సన్న, చిన్నకారు రైతులకు రుణసౌకర్యం అత్యంత కీలకం. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, హరిజన, గిరిజన, వెనుకబడిన కులాల సోసైటీలు ఈ రైతాంగానికి అర్థిక సౌకర్యాలు కల్పించాయి. గ్రామీణ పేద రైతులకు సంస్థాగత రుణ సౌకర్యం కల్పించడానికి రాష్ట్రంలో సహకార వ్యవస్థను విస్తృతపరిచారు. సన్న, చిన్నకారు రైతుల రుణసౌకర్యం కొరకు అనేక కమీషన్‌లు నివేదికలు ఇచ్చాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి రక్షించడానికి ఈ వ్యవస్థను ప్రతిష్ట పరిచారు. రుణ సౌకర్యంతో పాటు ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు ఇతర వ్యవసాయ ఉపకరణాలతో పాటు చిన్న తరహా యంత్రాలు సహకార సంస్థలు ద్వారా అద్దె - కొనుగోలు పద్ధతిపై అందుబాటులో వుంచారు.సన్న, చిన్నకారు రైతులు ఈ విధానం వల్ల లబ్ధిపొందారు. కాని ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా సంస్థాగత రుణం పేద రైతాంగానికి అందుబాటులో లేకుండా పోయింది.
రాష్ట్రంలోగల సహకార సంఘాలు :
రాష్ట్రంలో 4610 సంఘాలుండగా ప్రభుత్వం 2940కి 2005సం॥లో కుదించింది. సభ్యత్వాన్ని 1.38 కోట్లనుండి 27 లక్షలకు తగ్గించారు.
రాష్ట్రంలో 25లక్షల మంది కౌలుదారులతో కలిపి 40లక్షల మంది రుణ అర్హత గలవారు వున్నారు. కొత్త సభ్యులకు రుణాలు యివ్వడంలేదు. ఈ రంగంతో సంబంధంవున్న వారందరికీ అక్కౌంటెబిలిటీ (బాధ్యత) పెట్టలేదు. అధికార యంత్రాంగంతో పాటు సభ్యులు ప్రేక్షక పాత్ర వహించారు. రాజకీయ జోక్యం తారాస్థాయికి వెళ్లింది. పై కారణాలను అన్ని కోణాలలో పరిశీలించి వాటిని నివారించడానికి కృషి చేయాలి. అందుకు భిన్నంగా ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానాల ప్రకారం ఈ రంగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ ఒప్పందం. ఒకవైపు పెద్దఎత్తున నిధులు బాహాటంగా దుర్వినియోగం జరుగుతుండగా బ్యాంకుల వివరాలను కంప్యూటరీకరిస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగావుంది. ఈ రంగంపై వేసిన కమిషన్లు ప్రభుత్వం కోరుకున్న విధంగానే నివేదికలు సమర్పించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం - నాబార్డు ఒప్పందాన్ని లోతుగా పరిశీలిస్తే నష్టాలకు కారణమైన పై అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టులేదు. కేంద్ర ప్రభుత్వం యిచ్చే రు. 1500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ సహాయం రు. 600 కోట్లు నష్టాలను పూడ్చడానికి వినియోగించడమంటే ఉద్దేశ్యపూర్వక బకాయిదార్లకు, బాకీలు ఎగవేసిన వారికి అనుకూలంగా సహకరించడమే. సంస్కరణల పేరుతో చేపట్టిన చర్యలు సహకార లాభోక్తులకు ఏమాత్రం ఉపయోగపడవు. వెనుకబడిన ప్రాంతాల్లో సొసైటీల రద్దువల్ల అవి మరింత వెనకబాటుతనానికి గురవుతాయి. అర్హతగలవారికి రుణాలు లభించవు. సహకార రంగాన్ని ఎత్తివేయడానికి నాందిగా రివాల్వింగ్ స్కీం, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటివి ఏర్పర్చి సహకార స్ఫూర్తిని దెబ్బతీసారు.
