రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 1995 నుండి 2010 నాటికి 31,120 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇదే కాలంలో దేశంలో 2,86,913 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలా మంది విశ్లేషకులు వ్యవసాయరంగం సంక్షోభంలోకి వెళుతున్నట్లు ప్రకటిస్తున్నారు.
‘‘ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్మిర్మాణ కార్యక్రమం’’ కింద 1997 నుండి సంస్కరణలు, సరళీకరణ విధానాలు అమలు జరుపుతున్నారు. సంస్కరణలు అమలు జరుపుతున్న ఫలితంగా 1997 డిశెంబర్ 15న వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎల్కుర్తి గ్రామంలో నాగరి కిషన్‌రావు ఆత్మహత్యతో ప్రారంభమైన పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది.
సంస్కరణల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు
మొదటి తరం సంస్కరణలు
(1) ప్రభుత్వ సంఘాలు ఏర్పాటు : నీటి సంఘాలు, వన సంరక్షణ సమితులు - వాటర్ షెడ్డు కమిటీలు, మదన్స్ కమిటీ - విద్యా కమిటీ - రైతు క్లబ్బులు, పంటల సలహా కమిటీలు - డ్వాక్రా - స్వయం సహాయ గ్రూపులు`రైతు మిత్ర గ్రూపులు - వగైరా.
(2) సంస్థాగత మార్పులు (నిల్వలపై ఆంక్షల తొలగింపు చట్టాల మార్పులు, విద్యుత్, బోరు బావులు, త్రవ్వకానికి చట్టాలు, విత్తనం, మార్కెట్ చట్టాలను బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా మార్చడం)
(3) ప్రణాళికేతర వ్యయం పెంపు (టూరిజం - రోడ్లు, అనుత్పాదక రంగంపై పెట్టుబడి)
(4) ధరల పెంపుదల (విత్తనాల ధరలు, క్రిమి సంహారక మందులు, ఇతర ఇన్‌పుట్స్ ధరల పెంపు- నీటితీరువా పెంపు)
(5) వ్యవసాయ విస్తరణ ఉద్యోగాల తగ్గింపు
(6) విత్తనాలు ప్రైవేట్ రంగంగా ఉత్పత్తి - పంపిణీ
(7) దిగుమతులపై సరళీకరణ (దిగుమతి టారిఫ్ తగ్గింపు - అవసరం లేకున్నా దిగుమతి)
వీటిని అమలులోకి తెచ్చిన తరువాత సంస్కరణలు మరింత వేగవంతం చేయడానికి రెండవ రకం సంస్కరణ చేపట్టారు.
రెండవ తరం సంస్కరణలు
(1) వ్యవసాయ రుణాల తగ్గింపు (2) కాంట్రాక్టు వ్యవసాయం (కుప్పంతో సహా, ప్రకాశంలో సుబాబుల్ పంట) (3) యంత్రాల ప్రవేశం (4) ఎగుమతి కొరకు ఉత్పత్తి (5) ముతక ధాన్యాల తగ్గింపు (పంటల మార్పిడి) (6) సాంప్రదాయ ఎరువుల - విత్తనాల వాడకంకు స్వస్తి (మోనోశాంటో - డూపాయింట్ వారి విత్తనాలు, క్రిమిసంహారక మందులు) (7) బ్యాంకుల ప్రైవేటీకరణ (వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రుణాల తగ్గింపు) (8) రైతుల సంఖ్య తగ్గింపు (9) ప్రపంచ మార్కెట్‌తో పోటీ (10) కార్పొరేట్ వ్యవసాయం.
