. మహాసభ అభిప్రాయపడినట్లే గత మూడు సంవత్సరాలలో బహుళజాతి సంస్థల ప్రవేశం పెరగడం ఫలితంగా రైతులు దివాళా తీసి ఈ రంగం విడిచిపోతున్నారు. 1991లో 27.74% ఉన్నా రైతులు, 2011 జనాభా లెక్కల ప్రకారం వారి సంఖ్య 16.47 శానికి తగ్గినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ప్రతిరోజు 375 మంది రైతులు మొత్తం సంవత్సరంలో 13,68,012 మంది రైతులు దేశంలో వ్యవసాయ రంగాన్ని వదిలిపోతున్నారు. రైతాంగ సంక్షోభం పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. 2004 నుండి నేటి వరకు 3.30 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ప్రతి అరగంటకొక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. 40శాతం మంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టాలని ప్రభుత్వ విధానాలు ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయరంగంతోపాటు, దాని అనుబంధరంగాలకు ప్రణాళికాబడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడానికి ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న 25 కోట్ల ఆహారధాన్యాలకు అదనంగా మరో ఐదుకోట్ల టన్నుల ఉత్పత్తి పెరుగుతేనే ఆహారభద్రతా చట్టం అమలు సాధ్యమవుతుంది. కానీ, నేషనల్‌ సాంపిల్‌ సర్వే ప్రకారం నాలుగు శాతం వృద్దిరేటు లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రభుత్వం, 2011`12లో 3.6శాతం వృద్దిరేటు సాధించగా, 2012`13లో 1.9శాతానికి తగ్గిపోయింది. దీనిని బట్టి ప్రభుత్వం వ్యవసాయరంగంపై పాక్షిక దృష్టి మాత్రమే పెట్టినట్లు కనపడుతున్నది. ప్రభుత్వ అనుసరిస్తున్న కార్పోరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలి.
వ్యవసాయ బడ్జెట్‌ (కోట్లలో)
రంగం    2011`12    2012`13    2013`14
వ్యవసాయరంగం    16718    18173    21933
పరిశోధన    4729    4620    5729
పశుసంక్షేమం, డైరీ, చేపలు    1333    1878    2110
        పై కేటాయింపులు మొత్తం బడ్జెట్‌లో 3శాతానికిలోపుగానే ఉన్నాయి. అందువలన దేశ జిడిపిలో వ్యవసాయరంగం వాటా 2007`08లో 16.8శాతం ఉండగా 2011`12లో 12శాతానికి తగ్గింది. ఒక్కవ్యవసాయరంగానికి పరిమితంగా పరిశీలించినప్పుడు ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదల నామమాత్రంగా ఉంది. గ్రోత్‌రేటు ఈ విధంగా ఉంది.
సంవత్సరం        గ్రోత్‌ రేటు శాతం
2010`11        7.9
2011`12        3.6
2012`13        1.6శాతంగా ఉంది.
    ఫలితంగా దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఒకప్పుడు వంట నూనెలో స్వయంపోషకత్వంగా ఉన్న దేశం నేడు దిగుమతులు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిరది. 2011`12లో 56.73లక్షల టన్నులు(రు.30,960 కోట్లు) దిగుమతులు చేసుకోవగా 2012`13లో(2012 నవంబర్‌ నాటికి) 71.76 లక్షల టన్నులు(రు.42,663 కోట్లు) విలవ గల వంటనూనెలు దిగుమతి చేసుకున్నాం. ఇత పెద్దఎత్తున విదేశీ మారకద్రవ్యం తరలిపోతున్నది. చివరి క్రూడ్‌ రబ్బర్‌ 8,807 కోట్లు ముడి పత్తి, రు.2 వేల కోట్ల విలువ కలది దిగుమతి చేసుకుంటున్నాం. ఏటా ఎరువులు 40 వేల కోట్ల విలువ గలవి దిగుమతులపై ఆధారపడి ఉన్నాం. రూపాయితో డాలర్‌ మారకం విలువ పెరిగినపుడు వ్యవసాయ ఉపకరణాల ధరలు అపరమితంగా పెరుగుతున్నాయి. గత ఆరు మాసాలలోనే ఒక డాలర్‌కు రూపాయలు 53 నుండి 61కి తగ్గింది. దీని ప్రభావం వ్యవసాయంపై తీవ్రభారాలు వేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాల ఫలితంగా 2011`12లో ఎగుమతులు 21.3శాతం కాగా దిగుమతులు 32.3శాతంగా ఉన్నాయి. వ్యాపార లోటు రు. 8,79,504 కోట్లుగా ఉంది. దేశ బడ్జెట్‌ 2013`14లో 16.50 లక్షల కోట్లలో విదేశీ వ్యాపార లోటు 50శాతంగా ఉంది. నేడు దేశం విదేశీ మారక ద్రవ్యలోటుకు చేరుకుంది. వ్యవసాయ రంగంలో ముందస్తు వ్యాపారం 30వేల కోట్లకు పెరిగింది. నేడు ముందస్తు వ్యాపారమే ధరలను శాసిస్తున్నది. ఉత్పత్తిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేయడం, వినియోగదారులకు రెట్టింపు రేట్లకు అమ్ముకోవడం జరుగుతున్నది. దేశీయ రుణభారం 2012`13లో 5,75,000కోట్లుగా ఉంది. విదేశీ వ్యాపారలోటు మరియు రుణం వాటి వడ్డీలు కలిపితే బడ్జెట్‌కు సరిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఏరంగంలోనూ స్వయం సమృద్ధం కాలేదు.
