2013 నవంబర్ 1న కేంద్ర ప్రభుత్వం ఎంఎన్‌ఎఐఎస్(మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ స్కీం)ను ప్రకటించింది. గతంలో నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ మరియు రాష్ట్రీయ ఫసల్‌బీమా కార్యక్రమం పథకాలను కలిపి ఎంఎన్‌ఎఐఎస్‌ను ఏర్పాటు చేశారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, నెల్లూరు, వరంగల్ జిల్లాలను మాత్రమే ప్రయోగాత్మకంగా అమలు చేయ తలపెట్టారు. 2010`11లో ప్రారంభించిన ఈ పైలెట్ పథకానికి నేడు తూర్పుగోదావరి జిల్లాలోని వరి పంటలను కూడా తీసుకున్నారు. 2011 పంటల బీమా పథకాన్ని సమీక్షిస్తే వర్షబీమా పథకం కింద 8.82 లక్షల మంది బీమా చేసుకోగా 6.66 లక్షల మందికి క్లెయిమ్‌లు చెల్లించినట్టు ఎంఎన్‌ఐఎఎస్ కింది 40 వేల మంది ప్రీమియం చెల్లించగా 5 వేల మందికి క్లెయిమ్‌లు ఇచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. రెండు పథకాలకు కలిపి రైతుల నుండి వసూలు చేసిన ప్రీమియం 319.23 కోట్లు కాగా రైతులకు ఇచ్చిన క్లెయిములు 205.66 కోట్లు మాత్రమే. పంటల బీమా పథకం అంటే ప్రీమియంకు మించి క్లెయిములు వచ్చినపుడు ఏదో కారణంతో కోతలు పెట్టడం జరుగుతుంది. 2009`10లో మొదటిసారి ‘వర్షబీమా పథకం’ ప్రారంభించారు. 2010`11లో మాపిఫైడ్‌నేషన్ అగ్రికల్చరల్ ఇన్యూరెన్స్ పథకం ప్రయోగాత్మకంగా తెచ్చారు. ఇంత వరకు రాష్ట్రంలో పంటల బీమా పథకం వల్ల ఏరైతుకూ లాభం జరగలేదు. రుణం పొందినవారికి మాత్రమే తప్పనిసరి బీమా వర్తింపచేయడంతో వారు కూడా ప్రీమియం చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. ప్రీమియం చెల్లించడం నుండి మినహాయింపు కోరుతూ కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. నేటికీ పంటల బీమాపై అసంతృప్తిగానే ఉన్నారు.
బీమా చరిత్ర :
1970లో ధర్మనారాయణ కమిటీ పంటల బీమాపై అధ్యయనం చేసింది. అమలు కష్టసాధ్యమని, వ్యక్తిగతంగా అమలుపర్చమని కోరారు. ప్రొ॥దండేకర్ దీన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1972లో పంటల బీమా పథకం హెచ్`4 పత్తికి మాత్రమే పరిమితం చేశారు. నాటి నుండి 1999 వరకు ఇది ప్రయోగాత్మకంగా సాగింది.
(ప్రీమియం, క్లెయిములుRలక్షల రూపాయలలో)
మొదట 1985లో గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపచేశారు. 1994`99 వరకు 1రూపాయి ప్రీమియం చెల్లిస్తే రు.4 క్లెయిమ్ చేశారు. 2000 సంవత్సరం నుండి జాతీయ పంటల బీమా పథకాన్ని (ఎన్‌సిఐకి) అమలులోకి తెచ్చారు. ఈ పథకం కింద బీమాదారులకు క్లెయిములు రావడం అనేక చిక్కులతో ముడిపడి ఉంది. పంట నిలువుపై ఉన్నప్పుడు నష్టం జరిగితేనే క్లెయిములు చెల్లిస్తారు. పంట కోసి పొలంలోనే ఉండగా నష్టం జరిగినప్పుడు క్లెయిములు వర్తించవు. పైగా తాలూకా లేదా మండలం యూనిట్‌గా తీసుకొని నష్టాన్ని లెక్కిస్తారు. క్రాప్ కటింగ్ ఎక్స్‌పర్‌మెంట్ ద్వారా దిగుబడిని నిర్ణయిస్తారు. గత ఐదు సంవత్సరాల సగటు పంటను (త్రెషోల్డ్ యీల్డ్) గా గుర్తించి అందులో నుండి రిస్క్ శాతాన్ని తగ్గిస్తారు. ఐదు సంవత్సరాల సగటుకు సమానంగా గాని ఎక్కువగా గాని దిగుబడి వచ్చినపుడు పరిహారం వర్తించదు. దీనివల్ల ఏరైతుకు బీమా వర్తించలేదు. ఢల్లీి నుండి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రి నాయకత్వాన పరిశీలనకు వచ్చినపుడు రైతులు, రైతు సంఘాలు బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా మార్చాలని కోరారు. ఇది జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నది. అయినప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదు.
ప్రీమియంను అనంతరం ఆహార పంటలకు 2శాతం, వాణిజ్య పంటలకు 4శాతంగా నిర్ణయించారు. రుణంపై పైమొత్తం చెల్లించాలి. ప్రీమియం వసూలు నుండి క్లెయిములు ఇచ్చే వరకు కాగితాల పని పూర్తిగా జనరల్ ఇన్య్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రీమియం నుండి కొంత తీసుకుంటారు. క్లెయిములకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు రాష్ట్రం 50శాతం, కేంద్రం 50శాతం చెల్లించాలి. అనేక సందర్భాలలో కేంద్రం నిధులు వచ్చినప్పటికీ రాష్ట్రాలు తమ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో క్లెయిముల చెల్లింపులు సంవత్సరాల తరబడి పెండిరగులో ఉన్నాయి. పంటల బీమా పథకాల పరిణామ క్రమం ఈ విధంగా ఉంది. 1. జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ `1972, 2. నేషనల్ అగ్రికల్చరల్ కార్పోరేషన్, 3. రాష్ట్రీయ కృషి బీమా యోజన, 4. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 5. మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ వీటికి తోడు రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం 2008`09లో ప్రారంభించారు. వాతావరణ బీమా కింద చెల్లింపులు ఈ విధంగా ఉన్నాయి.(కోట్లలో)
ఈ పథకం కింద వేరుశనగ బీమాకు ఎకరాకు రు.265.20 పైసలు ప్రీమియం చెల్లించాలి. పథకం ప్రారంభించినప్పటి నుండి ప్రీమియం చెల్లించడమేతప్ప నష్టపోయిన రైతులకు పరిహారం రాలేదు. ముఖ్యంగా ఈ పథకాన్ని రాయలసీమ జిల్లాలలో వేరుశనగపై అమలు చేశారు. ఏటా 15`20 ఎకరాలలో వర్షాభావం వల్ల వేరుశనగ దెబ్బతిన్నప్పటికీ పరిహారం మాత్రం ఏదోకారణాలు చూపి తగ్గించివేశారు.
ప్రస్తుతం అమలు చేయబూనుకున్న మాడిఫైడ్ అగ్రికల్చరల్ నేషనల్ ఇన్సురెన్స్ పథకంలోకి వాతావరణ బీమా పథకం కొబ్బరి తోటల బీమా పథకాన్ని కూడా తెచ్చారు. ఈ మూడు పథకాలను కలిపి ఒకే పథకంగా రూపొందించారు. ప్రీమియంను రుణంపైగాక పంట దిగుబడి అంచనాపై నిర్ణయించారు. ఒక్కో పంటకు 14శాతం వరకు కూడా నిర్ణయించారు. ఫలితంగా ప్రీమియం బాగా పెరిగింది. 31.7.2012 నాటికి ప్రీమియం ఎకరాకు ఈ విధంగా ఉంది.
పత్తి, మిరపకు నీటిపాదుల, నీటిపారుదల లేని వాటికి రెండు ప్రీమియంలు నిర్ణయించారు. రుణం పొందినవారు తప్పనిసరిగా బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం పొందనివారికి తప్పనికాదు. సన్న చిన్నకారు రైతులకు 50శాతం ప్రీమియం సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. మిగిలిన 50శాతం రైతు చెల్లించాలి. ఇన్సురెన్స్ క్లెయిమ్ చేయడానికి ఈ దిగువ సూత్రాన్ని పాటించాలి.
త్రెషోల్డ్ యీల్డ్ ` వాస్తవ దిగుబడి
త్రెషోల్డ్ యీల్డ్
పై సూత్రం ప్రకారం త్రెషోల్ యీల్డ్‌లో తక్కువ రిస్క్ కింద 10శాతం తగ్గించాలి. మీడియం రిస్క్ అయినచో 20శాతం, హై రిస్క్ అయిన పంటలకు 40శాతం తగ్గించాలి. దీనిని ఇండెమ్నిటీ లెవల్స్ అంటారు. క్రాప్ కటింగ్ ఆధారంగా గత ఐదు సంవత్సరాల సగటు దిగుబడిని తీసుకొని అందులో నుండి వాస్తవ దిగుబడిని తీసివేయాలి. రిస్క్‌గా ప్రకటించిన ఇండెమ్నిటీ లెవల్స్ తగ్గించాలి. వచ్చిన మొత్తాన్ని ఇన్సూర్ చేసిన మొత్తంతో గుణకారం చేసి త్రెషోల్డ్ యీల్డ్‌తో భాగహారం చేయాలి. అప్పుడు క్లెయిమ్ మొత్తం వస్తుంది. క్రాప్ కటింగ్ చేసినపుడు మనం తప్పనిసరిగా ఉండాలి. వాతావరణ బీమా కింద వర్షాలు ఆలస్యమైనపుడు పంటవేయనపుడే 25శాతం పరిహారం చెల్లిస్తారు. మద్యలో ప్రకృతి వైపరిత్యాలకు తక్షణ పరిహారం కింద మరో 25శాతం చెల్లిస్తారు. వడగండ్ల వానకు మరియు కల్లాలలో పంటనష్టం జరిగినప్పుడు బీమా క్లెయిమ్స్ చేస్తారు. దీనిని కౌలుదారులకు కూడా వర్తింప చేస్తారు. ఆ విధంగా వర్షబీమా, కొబ్బరి తొటల బీమాను మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సురెన్స్‌తో జతచేశారు.