నేడు రెండవ తరం సంస్కరణలు వేగవంతంగా అమలు జరుగుతున్నాయి. అంతిమంగా వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరించడం లక్ష్యంగా విధానాలు సాగుతున్నాయి. వ్యవసాయ రంగం నుండి ప్రభుత్వ జోక్యం పూర్తిగా ఉపసంహరించబడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతలు
1) విత్తనం ఉత్పత్తి ` ధర నిర్ణయం ` సరఫరా
2) రుణ పంపిణీ ` దీర్ఘకాలిక రుణాలు
3) వ్యవసాయ శాఖ సలహాలు ` పట్టాదారు పాసుపుస్తకాల సరఫరా
4) ఎరువులు ` క్రిమి సంహారక మందుల సరఫరా
5) మార్కెట్‌లో కనీస మద్దతు ధరల నిర్ణయం ` కొనుగోలు ` అమలు
6) సాగునీటి వనరుల కల్పన
7) రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను అభివృద్ధి చేయుట
8) కేంద్రం నుండి వచ్చే నిధులతొ నూనెగింజలు ` పప్పుధాన్యాలు ` మొక్కజొన్న ` ప్రత్తి ` కొబ్బరి ` హార్టీకల్చర్ ` జ్యూట్ టెక్నాలజీ `ఆయిల్ ఫాం పంటల దిగుబడులను పెంచుతూ కొత్త విత్తనాలను కనిపెట్టడం
9) కూరగాయల పంటల ` విత్తనాల అభివృద్ధి
10) రాష్ట్రప్రభుత్తం బడ్జెట్లు పెంపుదల(2012`13 ప్రణాళికేత రు. 889.12, ప్రణాళిక రు.2820.45 కోట్లు మాత్రమే)
11) విత్తన చట్టం చేయడం ` కల్తీని నివారించుట
12) బహుళ పంటల విధానాన్ని అమలు చేయడం( మోనోక్రాప్ పంటలను నిషేధించుట)
13) రైతులకు విత్తనంపై హక్కు కల్పించడం
14) కాలం గతించిన విత్తనాల రాయల్టీని తగ్గింపు ` ఎత్తివేత
పై అంశాలను పరిష్కరించడలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలోని బహుళజాతీ కంపెఈలకు అనుగుణంగా విధానాలను రూపొందించి రైతులకు నష్టం కలిగిస్తున్నది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పంటల మార్పిడి విధానాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వీటి నివారణకు ఎలాంటి పథకాలు, చర్యలు లేవు. కనీసం అఖిలపక్ష సమవేశాన్ని పిలిచి పరిష్కరించడానికి కృషి చేయడం లేదు. సంవత్సరంపాటు వ్యవసాయ శాఖకు ప్రత్యేక బాధ్యత గల మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం నియమించలేకపోయింది. కర్నాటక, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కనీస మద్దతు ధరలను పెంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దానిని స్పూర్తిగా తీసుకోవడానాకి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
ఈ దిగువ అంశాలు పరిశీలించాలి.
1) ఎరువు ` విత్తన హక్కు .....
2) రుణ ప్రణాళిక
3) సాగునీటి సంస్కరణలు
4) ధరల నిర్ణయం
5) కౌలు రైతుల హక్కులు
6) ఎగుమతి ` దిగుమతులు
ఎరువులు ` విత్తన హక్కు కోల్పోతున్న రైతు
ప్రస్తుతం రాష్ట్రంలో మోన్‌శాంటో, డూపాయింట్, కార్గిల్, సింజెంటా కంపెనీలు 80 శాతం విత్తనాలపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. భారత దేశ విత్తన వినియోగంలో 60 శాతం విత్తనాలు రాష్ట్రంలోనే ఉత్పత్తికావడం గమనించాలి. క్రమంగా విత్తన టెక్నాలజీని పై కంపెనీలే తమ ఆధీనంలో ఉంచుకొని రాయల్టీ పేరుతో వందల కోట్లు సంపాదిస్తున్నాయి.
యూరియా కొరకు రైతులు కుటుంబాలతో సహా దుకాణాల ముందు రోజులు తరబడి పడిగాపులు ఉంటున్నారు. సెప్టెంబర్‌లో రావల్సిన 6 లక్షల టన్నుల ఎరువులను తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటిస్తున్నారు. కానీ ఆగస్టులో రావల్సిన కోటా ప్రకారం 2 లక్షల టన్నులు రాలేదు. ఏ పార్లమెంటు సభ్యుడు దీనిపై కేంద్రం వద్ద స్పందించలేదు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ ఎత్తివేత ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులపై రు.1,800 కోట్లభారం వేసింది. రు.480 ఉన్న డిఎపి బస్తా రు.1,260కి మరియు రు.230ఉన్న పోటాష్ బస్తా రు.880కి నాలుగు మాసాలలోనే పెంచారు. ప్రస్తుతం యూరియా బస్తా ధర 280 ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్‌లో రు.350`450 మధ్య అమ్మకాలు సాగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దం చేసినప్పటికీ అవి రైతులకు చేరకుండా ఎటువెళ్ళాయని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ల సమావేశంలో నిన్నటి రోజున ఆశ్చర్యం వెలిబుచ్చారు. అధికారులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లువార్త. ఈ ఆగ్రహాలు ఎలా ఉన్నా ఎరువులు బ్లాక్ మార్కెట్‌కే కాక మిక్సింగ్ ప్లాంట్లకు దారి మళ్ళాయి. నేడు రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, రుణాలు తదితర వ్యవసాయోపకరణాలు బ్లాక్ మార్కెటీర్ల చేతుల్లోకి వెళ్ళాయి. రుణం కావాలంటే లంచాలివ్వాల్సిందే.