        వ్యవసాయ రంగంలో అభివృద్ధి, అభివృద్ధి చెందిన దేశాలలోకాని, సోషలిస్టుదేశాలలో కాని 8శాతంగా ఉంది. కాని భారతదేశంలో గత రెండు దశాబ్దాలలో ఏటా 4శాతం వృద్ధిరేటు లక్ష్యం నిర్ణయించుకున్నా దాని దరికి చేరడంలేదు. ఒకవైపున ఉపకరణాల ధరలు 2004`05 స్థిర ధరలతో పోల్చితే 150శాతం పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గతంకన్నా తగ్గాయి. నేడు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. 1) రుణాల తగ్గింపు, 2) సాగునీటిని వ్యాపార సరుకుగా మార్చడం, 3) ఎరువుల ధరలు పెంచడం, 4) వ్యవసాయ శాఖ సిబ్బందిన తగ్గించడం, 5) మార్కెట్లను కాంట్రాక్టీకరించడం, 6) వ్యవసాయ దిగుమతులపై ఆధారపడడం, 7) ఆహారపంటల స్థానంలో వ్యాపార పంటలను ప్రోత్సహించడం తదితర పైవిధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతున్నది. వ్యవసాయ భూములను సెజ్‌ల పేరుతో లక్షల ఎకరాలను సన్న, చిన్నకారు రైతుల నుండి బలవంతంగా సేకరించి వారిని దిక్కులేనివారిగా చేయడమేకాక ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గుతున్నది. ఎరువులు, పెట్రోలియం ఉప ఉత్పత్తుల మీద కంట్రోల్‌ ఎత్తివేయడం, పంచదార లెవీ పద్దతిని తొలగించడం, చెరుకు , పత్తి మిల్లులు, ఫ్యాక్టరీలకు లాభాలు తెచ్చే విధానాలు అనుసరించడం వలన రైతులు ఈ రంగం నుండి తొలగిపోతున్నారు.
    పై విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించాల్సి ఉంది. నేడు దేశ ప్రజానీకంలో 26 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. 30%మంది పిల్లలు 2.5 కే.జీల బరువు తక్కువ పిల్లలుగా పుడుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. సన్న, చిన్నకారు రైతులలో 50శాతం మందికి పైగా రైతులు వ్యవసాయం చేయడంపై నిరాసక్తతగా ఉన్నారు. 177 దేశాలలో భారతదేశం 126వ ర్యాంకులో ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిక తెలియజేస్తున్నది. వ్యవసాయ రంగం వృద్ధి దశలో ఉన్నపుడు ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా 2005నుండి అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఈ దుర్భర పరిస్థితి ఏర్పడిరది. దేశవ్యాపితంగా కౌలుదారుల సంఖ్య పెరుగుతున్నది. వీరికి ఎలాంటి రక్షణ చట్టాలు లేవు. ఉన్నా అవి అమలులో లేవు. భూమిలేని రైతులు, కౌలురైతులు మొత్తం వ్యవసాయ రంగంలో గలవారిలో 80శాతం ఉన్నారు. వీరిని సంఘటిత పరిచి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పోరేటు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాపిత ఉద్యమం రావాలి. వర్గరీత్యా భూస్వామ్య ` పెట్టుబడిదారీ వర్గాలు ఈ ఉద్యమాలను అణచడానికి వివిధ చట్టాలను రూపొందించడమేకాక రాజ్యహింసకు పాల్పడుతున్నారు. గతంలో ఉద్యమాల ద్వారా విజయాలు సాధించిన చరిత్ర అఖిలభారత కిసాన్‌ మహాసభకు ఉంది. కిసాన్‌ సభ సభ్యత్వం గత మహాసభనాటికి 2,26,32,584 సభ్యత్వం ఉంది. ప్రస్తుత మహాసభ నాటికి మరో 50 పెరుగుదల ఉంది. అదేదారిలో రానున్నకాలంలో ఉద్యమాలు కొనసాగించడానికి 33వ మహాసభ దిక్సూచిగా ఉంటుంది. రైతులను, భూమిలేని పేదలను కిసాన్‌సభ జెండాకిందకు తీసుకురావడానికి సంఘటిత కృషి జరపాలి.
సారంపల్లి మల్లారెడ్డి