2012`13లో 81.76లక్షల టన్నుల నూనెలు రు.5268కోట్ల విలువ గలవి దేశం వంటనూనెలు దిగుమతి చేసుకున్నారు. ఆ సంవత్సరం మనదేశంలో 310లక్షల టన్నుల వంటనూనెలు ఉత్పత్తి అయ్యాయి. దిగుమతులు లేకుండా దేశంలో వంటలకు నూనెలు దొరికే పరిస్థితి లేకుండాపోయింది. ఈ దిగుమతుల వల్ల రూపాయి డాలరు విలువ తగ్గడంతో భారం మరింత పెరిగింది. దేశ జనాభా 120 కోట్లకు సరిపడా వంటనూనెలను ఉత్పత్తి చేసుకోగల పరిస్థితులను భారత వ్యవసాయశాఖ నిర్లక్ష్యం చేస్తున్నట్లు ద్యోతకమవుతుంది. 1995 డబ్ల్యుటివో విధానాల అమలు చేపట్టినప్పటి నుండి వంటనూనెల దిగుమతులు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నూనెగింజల అభివృద్ధికి బడ్జెట్‌లను తగ్గిస్తూ వస్తున్నది. దిగుమతులే లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులపై లక్ష్యాలు నిర్ణయిస్తున్నారు. నూనె గింజల దిగుమతుల వల్ల స్వయం సమృద్ధతను కోల్పోతున్నాం. 1992`93లో మన వినియోగంలో 3శాతం దిగుమతి చేసుకున్నాం. అది నేడు 50శాతానికి పెరిగింది. నూనె గింజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం తెలియపరుస్తున్నాయి. దిగుమతులపై ఆధారపడడంవల్ల స్థానికంగా నూనెగింజలు ఉత్పత్తి చేసే విస్తీర్ణం నిలకడగా లేక తగ్గుతూ ఉంది. ఒకవైపున యేటా 2శాతం జనాభా పెరుగుతుండగా అందుకు తగినట్లు వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకోవాల్సిన ప్రాథమిక అవసరాన్ని కేంద్రం గుర్తించినట్లు లేదు. ధనిక దేశాల ఆదేశాలను శిరసావహిస్తూ వ్యవసాయ ఉప ఉత్పత్తులు, వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దీనిని అవకాశంగా తీసుకొని పాల ఉత్పత్తులు, మాంసం ఉత్పత్తులు, పండ్లు పెద్దఎత్తున దిగుమతులు చేసి ఆదేశాలు లాభాలు గడిస్తున్నాయి.
మొదటిసారి ఫామాయిల్ దిగుమతి చేసుకొని చౌకడిపోల ద్వారా అమ్మిన సందర్భంగా నూనెగింజల ధరలు మార్కెట్‌లో పడిపోయాయి. ఆ ధరలు పడిపోవడంతో వేరుశనగ విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల నుండి 40 లక్షల ఎకరాలకు తగ్గింది. దిగుమతుల వల్ల దేశీయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అనుభవం గుర్తు చేస్తుంది. రైతులు ఒకసారి పంటమారినాక ధర పెరిగినప్పటికీ తిరిగి ఆ పంట పండిరచడానికి మొగ్గుచూపరు.