రుణాలు అందని రుణ ప్రణాళిక
వాస్తవ సాగుదారుకూ, సన్న చిన్నకారు రైతులకు మరియు దళిత,గిరిజన,కౌలు రైతులకు రుణసౌకర్యం కల్పించాలన్న లక్ష్యానికి విరుధ్ధంగా వ్యవసాయ రుణాలను వ్యవసాయంలో భాగస్వామ్యంలేని వారు పెద్దమొత్తాలు కాజేస్తున్నారు. వీరు తిరిగి చెల్లింపుకు బ్యాంకు ముఖం చూడరు. పెద్ద భూస్వాములు తమ కుటుంబ సభ్యుల పేర్లతో పంట రుణాలు,దీర్ఘకాలిక రుణాలను తీసుకుంటున్నారు. వీరు తక్కువ భూకమతాన్ని చూపడం ద్వారా ప్రభుత్వ మాఫీ పథకాలు వీరికే వర్తిస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం మాఫీ చేసిన రుణాలలో సింహ భాగం భూస్వాములదే. పంటరుణాలిచ్చే సందర్భంగా ‘‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’’ ప్రకారం రుణాలిస్తామంటారు. కానీ ఏ జిల్లాలోనూ ఏ రైతుకూ ఆ విధానం అమలు జరుపుట లేదు. గత సంవత్సరం ప్రతి బ్రాంచి 330 మంది కొత్తవారికి రుణాలివ్వాలన్న లక్ష్యంలో 10 శాతం కూడా నెరవేరలేదు. తిరిగి 2011`12లో ప్రతి బ్రాంచి 200 మందికి ఇవ్వాలని నివేదికలో వ్రాసినప్పటికీ, రుణప్రణాళిక విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి ఈ సంఖ్యను 100 మందికి తగ్గించారు. ఈ లెక్కన చూసినా రాష్ట్రంలో 8211 బ్రాంచీలలో 2997 బ్రాంచీలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. కనీసం 3 లక్షల కొత్తవారికి రుణసౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.కౌలుదారులకు రుణగుర్తింపు కార్డులిస్తామంటూ శాసనసభలో ప్రకటించారు. జిఓ విడుదల చేశారు. ఈ రోజు 40 శాతం సాగు భూమి కౌలు రైతులే చేస్తున్నారు. వీరికి రుణసౌకర్యం అందుబాటులో లేదు.
సాగునీటి నుండి రైతులను దూరం చేస్తున్న సంస్కరణలు
1995లో ‘‘రాష్ట్ర ఆర్థిక పున్ణనిర్మాణ కార్యక్రమం’’ అమలులో భాగంగా సంస్కరణల పర్వం రాష్ట్రంలో ప్రారంభమైంది. రాష్ట్రంలోని నీటి వనరులపై ప్రపంచబాÊయంకు సాంకేతిక నివేదికలు రూపొందించింది. అందులో ప్రస్తుతమున్న ప్రాజెక్టులు మరియు ఇతరంగా వున్న నీటి వనరులు చర్చించింది. నూతన ప్రాజెక్టుల జోలికి వెళ్ళకుండా అందుబాటులో వున్న నీటి వనరుల నుండి లభ్యమయ్యే నీటిని ఎలా వినియోగించుకోవాలో వివరించింది. అందుకు ‘‘కాల నిర్ణయ’’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలు చేయాలి - అది అమలు జరిగితేనే ప్రపంచబ్యాంకు రుణం లభ్యమవుతుంది.
ప్రపంచబ్యాంకు ఈ దిగువ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించింది
1. రాష్ట్ర నీటి వనరులపై శ్వేతపత్రం - జూన్ 1996
2. ప్రజలతో చర్చలు - ఫిబ్రవరి 1996 నుండి మార్చి 1997 వరకు
3. నీటి తీరువా పన్ను మూడు రెట్లు పెంపుదల - ఏప్రిల్ 1997
4. నీటి రంగంలో రైతుల యాజమాన్యానికి చట్టం - ఏప్రిల్ 1997
5. 10292 నీటి సంఘాల ఏర్పాటు - జూన్ 1997
174 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఏర్పాటు - నవంబర్ 1997
6. నీటి ఛార్జీల సమీక్షా కమిటీ ఏర్పాటు - డిసెంబర్ 1997
7. సాగునీటి రంగంలో నూతన విధానం - మార్చి-మే 1998
8. కాల్వలలో మొదటి శ్రమదాన కార్యక్రమం - మే-జూలై 1998
9. మొదటి నీటి సంఘాల అధ్యక్షుల సమావేశం - ఏప్రిల్ 1998
10. రెండవ శ్రమ దాన కార్యక్రమం - మే-జూలై 1998
11. నీటి వనరుల రిపేర్లలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గింపు
12. సాగునీటి మీటర్ల ఏర్పాటు 2003
1996 జూన్‌లో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ పత్రంలో సాగునీటి రంగంలో సిబ్బంది ఎక్కువగా ఉన్నారని, నిర్వహణ సామర్ధ్యం బాగా లేదని, దీన్ని మార్చటడానికి సంస్కరణలు ప్రవేశపెట్టాలని నాటి ప్రభుత్వం సూచించింది. శాసనసభలో ఈ పత్రంపై జరిగిన చర్చలో ఇది ఆ వాస్తవాలతో కూడుకున్న పత్రమని రుజువైంది. అయినప్పటికీ ఆ పత్రం ఆధారంగానే విధానాలు రూపొందించబడినాయి.
