2010`11 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రు.9000 కోట్లు ‘‘జాతీయ గ్రామీణ అభివృద్ధి త్రాగునీటి పథకం’’ కింద కేటాయించి దేశంలోని అన్ని గ్రామాలకు రక్షత త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణాభివృధ్ధిశాఖ పథకం రూపొందించింది. ముఖ్యంగా దళిత, గిరిజన పల్లెలకు, మురికా వాడలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ నిధులలో 20శాతం రాష్ట్రాలకు కేటాయిస్తూ, రాష్ట్రాలు వారి పథకాలకు 50:50 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కోరింది. ఇప్పటికే అనేక గ్రామాలకు త్రాగునీటి సౌకర్యంలేదు. ప్రజలు 10`12 కి.మీ వెళ్ళి త్రాగునీరు తెస్తున్నారు. ఒక వ్యక్తికి రోజుకు 40 లీటర్ల నీరు అవసరం. కానీ 10లీటర్ల లోపు లభ్యత లేని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే 1500 వరకు ఉన్నాయి. ఆరు దశాబ్దాలు గడిచినా మన ప్రభుత్వాలు త్రాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయాయి. భూగోళంపైనున్న ప్రతి ప్రాణికి నీరు అవసరం. నీటి లభ్యత తగినంత ఉంది. కానీ ప్రభుత్వాలు వినియోగంలోకి తేకపోవడంతో అనేక మంది అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. ఈ పరిస్థితులు గమనించి 1.3.92న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం మార్చి 23ను త్రాగునీటి దినంగా పిలుపిచ్చింది. ప్రపంచంలో మొదటిసారి 22మార్చి 1993న ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచంలో 78.3 కోట్ల మందికి రక్షిత నీరు లేదు. 7 లక్షల మంది పిల్లలు కులుషిత నీరు త్రాగి డయోరియాతో యేటా మరణిస్తున్నారు. అనగా రోజుకు 2000 మంది పిల్లలు మరణిస్తున్నారు. దీనిని నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఉద్యమం చేపట్టింది. అనేక ధనిక దేశాలు పేద దేశాలకు గ్రాంట్ల రూపంలో త్రాగునీటి పరిష్కారానికి నిధులు ఇస్తున్నాయి. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.
ఆర్శనిక్ మందులు, ఫ్లోరైడ్ నీరు, చౌడు కలిసిన నీరు(సెలినిటి) ఇనుము తదితర ఖనిజ లవణాలు కలిసిన నీరు, నైట్రేట్స్ మరియు బ్యాక్టీరియా కలుషితం జరిగిన నీటిని త్రాగునీటిగా వినియోగిస్తున్నాం. భారత దేశస్థాయిలో 11.51 లక్షల గ్రామాలకు రక్షిత నీరు ఉన్నట్టు, 5.70 లక్షల గ్రామాలకు పాక్షికంగా సరఫరా చేస్తున్నట్టు, 1.44 లక్షల గ్రామాలు కలుషిత నీటిని వినియోగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 85శాతం భూగర్భ జలాలపైననే ఆధారపడి ఉన్నారు. 35శాతం పైపు వాడుతున్నారు. 12శాతం మాత్రమే రక్షిత నీటి ట్యాపులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత 34,700 మిలియన్ క్యూబిక్ మీటర్లు లభ్యత ఉండగా, 14,112 మిలియన్ క్యూబిక్ మిటర్లు మాత్రమే వినియోగిస్తున్నాం. అనేక పథకాలు ప్రవేశపెట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఈ విధంగా వున్నాయి.
1) అత్యవసర గ్రామీణ నీటి సరఫరా పథకం(ఎఆర్‌డబ్ల్యుఎస్). దీనిని భారత ప్రభుత్వం 1972`73లో ప్రారంభించి 1973`74లో ఉపసంహరించింది. తిరిగి 1977`78లో కొనసాగించింది. 2009`10లో ఈ పథకం పేరు ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి (నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ వాటర్ ప్రాజెక్టు)గా మార్చారు.
2) కనీస అవసర కార్యక్రమం(ఎమ్‌ఎన్‌పి). ఐదవ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ త్రాగునీటి సరఫరా కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ముఖ్యంగా దళితులు, గిరిజనుల సబ్‌ప్లాన్ నిధులను వినియోగించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి.
3) ప్రధానమంత్రి గ్రామోదయ యోజన గ్రామీణ నీటి సరఫరా పథకం(పిఎమ్‌జివై`ఆర్‌డబ్ల్యుఎస్‌పి), దీనిని 2000`01లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన కింద ప్రారంభించింది. ఈ పథకానికి ఎమ్‌ఎన్‌పి(దళిత, గిరిజన సబ్‌ప్లాన్) నిధులను కూడా కలిపారు.
4) నాబార్డ్(ఆర్‌ఐడిఎఫ్), 2000`01 సంవత్సరం నాబార్డ్ ఆర్థిక సహాయంతో గ్రామీణ త్రాగునీటి పథకాలు ప్రారంభించారు. ఇందులో నాబార్డు 85శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15శాతం భరించాలి.
5) అంబేద్కర్ జీవనధార(ఎజెడి), ప్రధానంగా దళిత, గిరిజనులు నివసించే ప్రాంతాలకు గ్రామీణ త్రాగునీటి పథకం వర్తింప చేయడానికి దీనిని ఉద్దేశించారు.
6) హడ్కో 2004`05లో (హౌసింగ్ Ê అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (హడ్కో) నుండి గ్రామీణ త్రాగునీటి పథకాలకు మరియు సమస్యాత్మక గ్రామాలకు త్రాగునీటి సరఫరాకు ఆర్థిక సహాయం చేస్తారు.
7) ఎడారి అభివృద్ధి కార్యక్రమం(డిడిపి), కేంద్ర ప్రభుత్వం 100శాతం సహాయంతో అనంతపూర్ జిల్లాలో ప్రజలకు, పశువులకు త్రాగునీటి సహకారానికి నిధులు కేటాయించాలి.
8) స్వజలధార కార్యక్రమం, 25 డిసెంబర్ 2002న ప్రధాన మంత్రి వాజ్‌పేయిగారు ఆంధ్రప్రదేశ్, ఆదిలాబాద్ జిల్లా ఆవాల్‌పూర్ గ్రామంలో త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం మూడు మాసాలు నడవగానే మూతపడిరది. ఇలాంటి పథకాలను మరిన్ని గ్రామాలలో పెట్టడానికి ప్రయత్నించి విఫలం చెందారు. పై కేంద్ర ప్రభుత్వ పథకాలే కాక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారానూ, ప్రణాళికా నిధుల ద్వారానూ అనేక పథకాలు చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు. చివరికి గ్రామాలలో త్రాగునీటి సౌకర్య కల్పనకు పథకాలు రూపొందించారు. అయినా ఇంతవరకూ త్రాగునీటి సమస్య పరిష్కరించబడలేదు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి :
రాష్ట్రంలో 8.46 కోట్ల జనాభా (2011) ఉండగా 6.40 కోట్ల మంది గ్రామాలలో నివసిస్తున్నారు. 6 జిల్లాలలో గిరిజనులు అడవి ప్రాంతాలలో నివసిస్తున్నారు. నేటికీ గ్రామిణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలోనూ నివసించే ప్రజల త్రాగునీటి పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా ఉంది. 4`5 కి.మీల నుండి తెచ్చుకున్న నీటిని బహు జాగ్రత్తగా వాడుకోవాలి. మొత్తం గ్రామాలు 72,147 ఉండగా (21,634 గ్రా.పం) రోజుకు తలసరి 40లీటర్లు వినియోగించే గ్రామాలు 36,727 ఉన్నాయి. 10`39లీ. వినియోగించే గ్రామాలు 34,074 ఉన్నాయి. మిగిలినవి 10లీ లోపు వినియోగించే గ్రామాలు. 210 పట్టణాలకు కల్పించిన త్రాగునీటి వనరులు పట్టణ ప్రాంతాలకు కల్పించలేదు. మొత్తం గ్రామాలలో 3,33,123 చేతి పంపులు, 46,451 పిడబ్ల్యుఎస్ స్కీమ్‌లు, 462 సిపిడబ్ల్యుఎస్ స్కీమ్‌లు, 51 నీటి పరిక్షా కేంద్రాలు పని చేస్తున్నాయి. కానీ ఇందులో 35శాతం చేతి పంపులు పని చేయడం లేదు. రిపేర్లు చేయడానికి గ్రామపంచాయితీల వద్ద నిధులు లేక గ్రామాలలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది. యేటా మార్చి నెల ప్రవేశించినప్పటి నుండి జూలై ఆఖరు వరకు గ్రామాలలో త్రాగునీరు లభ్యత లేదు. జనగామా నియోజకవర్గంలోని పట్టణాలకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నియోజకవర్గంలోని గ్రామాలకు నీటిని ఫీల్టర్ చేయకుండానే, డీ`ఫ్లోరైడ్ చేయకుండానే సరఫరా చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఉన్న ఆరోగ్యం కూడా దెబ్బతిని ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చెక్‌డ్యాంలు, ఊటచెరువులు, ఉపరితల కుంటలు, వర్షపు కుంటలు, రీఛార్జ్ కుంటలు, భారీ మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది.
1969`2007 వరకు త్రాగునీటికి రాష్ట్రంలో 65.83 కోట్ల వ్యయం జరిగింది. ఈ దిగువ పనులు చేసారు.
(1) హాండ్‌పంపులు (2) ఎస్‌విఎస్ (సింగిల్ విలేజ్) స్కీమ్‌లు (3) ఎంవిఎస్ (బహుళ గ్రామాలు) స్కీమ్‌లు
ఉపరితల నీటి వినియోగం 23% మరియు భూగర్భజలాలు 72% వినియోగంలోకి తేవడానికి అంచనా వేసారు.
రాష్ట్రంలో మొత్తం గ్రామాలు 72147 ఉండగా 50శాతం గ్రామాలకు కూడా రక్షిత నీరు లేదు. ఆ ప్రయత్నమే లేదు. పథకాలెన్ని ప్రవేశపెట్టినా గ్రామీణ నీటి సరఫరా నేటికీ పూర్తికాలేదు. ఇక పట్టణాల సంగతి సరేసరి. 210 పట్టణాల్లో త్రాగునీటి కన్నా మురుగునీటి పారుదల సమస్యగా ఉంది. సీవరేజ్ బోర్డువారు త్రాగునీరు ` డ్రైనేజీ (సానిటేషన్) రెండు వ్యవస్థలను నిర్వహిస్తున్నారు. రకరకాల పథకాలతో ప్రవేశపెట్టిన త్రాగునీటి పథకాలు, శానిటేషన్ పథకాలు మధ్య దళారీలు కాజేస్తున్నారు. పట్టణాల్లో కాంట్రాక్టర్లే మున్సిపాలిటీలను కార్పొరేషన్ల నిధుల వ్యయంపై పెత్తనం చెలాయిస్తున్నారు. చివరకు త్రాగునీటిని వ్యాపారంగా మార్చివేసారు.
