(33వ అఖిలభారత కిసాన్‌సభ మహాసభల సందర్భంగా)
అఖిలభారత కిసాన్‌సభ 33వ మహాసభలు 2013 జూలై 24`27 వరకు తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో జరగబోతున్నాయి. 32వ మహాసభ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 2010 జనవరి 07`10 మధ్య జరిగింది. గత మహాసభ రైతులు ఎదుర్కొంటున్న నాగులు కీలక సమస్యలపై కమిషన్‌లు వేసి చర్చింది. 1) వ్యవసాయ రుణాలు 2) భూ సమస్యలు(సీలింగు, ఎస్‌ఇజడ్), 3) విత్తనం(బహుళజాతి సంస్థల గుత్తాదిపత్యం, బిటి వంకాయ ప్రవేశం, జన్యుమార్పిడి పంటలు`పర్యావరణంపై ప్రభావం), 4) వ్యవసాయ పంటల ధరలు, పంటల భీమా అను నాలుగు సమస్యలపైన తీర్మానాలు ఆమోదించింది. నాటి మహాసభలో వ్యవసాయ రంగంలోకి బహుళజాతి సంస్థల ప్రవేశ ప్రమాదాన్ని భారత రైతాంగానికి, ప్రజలకు గుర్తింప చేసింది. మహాసభ అభిప్రాయపడినట్లే గత మూడు సంవత్సరాలలో బహుళజాతి సంస్థల ప్రవేశం పెరగడం ఫలితంగా రైతులు దివాళా తీసి ఈ రంగం విడిచిపోతున్నారు. 1991లో 27.74% ఉన్నా రైతులు, 2011 జనాభా లెక్కల ప్రకారం వారి సంఖ్య 16.47 శానికి తగ్గినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ప్రతిరోజు 375 మంది రైతులు మొత్తం సంవత్సరంలో 13,68,012 మంది రైతులు దేశంలో వ్యవసాయ రంగాన్ని వదిలిపోతున్నారు. రైతాంగ సంక్షోభం పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. 2004 నుండి నేటి వరకు 3.30 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ప్రతి అరగంటకొక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. 40శాతం మంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టాలని ప్రభుత్వ విధానాలు ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయరంగంతోపాటు, దాని అనుబంధరంగాలకు ప్రణాళికాబడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడానికి ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న 25 కోట్ల ఆహారధాన్యాలకు అదనంగా మరో ఐదుకోట్ల టన్నుల ఉత్పత్తి పెరుగుతేనే ఆహారభద్రతా చట్టం అమలు సాధ్యమవుతుంది. కానీ, నేషనల్ సాంపిల్ సర్వే ప్రకారం నాలుగు శాతం వృద్దిరేటు లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రభుత్వం, 2011`12లో 3.6శాతం వృద్దిరేటు సాధించగా, 2012`13లో 1.9శాతానికి తగ్గిపోయింది. దీనిని బట్టి ప్రభుత్వం వ్యవసాయరంగంపై పాక్షిక దృష్టి మాత్రమే పెట్టినట్లు కనపడుతున్నది. ప్రభుత్వ అనుసరిస్తున్న కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలి.
వ్యవసాయ బడ్జెట్ (కోట్లలో)
రంగం 2011`12 2012`13 2013`14
వ్యవసాయరంగం 16718 18173 21933
పరిశోధన 4729 4620 5729
పశుసంక్షేమం, డైరీ, చేపలు 1333 1878 2110
పై కేటాయింపులు మొత్తం బడ్జెట్‌లో 3శాతానికిలోపుగానే ఉన్నాయి. అందువలన దేశ జిడిపిలో వ్యవసాయరంగం వాటా 2007`08లో 16.8శాతం ఉండగా 2011`12లో 12శాతానికి తగ్గింది. ఒక్కవ్యవసాయరంగానికి పరిమితంగా పరిశీలించినప్పుడు ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదల నామమాత్రంగా ఉంది. గ్రోత్‌రేటు ఈ విధంగా ఉంది.
సంవత్సరం గ్రోత్ రేటు శాతం
2010`11 7.9
2011`12 3.6
2012`13 1.6శాతంగా ఉంది.
ఫలితంగా దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఒకప్పుడు వంట నూనెలో స్వయంపోషకత్వంగా ఉన్న దేశం నేడు దిగుమతులు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడిరది. 2011`12లో 56.73లక్షల టన్నులు(రు.30,960 కోట్లు) దిగుమతులు చేసుకోవగా 2012`13లో(2012 నవంబర్ నాటికి) 71.76 లక్షల టన్నులు(రు.42,663 కోట్లు) విలవ గల వంటనూనెలు దిగుమతి చేసుకున్నాం. ఇత పెద్దఎత్తున విదేశీ మారకద్రవ్యం తరలిపోతున్నది. చివరి క్రూడ్ రబ్బర్ 8,807 కోట్లు ముడి పత్తి, రు.2 వేల కోట్ల విలువ కలది దిగుమతి చేసుకుంటున్నాం. ఏటా ఎరువులు 40 వేల కోట్ల విలువ గలవి దిగుమతులపై ఆధారపడి ఉన్నాం. రూపాయితో డాలర్ మారకం విలువ పెరిగినపుడు వ్యవసాయ ఉపకరణాల ధరలు అపరమితంగా పెరుగుతున్నాయి. గత ఆరు మాసాలలోనే ఒక డాలర్‌కు రూపాయలు 53 నుండి 61కి తగ్గింది. దీని ప్రభావం వ్యవసాయంపై తీవ్రభారాలు వేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాల ఫలితంగా 2011`12లో ఎగుమతులు 21.3శాతం కాగా దిగుమతులు 32.3శాతంగా ఉన్నాయి. వ్యాపార లోటు రు. 8,79,504 కోట్లుగా ఉంది. దేశ బడ్జెట్ 2013`14లో 16.50 లక్షల కోట్లలో విదేశీ వ్యాపార లోటు 50శాతంగా ఉంది. నేడు దేశం విదేశీ మారక ద్రవ్యలోటుకు చేరుకుంది. వ్యవసాయ రంగంలో ముందస్తు వ్యాపారం 30వేల కోట్లకు పెరిగింది. నేడు ముందస్తు వ్యాపారమే ధరలను శాసిస్తున్నది. ఉత్పత్తిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేయడం, వినియోగదారులకు రెట్టింపు రేట్లకు అమ్ముకోవడం జరుగుతున్నది. దేశీయ రుణభారం 2012`13లో 5,75,000కోట్లుగా ఉంది. విదేశీ వ్యాపారలోటు మరియు రుణం వాటి వడ్డీలు కలిపితే బడ్జెట్‌కు సరిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఏరంగంలోనూ స్వయం సమృద్ధం కాలేదు.
