రాజ్యాంగ సవరణ 73,74 ప్రకారం స్థానిక సంస్థల పరిపాలన ప్రజలకు అత్యంత సన్నిహితంగా వుండాలి. పశ్చిమబెంగాల్ గ్రామ పంచాయితీ వ్యవస్థ ఇందుకు ఆదర్శంగా నిలిచింది. గ్రామీణ ప్రజల భాగస్వామ్యం, రాజకీయ పార్టీల భాగస్వామ్యం కల్గిన వ్యవస్థగా కొనసాగుతున్నది. ఎన్నికలలో గెలిచినవారికి, ఓడిన వారికి గుర్తింపు గల్గిన విధంగా ఈ వ్యవస్థ కొనసాగడమే దీని విజయానికి కారణాలు. అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన పార్టీ ఆధిపత్యం స్థానిక సంస్థలలో కొనసాగుతున్నది. వారికి తోచిందే వేదంగా అమలుజరపబడుతున్నది. ఫలితంగా కొద్దిమందికి ప్రయోజనం, ఎక్కువమందికి ఉపకరించిన విధంగా ఈ వ్యవస్థ వుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే అధికారాలను పెట్టుకొని స్థానిక సంస్థలను తన జేబు సంస్థలుగా రాష్ట్ర పాలకవర్గం మార్చుకొంది. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌పై స్థానిక సంస్థలు ఆధారపడి వున్నాయి. మంత్రులు దయదలిస్తేనే స్థానిక సంస్థల నిధులు వస్తాయి. పశ్చిమబెంగాల్ ఇందుకు పూర్తి భిన్నంగా స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వహిస్తున్నది.
రైనా గ్రామ పంచాయితీ నిర్వహణ తీరు :
పశ్చిమబెంగాల్‌లోని బర్ధమాన్(భరద్వాన్) జిల్లాలోని రైనా పంచాయితీ సమితిలోని రైనా గ్రామ పంచాయితీని విశ్లేషించినప్పుడు దాని నిర్వహణ ప్రజలకు సన్నిహితంగా వుండి, వారి ప్రయోజనాలను రక్షిస్తున్నట్లు కనబడుతుంది. ఈ గ్రామ పంచాయితీలో 16వేల జనాభా వుంది. 11వేల మంది ఓటర్లు వున్నారు. 13 గ్రామాలు కలిసి గ్రామ పంచాయితీగా ఏర్పడింది. ఈ గ్రామ పంచాయితీని 12 వార్డులుగా విభజించారు. అందులో మూడు వార్డులు మహిళలకు, నాల్గు వార్డులు దళితులకు, ఒక వార్డు గిరిజనులకు కేటాయించగా, మిగిలిన నాలుగు వార్డులు జనరల్ స్థానాలుగా వున్నాయి. గ్రామ పంచాయితీలో సాగు భూమి 2079 హెక్టార్లు వుంది. ఈ మొత్తం ఖరీఫ్ వరి పంట వస్తుంది. రెండో పంటగా 500 ఎకరాలు వరి, మరో 500 ఎకరాలు బంగాళాదుంపలు (నవంబర్ నుండి మార్చి) పండిస్తారు. బంగాళా దుంపలు ఎకరాకు 100 క్వింటాళ్ళ వరకు పండుతాయి.
పంచాయితీలో 2500 సన్న, చిన్నకారు రైతు కుటుంబాలు వున్నాయి. 500 కుటుంబాలకు భూమిలేదు. ఇందులో 250 కుటుంబాలు కౌలుదార్లుగా వున్నారు. గ్రామంలో పెద్ద రైతు అనగా ఎనిమిది ఎకరాలు కల్గిన ఒకేఒకరు వున్నారు. గ్రామ పంచాయితీలో రెవిన్యూ అధికారి మరియు అటెండర్ వుంటారు. ఎనిమిది స్వయం సహాయక సంఘాలు వున్నాయి. ఇందులో నాలుగు అటవీ అభివృద్ధిలో పనిచేస్తున్నాయి. మరో రెండు విత్తనోత్పత్తి రంగంలో వున్నాయి. మిగిలిన రెండు చేపల పెంపకం, కుటీర పరిశ్రమలలో వున్నాయి. అన్ని స్వయం సహాయక గ్రూపులకు ఆదాయ వనరులు కల్పించబడినాయి.
