(1) భూ సమస్యలు
(1) భూముల రీసర్వే సెటిల్‌మెంట్ చేసి వాస్తవ సాగుదారులకు హక్కు కల్పించాలి. రికార్డుల్లో నమోదు చేయాలి.
(2) సాగులో ఉన్నవారికి అర్హతను బట్టి పట్టాలు ఇవ్వాలి.
(3) దళిత`గిరిజనుల భూములను సాగుకు యోగ్యంగా మార్చడానికి ‘‘చదును చేత’’ పేర నిధి కేటాయించాలి.
(4) అటవీ హక్కుల చట్టాన్ని చట్ట ప్రకారం గిరిజనులకు కుటుంబానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఇంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో 4,77,315 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసినా వారికి హక్కు పత్రాలు ఇవ్వడమే తప్ప భూమి చూపలేదు.
(5) ప్రభుత్వ భూములను దళిత`గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. భార్యా`భర్తల పేరుతో జాయింట్ పట్టాల విధానాన్ని అమలు చేయాలి.
(6) ‘‘భూ వినియోగ కమిటీ’’ రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని అమలు చేయాలి.
(2) కౌలు రైతులు:
(1) ప్రస్తుత చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు జరపాలి.
(2) కౌలుదారుల పేర్లు రికార్డుల్లో నమోదు చేయాలి.
(3) వ్యవసాయ అధికారులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు కౌలుదారుల హక్కుల అమలులో నిర్లక్ష్యం చేసినచో వారిపై చర్యలు తీసుకోవాలి.
(4) కౌలుదారుల నమోదుకు రెవెన్యూ అధికారులను ఎకౌంటబులిటీ చేయాలి. చట్టంలో నిర్దేశించిన సౌకర్యాలు కౌలుదారులకు కల్పించాలి.
(3) సాగునీటి వసతులు:
(1) భారీ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనివ్వాలి. ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాల్లోని మధ్యతరహా ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలి. ‘‘రాష్ట్ర జల విధానాన్ని’’ రూపొందించాలి.
(2) లిఫ్ట్ పథకాలకు 12 గంటల నాణ్యతగల విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఐడిసి (ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పెరేషన్) ద్వారా లిప్టు పథకాలను మరియు విద్యుత్ పంపు సెట్ల పథకాలను నిర్వహించాలి.
(3) మైనర్ ఇరిగేషన్ (చెరువు`కుంటలు) రిపేర్లు పూర్తిచేయాలి. దురాక్రమణకు గురైన చెరువు `కుంటలను రికవరీ చేసి రిపేర్లు చేపట్టాలి. ఆ విధంగా భూగర్భ జలాలు పెరుగుతాయి.
(4) వ్యవసాయ పంపుసెట్లకు 9గంటల విద్యుత్ సరఫరాను గ్యారెంటీ చేయాలి.
చెరువుల ఆయకట్టు
తెలంగాణ రాష్ట్రం
100 ఎకరాలపైబడి 100 ఎకరాలలోబడి మొత్తం
తెలంగాణలో 35,432 చెరువుల కింద 16,75,735 ఎకరాలు సాగు కావలసి ఉండగా 2011`12లో 4,50,903 ఎకకాలు మాత్రమే సాగయ్యింది. క్రమంగా చెరువులు నిర్మూలించబడుతున్నాయి. ఫలితంగా బావుల సేద్యం పెరుగుతన్నది.
(4) రుణాలు:
(1) అర్హతగల వారందరికీ సంస్థాగత రుణాలు ఇవ్వాలి.
(2) 1938 రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలి (అసలుకు సమానమైన వడ్డీ చెల్లించినచో రుణ విముక్తిన్ని చేయాలి).
(3) ప్రయివేటు రుణాలను నియంత్రించాలి.
(4) సహకార వ్యవస్థను పటిష్ట పరిచి ప్రతి 3000 మంది సభ్యులకు ఒక సొసైటీని వికేంద్రీకరించాలి.
(5) భూమిలేని గ్రామీణులతో సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి.
(6) ప్రకృతి వైఫరిత్యాలు సంభవించినప్పుడు రుణ వాయిదాలకు అవకాశం ఉండాలి.