ప్రపంచబ్యాంకు ఆదేశించిన విధానాలు
సాగునీటి రంగంలో సంస్కరణలు అమలు జరపాలి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన సాగునీరు - విద్యుత్ రంగాలలో సంస్కరణలపై ప్రపంచబ్యాంకు దృష్టి పెట్టింది. వ్యవసాయరంగంలో తాము కోరుకునే సమూల మార్పులకు ఈ రంగాలలో సంస్కరణలు అత్యంత కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత విత్తన రంగాన్ని, మార్కెట్ రంగాన్ని చివరగా రుణ లభ్యత రంగాన్ని సంస్కరణలలోకి ఈడ్చింది - సాగునీటి రంగంలో జి.ఓ 37 నీటిని ప్రైవేటీకరించే చర్యలకు ఉద్దేశించింది.
1997 ఏప్రిల్‌లో సాగునీటి సంఘాల చట్టం చేశాడు. రాష్ట్రంలో 10292 సాగునీటి సంఘాలను, 174 ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ సంఘాలను ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలు నిర్వహించారు. రైతులు శ్రమదానం చేసి కాలువలు రిపేర్లు చేసుకోవాల్సిందిగా కోరారు. 1998లో రైతులు శ్రమదానం ద్వారా 22,887 పనులను నిర్వహించి రూ. 118.1 కోట్ల విలువ గల రిపేర్లు చేశారని ప్రపంచబ్యాంకు ప్రశంసించింది. ఇకముందు ప్రభుత్వం రిపేర్లు చేయదని భావించిన రైతులు తామే కాలువల బాగుసేతకు పూనుకన్నారు.
సాగునీటి సంస్కరణల ప్రభావం
ప్రాజెక్టుల నివారణ జాప్యం వలన ఏర్పడు ప్రమాదకర ఫలితాలు
1. రాష్ట్రాల మధ్యన, రాష్ట్రంలోని ప్రాంతాల మధ్యన అసమానతలు పెరుగుతాయి.
2. వ్యవసాయ పంటల ఉత్పత్తి వేటు తగ్గి ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.
3. తలసరి ఆహార వాడకం తగ్గి పోతుంది.
4. వ్యవసాయాధారిత పరిశ్రమలకు కావలసిన ముడిసరుకుల కొరత ఏర్పడుతుంది.
5. వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
6. ఆహార పంటలు తగ్గిపోతాయి.
7. తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. భూగర్భ జలాలు పడిపోతాయి.
8. గ్రామీణ నిరుద్యోగం పెరిగి, వలసలు కొనసాగుతాయి.
9. పనులు లేక అశాంతి పెరుగుతుంది.
10. వెనకబాటుతనం వలన జనాభా పెరుగుటయే కాక, నాగరికత అభివృద్ధి కాదు.
11. ఆత్మహత్యలు - ఆస్తుల అమ్మకాలు పెరుగుతాయి.
12. నీరు వ్యాపార సరుకుగా మారుతుంది.
ప్రస్తుతం అమలవుతున్న నీటి సంస్కరణలు ఇన్ని ప్రమాదాలను మన ముందుంచుతాయి. ప్రపంచీకరణ విధానాల వలన, ప్రపంచ బ్యాంకు షరతుల వలన లబ్ది పొందేది బహుళజాతి కంపెనీలకు ఏ పెట్టుబడి లేకుండా లభ్యమయ్యే నీటిని కూడా వ్యాపార సరుకుగా మార్చి లాభాలార్జించడానికి ఈ సంస్కరణలు వారికి దోహద పడతాయి. చివరకు తాగడానికి నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
సంస్కరణలు అభివృద్ధి దిశగా ఉండాలి
సంస్కరణలు అభివృద్ధి దిశగా ఉండాలి. లభ్యత నీటి వినియోగానికి ప్రణాళికాబద్ధమైన విధానాలు అమలు చేయాలి. ప్రజలకు నష్టం లేని రీతిలో అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణాలు సత్వరం చేపట్టాలి. ‘‘జలవిధానం’’ ద్వారా ఏయే ప్రాంతాలకు ఎంత నీరు ఇవ్వాలో నిర్ణయించాలి. భౌగోళిక స్థితిని బట్టి నీటి కేటాయింపు ఉండాలి. నీటి యాజమాన్యాన్ని మెరుగుపరిచి వృధా నీటిని వీలైనంత వరకు వినియోగంలోకి తేవాలి. నీటిని వ్యాపార సరుకుగా మార్చి ప్రతిచర్యను ప్రభుత్వం అడ్డుకోవాలి. అందరికి తాగునీరు, ఒక పంటకు సాగు లభ్యమగునట్లు చూడాలి. నీటి యాజమాన్య నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం, ప్రజలు సమన్వయంగా చూసే విధంగా సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి రక్షణలు కల్పించాలి. నీటి వినియోగానికి అన్ని అవకాశాలను పరిశీలించాలి.