వ్యవసాయ రంగంలో అభివృద్ధి, అభివృద్ధి చెందిన దేశాలలోకాని, సోషలిస్టుదేశాలలో కాని 8శాతంగా ఉంది. కాని భారతదేశంలో గత రెండు దశాబ్దాలలో ఏటా 4శాతం వృద్ధిరేటు లక్ష్యం నిర్ణయించుకున్నా దాని దరికి చేరడంలేదు. ఒకవైపున ఉపకరణాల ధరలు 2004`05 స్థిర ధరలతో పోల్చితే 150శాతం పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గతంకన్నా తగ్గాయి. నేడు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. 1) రుణాల తగ్గింపు, 2) సాగునీటిని వ్యాపార సరుకుగా మార్చడం, 3) ఎరువుల ధరలు పెంచడం, 4) వ్యవసాయ శాఖ సిబ్బందిన తగ్గించడం, 5) మార్కెట్లను కాంట్రాక్టీకరించడం, 6) వ్యవసాయ దిగుమతులపై ఆధారపడడం, 7) ఆహారపంటల స్థానంలో వ్యాపార పంటలను ప్రోత్సహించడం తదితర పైవిధానాల ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతున్నది. వ్యవసాయ భూములను సెజ్‌ల పేరుతో లక్షల ఎకరాలను సన్న, చిన్నకారు రైతుల నుండి బలవంతంగా సేకరించి వారిని దిక్కులేనివారిగా చేయడమేకాక ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గుతున్నది. ఎరువులు, పెట్రోలియం ఉప ఉత్పత్తుల మీద కంట్రోల్ ఎత్తివేయడం, పంచదార లెవీ పద్దతిని తొలగించడం, చెరుకు , పత్తి మిల్లులు, ఫ్యాక్టరీలకు లాభాలు తెచ్చే విధానాలు అనుసరించడం వలన రైతులు ఈ రంగం నుండి తొలగిపోతున్నారు.
పై విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించాల్సి ఉంది. నేడు దేశ ప్రజానీకంలో 26 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. 30%మంది పిల్లలు 2.5 కే.జీల బరువు తక్కువ పిల్లలుగా పుడుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. సన్న, చిన్నకారు రైతులలో 50శాతం మందికి పైగా రైతులు వ్యవసాయం చేయడంపై నిరాసక్తతగా ఉన్నారు. 177 దేశాలలో భారతదేశం 126వ ర్యాంకులో ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిక తెలియజేస్తున్నది. వ్యవసాయ రంగం వృద్ధి దశలో ఉన్నపుడు ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా 2005నుండి అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఈ దుర్భర పరిస్థితి ఏర్పడిరది. దేశవ్యాపితంగా కౌలుదారుల సంఖ్య పెరుగుతున్నది. వీరికి ఎలాంటి రక్షణ చట్టాలు లేవు. ఉన్నా అవి అమలులో లేవు. భూమిలేని రైతులు, కౌలురైతులు మొత్తం వ్యవసాయ రంగంలో గలవారిలో 80శాతం ఉన్నారు. వీరిని సంఘటిత పరిచి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పోరేటు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాపిత ఉద్యమం రావాలి. వర్గరీత్యా భూస్వామ్య ` పెట్టుబడిదారీ వర్గాలు ఈ ఉద్యమాలను అణచడానికి వివిధ చట్టాలను రూపొందించడమేకాక రాజ్యహింసకు పాల్పడుతున్నారు. గతంలో ఉద్యమాల ద్వారా విజయాలు సాధించిన చరిత్ర అఖిలభారత కిసాన్ మహాసభకు ఉంది. కిసాన్ సభ సభ్యత్వం గత మహాసభనాటికి 2,26,32,584 సభ్యత్వం ఉంది. ప్రస్తుత మహాసభ నాటికి మరో 50 పెరుగుదల ఉంది. అదేదారిలో రానున్నకాలంలో ఉద్యమాలు కొనసాగించడానికి 33వ మహాసభ దిక్సూచిగా ఉంటుంది. రైతులను, భూమిలేని పేదలను కిసాన్‌సభ జెండాకిందకు తీసుకురావడానికి సంఘటిత కృషి జరపాలి.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment