2012 సంవత్సరంలో దేశంలో మొత్తం 13754 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 2572 మంది(19శాతం) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1997 నుండి సంస్కరణలు అమలు జరుపుతున్న సంవత్సరమే ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2004`12 సంవత్సరాలలో యేటా సగటున 2376 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే నేడు ప్రభుత్వాలు సన్నచిన్నకారు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఒకవైపు చెబుతుండగానే మరో వైపు ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. సంస్కరణలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచకపోగా రైతులను సంక్షోభంలోకి నెట్టాయి. సన్నచిన్నకారు రైతులు వ్యవసాయ రంగం వదిలివేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల తగ్గుదల క్రమం
ప్రతి సంవత్సరం 1,36,875 మంది రైతులు దేశంలో వ్యవసాయ రంగం వదిలిపోతున్నారు. అనగా రోజుకు 375 మంది వ్యవసాయరంగాన్ని వదిలిపోతున్నారు.
ప్రధానంగా ఈ దిగువ సమస్యలు రైతులను సంక్షోభానికి గురి చేస్తున్నాయి.
1) భూ సమస్య ` కౌలుదారుల విస్తరణ ` భూసేకరణ ` ప్రభుత్వ విధానాలు
2) వ్యవసాయ ఉపకరణాలు ` విత్తన ప్రైవేటీకరణ ` ఎరువుల సబ్సిడీ కోత ` సాగునీరు వ్యాపారీకరణ ` వ్యవసాయ విస్తరణ కుదింపు ` ప్రైవేటు మార్కెట్ చట్టం
3) కనీస మద్దతు ధరల నిర్ణయం` తగ్గింపు
4) బడ్జెట్ తగ్గింపు
5) ఎగుమతి`దిగుమతులు
పై సమస్యల అమలులో కేంద్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు అనుకూలంగా పని చేస్తున్నాయి. వారికి అనుకూలంగానే భూ చట్టాలలో సవరణలు సూచిస్తూ చర్చనీయాంశం చేసింది.
2012 మార్చి 05న భారత వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రకటన ప్రకారం ‘‘పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్(పిపిపిఐఎడి)’’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని 10 లక్షల సన్న చిన్నకారు రైతులకు వర్తింపచేస్తూ 2012`17 కాలంలో అమలు చేయాలి. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10వేల మంది రైతులు ఉండాలి. ఈ ప్రాజెక్టు కాలం 3`5 సం॥ల వరకు ఉంటుంది. ప్రతి రైతుకు 1లక్ష రూపాయల వరకు పెట్టుబడి ఇస్తారు. ఇందులో భారత ప్రభుత్వం 50శాతం అనగా రు.50వేలకు మించకుండా పెట్టుబడి ఇస్తుంది. డ్రిప్, స్ప్రింక్లర్, యాంత్రీకరణ, గ్రేడిరగ్ లాంటి పథకాలను సబ్సిడీగా ఇస్తారు.
ఈ పథకాన్ని భారత ప్రభుత్వం వ్యవసాయం మరియు కార్పోరేషన్ మరియు ఫిక్కి(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆండ్ ఇండస్ట్రీ) సంస్థలతో జాంయిటుగా ఒప్పందం కుదుర్చుకొని ఈ పథకం అమలు చేస్తారు. జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ(ఎన్.ఎల్.ఎస్.సి) దీనికి ఛైర్‌మెన్‌గా సెక్రటరీ ఉంటాడు. 10 లక్షల మంది రైతులకు వినియోగపడడానికి వీలుగా 12వ ప్రణాళికలో రు.5వేల కోట్లు కేటాయిస్తారు.
ఇంత వరకు 17 రాష్ట్రాలలో 34 కంపెనీలు ఆ రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాలో ఐటిసి కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఈ పథకం ప్రకారం కంపెనీలు కోరిన కొన్ని పంటలనే రైతులు పండిరచాలి.
భూ సమస్య :
భూసంస్కరణల ద్వారా భూసీలింగ్ తగ్గించి పేదలకు భూపంపిణీ చేస్తామన్నారు. ఇది ఎన్నికల ప్రకటన తప్ప ఆచరణీయం కాదు.
దేశ జనాభాలో 60శాతం మందికి 5శాతం భూమి మాత్రమే ఉంది. 10శాతం మంది చేతిలో నేటికీ 55శాతం పైగా భూమి ఉంది.
భూ సంస్కరణలు అమలు జరిపినా పేదలకు భూములు రాలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఈ దిగువ ప్రతిపాదనను తెచ్చింది.
1) సాగునీటి భూములకు 5`10 ఎకరాలకు, సాగునీటి వసతిలేని భూములకు 10`15 ఎకరాల పరిమితి ఉండాలి.
2) తోటల పెంపకానికి మత, ట్రస్టీ, పరిశోధన, పారిశ్రామిక సంస్థలకు మినహాయింపులు ఉపసంహరించుకోవాలి. ఎట్టి పరిస్థితులలోను ఒక యూనిట్‌కు మించి భూపరిమితి ఉండరాదు. మిగులు భూముల వివరాలు రాష్ట్రాలు తయారు చేసి ప్రజల తనిఖీకి ఉంచాలి.