త్రాగునీటి వ్యాపారం :
సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో త్రాగునీటిని వ్యాపార సరుకుగా మార్చివేశారు. బహుళజాతి సంస్థలు ఈ రంగంపై గుత్తాధిపత్యం కలిగి వేల కోట్లు ఆర్జిస్తున్నారు. సోయూజ్ లియోన్నాయిస్, మెక్‌డోనాల్డ్, కోకోకోలా(కిన్‌లే) పెప్సి, మోన్‌శాంటో, థామస్‌వాటర్, నార్త్‌వెస్ట్‌వాటర్, వివిండ్‌ఎన్విరాన్‌మెంట్, ఎన్‌రాన్, కింగ్‌ఫిషర్ లాంటి సంస్థలు వేల కోట్ల త్రాగునీటి వ్యాపారం సాగిస్తున్నాయి. టాటా కంపెనీతో యురేకా ఫోర్బ్స్ జాయింట్ వెంచర్‌గా కలిసి నీటి వ్యాపారం సాగిస్తున్నారు. వీరంతా త్రాగునీటి వ్యాపారం చేయడం ఫలితంగా ప్రభుత్వం ఉచితంగా రక్షిత త్రాగునీటిని అందించే పథకాలకు అడ్డుపడుతున్నారు. గ్రామీణ రక్షిత పథకాలను చేపట్టి దశాబ్దాలు గడిచినా పెండిరగులో పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ బహుళజాతి సంస్థలు ఏర్పాటు చేసిన 56 మందుల తయారీ కంపెనీలు వదులుతున్న కాలుష్యం త్రాగునీటిలోకి చేరినట్టు పరిశోధనల ద్వారా తెలిసింది. మద్యం తయారీకి వేల కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. 1లీ బీరు తయారు చేయడానికి 10లీ ల నీరు కావాలి. ప్రస్తుతం త్రాగునీరు రు.15`20 ఉండగా లీటరు పాలు గ్రామాలలో రు.15`20 అమ్ముతున్నారు. ప్రస్తుతం నీటి వ్యాపారం ప్రపంచవ్యాపితంగా యేటా 400 కోట్ల డాలర్ల వ్యాపారం సాగుతున్నది. గ్రామాలలో డీ`ఫ్లోరైడేషన్ చిన్న యంత్రాలను పెట్టి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. వీరు సరఫరా చేసే నీటికన్నా బోరునీరు వినియోగం మంచిదని పరిశీలకులు చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రతి కుటుంబం త్రాగునీరు కొనుగోలుపైననే ఆధారపడి వుంటున్నారు.
హైదరాబాదు పట్టణ త్రాగునీటి సమస్య :
హైదరాబాదు నగరంలో సంపన్నుల కాలనీలో ఎలాంటి ఆటంకం లేకుండా అధిక మొత్తంలో నీరు సరఫరా అవుతుండగా పేదలు నివసించే బస్తీలలో సరఫరా తక్కువగా ఉంటుంది. సంపన్న కాలనీవాసులు సరఫరా అవుతున్న నీటిని వాహనాలు కడగడానికి, చెట్లకు పెట్టడం, స్విమ్మింగ్‌ఫూల్స్, పెంపుడు జంతువులకు స్నానం చేయించడం లాంటి వాటికి వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాదు పట్టణానికి ఈ దిగువ విధంగా రోజుకు మిలియన్‌గాలన్లు నీరు వస్తున్నది.
1) ఉస్మాన్‌సాగర్ ` 25 ఎంజిడి
2) హిమాయత్‌సాగర్ ` 14 ఎంజిడి
3) కృష్ణా ఫేజ్ 1 `90 ఎంజిడి
4) కృష్ణా ఫేజ్ 2 ` 90 ఎంజిడి
5) మంజీరా(సింగూరు) ` 120 ఎంజిడి
మొత్తం 340 ఎంజిడిలు వస్తున్నాయి. ప్రస్తుతం 700 ఎంజిడిలు రోజుకు కావాలి. ప్రపంచంలో ఇంత వత్యాసం ఎక్కడా లేదు. మూడవ దశగా కృష్ణా నుండి రు.1670 కోట్లతో 1.6.2013న కిరణ్‌కుమార్‌రెడ్డిగారు మూడవదశ మరో 90 ఎంజిడిలకు శంఖుస్థాపన చేశారు. పనులు సాగుతున్నాయి. పట్టణ జనాభా పెరిగిపోతున్నది. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాలలో పట్టణానికి ఆనుకొని ఉన్నవాటికి త్రాగునీటి సౌకర్యంలేదు. ప్రస్తుతం మెట్రోపాలిటన్ మరో 600 చ. కి.మీలకు వ్యాపించి ఉంది. మరో 100చ. కిమీ పెరగబోతున్నది. ప్రస్తుతం హైదరాబాదులో 5.3 లక్షల పంపుసెట్ల కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. బచావత్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల నుండి హైదరాబాదుకు త్రాగునీటికి సంవత్సరానికి 3.90 టిఎంసిలు మాత్రమే తీసుకురావాలి. కానీ ఇప్పటికీ ఇప్పటి మూడు దశలు రోజుకు 270 ఎంజిడిల నీటిని రాబడుతున్నారు. అనగా సంవత్సరానికి 16 టిఎంసిల కృష్ణా జలాలను వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్ నీటి లెవెల్ 511 అడుగులు ఉన్నప్పుడు డెడ్‌స్టోరేజీ 175 టిఎంసిలు ఉంటాయి. వీటిని వినియోగించరాదని జి.వో 69/1996లో అఖిలపక్షం ఆమోదంతో తెచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో డెడ్‌స్టోరేజీ నుండి త్రాగునీటిని వినియోగించవచ్చు.
హైదరాబాదు పట్టణానికి గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 120 ఎంజిడి గోదావరి ఉపనది మంజీరా నుండి నగరానికి వస్తున్నాయి. అనగా సంవత్సరానికి 7 టిఎంసిలు తెస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత ఇంద్రావతిలు కలిసిన తరువాత నీరు పుష్కలంగా ఉంటుంది. యేటా 4000 టిఎంసిల వరకు సముద్రంపాలవుతున్నాయి. ప్రాణహిత కలిసిన తరువాత(కాళేశ్వరం నుండి) 30 కి.మీల దిగువన గోదావరిపై కంతాలపెల్లి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట నుండి హైదరాబాదు పట్టణానికి 50 టిసిఎంల నీటిని తెచ్చే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి ఆటంకాలు లేవు. మనం వినియోగించకున్నా నీరు వృధాగా సముద్రం పాలవుతాయి. కంతాలపెల్లి ప్రాజెక్టుకు 19.2.2009న రాజశేఖరరెడ్డిగారు శంఖుస్థాపన చేశారు. G85 మీటర్ల ఎత్తు నుండి నల్లగొండ జిల్లాలోని ఆలేరు నదిపై నిర్మించే బేగంపేట రిజర్వాయర్, G 520మీ వరకు 4 ఎత్తిపోతల ద్వారా నీటిని తేవాలి. కంతాలపెల్లి నుండి ఆలేరుకు 170 కి.మీ దూరం కాగా ఆలేరు నుండి హైదరాబాదుకు 70కి.మీ దూరం ఉంటుంది. అనగా కంతాలపెల్లి నుండి 240 కి.మీ లలో హైదరాబాదుకు త్రాగునీటిని అందించవచ్చు.
హైదరాబాదులో త్రాగునీటి వ్యాపారం పెద్దఎత్తున సాగుతున్నది. ఈ వ్యాపారవేత్తలు మెట్రో త్రాగునీటిని కూడా తమ వ్యాపారానికి వినియోగించుకుంటున్నారు. కిన్‌లే కంపెనీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజుకు 1కోటి రూపాయల లాభం సంపాదిస్తున్నది. గ్రామస్తులకు మాత్రం త్రాగునీటి ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.
త్రాగునీటి వనరుల కల్పనకు ప్రస్తుతమున్న పథకాలన్నిటినీ ఒక ఎజెండా కిందకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను, విదేశీ సహాయాన్ని అన్నింటిని ఒకే వ్యవస్థ ద్వారా వ్యయం చేయాలి. వివిధ వ్యవస్థల కింద చెపట్టడం వలననే ఈ దుస్థితి కొనసాగుతున్నది. త్రాగునీటి వ్యాపారాన్ని నిషేధించాలి. బహుళజాతి సంస్థలను త్రాగునీటి వ్యాపారం చేయకుండా కట్టుదిట్టం చేయాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
సారంపల్లి మాల్లారెడ్డి
20.04.2012

No comments:
Post a Comment