2014 మార్చి`మే నెలలలో పార్లమెంటు, కొన్ని శాసనసభల ఎన్నికలు ప్రకటించారు. అన్ని పార్టీలు ప్రణాళికల తయారీలో తలమునకలైనాయి. ప్రజాకర్షక విధానాలను ప్రకటించడానికి ప్రణాళికలకు రచనలు సాగిస్తున్నారు. ఏకంగా ప్రణాళికా రచనలకు కమిటీలను వేశారు. 1956 నుండి ప్రతి ఎన్నికలకు ప్రణాళికలు ప్రకటిస్తూనే ఉన్నారు. రాబోయే 16వ లోక్‌సభ ఎన్నికలకు ప్రణాళికల తంతు తిరిగి ప్రారంభమైంది. ఓటర్లు, మేధావులు, పార్టీల ప్రణాళికలపై దృష్టిపెట్టటడం లేదు. ప్రణాళికల్లో ప్రకటించినవి అమలు చేయకపోవడం సర్వసాధారణమైంది. ఎన్నికల ప్రచార కాలంలో ప్రణాళికలలో చెప్పినవాటిని పెద్దఎత్తున ప్రచారం చేయడం, ఎన్నికలు ఐపోయిన తర్వాత ప్రణాళికలను మూలపడవేయడం జరుగుతున్నది. చివరకు గెలిచిన పార్టీ కూడా తన ప్రణాళికలో ఏమున్నదో అమలులో అందుకు భిన్నంగా పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షం తన ఎన్నికల ప్రణాళికను అమలు జరిపించుకోవడానికి పార్లమెంటు మరియు శాసనసభలలో ఏనాడు వాదించిన పాపాన పోలేదు.
2009 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ‘‘భారతజాతీయ కాంగ్రెస్’’ తన ప్రణాళికలో 1. సన్నకారు రైతుకు రాయితీతో బ్యాంకు రుణాలు, రుణమాఫీ పథకాలు, వ్యవసాయోత్పత్తి పెంచడం, వ్యవసాయాధారిత పరిశ్రమలు, పాడి పరిశ్రమ, చేపలు, రొయ్యలు, తదితరాల పెంపకం, ఉద్యాన కృషి, పట్టుగూళ్ళ పెంపకాల ప్రోత్సాహం, వృధాగా పడివున్న భూములలో అడవులు పెంచుతామని తెలిపారు. సమగ్ర పంటల భీమా పథకం, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఇండ్లవద్దనే కనీస మద్దతు ధరల అమలు, వ్యవసాయోపకరణాల ధరల తగ్గింపు, వ్యవసాయంపై ఆదాయం గ్యారంటీ చేస్తామన్నారు. 1984 భూసేకరణ చట్టానికి సవరణ తెస్తామన్నారు. సహకార సంఘాల ప్రజాస్వామీకరణకు, ఉపాధిహామీ పథకానికి సోషల్ ఆడిట్ చేస్తామన్నారు. గ్రామీణ ఆహారభద్రతా చట్టం తెస్తామన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తామన్నారు.
2014 మార్చి నాటికి పరిశీలిస్తే 2009 ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదు. 2012 సంవత్సరంలో దేశంలో మొత్తం 13754 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 2572 మంది(19శాతం) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1997 నుండి సంస్కరణలు అమలు జరుపుతున్న సంవత్సరమే ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2004`12 సంవత్సరాలలో యేటా సగటున 2376 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే నేడు ప్రభుత్వాలు సన్నచిన్నకారు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఒకవైపు చెబుతుండగానే మరో వైపు ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. సంస్కరణలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచకపోగా రైతులను సంక్షోభంలోకి నెట్టాయి. సన్నచిన్నకారు రైతులు వ్యవసాయ రంగం వదిలివేస్తున్నారు.
ప్రతి సంవత్సరం 1,36,875 మంది రైతులు దేశంలో వ్యవసాయ రంగం వదిలిపోతున్నారు. అనగా రోజుకు 375 మంది వ్యవసాయరంగాన్ని వదిలిపోతున్నారు.
దేశంలో కౌలుదార్ల సంఖ్య విస్తరిస్తున్నది. కౌలుదార్ల రక్షణకు ఎలాంటి చట్టాలు లేవు. గతంలో వామపక్షప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయనిరాకరిస్తున్నాయి. పంట దిగుబడి ఎంత వస్తుందో అంత కౌలు రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అందువల్ల రుణగ్రస్తులైన కౌలుదారులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కనీస మద్దతు ధరల నిర్ణయం` తగ్గింపు
మార్కెట్లను ప్రైవేటీకరిస్తూ కేంద్రం సూచనల మేరకు రాష్ట్రాలు సవరణలు చేశాయి. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలు జరపాలన్న నిబందనకు నీళ్ళువదిలారు. అతితక్కువగా ప్రకటించిన కేంద్ర మద్దతు ధరలు కూడా లభ్యంకాని పరిస్థితి ఏర్పడిరది. కనీస మద్దతు ధరల నిర్ణయంలో అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. కాంప్రహెన్సివ్ పథకం కింద చేసిన సర్వేలో పత్తిహెక్టారుకు 17.83 క్వింటాళ్ళు రాగా క్రాప్ కటింగ్ ప్రయోగంలో 4.3 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ రెండు సర్వేలలో కాంప్రహెన్సివ్ సర్వేలను తీసుకోవడం ఫలితంగా 410.10 శాతం ధరలు తగ్గాయి.
ప్రకృతి వైపరీత్యాలు ` ప్రభుత్వ సహకారం.
కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలో 3290 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణంలో 400 లక్షల హెక్టార్లకు వరద తాకిడికి గురవుతున్నాయి. సగటున 75లక్షల హెక్టార్లు పంటలు పూర్తిగా నష్టపోతున్నాయి. యేటా 16 వేల మంది చనిపోతున్నారు. కరువుల వల్ల మరో 500 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ విధంగా దాదాపు మూడోవంతు భూమి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. 1954 నుండి 2004 వరకు 20 కమీషన్లు ప్రకృతివైపరిత్యావల నివారణకు నివేదికలిచ్చాయి. ఆ సూచనల్లో ఏఒక్కటీ పాటించలేదు. ఫలితంగా నేటికీ ప్రకృతి వైపరిత్యాల బారిన యేటా లక్షల కోట్ల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి జరిగిన నష్టంలో 5శాతం కూడాలేదు. ప్రధానంగా ప్రకృతివైపరిత్యాలు జరిగిన ప్రాంతాలలో ఆత్మహత్యలు ఎక్కువగా సాగుతున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి 12 నవంబర్ 2013న 40లక్షల ఎకరాల్లో రు.6500 కోట్ల పంటలు నష్టపోయినట్లు, 58 మంది మరణించినట్లు ప్రకటించారు. కేంద్రం వేయి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు. కానీ ఇంత వరకు పూర్తి పరిహారం రైతాంగానికి చెల్లించలేదు.
4`7 నవంబర్ 2013న హైదరాబాదులోని హైటెక్‌సిటీలో ‘‘ప్రపంచవ్యవసాయఫోరం మహాసభ మరియు వ్యవసాయ సాంకేతిక వ్యాపార సంత’’ ఏర్పాటు చేయబడిరది. దీని నిర్వహణకు అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, అస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు స్పాన్సర్ చేశాయి. స్వయంగా పాల్గొన్నాయి. బేర్(జర్మనీ) సంస్థ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. ఈ మహసభల ముఖ్యఉద్ధేశం ‘‘సన్నచిన్నకారు రైతుల భవిష్యత్తు సుస్థిరంగా పున:ఏర్పాటు’’ అను అంశంతో జరుగుతున్నాయి. బేర్ సంస్థ, నోవాస్, మోన్‌శాంటో, ఫాంటెర్రా, ఎర్త్‌వాచ్ మొదలగు పెద్ద సంస్థలు ఈఫోరం నిర్వహణ బాధ్యతల్లో ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించాడు. రాష్ట్రంలో వారి వ్యాపారానికి కావలసిన అన్ని రక్షణలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆరోజే ఈ కార్యక్రమం నిర్ణయించబడిరది. ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ ఫోరం ఛైర్మన్ కెన్నత్ బెకన్ అధ్యక్షతన, మైకెల్ డోయిన(మోన్‌శాంటో వైస్‌ప్రసిడెంట్), థాడ్‌సిమెన్స్(సిఇవో, నోవాస్ అమెరికా), డినైన్‌బూరెల్లా (ఫాంటెర్రా)లలు ప్రధాన వక్తలుగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభం చేశారు. వ్యవసాయశాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్‌పవార్‌కు బదులు మరొక మంత్రి హాజరయ్యారు.
2012 మార్చి 5న భారత వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రకటన ప్రకారం ‘‘పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్(పిపిపిఐఎడి)’’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని 10 లక్షల సన్న చిన్నకారు రైతులకు వర్తింపచేస్తూ 2012`17 కాలంలో అమలు చేయాలి. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10వేల మంది రైతులు ఉండాలి. ఈ ప్రాజెక్టు కాలం 3`5 సం॥ల వరకు ఉంటుంది. ప్రతి రైతుకు 1లక్ష రూపాయల వరకు పెట్టుబడి ఇస్తారు. ఇందులో భారత ప్రభుత్వం 50శాతం అనగా రు.50వేలకు మించకుండా పెట్టుబడి ఇస్తుంది. డ్రిప్, స్ప్రింక్లర్, యాంత్రీకరణ, గ్రేడిరగ్ లాంటి పథకాలను సబ్సిడీగా ఇస్తారు.
సన్న ` చిన్నకారు రైతులకు భూములపై హక్కులు లేకుండా చేయడం, సాగునీటికి మీటర్లు పెట్టి పన్ను విధించడం, ఎరువులు`విత్తనాల ధరలు పెంచడం (నాణ్యత లోపించడం), వ్యవసాయ విస్తరణ సేవలను కుదించడం, పంట రుణాలు తగ్గించడం, మార్కెట్లలో కాంట్రాక్ట్ పద్దతులు ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసైనా సన్న`చిన్నకారు రైతులను భ్రమలకు గురిచేసి వారి భూములను ఏక ఖండాలుగా మార్చి కంపెనీ వ్యవసాయం చేయడానికి ఇప్పటికే రాష్ట్రంలో మూడు సార్లు ప్రయత్నం జరిగింది. ఒకసారి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు సహకార కంపెనీ వ్యవసాయం పేరుతో ఇచ్చిన ప్రతిపాదనను రైతులు వ్యతిరేకించారు. రెండవసారి మూడు గ్రామాలను ఎంచుకుని కంపెనీ వ్యవసాయం చేయ నిర్ణయించగా (వరంగల్, మెదక్, అనంతపురం) దానిని రైతులు వ్యతిరేకించారు. మూడవసారి పిపిపిఏఐడి చర్చను కేంద్రం తెచ్చింది. దానిని రైతులు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు ఈ మహాసభల ద్వారా రైతాంగాన్ని నమ్మించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అనేక దేశాల్లో చిన్న కమతాల ద్వారా ఉత్పత్తిపెరుగుతుందని వారికి అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ ఇక్కడ భారీ కమతాలపై నుండి దృష్టిని మరలించలేకుండా రాష్ట్ర`కేంద్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు దాసోహమంటున్నాయి.
వ్యవసాయ అభివృద్ధిని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఏనాడు ప్రణాళికా వ్యవసాయ బడ్జెట్ కింద ఏనాడూ 3.50 శాతానికి మించలేదు. ఈ బడ్జెత్ కేటాయింపులతో వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయా? అందువల్ల గత 5 సంవత్సరాలలో వ్యవసాయోత్పత్తులు పెరగకపోగా, పప్పులు, వంటనూనెలు లక్ష కోట్ల విలువగలవి దుగుమతి చేసుకుంటున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యవసాయ బడ్జెట్‌లను పూర్తిగా తగ్గించివేశాయి. ఫలితంగా ప్రైవేట్ పెట్టుబడులు పరిగి లాభాలు ప్రైవేటువారికి వెళ్ళుతున్నాయి.
వ్యవసాయ బడ్జెట్ (ప్రణాళిక)
సం॥ వ్య.రంగం శాతం ప్రణాళికబడ్జెట్ మొత్తంబడ్జెట్
2010`11 13,824 3.65 3,79,029 11,97,327
2011`12 12,482.47 3.01 4,12,375 13,04,365
2012`13 17,665.34 3.09 4,13,625 14,10,367
2013`14(రి) 19,000.00 3.08 4,75,532 15,90,434
2014`15(బి) 21,609.00 3.89 5,55,322 17,63,214
వ్యవసాయ రుణాలను తగ్గించారు. ఉపకరణాల ధరలు పెరుగుతున్న క్రమంలో వాటికి సరిపడా రుణలభ్యత లేదు.