దీనికి తోడు సహకార సంస్థల సంస్కరణల పేరుతో ఒక్కో సభ్యునికి రూ. 300 వాటా ధనం ఉండాలని నిబంధన విధించి, అంతకన్నా తక్కువ వాటా కలిగిన కోటి రెండులక్షల మందిని సభ్యత్వం నుంచి తొలగించారు. నేడు ఈ రైతాంగం ప్రధానంగా ప్రైవేటు రుణాలపై ఆధారపడి ఉన్నారు. క్రిమి సంహారకమందుల వ్యాపారులు లేదా మైక్రో ఫైనాన్స్ సంస్థల నుండి అప్పులు పొంది అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఆదిలాబాద్‌లో దలాల్ వ్యవస్థ, రంగారెడ్డి జిల్లాలో గుంటూరు నుండి వచ్చిన ‘‘వంజర’’ వ్యవస్థ, చిత్తూరులో తమిళనాడు నుండి వచ్చినవారు 150 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6శాతం ఎక్కడా? వీరు తెస్తున్న వడ్డీ 150 శాతం ఎక్కడా? మైక్రో ఫైనాన్స్ సంస్థలు వీరిని పిల్చి పిప్పి చేస్తున్నాయి. ఫలితంగా గుంటూరు రెంటచింతలలో 50 మంది కౌలు రైతులు కిడ్నిలు అమ్ముకున్నారు. దేవరకొండ లాంటి చోట ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు.దీనికి తోడు సహకార సంస్థల సంస్కరణల పేరుతో ఒక్కో సభ్యునికి రూ. 300 వాటాలు ఉండాలని నిబంధన విధించి, అంతకన్నా తక్కువ వాటాలు కలిగిన కోటి రెండులక్షల మందిని సభ్యత్వం నుంచి తొలగించారు. నేడు ఈ రైతాంగం ప్రధానంగా ప్రైవేటు రుణాలపై ఆధారపడి ఉన్నారు.
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిరంతరం సన్న, చిన్నకారు రైతుల రుణ లభ్యత పెంచుతున్నామంటూ ప్రకటిస్తుంటారు. ఆచరణలో ఈ రైతాంగానికి సంస్థాగత రుణాలు లభ్యత లేదు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం మొత్తం రుణాలలో దళిత, గిరిజనులకు 15శాతం రుణాలు ఇవ్వాలని నిబంధన ఉంది. ఈ నిబంధన తుంగలోతొక్కారు.
గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామంలో ఆంజనేయ స్వామి మాన్యంలో గల 360 కుటుంబాలలో 30,40 మందికి అతి కొద్ది భూమి ఉంది. వారంతా భూస్వాముల వద్ద భూములు కౌలుకు తీసుకున్నారు. గ్రామంలోనే గల లైసెన్స్‌డ్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకున్నారు. వడ్డీ 60% ఉంది. పంటలు దెబ్బతిని గిట్టుబాటు ధర రాక అప్పుల భారం పెరిగింది. రు 30 వేలు అప్పుతేస్తే 50వేలు అయింది. ఈ అప్పుల బాధలకు భయపడి ఇండ్లు అమ్మారు. బబ్బా వెంకటరెడ్డి తరువాత పోలిరెడ్డి దుర్గపుపూడి చిన్న వెంకటరెడ్డి, భిక్షనాయక్,మొదలగు వారు దేశ రాజధాని ఢల్లీిలో ఒక్కో కిడ్నీని రు. 50వేల చొప్పున అమ్ముకున్నారు. ఈ డబ్బు పూర్తిగా బాకీదారులే తీసుకున్నారు. అయినా బాకీలు తీరలేదు. ఈ విధంగా రాష్ట్రంలో కిడ్నీలు అమ్ముకున్నవారు 50 మంది వరకు ఉన్నారు.ఇది ప్రైవేటు వడ్డీ విధానం.
నేడు బ్యాంకులు రుణ నిర్భంధ వసూళ్ళ ద్వారా రైతులపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తున్నాయి. 1. లక్న గోల్ల కృష్టయ్య, 2. మాలబాల కృష్టయ్య ఉల్లూరు గ్రామం కల్హాపూర్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా వారిని వరుసగా రు. 23 వేలు, రు. 18 వేలు బాకీ ఉన్నందుకు ఫిబ్రవరి 2007లో 15 రోజులు జైలులో పెట్టారు. 2001 డిసెంబరులో చిన్న వెంకటస్వామి బాకీదారు అబ్దుల్ రహీమాన్ జమీన్‌దార్‌ను మీడితురు గ్రామం కర్నూలు జిల్లా వారిని జైలులో పెట్టారు.5 పిభ్రవరి 2002న అనంతపురం జిల్లాలో ,నాగులూరు గ్రామానికి చెందిన పెనుగొండ మండల వాసి బి.గోపాలరెడ్డిని బ్యాంకు వారు నిర్బంధం పెట్టగా అనంతపురం బస్టాండ్‌లో ఆత్మహత్యకు పాల్పడినాడు. అదే విధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్. నల్లపరెడ్డి, గంగిరెడ్డిలను కడపజైలుకు పంపారు. ఈ బ్యాంకులు సాగిస్తున్న నిర్బంధాలు కసాయి వారిని మరపిస్తున్నాయి. వారికి కరువుకాటకాలకు సంబంధం లేదు. ఈ విధానాన్ని త్రీవంగా నిరసించాలి. కరువు నిబంధనలు ప్రకారం రుణ విముక్తులను చేయాలి.
