రాష్ట్ర వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు జనవరి 24న మొదటి విడత, 28వ తేదీన రెండవ విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభించబడిరది. జనవరి 31వ తేదీన మరియు ఫిబ్రవరి 4న ఎన్నికలు ముగుస్తాయి. కానీ ఎన్నికలను ఏకపక్షంగా తనకు అనుకూలంగా ఫలితాలు పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ఏహ్యకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని, రాజ్యాంగం 95 సవరణ తెచ్చారు. కానీ రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా ఎన్నికల నిర్వహణ అనేక లోపాలతో కొనసాగుతున్నది. 1985లో సింగిల్‌విండో విధానం వచ్చిన సందర్భంగా ప్రతి వ్యక్తిని పది రూపాయల వాటాధనంతో సభ్యులుగా చేర్చుకుని నాటి తెలుగుదేశం ప్రభుత్వం సహకరా వ్యవస్థపై తన పట్టును పెంచుకుంది. 2004 మే లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ వైద్యనాధన్ సిఫార్సుల మేరకు సహకార సంఘాలలో సంస్కరణ చేపట్టింది. ఆ సంఘ సిఫార్సుల ప్రకారం 1880 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అస్సలు నిఖర ఆదాయమే లేదు. కనీసం ఒక ఉద్యోగి వేతనాన్ని కూడా భరించగలిగే స్థితిలో లేదని తేల్చింది. పరపత వ్యవస్థ మనుగడ కోసం రు.4839 కోట్లు అవసరమని, దీన్ని కేంద్రం, రాష్ట్రం, సంఘాలు 74:11:15 నిష్పత్తిలో భరించాలని సూచించింది. దీనిలో భాగంగా 4610 సొసైటీలను 2949 సంఘాలకు కుదించారు. 10 రూపాయల వాటా ధనాన్ని 300 రూపాయలకు పెంచడం ద్వారా కోటి 48 లక్షల సభ్యత్వాన్ని 38 లక్షలకు కుదించారు. ఈ ప్రాతిపదికన 2949 సంఘాలకు ఎన్నికలు 2005లో నిర్వహించారు.
1995 నుండి 2004 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చాక పై వైద్యనాధన్ సిఫార్సులను అమలు చేసి, సంఘాలను, సభ్యత్వాలను కుదించి ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికైన సంఘాల గడువు 2010 అక్టోబర్ 20తో ముగిసింది. నాటి నుండి నేటి వరకు పాలక ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేస్తే వచ్చింది. చివరకు 2013 జనవరి 24న మొదటి విడుత సంఘాలకు ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని ప్రకటించింది. కానీ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగే విధంగా తనకు అనుకూల విధానాలను రూపొందించి పాలకవర్గం ఎన్నికలకు సమాయత్తమైంది. గత రెండు మాసాల్లో 38 లక్షలు గల సభ్యత్వాన్ని 55 లక్షలకు పెంచారు. కొంత మంది నాయకులు తామే స్వంతంగా సభ్యుల పేర డబ్బును చెల్లించి ఓటర్ల జాబితాను ప్రభావితం చేసారు. చనిపోయినవారి పేర్లు కూడా తొలగించకుండానే ఓటర్ల జాబితాను ప్రకటించారు. గతంలో వాయిదామీరిన భాకీదారుడు ఓటు వేసే అర్హతను ప్రస్తుత ఎన్నికల్లో తొలగించారు. సంఘం నుండి అప్పు పొందిన వ్యక్తికి సంఘానికి పాలకవర్గాన్ని ఎన్నుకునే హక్కు తృణీకరించబడిరది. మొదటి నుండి వాయిదామీరిన బాకీదారునికి పోటీ చేసే హక్కు నిషేదించబడడం సబబైన విషయమే. కానీ ఓటు వేసే హక్కును తృణీకరించడం, సభ్యుని ప్రాథమిక హక్కును రద్దుపరచినట్టయింది.
పాలకపక్షం తాను గెలవలేనని తెలిసినచోట కుంటిసాకులు చూపి అనేక సొసైటీల ఎన్నికలను నిలుపుదల చేస్తూ జీవోలు విడుదల చేస్తున్నాయి. మొదటివిడత లోనే 45 సొసైటీల ఎన్నికలను నిలిపివేసింది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. కొంత మంది సంఘాలను వేలం పద్దతిల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇది బహిరంగంగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వేలం పాటలలో పాల్గొన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సహకార ఎన్నికలను తొత్తడంగా మార్చి ఏకపక్షంగా కైవసం చేసుకోవడానికి పాలకపక్షం చట్టాలను, రాజ్యాంగాన్ని ఘోరంగా వుల్లంగిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి తన అనుయాయులు కోర్టులకు వెళ్లి స్టేలు తేవడం పరిపాటిగా జరుగుతున్నది. విచిత్రమైన విషయమేమిటంటే సహకారశాఖా మాత్యులు కూడా సొసైటీలపై స్టేలు విధించే అధికారం ఉండడమే ఆశ్యర్యాన్ని కల్గిస్తుంది. ఎన్నికల ద్వారా అధికారంలోకి రాలేమని భావించిన పాలకవర్గం ఇంత నగ్నంగా చట్టాలను తమకు అనుకూలంగా జీవోల రూపంలో మార్చుకోవడం కన్నా, వ్యవసాయ మార్కెట్ల మాదిగా నామినేట్ చేసినట్ చేసుకునే విధానం అనుసరించినట్లవుతున్నది.
ఒక్కో మండలానికి ఒకటి లేదా రెండు సొసైటీలు మాత్రమే ఉన్నాయి. ఓటర్లందరూ సొసైటీకి రావాలంటే 20నుండి 30 కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది.అనేక ప్రలోభాలకు ఒత్తిళ్లను తట్టుకుని వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యపడని వాతావరణం నెలకొన్నది. ఎక్కడికక్కడ రెవెన్యూ గ్రామాల్లో ఓటింగ్ జరపడం ద్వారా కొంతలో కొంత న్యాయం జరిగేది. సహకార సంఘాల ఎన్నికలను న్యాయ సమ్మత్తంగా జరపడానికి ప్రత్యేక ఎన్నికల కమిషన్ వేయాలి. వ్యవసాయ పరపతి సంఘాలే కాక, ఇతర వృత్తి, ఉద్యోగ, లేబర్, కాంట్రాక్ట్ సొసైటీలకు కూడా ఈ ఎన్నికల కమిషన్ నిర్వహించే విధానం రావాలి. ఎన్నికల కమిషన్‌కు స్వతంత్ర అధికారాలు ఉండాలి. ఎన్నికల్లో నేరాలకు పాల్పడినవారిని, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వేలంపాటలు వేసినవారిపై చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికలను న్యాయసమ్మతంగా నిర్వహించాలి.
25.01.2013

No comments:
Post a Comment