వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకాలోని తిమ్మంపేట మా స్వగ్రామం. గ్రామంలో నాటి సామాజిక పరిస్థితులు భూస్వామ్య ప్యూడల్ విధానం కొనసాగింది. పటేల్, పట్వారీలకు గ్రామానికి వచ్చిపోయే ప్రభుత్వ అధికారులకు దళితులు, రజకులు వెట్టిచాకిరి చేసేవారు. వెట్టిచాకిరికి ఎలాంటి జీతంగాని, కూలిగాని, పరిహారంకాని ఇవ్వకుండా ఉచితసేవలు చేసేవారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయదారులకు మేరలపై వృత్తులవారు పనిచేసి పెట్టేవారు. మాదిగ, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం, తదితర వృత్తులవారు గ్రామాన్ని తమలో తాము పంపిణీ చేసుకుని తమకు వచ్చిన కుటుంబాలకు వృత్తిపరమైన సేవలందించేవారు. ఈ సేవలు చేసినందుకు పంటల కాలంలో వారికి మేరలు ఇస్తారు. ఈ మేరల పెంపుదలకు ఉద్యమాలు చేసేవారు. మేరలు పెరిగిన తర్వాత తిరిగి పనిలోకి వచ్చేవారు. గ్రామంలో పదిసం॥ వయస్సు పైబడినవారు మొదలు 60 సంవత్సరాల వరకు వున్న మగవారు జీతాలకు పనిచేసేవారు. జీతంక్రింద పంట ధాన్యం ఇచ్చేవారు. చిన్నపిల్లవాడికి 30కిలో జొన్నలు, పెద్దవారికి 60 కిలోల జొన్నలు నెలకు ఇచ్చేవారు. డబ్బు అవసరముంటే యజమాని వద్ద సంవత్సరానికి రూ.100కు 24 రూ. వడ్డీకి తీసుకునేవారు. వారికుటుంబాలలో పెండ్లిళ్ళు జరిగినా, ఇళ్ళు నిర్మాణం చేసుకున్నా, ఆరోగ్యపరమైన అవసరాలున్నా, యజమాని నుండి బాకీ తీసుకునేవారు. కొన్ని కుటుంబాలు బాకీ తీరక శాశ్వతంగా వారివద్దనే తక్కువరేటు జీతానికి పనిచేసే వారు. ప్రతి ఉగాదికి పాలేర్లు మారేవారు. గ్రామంలో 10,12 కుటుంబాలు వడ్డీవ్యాపారం, నాగు వ్యాపారం చేసేవారు. నాగు అనగా(జూన్‌లో బస్తావడ్లు అప్పుగా తీసుకుంటే జనవరిలో పంటపండినాక అసలు బస్తాతో సహా మరొక అర బస్తా వడ్డీగా చెల్లించాలి) ఈదోపిడి అతి తీవ్రంగా ఉండిరది. అలాగే వడ్డీ రూ.100 కు సంవత్సరానికి రూ.24`60 వరకు వసూళ్ళు చేసేవారు. నాగులు, వడ్డీలు చెల్లించలేక చాలామంది భూములు కొల్పోయారు.
మా తల్లి, తండ్రులు సారంపల్లి రాధమ్మ, కృష్ణారెడ్డిలకు ఆరుగురు సంతానంలో ముగ్గురు ఆడవారు, ముగ్గురు మగవారు. నేను మూడవ సంతానం. మా అన్న, తమ్ముడు మాత్రమే కుటుంబంలో చదువుకున్నాం. 1964లో 13వందల ఓట్లుగలిగిన గ్రామం 1995నాటికీ 2700నాటికి పెరిగింది. అన్ని వృత్తుల వారు ఉన్న గ్రామం. ముదిరాజ్‌లు(చేపలు పట్టేవారు) దలితులు, గీత పనివారు, చాకలివారు, రెడ్డీలు, వడ్డెర, మరియు లంబాడ, సంఖ్యరీత్యా వారు సమాన కుటుంబాలుగా వున్నారు. వీరుకాక వడ్రంగం, కమ్మర తదితర అన్నివృత్తుల వారు వున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మాగ్రామంలోని వృత్తిదారుల దగ్గరకు రావడమే గాక తమ వ్యవసాయ పెట్టుబడులకు కూడా వచ్చేవారు. గ్రామంలో 13ఇరిగేషన్ చెరువులు ఉండడంచే పంటలు బాగా పండేవి. 1953లో మా నాన్నగారు మరణించాకా అప్పటి నుండి కుటుంబ బాధ్యత అమ్మపై పడిరది. 