గ్రామ పంచాయితీ ఓటర్లు ముగ్గురు సమితి సభ్యులను ఎన్నుకొంటారు. వీరు పంచాయితీ సమితిలో తమ గ్రామ పంచాయితీ సమితికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. సర్పంచ్ పంచాయితీ సమితిలో ఎక్స్ అఫిషియోగా వుంటారు. చట్టబద్ధంగా సంవత్సరానికి రెండుసార్లు మే, నవంబర్ నెలల్లో గ్రామ సభలు జరుగుతాయి. చట్టంలో లేకున్నా సాధారణంగా ఈ గ్రామ పంచాయితీ నెలకొకసారి గ్రామ సభలు జరుపుతుంది. సర్పంచ్‌కు అలవెన్సు నెలకు రు. 2వేలు, ప్రయాణపు ఖర్చుల క్రింది నెలకు రు. 500లు యిస్తారు. ఉప సర్పంచ్‌కు రు. 1500 అలవెన్సు, రు. 200 ప్రయాణపు ఖర్చుల క్రింద యిస్తారు. సమావేశమైనప్పుడు ప్రతి సభ్యునికి రు. 200లు యిస్తారు.
పంచాయితీలో నాలుగు స్టాండింగ్ కమిటీలు వున్నాయి. 1. ప్రణాళిక, ఫైనాన్స్ 2. విద్య - ఆరోగ్యం 3. అడవులు - భూమి 4. వ్యవసాయం, పశు సంవర్థక శాఖ, చేపలు వగైరా. ఈ నాలుగు స్టాండింగ్ కమిటీలకు ఛైర్మన్‌లు ఎన్నుకోబడతారు. ఛైర్మన్‌కు సమావేశ సిట్టింగ్ ఛార్జి రు. 200 చెల్లిస్తారు. సంచాలకులకు రు. 400 అలవెన్సు యిస్తారు. ప్రతిపక్షం వారు ఫైనాన్స్, ప్రణాళిక స్టాండింగ్ కమిటీలో వుంటారు. స్టాండింగ్ కమిటీల తీర్మానాలను గ్రామ పంచాయితీ ఆమోదానికి పెట్టాలి. దాదాపుగా స్టాండింగ్ కమిటీ తీర్మానాలను గ్రామ పంచాయితీ ఆమోదిస్తుంది.
గ్రామ పంచాయితీలోని గ్రామాలలో కమిటీలు :
ప్రతి గ్రామంలో 20 మందితో కమిటీ వేస్తారు. ఇందులో ఆ గ్రామం (వార్డు)కు ఎన్నికైన అభ్యర్థి గ్రామ కమిటీకి ఛైర్మన్‌గా వుంటారు. అతనితో పోటీచేసి సమీప ఓట్లతో ఓడిపోయిన ప్రతిపక్షవ్యక్తి ఉప ఛైర్మన్‌గా వుంటారు. వీరుగాక గ్రామంలో మరో 18మందితో కమిటీ వేస్తారు. దీనిని గ్రామాభివృద్ధి కమిటీగా పిలుస్తారు. ఈ గ్రామాభివృద్ధి కమిటీ నెలకొకసారి సమావేశమై గ్రామంలో జరుగు అభివృద్ధి పనులను సమీక్షిస్తుంది. దీనివలన గ్రామంలో జరుగు అభివృద్ధి పనులలో అవకతవకలు జరగడానికి ఆస్కారం వుండదు.