మద్దతు ధరల నిర్ణయంలోని మర్మం
కనీస వేతనాల నిర్ణయం
రాష్ట్ర లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రతి పనికి కనీస వేతనం నిర్ణయిస్తుంది. ఈ వేతనాల నిర్ణయం నిత్యావసర సరకుల ధరలపై ఆధారపడి నిర్ణయిస్తారు. నలుగురుగల కుటుంబానికి అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలు, బట్టలు, ఇతర గృహ అవసరాలన్నింటిని లెక్కగట్టి దినకూలి, నెల వేతనం నిర్ణయాలు చేస్తున్నారు.
అందువల్ల కోటానుకోట్ల మందిని పనిలో పెట్టుకొన్న పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వం వేతనాలు పెరగకూడదని కోరుకుంటారు. వేతనాలు పెరగకూడదని అనుకుంటే ఆహార ధాన్యాల ధరలు పెరగకూడదు. అందువల్ల ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా ూండడానికి ప్రభుత్వం కనీస మద్దతు ధరల విధానాన్ని ప్రవేశపెట్టింది. కనీస మద్దతు ధరలను పెరగకుండా నియంత్రించడానికి వీలుగా వ్యాపారులు, ప్రభుత్వం నిరంతరం అనుసరిస్తుంటాయి. చివరకు వ్యాపారులు సిండికేట్‌గా మారి వ్యవసాయోత్పత్తులను కనీస మద్దత్తు ధరలకన్నా తక్కువకు కొనుగోలు చేస్తారు.
ప్రతి దేశంలో ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా ఆయా ప్రభుత్వాలు కొన్ని విధానాలు అనుసరిస్తున్నాయి. ఆ విధానాల ఫలితంగా ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నాయి. అమెరికా తన రైతాంగానికి 53% నుండి 80% వరకు ూత్పత్తికి రాయితీలు ఇస్తున్నాయి. జపాన్, జర్మనీలాంటి అభివృద్ధి చెందిన దేశాలేగాక అత్యంత వెనుకబడిన పాకిస్తాన్ దేశం 25%, బంగ్లాదేశ్ 27% రాయితీలు ఇస్తున్నాయి.
కౌలు రైతుల హక్కులు ` మోహన్ కందా కమిషన్ సిఫారసులు
రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ మరియు సహకార శాఖల తరపున 12.08.2011న డా॥మోహన్‌కందా చైర్మన్‌గానూ, డా॥ ఎం.వి.రావు ఎంఎల్‌సి వైస్‌చైర్మన్‌గానూ, సభ్యులుగా సి. మురళీధర్ ఇన్జనీర్-ఇన్- ఛీప్ డా॥ కె.ప్రతాప్‌రెడ్డి, డా॥ ఆర్ సుధాకర్‌రావు, మెంబర్ సెక్రటరీగా వ్యవసాయ కమీషనర్ ఇ. ఉషారాణి గార్లతో కమీషన్ వేసింది. వారికి ఐదు అంశాలను పరిశీలించాలని లక్ష్యంగా నిర్ణయించారు. 1. క్రాప్ హాలిడే ప్రకటనకు కారణాలు, 2. గతం పునరావృతం కాకుండా చర్యలు 3. పంటల విధానం మరియు మార్కెట్ పరిస్థితి. 4. గోదావరి డెల్టాలో నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల 5. వరిపంట అభివృద్ధికి చర్యలు
పై సమస్యలను పరిశీలించిన కమీషన్ సూచనలలో కౌలు రైతుల సమస్యను పూర్తిగా గమనంలోకి తీసుకోలేదు. పంటల రుణ పరిమితి( స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) మద్దతు ధరపై బోనస్సు, పాల ఉత్పత్తి, సేకరణ, సమస్యలను కమీషన్ గమనంలోకి తీసుకోలేదు. దీనికి తోడు 07.06.2011న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ‘‘ఎపి భూమి లైసెన్స్‌డ్ సాగుదారుల చట్టం-2011 కాగితాలకే పరిమితమవుతున్న కమిషన్ నివేదికల జాబితాలోకి ఈ నివేదిక కూడా చేరిపోయింది. కౌలు రేటు ఎకరా రెండు పంటలకు కలిపి 25 బస్తాలు కౌలు తీసుకుంటున్నారు. కౌలు రైతుకు రెండుపంటలపై 40 బస్తాలు పండుతాయి. రెండుపంటల పెట్టుబడి రు. 32 వేలు కాగా 40 బస్తాలకు రు.28 వేలు మాత్రమే వస్తాయి. కౌలు రైతుకు రు. 4వేలు నష్టం వస్తున్నది. ఈ వాస్తవం కమిషన్ గుర్తించలేదా? పాల సేకరణ కేంద్రాలు లేకపోవడం వలన అతితక్కువ ధరకు పాలు అమ్ముకుని కౌలు రైతులు నష్టపోతున్నారు. ఇది కూడా కమీషన్ దృష్టికి రాలేదు.
రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలుదారులు ఉన్నట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అంచనా వేసింది. వీరు అంతా మూజువాణీ ఒప్పందం ద్వారానే కౌలు సాగు చేస్తున్నారు. కౌలు చట్టం ప్రకారం ప్రతి కౌలుదారు రెవిన్యూ రికార్డులో నమోదు కావాలి. కాని ప్రభుత్వం చట్టం అమలు చేయనిరాకరిస్తున్నది. కౌలు చట్టాలను అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు ఆందోళనలు చేస్తునే ఉన్నారు. 1956 ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) కౌలుదారీ చట్టం వచ్చింది. 1956 సెప్టెంబరు 9 తేదీని రాష్ట్రపతి ఆమోదం పొంది సెప్టెంబరు 13న దీనిని గెజిట్‌లో ప్రకటించారు. తిరిగి 1974 నవంబరు 21 న అనేక మార్పులతో రాష్ట్రప్రతి అమోదం పొంది నవంబరు 27 ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రకటించారు. ఈ సవరణలు అన్ని 1-7-1980 నుండి అమలులోకి వచ్చాయి.
ఈ చట్టం ప్రకారం హైకోర్టు సలహాతో రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసరును నియమించాలి. అట్టి స్పెషల్ ఆఫీసరు కౌలు సమస్యలు అన్నింటిని పరిష్కరించాలి. కౌలు రెేట్ల విషయంలో గాని, తొలగింపుల విషయంలోగాని, కౌలు మార్పిడి విషయంలో గాని తగాదాలు వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసరు పరిష్కార కర్తగా వుంటాడు. ఈ చట్టాన్ని అమలు చేయ ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
ఎగుమతి ` దిగుమతుల ప్రభావం
05.03.2012న కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతులను నిషేదిస్తూ నిర్ణయం తీసుకోవడమే తడవుగా మార్కెట్లలో పత్తి ధరలు క్వింటాల్‌కు 500 నుండి 800 రూపాయల వరకు తగ్గిపోయాయి. ఆత్మహత్యా సదృశ్యమైన ఎగుమతి`దిగుమతుల విధానం రైతులకు ప్రాణసంకటంగా మారింది. ఏప్రిల్ 2011లో క్వింటాల్ పత్తి ధర 6500 రూపాయలు ఉండగా, ఫిబ్రవరి 2012లో 4000 రూపాయలకు ధరలు తగ్గించారు. దీనికి తోడు ఎగుమతి నిషేదం విధించడంతో మరో 800 రూపాయలు ధరలు తగ్గి ప్రస్తుతం క్వింటాల్ 2800`3000 మధ్య అమ్మకాలు సాగుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాపితంగా రైతుల ఆందోళనలు పెల్లుబికాయి. శాసనసభలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇది గమనించిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ప్రధానికి లేఖలు వ్రాశారు. విచిత్రమేమంటే! కేంద్ర వాణిజ్యశాఖ ఎగుమతులను నిషేదిస్తూ తీసుకున్న నిర్ణయం తన దృష్టికి రాలేదని ప్రధాని ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్‌పవార్ ఎగుమతి నిషేదాన్ని బలపర్చడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రైతులను నష్టపరిచి, వ్యాపారుల ఒత్తిడికి లొంగి ఎగుమతి నిషేదాన్ని అమలు జరపడం గతంలో జరిగింది, నేడు జరుగుతున్నది. పత్తి వ్యాపారుస్తులు మరియు పత్తి మిల్లర్ల బలమైన లాభి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమకు ఆర్థిక లాభదాయకమైన విధానాలను రూపొందించుకోవడం గతం నుంచి వస్తున్నది. అంతర్జాతీయ మార్కెటులో ధరలు పెరిగినప్పుడు ఎగుమతుల నిషేదం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ కన్నా తక్కువ ధరలకు ఇక్కడ రైతుల నుండి తమ అవసరాల మేరకు కొనుగోళ్లు చేస్తారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెటులో తక్కువ ధరలు ఉన్నప్పుడు దేశీయంగా కొనుగోలు చేయకుండా దిగుమతులపై ఆధారపడి స్థానిక రైతులను మరింత నష్టపరుస్తున్నారు. ఉభయత్రా ఎగుమతులు, దిగుమతుల వల్ల లభ్దిపొందుతున్నదీ వ్యాపారులు మరియు పత్తి మిల్లుల వారే.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్( కోట్లలో)
