2012`13 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోదిశవైపు సాగుతున్నట్లు ఆర్థిక వేత్తలు విశ్లేషణలు చేస్తున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి కీలకమైన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో ఉత్పత్తి తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం ఉత్పత్తులు కూడా ఈ సంవత్సరం రాని పరిస్థితి ఉంది. మొదట్లో వర్షాభావ పరిస్థితుల వలన ఏర్పడిన కరువులు, అనంతరం వచ్చిన వరదలు(నీలంతుఫాన్) వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వశాఖలు వేసిన అంచనాలు తల్లక్రిందులవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారి పోవడానికి ప్రకృతిని కారణంగా చూపుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకొని, ప్రాథమిక వనరులు వినియోగాన్ని పెంచి ఉత్పత్తిని సాధించాలి. అందుకు ప్రభుత్వం తగు ప్రణాళికలు రూపొందించి ఫలితాలు సాధించాలి. కాని అందుకు భిన్నంగా రాష్ట్రప్రభుత్వం ఉత్పత్తి రంగం నుండి తప్పుకోవడం, ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుకూలంగా విధానాలు రూపొందించుకొని అమలు చేయడం ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. రాష్ట్రంలో నున్న వనరులను వినియోగించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యంచెందుతున్నది. దీనికిరాజకీయ అనిశ్చితి తోడైంది. అనిశ్చితిని తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు రాష్ట్ర, కేంద్ర పాలకవర్గాలు చేయడంలేదు.
ఆర్థిక స్థితి పెరుగుదలకు వ్యవసాయ ఉత్పత్తులు ప్రాథమికమైనవి. వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమలకు ముడిసరుకులుగా వినియోగించడంద్వారా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల ఉంటుంది. పారిమ్రిక ఉత్పత్తి ద్వారా సేవారంగం అభివృద్ధి అవుతుంది. ఈ మూడు రంగాలు పరస్పరం ఒకదానికొకటి ఆధారపడి అభివృద్ధిని సాధించాలి. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే గత మూడు సంవత్సరాలుగా ఉత్పత్తిలో పెరుగుదల లేదు. వ్యవసాయోత్పత్తి పెరుగుదల రేటు లక్ష్యం 4శాతంగా గత ఆరు సంవత్సరాలుగా నిర్ణయిస్తున్నారు. 2010`11 సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 203.14 లక్షల టన్నులు దిగుబడిరాగా,2011`12లో 182.52 లక్షల టన్నులకు తగ్గిపోయింది. 2012`13లో లక్ష్యం 218 లక్షల టన్నులుకాగా 155లక్షల టన్నులకు తగ్గిపోతున్నట్లు ప్రభుత్వం ముందస్తు అంచనాలు వేసింది. దాదాపు లక్ష్యంలో 25శాతం లోటు ఏర్పడిరది. కరువుల వల్ల, వరదల వల్ల సాగువిస్తీర్ణం తగ్గిందని వ్యవసాయశాఖ తెలుపుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా, గోదావరి జిల్లాలు 2,500 టిఎంసిల వరకు సముద్రంపాలయినాయి. రాష్ట్ర జలవిధానం రూపొందించి అందుకనుగుణంగా అమలు చేస్తే కరువులు, వరదల నష్టాన్ని 70శాతం వరకు తగ్గించవచ్చు. మనం వినియోగించని నీరు సముద్రంలోకి వెళుతుంది. అదే సందర్భంలో దిగువన లిప్టు పథకాలు అభివృద్ధిపరిచి ఆ నీటిని మైనర్ ఇరిగేషన్‌కు అనుసంధానం చేయడం ద్వారాను, ప్రస్తుతం ఉన్న లిప్టు పథకాల కింద పూర్తిస్థాయిలో సాగుచేయుట ద్వారాను భూగర్భ జలాల అభివృద్ధితోపాటు ఒక పంట పండే అవకాశం కల్గించవచ్చు. కాని జలవిధాన్ని రూపొందించే విధంగా రాష్ట్రప్రభుత్వ ఆలోచనా ధోరణి లేదు. సాధారణ వరిసాగు 40.29 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సగటు బియ్యం ఉత్పత్తి 130 లక్షల టన్నులు రావాలి. గత సంవత్సరం 129.51 లక్షల టన్నుల దిగుబడిరాగా, ఈ సంవత్సరం 110 లక్షల టన్నులకు తగ్గిపోతున్నది. పప్పుధాన్యాలు, నూనె గింజలు మరియు ముతకధాన్యల ఉత్పత్తి 50శాతానికిపైగా తగ్గింది.