ఇరిగేషన్ : గ్రామంలో 20 ఎకరాలు కల్గిన లిఫ్టు పథకం (బోరు బావి) గ్రామ పంచాయితీ నిర్వహిస్తుంది. ఏటా దాదాపు విద్యుత్ బిల్లు రు. 16000 వస్తుంది. దీన్ని గ్రామ పంచాయితీ భరిస్తుంది. రైతులనుండి బంగాళాదుంపలకు ఎకరా రు. 240, రెండవ వరి (జనవరి- ఏప్రిల్) పంటకు రు. 420 మరియు ఆవాల పంటకు ఎకరాకు రు. 90, వరి మొదటి పంట (జూలై-నవంబర్)కు రు.180లు నీటితీరువాగా వసూలు చేస్తారు. 100 ఎకరాల లిఫ్టు (దామోదర వ్యాలే నదినుండి)ను పంచాయితీ సమితి నిర్వహిస్తుంది. పంచాయితీ ఆధీనంలోని బోరుబావి రిపేర్లు పంచాయితీ భరిస్తుండగా, సమితి నిర్వహించే బోరుబావికి సమితి నిధుల నుండి వ్యయం చేస్తారు.
1973 నాటికి సాగునీటి వనరులు 26శాతం కాగా, నేడు అది 76శాతానికి విస్తరించింది.
పంచాయితీ సిబ్బంది - వేతనాలు : ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రు. 15500, కార్యదర్శి - రు. 15000, ఇంజనీరు రు. 10000, ఇద్దరు అసిస్టెంట్‌లకు చెరొక రు.7000, ముగ్గురు అటెండర్లకు రు. 5000 నుండి 6000 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంచాయితీకి చెల్లిస్తుంది.
పన్నుల వసూళ్ళు : గ్రామ పంచాయితీలో ఇద్దరు టోల్ ట్యాక్స్ కలెక్టర్స్ వున్నారు. వీరు గ్రామ పంచాయితీలోని రోడ్లపై తిరుగు వాహనాల నుండి పన్నులు వసూలు చేస్తారు. పన్నుల వసూళ్ళను కమీషనుపై వసూలు చేయిస్తారు. రు. 8000లు వసూలు చేసినచో 8శాతం, రు. 8000లపైన వసూలు చేసినచో 20శాతం కమీషనుగా వసూలు చేసిన వారికి యిస్తారు. యివిగాక ప్రతినెల రు. 200 చొప్పున రెమ్యునరేషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది.
టోల్ ట్యాక్స్ నిబంధనలు : లారీకి రు. 40, కారుకు రు. 10, బస్సు (ప్రతి టిప్పుకు) రు. 5లు, ట్రాక్టర్‌కు రు. 30లు, ఖాళీ లారీకి రు. 15లు చొప్పున వసూలు చేస్తారు. వసూలు చేసిన టోల్‌ట్యాక్స్ కలెక్టర్‌కు 30శాతం కమీషను వుంటుంది.
గ్రామ పంచాయితీ సమావేశాలు : సర్పంచ్ (ప్రధాన్), ఉప సర్పంచ్ (ఉప ప్రధాన్), ఎన్నికైన వార్డు సభ్యులతో పాటు స్థానిక శాసన సభ్యులు మరియు పంచాయితీ సమితికి ఎన్నిక కాబడిన సభ్యులు హాజరవుతారు. నెలకొకసారి ఈ సమావేశం జరుగుతుంది.
ఆర్థిక పరిస్థితి : పంచాయితీ మొత్తం బడ్జెట్ - 2007-08కి రు. 1,69,73,373.34గా వుంది. ప్రారంభ నిల్వ 306913.81 కాగా, ముగింపు నిల్వ 247418.14గా వుంది. గ్రామ పంచాయితీ ఆదాయం ఇంటి పన్నులు, నీటి తీరువా, టోల్‌ట్యాక్స్, భూముల కౌలు, తదితర వనరుల క్రింద రు. 4,15,622లు వస్తున్నది. సిబ్బందికి చెల్లించే రు. 6,98,349లు రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీకి జమ చేస్తుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం క్రింద గ్రామానికి రు. 1,29,48,347లు యిచ్చారు. ఈ మొత్తంలో సంవత్సరాంతమున రు.1340లు మిగిలాయి. ప్రధానంగా నీటి పరిరక్షణ, ప్లాంటేషన్, కరువుల నుండి రక్షణ, మైక్రో ఇరిగేషన్, నీటి వనరుల అభివృద్ధి, భూమి అభివృద్ధి, వరద నివారణ, గ్రామంలోని రోడ్లు, వగైరా పనులకే యీ నిధులు కేటాయించారు. 