దేశంలో 43కోట్ల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ అందులో ముతక ధాన్యాలు(రాగులు, సజ్జలు, కొర్రలు) మరియు నూనెగింజలు(వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా, రేప్‌సీడ్, ఆముదం తదితర 9రకాల నూనెగింజలు) విస్తీర్ణం తగ్గిపోతున్నది. దీనికి తోడు మరొక 7కోట్ల ఎకరాల భూమి బీడుగా మారింది. నూనెగింజలు పండే ప్రాంతంలో ఎక్కువభాగం రియల్‌ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళింది. వీరు కొనుగోలు చేసి బీడుగా పెట్టారు. వ్యవసాయ భూమి బీడుగా పెట్టడం నేరమని ఉత్పత్తిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికీ భూములు కొనుగోలు చేయడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. జాతీయ బ్యాంకులు రు.6లక్షల కోట్లు రుణంగా వీరికి సహకరించారు. వీరికి అనుకూలంగా భూసేకరణ చట్టాలలో సవరణలు తెచ్చారు. భూ రక్షణ చట్టాలను వీరికి అనుకూలంగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అస్సైన్డ్ భూచట్టంలో 9/77 సవరణ, సీలింగ్ చట్టంలో సెక్షన్ 14కు సవరణ తెచ్చి రక్షణలు కల్పించారు. ఆవిధంగా చట్టరణ కల్పించడం వలన వ్యవసాయ ఉత్పత్తులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అతి చిన్న దేశాలైన మలేషియా, సింగపూర్ నుండి వంటనూనెలు దిగుమతి చేసుకునే దుస్థితికి దేశ వ్యవసాయ ఆర్థిక పరిస్థితిని కల్పించారు. నూనె గింజలు పండిరచే రైతులకు ప్రోత్పాహంగానీ, సహకారంగానీ, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంలో ప్రభుత్వాలు నిష్ఫలమయ్యాయి. దేశంలోకి వంటనూనెల దిగుమతులు ఇలా ఉన్నాయి. (దిగుమతులు, ఉత్పత్తి : లక్షల టన్నులలో, విలువ : కోట్ల రూపాయలలో)
పై పట్టికను పరిశీలించినప్పుడు ఉత్పత్తిలో పెరుగుదల ఎగుడుదిగుడులుగా ఉంది. ఇందులో వేరుశనగ, సోయా, రేప్‌సీడ్(వెర్రినువ్వులు) సింహభాగం పండుతాయి. ఈ మూడు పంటలతోపాటు సన్‌ఫ్లవర్, ఆయిల్‌ఫామ్ తోటల పెంపకం ద్వారా మనకు కావలసిన నూనెలు ఉత్పత్తి చేసుకోవడానికి వీలున్నది. కానీ మనం క్రూడ్ ఫామ్ ఆయిల్‌ను 12శాతం వినియోగం మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. తలసరి వాడకం సంవత్సరానికి పరిశీలిస్తే 1992`93లో 5.8కేజీలు ఉండగా, అది 2010`11లో 14.5 కిలోలకు పెరిగింది. తలసరి వాడకం పెరిగినా ఏజెన్సీ ప్రాంతాలలోని ప్రజలు, మురికివాడల్లో పేదలు, గ్రామీణ ప్రాంతంలోని దిగువ తరగతి ప్రజలు తలసరి వాడకానాకి తక్కువగానే వినియోగిస్తున్నారు. దేశంలో ఒక సర్వే ప్రకారం 15శాతం కుటుంబాలు 5 కిలోలకు లోపు వాడుతున్నారు. దేశంలో 9 నూనెగింజల సాగు విస్తీర్ణం ఈ విధంగా ఉంది.
ఒకవైపున బడ్జెట్ తగ్గడం విస్తీర్ణంపై ప్రభావం చూపింది. వ్యవసాయ శాఖల్లో ప్రత్యేకంగా నూనెగింజల ఉత్పత్తికి ఒక విభాగాన్ని తెచ్చారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే విభాగం ప్రారంభించిన తర్వాతనే విస్తీర్ణం, ఉత్పత్తి, బడ్జెట్ సంఖ్యలు తగ్గుముఖం చూపుతున్నాయి. దేశంలో నూనె గింజల ఉత్పత్తిని తగ్గించడానికి ప్రపంచబ్యాంకు మొదలు రుణదాతలందరూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తమ దిగుమతులకు మార్కెట్‌ను తెరిచిపెట్టాలని ఆదేశిస్తున్నారు. అందులో రైతులకు నిరాశకలిగే విధంగా మద్దతు ధరలను నిర్ణయిస్తున్నారు. ఒక క్వింటాలు సోయా 2009`10 రు.1390 ఉండగా 2012`13రు.2240కి మాత్రమే పెంచారు. అదేవిధంగా పై సంవత్సరాలలో వేరుశనగ కాయ రు.2100 నుండి రు.3700లకు, సన్‌ఫ్లవర్ రు.2215నుండి రు.3700కు మాత్రమే పెంచారు. క్వింటాలుకు 28 కిలోల నుండి 40 కిలోల నూనె వస్తుంది. అలాగే నూనె తీయగా మిగిలిన చెక్క అత్యంత విలువైనది. నూనె తీసిన చెక్క ధర కూడా రైతులకు ఇవ్వడంలేదు. మధ్యదళారీలకు వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నారు. వీరిపై ఎలాంటి నియంత్రణ లేదు. నిత్యావసర సరుకుల చట్టం ఉన్నా దాని ఊసేలేదు.