గత పాలక వర్గాలు ఉద్దేశపూర్వకంగానే సహకార వ్యవస్థను భ్రష్టు పట్టించారు. తమ స్వార్థానికి వినియోగించుకోవడమే కాకుండా వాటిని తమ జేబు సంస్థలుగా మార్చుకున్నారు. ఫలితంగా రుణాలు అందక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 9 సంవత్సరాలలో రాష్ట్రంలో 19,500 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు రాష్ట్ర క్రైమ్ రిపోర్టు తెలియజేస్తున్నది. అయినా ప్రభుత్వాలు మాత్రం ఈ సహకార సంస్థలకు చక్కదిద్దటానికి బదులు రద్దు చేసే దిశగా పని చేస్తున్నాయి.
ప్రధాని ప్యాకేజీ
రాష్ట్రంలోని 16 జిల్లాలు (తెలంగాణా 9, రాయలసీమ 4, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) ల్లో ఆత్మహత్యల నివారణ పథకం పేరుతో ప్రధాని రూ 9650.18 కోట్లతో ప్రకటించారు. ఇందులో రు. 1436 కోట్లు రుణాల రద్దుకు ఉద్దేశించినవి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ పథకాన్ని అమలు జరపుటకు నిర్ణయించుకుంది.వారి లక్ష్యం ప్రకారం రూ. 1993.87 కోట్ల రూపాయలు వడ్డీ మాఫి చేయాలి.అసలు 7,260.06 కోట్లు 5 సంవత్సరాలకు రీషెడ్యూల్డ్ చేయాలి. తిరిగి 12627.23 కోట్లు కొత్తగా రుణాలు ఇవ్వాలి. ఈ పథకం రెండు సంవత్సరాలు గడిచిన నేటికి అమలు జరగలేదు.రు. 5745.76 కోట్లు మాత్రమే రీషెడ్యూల్డ్ చేసినట్లు తెలిపారు.
రుణ రద్దు పథకం
కేంద్రప్రభుత్వం 28 ఫిబ్రవరి 2008న పార్లమెంటులో రుణరద్దు పథకాన్ని బడ్జెట్ వితరణ సందర్భంగా ప్రకటించారు. 2007 మార్చి 31 నాటికి బకాయి పడి2008 ఫిబ్రవరి 28 నాటికి చెల్లించని రుణాలు రద్దు చేయాలి. 5 ఎకరాల లోపు కలిగిన రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 5 ఎకరాలు పై గలిగిన వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ప్రకారం 25 శాతం రుణాన్ని రద్దు చేయాలి.
ఈ పథకం వలన రాష్ట్రంలో రు. 12వేల కోట్లు రుణాలు రద్దు అవుతాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. వాస్తవానికి మొత్తం రుణాలలో 25శాతం మాత్రమే రద్దు అవుతాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ - ఆగష్టు వరకు రుణాలు పంపిణీ చేస్తారు.గత దశాబ్ద కాలంగా రుణభారం పెరిగిన రైతులకు చెల్లించడానికి ఆశక్తులయ్యారు. ఈపరిస్థితిల్లో సహకార బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకులు బుక్ ఎడ్జెట్‌మెంట్ విధానాన్ని అమలు జరిపాయి. ఫలితంగా రుణం చెల్లించని వారు కూడా తిరిగి కొత్తరుణాలు తీసుకున్నట్లు నమోదు అయ్యారు. నేడు వారెవరికి రుణరద్దు చట్టం వర్తించదు.
రైతులు, రైతు సంఘాలు రుణ వాయిదా తేదిని 28 ఫిబ్రవరి 2008 నాటికి నిర్ణయించాలని కోరుతున్నారు. అలాగే రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలలో (డిపిఎపి ప్రాంతాలు) 5 ఎకరాల నిబంధనను సడలించాలి.
కాని కేంద్రప్రభుత్వం నిబంధనను సడలించడానికి బకాయి తేదిని మార్చడానికి సుమఖంగా లేనట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరత్‌పవార్ (23-04-2008) ప్రకటించారు. కృష్ణాజిల్లా మోపిదేవి సహకార బ్యాంకు (కెడిసిసి) లో మెరకనపల్లి, వక్కలగడ్డ, మేకవారి పాలెం, నాగాయతిప్ప గ్రామాల్లో ఒక్కరికి కూడా రుణం రద్దు కావడం లేదు. వరంగల్ జిల్లా నర్సంపేట బ్రాంచ్‌లో గల నాచినపల్లి సహకార సొసైటీలో ఇరవై శాతం సభ్యులకు మాత్రమే రుణాలు రద్దు అవుతున్నాయి.
రైతుమిత్ర గూపులు :
గత తెలుగుదేశం ప్రభుత్వం 2.03 లక్షల గ్రూపులను ఏర్పాటు చేసింది.(15 మంది సన్నచిన్నకారు రైతులు) కాంగ్రెస్ ప్రభుత్వం మే 2004లో అధికారానికి వచ్చిన తర్వాత మరొక లక్ష గ్రూపులను ఏర్పాటు చేస్తానని 31-12-2007 నాటికి 34,245 గ్రూపులను మాత్రమే ఏర్పాటు చేసింది. అందులో 23,451 గ్రూపులకు బ్యాంకు అకౌంట్‌లు తీసుకున్నారు. 1.25 లక్షల మందికి రుణాలు ఇచ్చినట్లు ప్రకటించారు. ఇందులో 10,605 మందికి కౌలుదారులకు రుణాలు ఇచ్చారు. రాష్ట్రంలో 24 లక్షల కౌలుదారులు ఉన్నారు. వారికి రుణాలు ఇస్తామని పదై పదై ప్రకటించడం తప్ప చివరకు కొనేరు రంగారావు కమిషన్ రికమండేషన్ ప్రకారం రుణ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదు.
సన్న,చిన్నకారు రైతులకు పంటరుణాలలో 20 శాతం దీర్ఘకాలిక రుణాలను 15 శాతం మాత్రమే పంపిణీ చేశారు. దీర్ఘకాలిక రుణాలకు వీరికి అర్హత లేదని చెబుతున్నారు ముఖ్యంగా దళిత గిరిజనులకు 15 శాతం రుణాలు నిబంధనల ప్రకారం ఇవ్వాలి. కాని ఇవ్వడం లేదు.
రుణాలకు సూచనలు :
1. స్కేలు ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలివ్వాలి - రుణ మొత్తంపై పరిమితి విధించరాదు. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి.
2. వ్యవసాయ కార్మికులకు వినియోగ రుణాలివ్వాలి.
3. సొసైటీలు వ్యవసాయేతర వ్యాపారం చేయడానికి వీలుగా సొసైటీ వాటాధనంతో పాటుగా బ్యాంకులు రుణ సదుపాయం చేయాలి. ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు అద్దెకు, అందించాలి.చౌకదుకాణాలు నిర్వహించాలి. అన్ని నిత్యావసర వస్తువులు అమ్మించాలి. విత్తనాలు కూడా అమ్మాలి.
4. రుణ వసూళ్ల సందర్భంలో పంటలను కొనుగోలు చేయుటకు అవకాశం కల్పించాలి. (కొనుగోలు చేసిన పంటను అమ్మి జిల్లా బ్యాంకుకు రుణం చెల్లించాలి.)
5. కేంద్ర - రాష్ట్రాలకు నిధులు (పెన్షన్లు మానవ వనరుల అభివృద్ధి నిధులు, వేతనాలు, ఇతర బడ్జెటు వనరులు) సహకార బ్యాంకులలో డిపాజిటు చేసి, దాని ద్వారా ప్రభుత్వాలు వ్యయం చేయాలి.
6. ఒకే కుటుంబంలో ఒకరికే రుణం ఇవ్వాలి. (ఎంత భూమి ఉన్నా - ఎంత మొత్తమైనా ఇవ్వాలి).
7. గ్రామంలో డిపాజిట్లు సేకరించాలి.
8. దళిత, గిరిజనులకు మొత్తం రుణంలో ప్రస్తుతం 15 శాతం ఇవ్వాలన్న నిబంధనకు బదులుగా35 శాతం పంట రుణంగా ఇవ్వాలి.
9. సభ్యులుగా నున్న వారందరికి రుణాలివ్వాలి. - బినామి సభ్యత్వం తొలగించాలి.
10. చేతివృత్తుల వారు గాని, ఇతరులు గాని సభ్యులుగా వుంటే రుణం ఇవ్వాలి.
11. ప్రతి వాస్తవసాగుదారు పేరు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలి - రెవెన్యూ రికార్డుల ప్రకారం రుణ పట్టిక తయారు చేయాలి.
12. వాస్తవ సాగుదారు (కౌలుదారు) పంటరుణం ఇవ్వాలి.
13. వ్యవసాయాధికారులతో రైతులకు పంటలు పండిరచటంపై శిక్షణ ఇవ్వాలి. ఏ భూమిలో ఏ పంట వేయాలో చెప్పాలి.
14. పాడిపరిశ్రమ - గొఱ్ఱెల, మేకలపెంపకం - కూరగాయల పెంపకం వారికి రుణాలివ్వాలి.
15. చేతివృత్తుల వారికి వారి సంఘాల ద్వారా రుణాలివ్వాలి.
సారంపల్లి మల్లారెడ్డి
28.01.2012

No comments:
Post a Comment