2007-08లో ఈ గ్రామ పంచాయితీ 104 పనులను పూర్తిచేసింది. ఇవన్నీ గ్రామాభివృద్ధి కమిటీద్వారా నిర్వహిస్తారు. 2008-09 సంవత్సరానికి 13-10-2008 నాటికి (ఆరు మాసాలకు) 85 పనులను పూర్తిచేశారు. ముఖ్యంగా, ఈ పథకం పూర్తి పారదర్శకంగా వుంది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం క్రింద గ్రామ పంచాయితీకి రు. 5,25,677లు 2007-08కి కేటాయించారు. ప్రతి ఇంటికి రు. 35000లు లోభోక్తకు గ్రామ పంచాయితీ చెల్లిస్తుంది. లాభోక్త 17 చ.మీల వైశాల్యంలో ఇల్లు నిర్మాణం చేపట్టాలి. తన స్వంత పెట్టుబడి లేకుండా లోభోక్త యీ నిధులతోనే ఇల్లు పూర్తిచేసుకుంటాడు. లాభోక్తపై ఎలాంటి భారం పడదు. అలాగే, పంచాయితీకి స్వేచ్ఛా నిధుల క్రింద రు. 3,82,430లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఎం.ఎల్.ఏ నిధుల నుండి లక్ష రూపాయలు పంచాయితీకి యిచ్చారు. వృద్ధాప్య పెన్షన్ క్రింద జాతీయ నిధి నుండి రు. 5,60,054లు పంచాయితీకి వచ్చాయి. 12వ ఫైనాన్స్ కమిషన్ క్రింద రు. 1,80,742లు వచ్చాయి. ఈ విధంగా పంచాయితీకి కేంద్రం నుండి, రాష్ట్రం నుండి వచ్చే నిధులు నేరుగా వారి అక్కౌంట్‌కు జమ అవుతాయి. ఏ పేరుతో వచ్చే నిధులను ఆ పనికే వ్యయం చేయడం జరుగుతుంది. ఏ పరిస్థితులలోనూ నిధుల మార్పిడి జరగదు.
గ్రామ పంచాయితీ - ప్రజల సంబంధాలు : ప్రజలకు కావాల్సిన అన్ని సమస్యలను గ్రామ పంచాయితీ నేరుగా సంబంధం కల్గివుంది. రాష్ట్ర ప్రభుత్వం గానీ, జిల్లా పరిషత్‌గానీ గ్రామ పంచాయితీలో జరుగు అభివృద్ధి పనులలో ఎలాంటి జోక్యం చేసుకోవు. పంచాయితీ తీర్మానమే తుదిగా వుంటుంది. గ్రామ అవసరాలను బట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతివ్యక్తికి ఉపాధి కల్పించబడింది. ఇల్లు, ఉపాధి, ఆరోగ్యం, విద్య వంటి సంక్షేమ పథకాలు నేరుగా గ్రామ పంచాయితీ ద్వారానే నిర్వహించబడుతున్నాయి. ప్రతిపక్షం వారికి కూడా పరిపాలనలో గానీ, పంచాయితీ వ్యవహారాలలోగానీ జోక్యం వుంటుంది. దీనివలన పంచాయితీలో అవకతవకలు జరగడానికి ఆస్కారంలేదు. పంచాయితీ నేతృత్వంలోనే చౌకడిపోలు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా, గమనించాల్సిందేమిటంటే గ్రామ పంచాయితీలోని గ్రామాలలో ఏర్పాటుచేసే ''గ్రామాభివృద్ధి కమిటీలు'' అత్యంత చైతన్యవంతంగా పనిచేస్తున్నాయి. స్వయం సహాయక గ్రూపులకు పని కల్పించడంలోను, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలోను పంచాయితీ కీలకపాత్ర వహించినట్లు కనబడింది.
మన రాష్ట్రంలో పంచాయితీల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, జిల్లా పరిషత్‌ల జోక్యం ఎక్కువగా వుంటుంది. అలాంటిది పశ్చిమబెంగాల్‌లో కనబడదు. అందువల్ల గ్రామీణ ప్రాంతంలోని ప్రతివ్యక్తి గ్రామ పంచాయితీ తనదిగా భావిస్తున్నాడు.

No comments:
Post a Comment