3) భూదాన భూములు, ప్రభుత్వ భూములు, మత సంస్థలకు చెందిన భూములు పేదలకు సాగుకు ఇవ్వాలి. వేలం వేసి అందుబాటులో ఉంచాలి.
పై కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడానికి ఏ రాష్ట్రప్రభుత్వమూ సుముఖంగా లేదు.
ప్రస్తుత పరిస్థితి :
ప్రస్తుతం ప్రభుత్వాలు పేదల నుండి బలవంతపు భూసేకరణలు చేస్తున్నాయి. వేలాది మందికి ఎలాంటి పరిహారం చెల్లించకుండానే భూములు తీసుకున్నారు. తమకు కావలసిన భూములన్నీ సేకరించిన తరువాత ఇప్పుడు 2013లో భూసేకరణ చట్టం తెచ్చారు. దీనవలన పేదలకు ఉపయోగంలేదు. ఇప్పటికే పేదలు భూములు కోల్పోయారు.
దేశంలో కౌలుదార్ల సంఖ్య విస్తరిస్తున్నది. కౌలుదార్ల రక్షణకు ఎలాంటి చట్టాలు లేవు. గతంలో వామపక్షప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయనిరాకరిస్తున్నాయి. పంట దిగుబడి ఎంత వస్తుందో అంత కౌలు రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అందువల్ల రుణగ్రస్తులైన కౌలుదారులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
2) వ్యవసాయ ఉపకరణాలు ` విత్తన ప్రైవేటీకరణ ` ఎరువుల సబ్సిడీ కోత ` సాగునీరు వ్యాపారీకరణ ` వ్యవసాయ విస్తరణ కుదింపు ` ప్రైవేటు మార్కెట్ చట్టం :
ముఖ్యంగా విత్తన రంగం 80శాతం ఇప్పటికే బహుళజాతి సంస్థల పరమైంది. టెక్నాలజీ అభివృద్ధిపరిచి కొత్త విత్తనాలను ఆవిష్కరించే ప్రయత్నాలను గత దశాబ్దకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకున్నాయి. బహుళజాతి సంస్థలకు అనుకూలంగా విత్తన చట్టాలు చేయడానికి ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు అనుకూలమైన విత్తన చట్టాలు లేకపోవడం వలన యేటా ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే 4`5 లక్షల ఎకరాల పంటలు కాత`పూత లేకుండా రైతులు నష్టపోతున్నారు. విత్తనాల ధరలు వెయ్యిశాతం వరకు పెంచారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు.
ఎరువుల ధరల విధానంలో ‘‘మూలకాల ఆధారిత సబ్సిడీ’’ పేర సబ్సిడీ కోత పెడుతున్నారు. 2009`10లో దేశంలో 78000 కోట్లు ఎరువుల సబ్సిడీ కేంద్రం చెల్లించగా 2013`14లో 64000 కోట్లకు తగ్గించారు. అదే సందర్భంలో ఎరువుల ధరలు 400శాతం పెంచారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు.
వ్యవసాయ రుణాలను తగ్గించారు. ఉపకరణాల ధరలు పెరుగుతున్న క్రమంలో వాటికి సరిపడా రుణలభ్యత లేదు.
సంవత్సరం టార్గెట్ సాధించినది
2009`10 325000 276656
2010`11 375000 355550
2011`12 475000 396158
2012`13 550000 420000
2013`14 700000
పెరుగుతున్న ధరలను బట్టి రుణ లభ్యత లేకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీలపై ఆధారపడుతున్నారు. ఆ విధంగా సంస్థాగత రుణాలకు రైతులు దూరమయ్యారు.
సాగునీటిని వ్యాపార సరుకుగా మార్చేశారు. మీటర్లు బిగించారు. సాగునీటి లభ్యత లేక రైతులు తమ స్వంత పెట్టుబడితో భూగర్భజలాల ద్వారా పంటలు పండిస్తున్నారు. పంపుసెట్ల కింద పండిస్తున్న రైతులు రుణాలు పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వ్యవసాయ విస్తరణను పూర్తిగా ప్రైవేటుపరం చేశారు. ఒక విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖను ఎత్తివేసే దశకు చేరుకున్నాయి.
ఎగుమతి`దిగుమతులు విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. 2012`13లో 8429 వేల టన్నులు వంటనూనెలను దిగుమతి చేసుకోవడం వలన నూనెగింజల పంటల ధరలు తగ్గాయి. అదేవిధంగా 3308వేల టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధర బాగా పెరిగినపుడు ఎగుమతులపై నిషేధం పెట్టారు.
కేంద్ర వ్యవసాయ బడ్జెట్ (ప్రణాళిక) ` అందులో వ్యవసాయ రంగం బడ్జెట్ శాతం
బడ్జెట్‌లో క్రమంగా నికర తగ్గింపు పెరిగింది.
