1) ఇప్పటికే తెలంగాణా ప్రాంత ,ఆంధ్ర ప్రాంత కౌలుదారీ చట్టాలు ఉన్నాయి.ఇప్పుడు అదనంగా మరో కౌలుదారీ చట్టం ప్రతిపాదించ బడుతున్నది.పాత చట్టాలను ఇది తొలగిస్తుందా,సమాంతరంగా కొనసాతుందా?6 క్లాజులో మిగిలిన అన్ని చట్టాలను ఓవర్‌రైడ్ చేస్తుంది అన్నదాని అర్థంఏమిటి?
2) పాత చట్టాలు కౌలుదారుల రక్షణ కోసం తేబడ్డాయి.కొత్త చట్టం ఎవరి రక్షణ కోసం?పాత చట్టాలను అమలు చేయకుండా భూయజమానుల భయాలను తొలగించాలనే పేరుతో కౌలుదారులను బలిచేయడం కొత్త చట్టం లక్ష్యం కాదా?
3) పాత చట్టాలలో కౌలుదారులకు కొన్ని రక్షణలు ఉన్నాయి.కొత్త బిల్లులో వాటిని తొలగించారు.
4) పాత చట్టాలలో కౌలురేటుపై నియంత్రణ ఉన్నది.కొత్త బిల్లులో ఎందుకు లేదు?
5) పాత చట్టాలలో భూ యజమాని అమ్మకానికి పెడితే కొనుగోలు చేయడానికి కౌలుదారుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.కొత్త బిల్లులో ఎందుకు ఈ అంశంలేదు?
6) పాత చట్టంలో యజమాని భూమికి పూర్తి రక్షణ ఉన్నది.ఈ అంశంకోసమే అయితే కొత్తగా ఒక చట్టం అవసరంలూదు.
7) ప్రకృతి వైపరీత్యాల వల్లజరిగే నష్టాలను లీజుమొత్తంలో సర్ధుబాటు చేస్తామంటే అర్ధం ఏమిటి?లీజు మొత్తం నుండి తగ్గిస్తారా? చెల్లింపులు రీషెడ్యూల్డ్ చేస్తారా?
8) పాత చట్టం క్రింద భూయజమాని అధికారిక ఒప్పందాలకు రావడంలేదని అంటున్నారు.కొత్త బిల్లు కింద వస్తారని గ్యారంటీ ఉందా?పాత చట్టం అమలు జేయకుండా భాద్యతను వదులుకోవడం కాదా కొత్త చట్టం తీసుకురావడమంటే?
9) రైతు వ్యవసాయ పెట్టుబడిలో 75 శాతం ఇప్పటికీ ప్రైవేటు రంగానిదే. కౌలుదారుల పరిస్థితి ఇంకా అధ్వాన్నం.కొత్త బిల్లు మూలంగా పరిస్థితి ఇంతకన్నా మెరుగు అవుతుందా?
10) కొత్త చట్టం భూ యజమానుల భూమిని లీజుకు తీసుకోవడానికా? ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడానికా?లీజు పేరుతో పేదలకు భూపంపిణీ కార్యక్రమాన్ని అటకెక్కించడానికా?
11) రాష్ట్రంలో ఇప్పటికే కౌలుదారులుగా ఉన్న లక్షలాది మందిని బేధఖలు చేయడానికి ఈ బిల్లు ఒక సాధనం కాదా?
12) లీజు బృందానిది,సేద్యం వ్యక్తిది అయినప్పుడు వచ్చే సమస్యలు పరిష్కారం ఎవరు చేస్తారు.
13) ఒక బృందానికి లీజుకు ఇచ్చే భూమి వవిస్తీర్ణంపై పరిమితి లేదు. అంటే ఎంతైనా ధఖలు చేయవచ్చా?
14) బినామీ బృందాల పేరుతో పెద్ద పెద్ద సంస్ధలు ప్రభుత్వ భూములపై ఆజిమాయిషీ సంపాదించవా?
15) కౌలుదారు భూయజమాని అసమాన భాగస్వాములు.ప్రభుత్వం భూ యజమాని తరపున నిలబడుతుందా? కౌలుదారు తరపున నిలబడుతుందా?కొత్త బిల్లు యజమాని వైపు మొగ్గు చూపడంలేదా?
16) బిల్లు ప్రకటిత ఉద్ధేశాలు ఏమి ,చెప్పినా ఆచరణలో సంభవించే పర్యవసానాలు ఏమిటి?

No comments:
Post a Comment