(7) వడ్డీలేని వ్యవసాయ రుణాలు ఇవ్వాలి.
(5) ఎరువులు` క్రిమి సంహారక మందులు:
(1) ఎరువులు`క్రిమిసంహారక మందులపై వ్యవసాయ శాఖ నియంత్రణ ఉండాలి.
(2) తగినన్ని ఎరువులను అందుబాటులో పెట్టాలి.
(3) ఒక హెక్టారులోపు గల రైతులకు ఎరువులు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
(4) మిక్సింగ్ ప్లాంట్లను రద్దు చేయాలి.
(5) రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచాలి.
(6) విత్తనాలు:
(1) విత్తన రంగం నుండి బహుళజాతి సంస్థలను తొలగించాలి.
(2) ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిశోధనా కేంద్రాల్లో విత్తన ప్రయోగాలు చేపట్టాలి.
(3) తెలంగాణాలోని ప్రతి జిల్లాలో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించి ప్రయోగాలు ప్రారంభించాలి.
(4) ఇక్రిసాట్ ప్రయోగాలు తెలంగాణా రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలి.
(5) విత్తనోత్పత్తి చేస్తున్న రైతులను ప్రోత్సహించి, విత్తన కంపెనీల నుండి రక్షణ కల్పించాలి.
(6) రాష్ట్రం నుండి విత్తన ఎగుమతికి గల అవకాశాలను పరిశీలించాలి.
(8) విస్తరణ:
(1) వ్యవసాయ శాఖ ప్రతి 1000 కుటుంబాలకు లేదా 3 గ్రామాలకు ఒక అధికారిని నియమించాలి.
(2) భూసార పరీక్షలు జరిపి విత్తనాలు, ఎరువులు ఎలా వాడాలో రైతులకు తెలియపర్చాలి.
(3) బహుళ పంటలను ప్రోత్సహించాలి.
(4) క్రిమి కీటకాదుల దాడులు జరిగినచో ప్రభుత్వమే నివారణా చర్యలు చేపట్టాలి.
(5) ప్రతి గ్రామపంచాయితీ సమావేశాలకు వ్యవసాయాధికారి హాజరు కావాలి.
(6) ప్రభుత్వ విత్తనోత్పత్తి కేంద్రాలను నిర్వహించాలి.
(7) మండలాన్ని నాల్గు జోన్స్‌గా చేసి ప్రతి జోన్ కేంద్రంలో చిన్న యంత్రాలు అద్దె, కొనుగోలు పద్దతిపై సన్న`చిన్నకారు రైతులకు అందించాలి. భారీ యంత్రాలకు బదులు చిన్న యంత్రాలను విరివిగా ప్రవేశపెట్టాలి.
(8) ఆదర్శరైతుల వ్యవస్థను రద్దు పరచి వ్యవసాయ పట్టభద్రులను నియమించాలి.
(9) మార్కెట్:
(1) మార్కెట్ పరిధిలో రైతుల సభ్యత్వాలను నమోదు చేసి మార్కెట్ కమిటీలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలి.
(2) మార్కెట్ యార్డుల్లో సరుకుల నిల్వకు కోల్డ్ స్టోరేజీలను, గోదాములను నిర్మించాలి.
(3) రైతుబంధు పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి (ప్రస్తుతం ఈ పథకం క్రింద వ్యాపారుల సరుకులకు రుణాలు ఇస్తున్నారు).
(4) విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు మార్కెట్ కమిటీల ద్వారా అమ్మించాలి.
(5) మార్కెట్ కమిటీలు రైతులకు శిక్షణ చేపట్టాలి.
(10) ఎగుమతి`దిగుమతులు:
(1) మన రాష్ట్రంలో జరుగు మిగులు ఉత్పత్తులను ఇతర ప్రాంతాలనుండి దిగుమతులు చేసుకోవడం నియంత్రించాలి.
(2) మన మిగులు ఉత్పత్తులను అవసరమైన చోటికి ఎగుమతి చేసే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్ కమిటీ చేపట్టాలి.
(3) వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడిరగ్ చేసి ఎగుమతులకు అనుకూలంగా తయారు చేసి అమ్మించాలి.
(11) పకృతి వైఫరిత్యాలు:
(1) రాష్ట్రంలో కరువులు యేటా వస్తున్నాయి. కరువుల నివారణకు ‘‘రాష్ట్ర జల విధానం’’ను రూపొందించాలి (ప్రాజెక్టుల నుండి చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల అభివృద్దితో పాటు, చెరువుల వెనుక ఒక పంట గ్యారెంటీ ఉంటుంది).
(2) ప్రకృతి వైఫరిత్యాల నిధిని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి కేటాయించాలి.
(3) పంటలు నష్టపోయి ఏ రైతు నిరాశ`నిస్పృహలకు గురై ఆత్మహత్యకు పాల్పడకుండా చూడాలి.
(12) వ్యవసాయ బడ్జెట్ :
(1) విత్తన, ఎరువులు, క్రమి సంహారక మందుల సబ్సిడీ ` వ్యవసాయ విస్తరణ వ్యయం, పరిశోధనలు ` సాగునీటి వనరుల నిర్మాణం, రిపేర్లు (మేజర్, మిడియం, మైనర్, లిఫ్ట్, పంపుసెట్ల సబ్సిడీ) ` మార్కెట్ జోక్యం పథకం క్రింద 5000 కోట్లు ` రైతుల ఆత్మహత్యలకు ఎక్స్‌గ్రేషియో ` రైతుల వృద్ధాప్య పెన్షన్లు, ప్రకృతి వైఫరిత్యాల పరిహారం, హార్టీకల్చర్ అభివృద్ది ` పాడిపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత వృత్తులకు సహకారం ... వీటికి కావాల్సిన నిధులను బడ్జెట్ నుండి కేటాయించాలి.
(13) అఖిలపక్ష కమిటీలు:
(1) రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో రైతులతో అఖిలపక్ష కమిటీలను వేయాలి.
(2) విద్యుత్ సబ్‌స్టేషన్ వారీగా అఖిలపక్ష కమిటీ వేయాలి.
(3) ప్రభుత్వ పథకాల అమలుకు, లాభోక్తల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎన్నుకోవాలి.
(14) పస్తుత బడ్జెట్ ఈ విధంగా ఉంది :
ఈ పట్టికను గమనిస్తే బడ్జెట్ కేటాయింపులు ఎంత భారీగా చేసి తీరా వాస్తవ వ్యయం ఎలా తగ్గిందో తెలుసుకోవచ్చు. (మొత్తం రాష్ట్ర బడ్జెట్ కోట్లలో)
మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ ప్రణాళికేతర, ప్రణాళిక బడ్జెట్ 3.5శాతం మించలేదు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయ అభివృద్ది అయ్యేనా? కేంద్రం ఆర్కేవివై క్రింద చేసిన కేటాయింపులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. బడ్జెట్‌లో 10 శాతం కేటాయించాలి. విడిగా బడ్జెట్ ఉండాలి.
అందుకే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ వ్యవసాయ విధానాలను సంస్కరించాలి. సంస్కరణల పేరుతో రైతులను భూముల నుండి వెళ్ళగొట్టడం లేదా ఆత్మహత్యలకు పాల్పడేవిధంగా పరిస్థితులను సృష్టించడం చేస్తున్న ప్రభుత్వాలు కార్పోరేట్ అనుకూల విధానాలను పూర్తిగా మార్చాలి. సన్న,చిన్నకారు రైతులకు వ్యవసాయంపై ఆదాయం పెరిగే విధంగా చూడాలి. వ్యవసాయోపకరణాల ధరలకు, పంటల ధరలకు మధ్య సమతూకం ఉండాలి. రైతుల కుటుంబ శ్రమకు తగిన ప్రతిఫలం అందేవిధంగా ధరలు నిర్ణయించాలి. వ్యవసాయోపకరణాలను పూర్తి సబ్సిడీపై రైతులకు అందజేసినప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గుముఖంలో ఉంటాయి. ఒకవైపున ఉపకరణాల ధరలు పెంచుతూ మరోవైపున పంటలు ధరలు తగ్గిస్తూ రైతులకు హాని కల్గించే విధానాలను విడనాడాలి.

No comments:
Post a Comment