పరిశ్రామిక ఉత్పత్తి గ్రోత్‌రేటు లక్ష్యం 10.50శాతం కాగా 5.4శాతానికి తగ్గినట్లు ముందస్తు అంచానాలు వేశారు. విద్యుత్ కోత వల్ల 6లక్షల పరిశ్రమలు ముతపడిపోయాయి. ఒక మెగావాట్‌కుపైన విద్యుత్ వినియోగించే పరిశ్రమలు సంవత్సరంలో 4,5 మాసాలు మాత్రమే పనిచేస్తున్నాయి. రోజులో 6,7గంటలు మాత్రమే సరఫరా చేయడం వలన ఉత్పత్తి నికరంగా జరుగుటలేదు. కార్మికులకు ఉద్వాసన చెప్పడం లేక పాక్షికంగా పనిచేయించడం జరుగుతున్నది. రానున్న రెండు మూడు సంవత్సరాల వరకు విద్యుత్ సమస్య పరిష్కారమయ్యే సూచనలు కానరావడంలేదు. భారీ పరిశ్రమల ఉత్పత్తి సగానికి సగం తగ్గింది.
సేవారంగంలో నిరుద్యోగ సంక్షోభం 12శాతానికి చేరినట్లు అంచనా వేస్తున్నారు. కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటించడమేతప్ప ఉన్న ఉద్యోగాలకు భద్రతలేదు. చాలా పరిశ్రమలు, ప్రాజెక్టులు మూత పడడంతో ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నారు. కొత్త పరిశ్రమలు రావడానికి ఉత్సాహం చూపడంలేదు. విద్యుత్ కొరత, రాజకీయ అనిశ్చితి పెట్టుబడులరాకకు ఆటంకాలుగా ఉన్నాయి. ఆవిధంగా ప్రజల కొనుగోలుశక్తి తగ్గిపోయింది. దారిద్య్రరేఖ పెరుగుదల కొనసాగుతున్నది. 2004`05లో రాష్ట్రప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువనున్నవారు 15.80శాతంగా ప్రకటించగా టెండూల్కర్‌కమిటీ 29.90శాతంగా ఉన్నట్లు తేల్చింది. అదేకాలంలో సక్సేనా కమిటీ 50శాతంగాను, అర్జున్‌సేన్‌గుప్తాకమిషన్ 77శాతం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు ప్రకటించారు. టెండూల్కర్‌కమిటీ సర్వేను ఆమోదించినా దాదాపు 30శాతం అనగా 1.26 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. కాని రాష్ట్రప్రభుత్వం 1.84 లక్షల తెల్లకార్డులు ఇచ్చింది. ఇదిగాక ఎఎవై, అన్నపూర్ణ, వికాలాంగులకు, హాస్టళ్ళకు చౌకబియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రతినెల రెండు లక్షల టన్నులు బిపిఎల్ వారికి, లక్షా 31వేల టన్నులు ఎపిఎల్‌వారికి కేంద్రం అందిస్తుండగా ఈ మొత్తాన్ని 3.32 లక్షల టన్నుల బియ్యాన్ని బిపిఎల్ వారికే ఇస్తున్నది. దారిద్య్రరేఖకు దిగువనున్నవారి సంఖ్య తగ్గితే చౌకబియ్యం సరఫరా తగ్గాలికదా? దారిద్య్ర నిర్మూలనకన్నా దరిద్రుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వమే చెప్పక చెబుతున్నది.
రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే కోతలు పెరుగుతన్నాయి. ప్రకటించిన బడ్జెట్ ఆదాయంరాకపోవడంతో సంక్షేమ పథకాలకు కోత విధిస్తున్నారు. 2009`10లో 23.20శాతం, 2010`11లో 12.52శాతం,2011`12లో 16శాతం బడ్జెట్‌లో కోత విధించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 10శాతానికి మించి కోతపడడం అనగా అభివృద్ధి పథకాలకు కోత పెడుతున్నారు. రాష్ట్రరుణభారం బడ్జెట్‌ను మించి పెరుగుతున్నది. ఈ సంవత్సరం బడ్జెట్ 1.45లక్షల కోట్లు కాగా రాష్ట్రరుణభారం 1.60 లక్షల కోట్లకు చేరుతుందని బడ్జెట్‌లెక్కలు చెబుతున్నాయి. 2010`11లో రుణభారం 1.22 లక్షల కోట్లుకాగా, 2012`13లో 40వేల కోట్లు పెరిగాయి. అదేసందర్భంలో ప్రజలపై పన్నులభారం పెరుగుతున్నది. రాష్ట్రపన్నులు 2010`11లో 56వేల కోట్లు కాగా 2012`13లో 80వేల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వీటికితోడు కేంద్రం నుండి వచ్చే పన్నులు ఈ సంవత్సరం 22వేల కోట్లకు చేరుకుంది. పన్నుల నుండి వచ్చిన ఆదాయం నుండే వడ్డీ చెల్లింపులు దినదినం పెరుగుతున్నాయి. 