వ్యవసాయరంగానికి మొత్తం బడ్జెట్‌లో కేటాయింపు ఏనాడూ మూడు శాతం మించలేదు. మరొకవైపున ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి.బహుళ జాతి సంస్థలు, విత్తన, క్రిమిసంహారక మందులు, నీటివ్యాపారం మార్కెట్లలోకి రావడంతో ఆ పెట్టుబడులకు లాభాల రూపంలో మన ఉత్పత్తులు తరలిపోతున్నాయి. నేడు దేశంలో వ్యవయసాయరంగంలోకి 1.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
వ్యవసాయ రంగంలో కేంద్రం రాజ్యాంగ బాధ్యతలు
1) వ్యవసాయ పరిశోధనలు
2) వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు
3) రాష్ట్రాలకు ఎరువుల సబ్సిడీ
4) ఎగుమతి`దిగుమతుల విధాన నిర్ణయం
కానీ రాష్ట్రాలు ప్రతి సమస్యను కేంద్రంపైకి తోసి తమ బాధ్యత నుండి తప్పుకుంటున్నాయి. అందువల్ల కేంద్రం రాష్ట్రాల బాధ్యతను తన అధికారంలో కేంద్రీకరించుకుంటున్నది.
కేంద్ర బడ్జెట్‌లో కానరాని వ్యవసాయం
2012`13బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెడుతూ వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసినట్లు పార్లమెంటులో ప్రకటించారు. గత బడ్జెట్‌పై 1.62లక్షల కోట్లు పెంపుదల చేస్తూ మొత్తం బడ్జెట్ 14,90,925 కోట్ల వ్యయంతో ప్రవేశపెడుతూ వ్యవసాయ రంగానికి రూ.20,208 కోట్లు కేటాయింపు చూపారు. గత సంవత్సరంపై 18 శాతం వృద్ధి వుంది. రాష్ట్రీయ కృషి వికాస్‌యోజనకు రు.9,217 కోట్లు, పంట రుణాల కొరకు రు.1లక్ష కోట్లు పెంపుదల చేస్తూ రు.5.75 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు.
పై నిధులతో వ్యవసాయ రంగం అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సెలవిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పరిశోధన` విద్య కొరకు అతితక్కువ బడ్జెట్లు కేటాయిస్తున్నది.
భ్రమలు కల్పిస్తున్న చైతన్య యాత్రలు ` సదస్సులు
రాష్ట్ర ప్రజల, రైతాంగం సమస్యలను పరిష్కరించడానికి ఏప్రిల్ 15 నుండి మే 5వరకు ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రవర్గ ఉపసంఘం సభ్యులైన రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి మరియు కన్నాలక్ష్మీనారాయణ, సూచనల మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించాడు. 20 రోజుల ఈ కార్యక్రమంలో 8 ప్రజాసంబంధ సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పనులు, త్రాగునీటి సమస్య, ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసుల అంశాలు, రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్తుపై సమీక్షలు ఉంటాయని ఏప్రిల్ 10న ప్రకటించారు. ఇందులో రచ్చబండ కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తారు. కరువు మండలాలలోని పంటలు నష్టపోయిన రైతులకు 1800 కోట్ల పంపిణీకి ఉద్దేశించారు. ఏప్రిల్ 25లోపు కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ప్రజాపథంలో ధరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బ్యాంకర్స్ సర్వే ప్రకారం 24లక్షల మంది కౌలుదారులుండగా గత సంవత్సరం 7లక్షల మందికే గుర్తింపుకార్డులిచ్చారు. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుండి 10 వరకు ధరఖాస్తులు తీసుకొని ఏప్రిల్ 22 నుండి 25 వరకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఏమేరకు అమలు చేస్తుందో?
2012`13 పంటల ప్రణాళిక వాస్తవికంగా ఉండాలి.