3) కనీస మద్దతు ధరల నిర్ణయం` తగ్గింపు
మార్కెట్లను ప్రైవేటీకరిస్తూ కేంద్రం సూచనల మేరకు రాష్ట్రాలు సవరణలు చేశాయి. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలు జరపాలన్న నిబందనకు నీళ్ళువదిలారు. అతితక్కువగా ప్రకటించిన కేంద్ర మద్దతు ధరలు కూడా లభ్యంకాని పరిస్థితి ఏర్పడిరది. కనీస మద్దతు ధరల నిర్ణయంలో అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. కాంప్రహెన్సివ్ పథకం కింద చేసిన సర్వేలో పత్తిహెక్టారుకు 17.83 క్వింటాళ్ళు రాగా క్రాప్ కటింగ్ ప్రయోగంలో 4.3 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ రెండు సర్వేలలో కాంప్రహెన్సివ్ సర్వేలను తీసుకోవడం ఫలితంగా 410.10 శాతం ధరలు తగ్గాయి.
కేంద్ర ధరల నిర్ణాయక సంస్థ నివేదిక ప్రకారం రైతులకు ఎంత గిట్టుబాటుగా ఉన్నది తెలుసుకోవచ్చు. హెక్టారుకు పెట్టుబడి, వ్యయం, ఆదాయం రూపాయలలో ఇలా ఉంది.

మంచి రుతువులు వచ్చినప్పుడు పంటలు బాగా పండినప్పుడు ఈ ఆదాయం వస్తుంది. కానీ యేటా ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటల దిగుబడి తగ్గి రైతులు దివాళా తీస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు ` ప్రభుత్వ సహకారం.
కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలో 3290 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణంలో 400 లక్షల హెక్టార్లకు వరద తాకిడికి గురవుతున్నాయి. సగటున 75లక్షల హెక్టార్లు పంటలు పూర్తిగా నష్టపోతున్నాయి. యేటా 16 వేల మంది చనిపోతున్నారు. కరువుల వల్ల మరో 500 లక్షల హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ విధంగా దాదాపు మూడోవంతు భూమి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. 1954 నుండి 2004 వరకు 20 కమీషన్లు ప్రకృతివైపరిత్యావల నివారణకు నివేదికలిచ్చాయి. ఆ సూచనల్లో ఏఒక్కటీ పాటించలేదు. ఫలితంగా నేటికీ ప్రకృతి వైపరిత్యాల బారిన యేటా లక్షల కోట్ల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి జరిగిన నష్టంలో 5శాతం కూడాలేదు. ప్రధానంగా ప్రకృతివైపరిత్యాలు జరిగిన ప్రాంతాలలో ఆత్మహత్యలు ఎక్కువగా సాగుతున్నాయి.
వరదల పాలవుతున్నాయి. ఇన్‌ఫుట్ సబ్సిడీ ` భీమా పరిహారం అందడం లేదు.
1) 05`8 డిసెంబర్ 2012 నీలం 3,38,000 ఎకరాలు
2) 2012 ఖరీఫ్ కరువు 234 మండలాలు 1198 కోట్ల రూపాయల నష్టం
3) 15`18 ఫిబ్రవరి 2013 అధిక వర్షాలు 5,33,814 ఎకరాలు
4) 15`20 జూలై 2013 అధిక వర్షాలు 2,20,921 ఎకరాలు
5) 2013 ఖరీఫ్ కరువు291 మండలాలు 2,000 కోట్లు రూపాయల నష్టం
6) 9`13 అక్టోబర్ 2013 ఫైలిన్ తూఫాన్ 17,774 ఎకరాలు
7) 22`26 అక్టోబర్ 2013 అధికవర్షాలు 10,85,132 ఎకరాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి 12 నవంబర్ 2013న 40లక్షల ఎకరాల్లో రు.6500 కోట్ల పంటలు నష్టపోయినట్లు ప్రకటించారు. కేంద్రం వేయి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు. కానీ ఇంత వరకు పూర్తి పరిహారం రైతాంగానికి చెల్లించలేదు.
అందుకే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ వ్యవసాయ విధానాలను సంస్కరించాలి. సంస్కరణల పేరుతో రైతులను భూముల నుండి వెళ్ళగొట్టడం లేదా ఆత్మహత్యలకు పాల్పడేవిధంగా పరిస్థితులను సృష్టించడం చేస్తున్న ప్రభుత్వాలు కార్పోరేట్ అనుకూల విధానాలను పూర్తిగా మార్చాలి. సన్న,చిన్నకారు రైతులకు వ్యవసాయంపై ఆదాయం పెరిగే విధంగా చూడాలి. వ్యవసాయోపకరణాల ధరలకు, పంటల ధరలకు మధ్య సమతూకం ఉండాలి. రైతుల కుటుంబ శ్రమకు తగిన ప్రతిఫలం అందేవిధంగా ధరలు నిర్ణయించాలి. వ్యవసాయోపకరణాలను పూర్తి సబ్సిడీపై రైతులకు అందజేసినప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గుముఖంలో ఉంటాయి. ఒకవైపున ఉపకరణాల ధరలు పెంచుతూ మరోవైపున పంటలు ధరలు తగ్గిస్తూ రైతులకు హాని కల్గించే విధానాలను విడనాడాలి.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment