2014 ఏప్రిల్ 30న జరుగబోవు ఎన్నికలలో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలు ప్రణాళికా రచనలో తలమునకలవుతున్నారు. ప్రజాకర్షణ పథకాలను ప్రకటించి ఓట్లు సంపాదించి పాలక పక్షంగా ఎన్నికల కావాలన్న తపన ప్రధాన రాజకీయ పార్టీలలో ఉంది. ఇప్పటికే తెలుగుదేశం, లోక్‌సత్తా మానిఫెస్టోలు విడుదల చేశాయి. రాష్ట్ర కాంగ్రెస్, బిజెపిలు నేడోరేపో విడుదల చేస్తాయి. అఖిలభారత స్థాయిలో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు ప్రణాళికలు ప్రకటించాయి. సిపిఎం పార్టీ మినహా మిగిలిన ఏ ప్రణాళికలో రాష్ట్రాభివృద్ధికి కీలకమైన భూ సమస్యను తప్పించి వివిధ రకాలైన ప్రజాకర్షక పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 2009 ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి ప్రణాళికలలో భూ సమస్యనే ఊటకించలేదు. తెలుగుదేశం కూడా అదేబాటలో నడిచింది. ఉచిత కలర్‌టివిలు, వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్, పెన్షన్‌ల పెంపు, నిరుద్యోగ భృతి, వృత్తుల వారికి రుణమాఫీ తదితర పథకాలను పెద్దఎత్తున ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మరొక అడుగు ముందుకేసి అన్ని రకాల అప్పుల రద్దు, అందరికీ కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య, ఫీజ్ రియంబర్స్‌మెంట్, వివాహాలకు రు.50 వేలు ఆర్థిక సహాయం, అన్ని కులాల వారికి పెన్షన్ పథకాలు, శసనసభలో స్థానాల సంఖ్య పెంచడం, దళిత గిరిజన, మైనారిటీ, మహిళలు, బ్రాహ్మండ్లకు, యువతకు, వికలాంగులకు, ఉద్యోగులకు, రైతులకు పెద్దఎత్తున తాయిలాలు ప్రకటించారు. తెలుగుదేశం ప్రకటించిన ప్రణాళికా వ్యయం అంచనా వేస్తే రు.1.50 లక్షల కోట్లు కావాలి. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 1లక్ష 83 వేల కోట్లు ఉంది. విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రు.70 వేల కోట్లకు మించదు. ప్రణాళికేతర వ్యయం పోగా రు.30 వేల కోట్లు ప్రణాళికా బడ్జెట్ మిగులుతుంది. ఈ బడ్జెట్‌లోనే రాయితీలన్నీ తీర్చాలి. రాయితీల తీర్పుతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రాభివృద్ధికి కీలకమైన భూ సమస్యను పట్టించుకోకపోవడం వారి వర్గ నైజాన్ని దృవపరుస్తున్నది. నేటికీ తెలంగాణాలో ఫ్యూడల్ విధానాలే కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగు భూమి 1.65 కోట్ల ఎకరాలుండగా ఇందులో 2011`12 సంవత్సరం 51 లక్షల ఎకరాలు బీడు భూమిగా మారింది. అనగా సాగుభూమిలో మూడిరట ఒకటవ వంతు బీడుగా ఉంది. దీనిని సాగులోకి తేవడానికి ఎలాంటి పథకాలు ప్రణాళికలో లేవు. భూమిపై ఆధారపడిన దళిత, గిరిజనుల పరిస్థితి అత్యంత ధారుణంగా ఉంది. తెలంగాణా రాష్ట్రంలో దళిత జనాభా 50 లక్షలు కాగా వారిలో 6.8 లక్షల మందికి మాత్రమే 15 లక్షల ఎకరాల భూమి ఉంది. మిగిలిన వారికి భూమి లేదు. అదేవిధంగా గిరిజన జనాభా 27.50 లక్షలు కాగా వారిలో 5.26 లక్షల మందికి మాత్రమే 18 లక్షల ఎకరాలు ఉంది. దళిత గరిజన జనాభాలో 60శాతం మందికి ఎలాంటి భూమలు లేవు. ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూముల పంపిణీ చేసి వారి జీవనాదాయానికి గ్యారంటీ కల్పించాలని క్యాబినెట్ మంత్రి కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటి సూచనలను పాలకపార్టీలు బుట్టదాఖలు చేశాయి. తెలంగాణాలో నేటికీ 69శాతం జనాభా గ్రామాలలో వ్యవసాయంపై లేదా ఆధారిత వృత్తులపై ఉన్నారు. వారికి ఆదాయం గ్యారంటీ చేసినచో ఈ రాయితీలతో పనిలేదు. భౌగోళికంగా 2.48 కోట్ల ఎకరాలున్న తెలంగాణాలో 68 లక్షల ఎకరాలు అడవులున్నాయి. కానీ వాస్తవంగా అడవులన్నీ చెట్లు లేని ఎడారులుగానే ఉన్నాయి. ఎజెన్సీ ఏరియాలో గిరిజనుల ఆదాయం ఆడవి ఉత్పత్తులపైననే ఆదారపడి ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన అటవీహక్కుల చట్టం అమలు చేయాలని అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. అయినా వారి మొర వినే నాధుడులేదు. 2005 నుండి ఆరు విడుతలుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భూములు పంచామని గొప్పలు చెప్పింది. తెలంగాణాలో పంపిణీ చేసింది 2.80 లక్షల మందికి 3 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ భూముల్లో అత్యధిక భాగం సాగుకు యోగ్యం కానిదే. పట్టా సర్టిఫికెట్‌లు పొందిన వారికి భూమి చూపలేదు.
రాష్ట్రంలో భూ సంస్కరణలు అత్యంత ఘనంగా నిర్వహించామని చెప్తున్న ప్రభుత్వం గణాంకాల ప్రకారమే నవంబర్ 1969 నుండి నవంబర్ 2002 వరకు 11 లక్షల మందికి 16. 79 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇందులో 2.54 లక్షల మంది దళితులకు 3.83 లక్షల ఎకరాలు మరియు 2.72 లక్షల మంది గిరిజనులకు 4.29 లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లు చెప్తున్నాయి. కానీ ఇందులో సగం భూమి తిరిగి భూస్వాముల చేతికే తిరిగి చేరింది. లేదా ప్రజోపయోగ పనులకు ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. 1973 భూ సంస్కరణల తరువాత కూడా పంపిణీ చేసింది కలుపుకొని ఉంది. 1969 నుండి నేటి వరకు పంపిణీ చేసిన భూమి తెలంగాణాలో సుమారు 20 లక్షల ఎకరాలు మాత్రమే. ఇందులో 10 లక్షల ఎకరాలు తిరిగి భూస్వాములకే చేరింది. రాష్ట్రంలో ఇనాం భూముల రద్దు చట్టం 29/1985 అమలు చేసినా నేటికీ ఇనాందారులకు వారి భూములను వారికి పట్టాలు ఇవ్వలేదు. 81 వేల మంది ఇనాందారులకు 2.38 లక్షల ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు. ఇంకా 1.5లక్షల ఎకరాలు పట్టాలు ఇవ్వాల్సి వుంది. తెలంగాణా సాయుధ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రక్షిత కౌలుదారీ చట్టం `1955(38ఇ) ని కూడా అర్థభాగమే అమలు చేశారు. 10 లక్షల ఎకరాల భూములను తెలంగాణాలో భూములు తమ హక్కుభుక్తంలో ఉండగా 46,131 మందికి 3.51 లక్షల ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అక్షరాస్యత లేకపోవడంతో పట్టేదార్లతో దొంగవేలు ముద్రలు వేయించుకొని రక్షిత కౌలుదారుకు రాజీనామా ఇస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్ ఆఫీసు వద్ద రాజీనామా ధరఖాస్తులు రాయించుకున్నారు.
2013 మార్చి 18న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రస్తుత సీలింగు పరిమితిని తగ్గించి 10`15 ఎకరాలకు పరిమితం చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. భూ సంస్కరణల చట్టాలను సమీక్షిస్తే పాలకవర్గాల నైజం బట్టబయలవుతుంది. 1968లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వాన భూ సీలింగు పరిమతిని కుటుంబానికి 324 ఎకరాలుగా నిర్ణయించింది. ఈ సంస్కరణల వల్ల ఎకరం భూమి కూడా పేదలకు దక్కలేదు. తిరిగి కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్ల 1973 జనవరిలో లో పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా సీలింగు కుటుంబానికి 54 ఎకరాలుగా నిర్ణయించారు. కానీ ఈ చట్టాన్ని 1975 జనవరి నుండి అమలు చేశారు. 2 సంవత్సరాల కాలయాపన వల్ల భూస్వామలు తమ భూములను వివిధ బినామీ పేర్లతో మార్పిడి చేసుకొని రక్షించుకున్నారు. 2013లో వచ్చిన చట్టం అమలుకు బహిరంగంగానే తిరస్కరించారు. మూడు దశల సంస్కరణలను పరిశీలిస్తే పేదలకు, వాస్తవ సాగుదార్లకు భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించాలన్న లక్ష్యం పాలకులకు లేదని స్పష్టమవుతుంది. గ్యారంటీ ఆదాయాలు లేక నిరంతరం పేదలు తమ కుటుంబాల చుట్టూ తిరిగే విధంగా, తమపై ఆధారపడే విధంగా ఉండటానికి కీలకమైన భూమిని తమ చేతుల్లో అట్టి పెట్టుకుంటున్నారు. కనీసం 50 గజాల ఇండ్ల స్థలాల కొరకు తిరుగుతున్నవారు లక్షల్లో తిరుగుతున్నారు. ఏ తగాదాలేని ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసుకున్నవారిని నానా ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఇంటి సామానులు ఉండగానే గుడిసె తగులబెట్టటం, కూలికి వెళ్ళిన వారికి పోలీసు స్టేషన్‌లో నిర్బంధించడం, కేసులు పెట్టడం లాంటి కృార చర్యలకు ప్రభుత్వం పాల్పడుతున్నా పాలకులు మాత్రం పక్కా ఇండ్ల నిర్మాణం చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. పేద రైతులు భూములు వదులుకునే విధంగా వ్యవసాయ విధానాలను ప్రపంచబ్యాంకు ఆదేశాలతో రూపొందించి అమలు చేయడం వల్ల రుణభారం పెరిగిన రైతులు తప్పనిసరై భూములు వదిలి ఇతర రంగాలకు వెళ్ళిపోతున్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సర్వే ప్రకారం దేశంలో ప్రతిరోజు 378 మంది రైతులు వ్యవసాయ రంగాన్ని వదిలిపోతున్నట్టు అంచనా. ఒకవైపున దారిద్య్రం తగ్గిందనడం, మరొకవైపున రేషన్ కార్డుల సంఖ్యను పెంచడం చూస్తుంటే ప్రభుత్వం ఏం చేప్తున్నదో, ఏం చేస్తున్నదో తెలియని పరిస్థితి.
పారిశ్రామిక అభివృద్ధిని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తెలుగుదేశం పాలనా కాలంలో 15 ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను(అల్విన్‌వాచ్, ఐడిపిఎల్, ఇందూపూర్ షుగర్, మారుతి గోల్డ్‌సిల్క్, ఎపి స్టీల్, అంతర్గామ్, కాగజ్‌నగర్, అదిలాబాద్, సిరిసిల్ల స్పిన్నింగ్‌మిల్లులను, రిపబ్లిక్ ఫోర్స్ ఎపి స్కూటర్స్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సహకార చక్కెర మిల్లులు) మూసి వేసి 22 వేల మందికి ఉద్యోగ, ఉద్వాసన కల్పించారు. తగుదునమ్మా అని కాంగ్రెస్ వారు కూడా అజాంజాహి, గుంతకల్ స్పిన్నింగ్, డిబిఆర్ మిల్, రీచ్‌మిల్(చిలమత్తూరు) ఫ్యాక్టరీలను మూసివేసి 15 వేల మంది ఉద్యోగులను నిరుద్యోగులను చేశారు. ప్రజల నుండి ఆదాయం రాబట్టడానికి పోటీలు పడి బెల్టుషాపులను ఏర్పాటు చేశారు. ఏటా రు.20వేల కోట్ల ఆదాయం బడ్జెట్‌కు వస్తున్నది. సాగు నీటి సెస్ రద్దు చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ 1997లో 3 రెట్లు శిస్తు పెంచింది. వీటన్నిటి ఫలితంగా 13 లక్షల ఎకరాల భూమిని తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు అతి తక్కువ రేట్లకు సేకరించాయి. ఇన్ని అకృాత్యాలకు పాల్పడ్డ పాలక పార్టీలు గ్రామీణ ప్రజల జీవనాదాయాన్ని దెబ్బకొట్టి వారిని కటిక దరిద్రులుగా మార్చివేసి, ఎన్నికలు వస్తుండగా రాయితీల ప్రకటనలు చేయడం ఆశ్చర్యం కల్గించే అంశం ఏమీకాదు. ప్రజలు సొంత కాళ్ళపై నిలబడకుండా, సొంత ఆదాయంపై బ్రతుకులు వెళ్ళదీయకుండా రాయితీలపై ఆధారపడే బ్రతుకులు కల్పించడం పాలకులు ప్రణాళికాబద్దంగా అనుసరించిన విధానాల ఫలితమే.
నేటికీ భూ సమస్య అత్యంత కీలక సమస్యగానే ఉంది. భూదాహంతోనున్న ప్రజలకు వారి సమస్యలు పరిష్కరించకుండా రాయితీలతో కాలం వెల్లబుచ్చడానికి పాలకులు పడుతున్న పాట్లు ప్రజలు గ్రహిస్తున్నారు. ఒక శాసన సభ్యునికి నెల ఆదాయం లక్ష రూపాయలు పైగా పెంచుకోవడం, ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా కోట్లు సంపాదించడం లక్ష్యంగా ఎన్నికల బరిలోకి ఆకర్షనీయ ప్రణాళికలతో వస్తున్నారు. ప్రకృతి సహజ వనరులైన భూమిని, నీటిని వ్యాపార సరుకులుగా మార్చి వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆరు దశాబ్దాలు గడిచినా నల్లగొండ, వరంగల్ పశ్చిమ ప్రాంతం, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలలో ఫ్లోరైడ్ నీరు త్రాగుతూ వేలాది గ్రామాలలో 20 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి 60 సంవత్సరాల వ్యక్తిగా మారిపోతున్నారు. ఏటా రక్షిత మంచినీటికి నిధులు విడుదల చేయడమే తప్ప సమస్య పరిష్కారం మాత్రం కాదు. ఎండాకాలం వస్తున్నదంటే ట్యాంకర్లు పెట్టడం లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు పెట్టడం గమనించాలి. కృష్ణా, గోదావరి జలాలు 3 వేల టిఎంసిల వరకు వృధాగా సముద్రంపాలవుతున్నాయి. ఇవేవీ ప్రణాళికలో బూతద్దం పెట్టి వెతికినా కనబడవు. నేడు నెలకు రు.10 వేలు సంపాదిస్తున్న ఉద్యోగి కూడా 50 గజాల స్థలం కొని గ్రామాలలో ఇళ్ళు నిర్మించలేడన్నది అతిశయోక్తికాదు. నిజానికి ప్రజల మేలు కోరే పార్టీలు భూ సమస్య పరిష్కారానికి తమ ప్రణాళికలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడో 1940లో చేసిన రీ`సర్వే సెటిల్‌మెంటును నేటికీ కొనసాగిస్తున్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడగానే 1914 మేలో మొదటి సంతకం భూ రీ`సర్వే సెటిల్‌మెంట్‌పై పెట్టి ,వాస్తవ సాగుదారును రెవెన్యూ రికార్డులో నమోదు చేసి పాసు పుస్తకం ఇవ్వాలి. ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి. ఏజెన్సీ ఏరియాలోని సెక్షన్ 4 కింద ఉన్న భూములను గిరిజనులకు కుటుంబానికి 4 ఎకరాలు ఇవ్వాలి. మొదట ఇండ్ల స్థలాలు కేటాయించాలి. ప్రతి గ్రామానికి శాశ్వత ప్రాతిపదికపైన త్రాగునీటి సౌకర్యం కల్పించాలి. ఈ అంశాలకు ప్రణాళికలో మొదటి ప్రధాన్యత ఇవ్వాలి. అలాంటి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలనే ఎన్నుకోవాలి. భూ సమస్య పరిష్కారం ద్వారానే శాశ్వత రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. దీనికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. పైగా రాష్ట్ర జిడిపి ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది. అందరికీ ఉపాధి లభ్యమవుతుంది. అంతేకాని భ్రమలు కల్పించే ప్రణాళికలు ప్రజల ఆదాయాన్ని పెంచకపోవగా మరింత తగ్గించి దరిద్రుల సంఖ్యను పెంచుతాయి.
సారంపల్లి మల్లారెడ్డి
02.04.2014

No comments:
Post a Comment