ఈ సమితిలో 8 గ్రామ పంచాయితీలు వున్నాయి. అవి 1. ఫిజల్నా 2. నాటు 3. నారుగ్రామ్ 4. సెహరా 5. శ్యాంసుందర్ 6. రైనా 7. ముగుర 8. పాలషాన్. ఈ గ్రామ పంచాయితీలనుండి 24 మంది సమితి సభ్యులను ఎన్నుకున్నారు. గ్రామ పంచాయితీ సర్పంచ్‌లు ఎనిమిది మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా వున్నారు. ఇద్దరు జిల్లా పరిషత్ సభ్యులు ఈ సమితి నుండి ఎన్నికవుతారు. వారు ఒక శాసనసభ్యులు, ఒక పార్లమెంట్ సభ్యులు ఎక్స్ అఫిషియోగా వుంటారు.
సమితిలో 113 గ్రామాలున్నాయి. మొత్తం విస్తీర్ణం 1,93,067.34 హెక్టార్లు వుంది. మొత్తం జనాభా 1,62,923 వున్నారు. ఇందులో దళిత జనాభా 53,441, గిరిజన జనాభా 9,248గా వున్నారు. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 21,513 వున్నారు. మొత్తం ఓట్లు 1,10,638 వున్నాయి. 106 వార్డులు, రెండు జిల్లా పరిషత్ స్థానాలు కల్గి వున్నాయి.
ఈ సమితిలో తొమ్మిది స్థాయి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ తొమ్మిది స్థాయి సంఘాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రతిపక్షం నుండి ఒకరే వున్నచో అతను అన్ని స్థాయి సంఘాలలో పాల్గొంటారు. ప్రతి స్థాయి సంఘానికి ఐదుగురు సభ్యులను ఎన్నుకోవాలి. ఒక సభ్యుడు మూడు కమిటీలకు పోటీచేయవచ్చు. ఆ కమిటీలలో సభ్యులుగా కొనసాగవచ్చు. ప్రతి స్థాయి సంఘం ఒక ఛైర్మన్‌ను ఎన్నుకొంటుంది. ఈ స్థాయి సంఘాలకు విడివిడిగా బడ్జెట్ కేటాయింపులు వుంటాయి. అవి
1. ఆర్థిక మరియు ప్లానింగ్ 2. ఆరోగ్యం, పర్యావరణం
3. విద్య, ఆటలు 4. విద్యుచ్ఛక్తి, చిన్న పరిశ్రమలు
5. స్త్రీ, శిశు సంక్షేమం 6. చేపలు, పశు సంవర్థక శాఖ
7. వ్యవసాయం, ఇరిగేషన్, సహకార రంగం 8. ప్రాథమిక వనరుల కల్పన, రవాణా
9. అటవీ భూములు, సాగు భూముల అభివృద్ధి
అన్ని స్థాయి సంఘాల ఛైర్మన్‌లు ఫైనాన్స్ కమిటీలో సభ్యులుగా వుంటారు.
స్వయం సహాయక గ్రూపులు రైతులనుండి కొనుగోళ్ళు చేయడానికి జిల్లా పరిషత్ ఆర్థిక సౌకర్యం కల్పిస్తుంది. సహకార సొసైటీలు కూడా రైతులనుండి కొనుగోళ్ళు చేస్తాయి. ముఖ్యంగా, బంగాళాదుంపలతోపాటు ధాన్యం కొనుగోలుచేసి ధాన్యాన్ని బియ్యంగా చేసి భారత ఆహార సంస్థకు అమ్ముతారు. బంగాళాదుంపలు కోల్డ్ స్టోరేజీలో పెట్టి ధర వచ్చినప్పుడు అమ్మాలి. బంగాళాదుంపల కనీస మద్దతు ధర కిలో రు. 2.50లు. సమితి ఏరియాలోని బ్యాంకుల రుణ సమస్యపై సంవత్సరంలో నాల్గుసార్లు సమావేశాలు జరుగుతాయి. సమితిలో 1907-08 సంవత్సరానికి 179శాతం వసూళ్ళు చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు పంటరుణాలు యిస్తారు. మార్చి 31న యేటా చెల్లింపులు చేయాలి. సహకార సంఘాలకు చెల్లింపులు సక్రమంగా సాగుతున్నాయి.