2012`17, 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం, దిగుబడుల లక్ష్యం విపరీతంగా పెంచారు. పెంపుదల సాధనకు పథకాలు మాత్రం రూపొందించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 75లక్షల హెక్టార్లు సాగుచేస్తున్నాం. అలాంటిది 2012।13లో 83లక్షల హెక్టార్లు సాగుచేసి 241లక్షల టన్నుల దిగుబడులు సంపాదిస్తామని, అదేవిధంగా ప్రతియేటా విస్తీర్ణం, దిగుబడి పెంచుతూ 2016`17లో 94లక్షల హెక్టార్లు సాగు చేసి 300 లక్షల టన్నులు దిగుబడులు సాధిస్తామని కేంద్ర ప్రణాళిక సంఘానికి ముఖ్యమంత్రి సమర్పించిన పత్రంలో తెలిపారు. 2011`12లో 228లక్షల టన్నులు లక్ష్యం కాగా 173లక్షల టన్నులకు తగ్గింది. లక్ష్యలు భిన్నంగా ఉన్నా, ఆచరణ దిగదుడుపుగా ఉంటున్నది. వ్యవసాయరంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలే ఈ పరిస్థితిని కల్పిస్తున్నాయి.
రైతులకు పాసుపుస్తకాలు, నాణ్యమైన అవసరమైన విత్తనాలు, సకాలంలో రుణాలు, సాగునీటి వనరులు, నాణ్యమైన ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యతతో పాటు వ్యవసాయ శాఖ సహాయ సహకారాలు, సలహాలు అందక రైతులు ప్రకృతిపై ఆధారపడి వ్యవసాయాలు చేస్తున్నారు. ప్రకృతివైపరీత్యాలను ఎదిరించి వ్యవసాయోత్పత్తులు చేస్తున్నప్పటికీ మార్కెట్లో గిట్టుబాటుధరలు కాదుకదా కనీసం మద్దతు ధరలు కూడా లభ్యం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎగుమతులు`దిగుమతుల విధానాన్ని రైతు వ్యతిరేకంగా అమలుజరుపుతూ వ్యాపారులకు వ్యవసాయోత్పత్తులపై వేలకోట్ల రూపాయల లబ్ధిని కలిగిస్తున్నారు. వ్యవసాయరంగంలోని ప్రతిఅంశంలో మధ్యదళారీల పాత్రను ప్రోత్సహించి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందా? రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించిన లక్ష్యాలు ఉత్పత్తి రంగంలో సాధ్యమా? వ్యవసాయప్రణాళికా విధానం పూర్తిగా మారాలి.
ప్రణాళికకు చర్యలు
1) వాతావరణం, భూసార పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలలో పంటల విధానాన్ని రూపొందించాలి.
2) విత్తనాలు నాణ్యమైనవి మార్కెట్ కమిటీల ద్వారా అందించాలి.
3) అర్హత గల రైతులందరికీ ముఖ్యంగా కౌలుదారులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణాలివ్వాలి.
3) ఎరువులు, క్రమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలి. పెరిగిన ఎరువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా సన్న, చిన్నకారు రైతులకు తగ్గింపు ధరలకు ఎరువులివ్వాలి.
4) 2.5 ఎకరాలలోపు రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి.( కొన్ని రాష్ట్రాలలో ఈ విధానం ఉంది.)
5) పంటలు వేసేనాడే మద్దతు ధరలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి.
6) రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ప్రకటించిన ధరకు కొనుగోలు చేయాలి.
7) బయోపర్టిలైజర్స్, జిప్పం, జింక్, బిందు, తుంపరసేద్య పరికరాలు చిన్న యంత్రాలు సన్న, చిన్నకారు రైతులకు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
8) మండల కేంద్రాలలో కొనుగోలు చేయడానికి అద్దె కొనుగోలు పద్దతిపై యంత్రాలు అందుబాటులో పెట్టాలి.
9) ప్రకృతివైపరీత్యాల సందర్భంగా నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వాలి. ఒక పంటకు గ్యారింటీ ఉండే విధంగా రాష్ట్ర జలవిధానాన్ని రూపొందించి ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపే పథకాన్ని రూపొందించి అమలు చేయాలి.
పై ప్రణాళికను అమలు జరపడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అఖిలపక్ష సమావేశాలు జరిపి ప్రణాళికలు తయారు చేయాలి. అప్పుడే రైతుల ఉత్సాహంగా వ్యవసాయ కార్యక్రమాలలో పాల్గొంటారు.
14.09.2012
సారంపల్లి మల్లారెడ్డి
ఉపాధ్యక్షులు అఖిలభారత కిసాన్‌సభ
9490098666

No comments:
Post a Comment