40 ఎకరాల భూమి ఉన్నప్పటికీ సరిగ్గా పంటలు పండకా ఏ యేటికాయేడు అతి కష్టం మీద వెళ్లదీసింది. ముగ్గురన్నదమ్ములకు చదువు చెప్పించాలని ప్రత్యేక శ్రద్ధ వహించింది. 1957లో గ్రామంలో పార్టీ ఏర్పడిరది. పార్టీ ఏర్పడడానికి మా తమ్ముడు రాజిరెడ్డి కృషి చేసాడు. అప్పటి నుండి మా కుటుంబం గ్రామ కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుగా మారింది. గ్రామానికి రాష్ట్ర`జిల్లా నాయకులు ఎవరొచ్చినా వారికి భోజన ఏర్పాట్లు చేసేది. ఇటు వ్యవసాయ శ్రమ, అటు కుటుంబ బాధ్యత ఉన్నా ఏనాడు కుటుంబ సభ్యులపై గాని, ఇతరులపై గాని కోపగించి ఎరుగరు. 1960లో అన్నదమ్ములం వేరుపడ్డాం. అప్పుటినుండి అమ్మ నాతోనే ఉంది. నాకు అన్ని విధాలా తోడుగా ఉంటూ కుటుంబ సమస్యలనే కాక రాజకీయంగా ధైర్యం కల్పించింది. నాడు కల్పించిన ధైర్యమే కమ్యూనిస్టు ఉద్యమంలో నన్నింతవానిగా చేసింది. వ్యవసాయ పనులు చేస్తూ వచ్చింది. 1964 నుండి 1972 వరకు గ్రామంలో కాంగ్రెస్ వారు పోలీస్ క్యాంపు ఏర్పాటు చేసి కమ్యూనిస్టు పార్టీని లేకుండా చేయాలని నిర్బంధం సాగించారు. నాతో సహా అనేక మంది గ్రామం నుండి రహస్య జీవనానికి వెళ్లారు. ఆ పరిస్థితుల్లో అమ్మ ధైర్యం చెబుతూ ఉద్యమాన్ని నిలబెట్టడానికి కృషి చేసింది.
పట్వారీ మాలీపటేల్ కొంతమంది వడ్డీ, నాగులకిచ్చేవారితో మిలాఖతై గ్రామంలో అరాచకాలు చేసేవారు. గ్రామంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే వుంది. 1962 ఎన్నికలకు ముందు కమ్యూనిస్టుపార్టీ ఏర్పడిరది. గ్రామంనుండి తెలంగాణా సాయుధపోరాటంలో 5గురు వ్యక్తులు పాల్గొని యూనియన్ మిలటిరీ కాల్పుల్లో మరణించారు. 1. తోటకూరి కనకయ్య, 2. తోటకూరి బక్కయ్య, 3. కత్తి సమ్మయ్య, 4. బాశబోయిన నర్సయ్య, 5. తోటకూరి బాలరాజు పోరాటంలో ప్రాణాలర్పించారు. ఆ తర్వాత గ్రామంలో కమ్యూనిస్టులు లేకుండా అణిచివేసి నిర్భంధం సాగించారు. ఈనిర్భంధానికి వ్యతిరేకంగా కుమ్మరికుంట్ల బొందయ్య (కాజీపేటలో రైల్వే ఉద్యోగి) గ్రామానికి వచ్చి కమ్యూనిస్టుపార్టీ ప్రచారం మొదలు పెట్టాడు. దీనికి ఆకర్శితుడైన మా తమ్ముడు (రాజిరెడ్డి) పార్టీ ఏర్పాటుకు ముందుకు వచ్చాడు. నాడు ముదిరాజ్‌లు, రజకులలో కొంతమంది తోడుగా నిలిచారు. దానితో గ్రామంలో 1960లో కమ్యూనిస్టుపార్టీ ఏర్పడిరది. కమ్యూనిస్టుపార్టీ ఏర్పడినప్పటి నుండి పటేల్, పట్వారీలు నిర్భంధం కొనసాగించారు. కమ్యూనిస్టులపైన కేసులు పెట్టారు.
నాకు ఊహ తెలిసినప్పటి నుండి కుటుంబం ఆర్థిక కష్టాలకు తోడు, రాజకీయ నిర్బంధం కొనసాగింది. అన్ని సందర్భాల్లోనూ అమ్మ ధైర్యంగా నిలబడిరది. గ్రామంలోని భూస్వామ్య వర్గాలు కుటుంబంపై ఎప్పుడూ కక్షగానే ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా భూములు అమ్మకుండా కాపాడిరది. 1974లో అనారోగ్యంతో మరణించింది. అమ్మ జ్ఞాపకాలు ఈ నాటికీ చెక్కుచెదరనివిగా నా మనోపలకంపై ఉన్నాయి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది. 30.07.2013

No comments:
Post a Comment