అన్ని గ్రామ పంచాయితీలలో అన్ని ఇండ్లకు 100శాతం శానిటేషన్ సౌకర్యం కల్పించబడింది. సిస్టర్ నివేదిత అను ప్రయివేటు సంస్థ ద్వారా శానిటేషన్ సౌకర్యాలు కల్పించారు. ఇందిర ఆవాసయోజన క్రింద మార్చి 2008 నాటికి 400 ఇండ్లు రు. 35,000 చొప్పున మరియు ఏప్రిల్ 2008 నుండి మార్చి 2009 వరకు 600 ఇండ్లు కోటాగా నిర్మాణాలు చేపట్టారు.
సిబ్బంది:
1. బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 2. సహాయక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
3. చేపల విస్తరణ అధికారి 4. విద్యా విస్తరణాధికారి
5. సామాజిక విద్యా విస్తరణాధికారి 6. పరిశ్రమల అభివృద్ధి అధికారి
7. సమితి రిలీఫ్ అధికారి 8. కనీస వేతనాల అమలుకు ఇన్‌స్పెక్టర్
9. దళిత, గిరిజనాభివృద్ధి అధికారి 10. ఆర్థికంగా వెనుకబడిన మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి
11. స్వయం సహాయక గ్రూపుల మరియు గ్రామాభివృద్ధి అధికారి 12. పంచాయితీ అభివృద్ధి అధికారి
13. ఆడిటర్ 14. ఇన్‌స్పెక్టర్ 15. ఉపాధి కల్పనాధికారి
భూ సమస్య : సమితి మొత్తం విస్తీర్ణం 1,93,067.34 హెక్టార్లు కాగా, అందులో సాగు భూమి 1,64,107.3 హెక్టార్లు వుంది. 1891.99 హెక్టార్లలో నీటి కుంటలు వున్నాయి. సమితి గుండా 18 కి.మీలు నది ప్రవహిస్తుంది. బీడు భూములు 1930.67 హెక్టార్లు వున్నాయి. మొత్తం కౌలుదార్లు 4874మంది వున్నారు. వీరు 1757.09 హెక్టార్లు సాగుచేస్తున్నారు. ఇందులో గిరిజన కౌల్దార్లు 826, దళిత కౌల్దార్లు 2021, మిగిలినవారు 2027 వున్నారు. 7848 మంది పట్టాదార్లు వుండగా, అందులో గిరిజన పట్టాదార్లు 1633, హరిజన పట్టాదార్లు 3930 మంది వున్నారు. చిన్న రైతులు 7150కాగా, సన్నకారు రైతులు 10076 మంది మరియు వ్యవసాయ కార్మికులు 73804 మంది వున్నారు.
ఆర్థిక వనరులు : సమితి ప్రాంతంలో 49 ధాన్యం మిల్లులు వుండగా, అందులో ఒకటి సహకార రంగానికి చెందినది. ఐదు కోల్డ్ స్టోరేజీలు, ఒక థర్మల్ పవర్‌స్టేషన్, ఒక ఆయిల్‌ప్లాంట్‌లు వున్నాయి.
ఆరోగ్య వనరులు : జననాల రేటు వెయ్యి మందికి 15.078 కాగా, మరణాల రేటు వెయ్యికి 3.67గా వుంది. శిశు మరణాల రేటు వెయ్యికి 22.99 వుంది. నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 26 ఆరోగ్య సబ్ సెంటర్లు, మూడు హోమియో వైద్య శాలలు, ఏడు శిశు సంక్షేమ ప్రాజెక్టులు, ఐదు స్వ జలధార మంచినీటి పథకాలు, 81 మంది శిక్షణపొందిన దాయీలు వున్నారు. పోలియో, ఇమ్యునైజేషన్ టీకాలు 104.72శాతంగా వుంది.