వంటనూనెల దిగుమతుల వల్ల దేశం విదేశీ మారకద్రవ్యం నష్టపోవడమేకాక గ్రామీణ ప్రజలు అధిక ధరలకు దిగుమతి నూనెలు కొనాల్సి వస్తున్నది. నూనె గింజల ఉత్పత్తిలో వ్యవసాయ దారులు పనిదినాలు కోల్పోతున్నారు. అన్నిటికన్నా ప్రమాదకరంగా దిగుమతి అయిన వంటనూనెలు కల్తీ లేదా ఆరోగ్యానికి హానికరమైనవి వినియోగించాల్సి వస్తున్నది. ఈ రోజు వస్తున్న జబ్బులకు విరుగుడుగా నూనెలు వాడకూడదని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు.
వర్షాభావం కింద ఈ పంటలు పండుతాయి. సంవత్సరంలో 2 పంటలు పండిరచవచ్చు. పంటకాలం 4మాసాలు మాత్రమే. అన్ని భూములలో(చవిటి భూములు మినహా) నూనెగింజలు పండే అవకాశం ఉంది. ఈ పంటలు పండిరచడం వలన భూమికి నత్రజని పెరుగుతుంది. అది రెండవ పంటకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పంటలకు క్రిమికీటకాల దాడులు కూడా తక్కువే. కొన్ని నూనెగింజల పంటల పరిస్థితి ఈ దిగువ విధంగా ఉంది.
రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సోయా పంటకు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం పత్తి, మిరప పంటల వల్ల నష్టపోతున్న రైతులకు సోయా ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. ఎకరాకు అతితక్కువ 8 క్వింటాళ్ళ నుండి 13 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. కనీస మద్దతు ధర రు.4500 ఉండాలి. అయినప్పటికీ కిలో నూనె రు.50లకు అమ్మవచ్చు. పెట్టుబడిపోగా ఎకరాకు రు.20వేలు గిట్టుబాటు అవుతుంది. ఇటు వినియోగదారులకు అటు ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో సోయా వేయడానికి రైతులు ముందుకు వచ్చినా కనీసం విత్తన సరఫరా చేయలేకపోయింది. చైనా, అమెకాల్లో సోయా ఉత్పత్తి అత్యంత కీలకమైంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి ర్యాంకులో ఉంది.
దేశంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి విధానాలు రూపొందించాలి. విదేశీ మారకద్రవ్యం సమస్యతోపాటు దేశీయ ఉత్పత్తులు పెంచడం వలన నాణ్యత కలిగిన వంటనూనెలు వినియోగదారులకు అందించవచ్చు. డాలరు, రూపాయి మారకం సమస్యలు పరిష్కరించుకోవచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పని దినాలను పెంచవచ్చు. దేశం వంటనూనెలలో స్వయం సమృద్ధం కావడాన ఇతర దేశాల ఒత్తిడికి లోనుకాకుండా ఉండవచ్చు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ సమస్యను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేసి వంటనూనెల ఉత్పత్తులను పెంచాలి.
సారంపల్లి మల్లారెడ్డి
14.11.2013

No comments:
Post a Comment