Tuesday, 12 August 2014

స్వయం సహాయక గ్రూప్‌లకు భూమి కౌలుపై నోట్‌

   రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ది శాఖా ద్వారా స్వయం సహాయక గ్రూప్‌లకు కౌలు నిబంధనలపై భూములు ఇచ్చి మహిళా సభ్యులను ఆర్ధికంగా పటిష్టవంత పర్చాలని నూతన కౌలుదారి చట్టాన్ని ప్రతిపాదించింది. 2014 నాటికి ప్రతి పేద మహిళకు లక్ష రూపాయాల ఆదాయం కల్పించబడుతుందని ప్రధాన ఉద్దేశ్యంగా పెర్కొన్నారు. నూతన చట్టంలో ఈ దిగువ నిబంధనలు ఉన్నాయి.
    1. స్వయం సహాయక గ్రూప్‌లకు రిజిస్టేషన్‌ ద్వారా 5 సంవత్సరాలు కౌలుకు ప్రైవేటు భూములను ఇవ్వాలి.
    2. భూ యజమాని మారినా 5 సంవత్సరాలు కౌలు తీసుకున్న గ్రూప్‌ కొనసాగుతుంది.
    3. కౌలు రేటు నిర్ణయం :`  గ్రూప్‌కు ` భూ యజమానికి మధ్య అవగాహనతో మార్కెట్‌ రేట్లను బట్టి అగ్రిమెంట్‌            కుదిర్చుకోవాలి.
    4. ప్రకృతి వ్యపరీత్యాల వలన పంటకు నష్టం వాటిల్లుతే కౌలు రేటును ‘‘సర్దుబాటు’’ చేస్తారు. ఇన్సూరెన్స్‌, ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తారు.
    5. అగ్రిమెంట్‌ చేసుకున్న గ్రూప్‌లకు ప్రభుత్వ మరియు వ్యవస్ధాగత రుణాలు పొందవచ్చు.
    6. 5 సంవత్సరాల అనంతరం కౌలు అగ్రిమెంట్‌ దానంతటదే రద్దు అవుతుంది.
 పై చట్టం పరిశీలించినపుడు కొన్ని  సందేహాలు కలుగుతున్నాయి. నూతన చట్టంలో చూపిన నిబంధనలలో     స్పష్టత తేదు.
    ` ఇప్పటికే కౌలుదారి చట్టం (తెలంగాణ ఏరియా) కౌలుదారి చట్టం (ఆంధ్రా ఏరియా) ఆమలులో ఉన్నాయి. ఇప్పడు తెస్తున్న చట్టం వలన  ప్రస్తుత చట్టాలు అమలులో ఉంటాయా? రద్దు అవుతాయా? లేక రెండూ అమలవుతాయా? 
    ` ప్రైవేట్‌ భూ యజమానులనుండి స్వయం సహాయక గ్రూప్‌లకు భూములు ఇప్పించి, అగ్రిమెంట్‌ చేయించే  బాధ్యతను ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది?  అధికోత్పత్తికి భూములను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉన్నపుడు భూయజమాని నిరాకరిస్తే ఆ బాధ్యత ఏ సంస్థ నిర్వర్తిస్తుంది? భూమిని అభివృద్ధి (సాగునీరు, కట్టలు వేయడం, సాగుకు యోగ్యంగా మార్చడం) పర్చకుండా ఉత్పత్తి పెరగదు. భూ యాజమానులు గ్రూప్‌లకు కౌలుకివ్వడానికి ముందుకు రానప్పుడు కౌలు విదానాన్ని ఎలా కొనసాగిస్తారు?
    ` ప్రభుత్వ భూములు, దేవాలయాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందా?
    ` మార్కెట్‌ కౌలు రేటును నిర్ణయించడం వలన గ్రూప్‌లకు ఆదాయం వస్తుందా? 2014 నాటికి గ్రూపులోని మహిళా లక్షాధికారి అవుతుందా? దీనికి కౌలు చట్టం గ్యారెంటీ ఇస్తుందా? 
    ` గత కౌలుదారి చట్టంలో కౌలు దారుకు గల వంశపారంపర్య హక్కును ఈ చట్టంలో తీసివేశారు.      
 భూ యజమాని భూమి అమ్మదల్చుకున్నపుడు కౌలుదారుకు మొదట చేప్పాల్సిన నిబంధన ఈ చట్టంలో లేదు. సంస్థాగత రుణాలు లభ్యత గ్యారంటీ వుంటుందా? కానప్పుడు మైక్రో ఫైనాన్స్‌, వ్యవసాయ అధారిత కంపెనీలు, ప్రైవేట్‌ వడ్డి వ్యాపారుల నుండి రుణం పొందాల్సి వస్తుంది. అప్పడు ఆగ్రూప్‌పై రుణదాతకు హక్కు ఎర్పడదా?
    ` మార్కెట్లలో గ్రూపుల ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వ కొనుగోలు సంస్ధలు గ్యారెంటీ ఇస్తాయా?
    ప్రకృతి వైపర్యీతాల సందర్భంగా  పంటల భీమా, ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం భూ యజమానికా? కౌలుదారుకా? అడ్జస్టుమెంట్‌ ఏవరికి చేస్తారు?
    పై వివరణలను చట్ట బద్దంగా పరిష్కారించే దిశగా చట్టంలో గల నిబంధనలు ఏమిటి?
తేది: 30.04.10

No comments:

Post a Comment