విద్యా రంగం : ఒక కాలేజీ, 10 హైయ్యర్, సెకెండరీ పాఠశాలలు, 13 ఉన్నత జూనియర్ పాఠశాలలు, ఒక ఉన్నత మదర్స్, 127 ప్రాథమిక పాఠశాలలు వున్నాయి. మాధ్యమిక పాఠశాలలు 5-8 తరగతులకు మూడు పాఠశాలలు, శిశు తరగతి 1-4తరగతులకు 18 పాఠశాలలు వున్నాయి. మొత్తం ప్రాథమిక పాఠశాలలో 19,373 మంది విద్యార్థులు వుండగా అందరికీ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించబడుతుంది. పురుషులలో 88.10 శాతం, మహిళలలో 84.05శాతం అక్షరాస్యత వుంది.
ఉపాధి హామీ పథకం : 2008-09 సంవత్సరానికి 8 గ్రామ పంచాయితీలకు రు. 2,28,55,024 లు కేటాయించబడినాయి. 24,647 జాబ్ కార్డులు పంపిణీ చేశారు. సెప్టెంబర్ 2008 నాటికి 7,23,567 పనిదినాలు కల్పించారు. 561 పనులను 8 గ్రామ పంచాయితీలలో చేపట్టారు.
ఇరిగేషన్ : 20 ఎకరాలకు పైబడిన సాగునీటి లిఫ్టు పథకాలను సమితి నిర్వహిస్తుంది. రైతులు పంటలకు నీటితీరువా చెల్లించడం తప్ప బాధ్యత మొత్తం పంచాయితీ సమితి భరిస్తుంది.
అలాగే, పండిన పంటలకు మద్దతు ధర లభించనప్పుడు పంచాయితీ సమితి జిల్లా పరిషత్ నుండి నిధులను సమీకరించి మద్దతు ధరలకు కొనుగోలు చేస్తుంది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో పంచాయితీ సమితి కీలకపాత్ర పోషిస్తుంది. ప్రజలకు ఉపాధి హామీ గ్యారెంటీ వుంది. అన్ని స్వయం సహాయక బృందాలకు ఆదాయ వనరులు కల్పించారు. ఆదాయంలేని వారు కనిపించలేదు. ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఇండ్లు, తదితర సమస్యలపై సమితి ప్రత్యేకంగా కేంద్రీకరించి నిర్వహణ చేస్తున్నది. పెన్షన్లు, ఉపాధి హామీ పథకాలన్నింటినీ పంచాయితీ సమితి బాధ్యత వహించి వుంది. ఏ సమస్యపైన అయినా లాభోక్తలు గ్రామ పంచాయితీద్వారా తమ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్‌లను పరిశీలించినప్పుడు ఈ కార్యక్రమాలేవీ చేపట్టలేదు. కాంట్రాక్టర్లు, పైరవీకార్లు నిరంతరం ఆఫీసుల చుట్టూ తిరగడం కనబడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి మండల పరిషత్ ఎలాంటి బాధ్యతను స్వీకరించదు. ఒకవిధంగా మండల పరిషత్ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పరిషత్‌లకు జేబు సంస్థగా వుంటుంది. ఎన్నికైన సర్పంచ్‌లకు, ఎంపిటిసీలకు వారి గ్రామాలలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ పని కావాలన్నా, జిల్లా బాధ్యులుగా వున్న మంత్రి అనుగ్రహం పొందాలి. చివరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డులు, పెన్షన్లు కూడా మంత్రి ఆజ్ఞలతోనే అందుబాటులోకి వస్తాయి.
---

No comments:
Post a Comment