ఇతర దేశాలలో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. సగటు పంటకు దిగుబడి ఎంత తక్కువ వస్తే దానికి విలువ కట్టి రైతుకు చెల్లిస్తారు. దీనివల్ల ఎలాంటి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉండదు. క్రాప్ కటింగ్ ద్వారా సగటు పంటను నిర్ణయిస్తారు. కొత్త పథకం కింద ప్రీమియం ముతకధాన్యలకు దాదాపుగా రు.400, పప్పుధాన్యాలకు రు.200 నుండి 250 వరకు చెల్లించడానికి రైతులు ధౌర్యం చేయడంలేదు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రు.14 చొప్పున ప్రీమియం కట్టాలి. ఇందులో 50శాతం కొబ్బరి అభివృద్ధి మండలి చెల్లిస్తుంది. మరో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనిచో ఆ మొత్తాన్ని రైతులే భరించాలి. పంట నష్టాలను అంచనా వేయడానికి ప్రతి 17 కి.మీ లకు నీటి కొలత పరికరాలను పెట్టాలి. కొత్తగా దేశమంతా 5000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి ఉన్నవే సరిగా పనిచేయడంలేదు. వేళ్ళమీద లెక్కించగలిన వాళ్ళకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది.ఈ బీమా కింద వరి, సన్‌ఫ్లవర్, వేరుశనగ, మిరప, పెసళ్ళు, మినుములు, మొక్కజొన్న, కందులు మాత్రమే నష్టం జరిగినచో క్లెయిములు వర్తింపచేస్తారు. మిగిలిన పంటలకు వర్తింపచేయరు.
వర్షబీమా :
1. ప్రతి 17 కి.మీలకు ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొలత పరికరాలను పరిశీలించే ఉద్యోగులను నియమించాలి.
2. పంట వేసిన తరువాత 45 రోజులు వర్షం రాకపోతే ఇన్సురెన్స్ చేసినదాంట్లో 50శాతం చెల్లిస్తారు. ఈ తరువాత 45 రోజులకు మిగితా సగం ఇస్తారు.
3. అతి వర్షం పడి నష్టం జరిగితే ప్రాంతాలను బట్టి బీమా నిర్ణయిస్తారు.
4. సన్నచిన్నకారు రైతులకు 2.5శాతం, మిగిలిన రైతులకు 3.5 శాతం ప్రీమియం చెల్లించాలి.
5. వ్యవసాయశాఖ ద్వారాగాని, బ్యాంకుద్వారాగాని ప్రీమియం చెల్లించవచ్చు.
6. దేవాలయ భూముల కౌలుదారులకు కూడా దీనిని వర్తింపచేస్తారు.(మామూలు కౌలుదారులకు వర్తింపచేయరు.)
7. అడంగల్/పహాణి ఒక కాపీని జతపర్చాలి.
ఇవి ప్రస్తుతం రాయలసీమా నాలుగు జిల్లాలోని వేరుశనగ పంటకు మాత్రమే వర్తింపచేశారు.
పై వివరణ పరిశీలించినపుడు లాభాలు ఆశించి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఈ రంగంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వారు ప్రీమియం వసూలు చేయడమే తప్ప ఎలాంటి క్లెయిములు ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడంలేదు. పథకాన్ని రూపొందించినప్పుడు రైతు ప్రతినిధులతో కాని, కనీసం పార్లమెంటులోని ప్రతినిధులతోగాని లేదా శాసనసభ్యులతోగాని చర్చించకుండా ఇన్సురెన్స్ కంపెనీల లాభాల కొరకు ఈ బీమా పథకం ప్రకటిస్తునారే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదు. అందువల్ల పంటల బీమా పథకం ప్రయోగాలు నాలుగు దశాబ్దాలు గడిచినా నేటికీ ఏఒక్క పథకం రైతుల ప్రయోజనాన్ని రక్షించలేకపోయింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో సగటు దిగుబడి అంచనాలు ఉన్నాయి. ఆ దిగుబడికి ఎంత పంట తగ్గితే రైతువారిగా అతనికి పరిహారం చెల్లించే విధానం ఒక్కటే సరైన మార్గం. ఇది అమెరికా, చైనాల్లో కొనసాగుతున్నది. భారతదేశంలో కూడా దీన్ని వర్తింపచేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
11.05.2014

No comments:
Post a Comment