సంవత్సరం టార్గెట్ సాధించినది
2009`10 3,25,000 2,76,656
2010`11 3,75,000 3,55,550
2011`12 4,75,000 3,96,158
2012`13 5,50,000 4,20,000
2013`14 7,00,000 7,30,000
2014`15 7,00,000 `
పెరుగుతున్న ధరలను బట్టి రుణ లభ్యత లేకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీలపై ఆధారపడుతున్నారు. ఆ విధంగా సంస్థాగత రుణాలకు రైతులు దూరమయ్యారు.
సాగునీటిని వ్యాపార సరుకుగా మార్చేశారు. మీటర్లు బిగించారు. సాగునీటి లభ్యత లేక రైతులు తమ స్వంత పెట్టుబడితో భూగర్భజలాల ద్వారా పంటలు పండిస్తున్నారు. పంపుసెట్ల కింద పండిస్తున్న రైతులు రుణాలు పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ విధంగా ప్రత్యక్ష పన్నులు తగ్గించి, పరోక్ష పన్నులు విఫరీతంగా పెంపుదల చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఈ విధంగా ఉన్నాయి.
పన్నులు 2011`12 2012`13 2013`14
రాష్ట్ర పన్నులు 53,283 62,572 72,442
పన్నేతర రాబడి 11,694 12,864 15,393
కేంద్రం నుండి పన్నులు 17,751 20,270 24,132
గ్రాంట్లు 10,824 13,793 15,803
మొత్తం 93,553 1,09,500 1,27,772
పై రాష్ట్ర పన్నులను పరిశీలించినప్పుడు రాష్ట్ర పన్నులు పన్నేతర ఆదాయం విఫరీతంగా పెరుగుతున్నది..
ప్రస్తుతం దేశంలో పరిస్థితి
R దేశంలో 24.6 కోట్ల కుటుంబాలను సర్వే చేయగా
R 22% మందికి కాంక్రీటు కప్పు ఇండ్లు ఉన్నాయి.
R 32% మందికి పంపునీళ్ళ లభ్యత ఉంది.
R 47% మందికి మరుగుదొడ్లు ఉన్నాయి.
R 49% మంది వంట కట్టెలు ఉపయోగిస్తున్నారు.
R 17% మంది పిడకలు వంటకు వినియోగిస్తున్నారు.
R 41% మందికి మాత్రమే వంటగదులు ఉన్నాయి.
దారిద్య్ర రేఖ నిర్ణయం
2008`09లో గ్రామీణంగా రు.22.40 మరియు పట్టణ ఆదాయం రు.28.65లు రోజుకు మించితే వారు బిపిఎల్ కిందకురారు. 2011`12లో దీనిని కాస్త పెంచి గ్రామీణ రు.26, పట్టణ రు.32గా నిర్ణయించారు.
పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజెపి ప్రకటించిన ప్రణాళికలో రైతులను రుణవిముక్తులను గావించడానికి ఆత్మహత్యల నివారణకు భూసేకరణలో రైతుల ప్రయోజనాల రక్షణకు ఆహారభద్రతకు పోరాడుదామని ప్రకటించింది. గత 5 సంవత్సరాల పాలనలో తాను ప్రకటించిన ప్రణాళికలోని అంశాలపై పార్లమెంటులో చర్చను ప్రారంభించలేదు. రైతుల ఆత్మహత్యలు సాగుతున్నా తనకు పట్టనట్లు ఊరుకుంది. వ్యవసాయోత్పత్తుల దిగుమతులు వస్తున్నా ఆటంకపర్చలేదు. చివరకు మన మిగులు ఉత్పత్తును ఎగుమతులు చేస్తున్న సందర్భంలో వాటిని నిషేధించి దేశంలో పంటల ధరలు తగ్గడానికి(పత్తి, పంచదార) అవకాశం కల్పించారు. ఆ విధంగా రైతులు దివాళా తీసి రుణగ్రస్తులయ్యారు.
చివరికి తెలుగుదేశం, లోక్‌సత్తా లాంటి పార్టీలు కూడా తమ ప్రణాళికలను అమలు జరపడంలేదు. ప్రణాళికలు ‘‘శుభపత్రిక’’ల్లాగా ప్రచారానికి వినియోగించడమే తప్ప తిరిగి వాటి గురించి పట్టించుకున్న పార్టీలేదు.
2014లో ప్రకటించబోయే ప్రణాళికలు పాత విధానానికే కట్టుబడతాయా? లేక కనీసం వాటి అమలు కొరకు కృషి చేస్తాయా అన్నది వేచి చూడాలి.
సారంపల్లి మల్లారెడ్డి
25.03.2014

No comments:
Post a Comment