2010`11లో 9,675 కోట్లు చెల్లించగా, 2012`13లో 12,226కోట్లకు చెల్లింపుల పెరిగాయి. రాష్ట్రరెవెన్యూ ఆదాయంలో 10.47శాతం వడ్డీ చెల్లింపులకే పోతున్నది. రాష్ట్రప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మధ్యంపైన, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపైన, పరోక్షపన్నులపై కేంద్రీకరించింది. ఈ ఆదాయం పెంచుకునే మార్గాలు ప్రత్యక్షంగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు వేసేవే. కార్పోరేట్ సంస్థలు వేలకోట్ల పన్నులు ఎగనామం వేస్తూ వేయిశాతం వరకు లాభాలు సంపాదిస్తున్నా వాటి జోలికి ప్రభుత్వం వెల్లడంలేదు. అందువలన ఒకవైపున రాష్ట్రప్రజలపై భారాలు మరొకవైపున కార్పోరేట్లకు లాభాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ భారాలను పరిశీలిస్తే 2005 నుండి నేటి వరకు ఛార్జీల పెంపుదల మరియు ఫ్యూయెల్ సర్‌ఛార్జీ కలిపి 35 కోట్ల భారం వేశారు. ఇందులో 2013`14కు రాష్ట్రప్రభుత్వ సబ్సిడీ 5,300 కోట్లు తీసివేయగా వినియోగదారులపై 12,725 కోట్ల భారం వేయబోతున్నట్లు డిస్కాంలు ప్రతిపాదనలు పెట్టాయి. అయినా నాణ్యతగల విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ సంవత్సరం రాష్ట్రబడ్జెట్‌కు 10శాతానికిమిచి కోతపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి రాష్ట్రప్రభుత్వం తిరిగి పన్నులు వేసి ప్రజలపై భారాలు మోపడాన్ని వాయిదా వేస్తూ సాధారణ బడ్జెట్‌కు బదులు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి బయటపడాలని చూస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవడానికి ప్రాథమిక వనరుల వినియోగంపెరగాలి. వ్యవసాయంతోపాటు విద్యుత్, బొగ్గు, నీరు, రవాణా సౌకర్యాలకు ప్రాధాన్యాత ఇవ్వాలి. వీటిద్వారా జరుగు ఉప ఉత్పత్తులు రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుతాయి. రాష్ట్రస్థూల ఉత్పత్తిలో రుణాలు ప్రస్తుత ధరల ప్రకారం 20.65శాతంగా ఉంది. (2004`05 ధరల ప్రకారం 34.23శాతంగా ఉన్నాయి) మన రెవెన్యూ ఆదాయంలో `12శాతం వడ్డీచెల్లింపులకే పోతే ప్రణాళికా బడ్జెట్‌కు నిధులు ఎక్కడి నుండి వస్తాయి. 15 వేలకోట్లు కేటాయించిన సాగునీటి శాఖకు 10మాసాలలో 7వేల కోట్లు మాత్రమే వ్యయం చేశారు. రానున్న రెండు మాసాలలో 8వేల కోట్లు వ్యయం చేయడం సాధ్యమా? బడ్జెట్ ద్రవ్యలోటు పెరుగుతుండడంతో ప్రణాళికకు కేటాయించిన బడ్జెట్ లోటు ఏర్పడుతుంది. ఉత్పత్తి రంగానికి విఘాతం కలుగుతుంది. అందువలన ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను పున:సమిక్షించుకోవాలి. ప్రాథమిక, ద్వితీయ రంగాలైన వ్యవసాయ, పారిశ్రామికరంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యుత్ కొరత నివారణకు జెన్‌కో ద్వారా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. స్థానిక గ్యాస్ వనరులను వినియోగంలోకి తేవాలి. కార్పోరేట్ సంస్థలల్లోను, ప్రభుత్వరంగంలోను జరుగుతున్న అవినీతిని నియంత్రించాలి. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అందరికీ ఉపాది కల్పనకు మరియు ఆహారభద్రతకు గ్యారింటీ ఏర్పరచాలి. ఆ విధంగా ఆర్థిక విధానాన్ని సవరించుకోవాలి. రాష్ట్ర జలవిధానాన్ని రూపొందించాలి. కోటి ఎకరాలుగా ఉన్న పడావు భూమిని సాగులోకి తేవాలి. ఉత్పత్తి రంగంనుండి వలసలను నివారించాలి. గాలిబుడగ ప్రణాళికలు, ప్రకటనలను విరమించుకొని స్థిర అభివృద్ధికి వనరులనుబట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే రాష్ట్ర ఆర్థిక స్థితి ఊర్థ్వముఖంలోకి వెలుతుంది.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment