Wednesday, 13 August 2014

సౌర తాపానికి ధనిక దేశాలదే బాధ్యత

    ‘‘బస్సులో ప్రయానిస్తూ కరీంనగర్‌ జిల్లా సారంపల్లి గ్రామానికి చెందిన బాదం రాజు (22) వడగాలులతో మృతి’’, ‘‘నెల్లూరు జిల్లా కావలిలో ఎండ తీవ్రతకు రిక్షాలోని రిక్షా కార్మికుడు మృతి’’, ఈ విధంగా 25మే 2013 ఒక్కరోజులోనే 544 మంది మృత్యువాత పడ్డట్టు వార్తలు తెలుపుతున్నాయి. ఇంతకు ముందు రోజు 293 మంది మృతిచెందారు. ఈ సంఖ్యను అధికారులు ధృవీకరించినా, ధృవీకరించకపోయినా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే వుంటుంది. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా 48,49 డిగ్రీల వేడి ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది ఇంతకన్నా ఎక్కువగానే 51 డిగ్రీల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్కువచేసి చూపడం అన్నిరంగాలలో అనవాయితీగా వస్తున్నది. నష్టాలను ఉన్నదున్నట్టు చూపినచో ప్రభుత్వ సమర్థతపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని, నష్టాలను తక్కువచేసి చూపటం, ఆదాయాన్ని ఎక్కువచేసి చూపడంలో ప్రభుత్వ గణాంకాలు అందెవేసిన చేయిగా ఉన్నాయి.
      గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. 1993లో లాతూర్‌ భూకంపం, 1999లో ఒరిస్సా సూపర్‌ సైక్లోన్‌, 2001లో గుజరాత్‌ భూకంపం వంటివన్నీ ఆయా రాష్ట్రాలకు పరిమితమైనాయి. 2005 డిశెంబర్‌ 26న సుమత్ర తీరంలో ఏర్పడిన సునామీ వలన ఇండోనేషియా, శ్రీలంక, మల్దీవులు, థాయిలాండ్‌లతో పాటు భారతదేశంలో మూడు లక్షల మందికిపైగా ప్రజలు మరణించారు. వారిలో 12,405 మంది భారత్‌లోనే మరణించారు. భారత్‌ నష్టం రూ.11,544.91 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంభవిస్తున్న ఉగ్రతాపం వల్ల ప్రజలకేగాక పశువులు, పక్షులు ఒకటేమిటి, మొత్తం ప్రాణకోటి ఉనికికి ప్రమాదం ఏర్పడిరది.
    సాధారణ వేడికన్నా ప్రపంచ స్థాయిలో అధనంగా 2డిగ్రీలు అనుమతివ్వవచ్చని జపాన్‌లోని ‘‘క్యోటో’’ తీర్మానంలో అన్ని దేశాలు అంగీకారానికి వచ్చాయి. తాము విడుదల చేస్తున్న కాలుష్యాన్ని తగ్గించుకొని భూవాతావరణ సమతుల్యతను కాపాడటానికి కృషి చేస్తామని అన్నారు. కానీ నేడు పారిశ్రామికంగా అభివృద్ధిచెందిన దేశాలు విడుదలచేస్తున్న 80శాతం కర్బన ఉద్గారాలవలన ప్రకృతిలో అనేక మార్పులు వస్తున్నాయి. ఋతువుల క్రమంలో మార్పులే కాక, బౌగోళిక, సముద్ర నియమంలో మార్పులు సంచరించాయి. మొట్టమొదటిసారి 1992 రియోడిజెనరీలో ‘ధరిత్రి’ సదస్సు జరిగింది. ఆ తరువాత 2007లో బంలి ద్వీపంలోను, 2009 డిశెంబర్‌లో కోపెన్‌ హేగెన్‌లో ఈ అంశంపై ప్రపంచ దేశాల సమావేశాలు జరిగాయి. అమెరికా, ధనిక దేశాలు తమ ఉద్గారాల విడుదలను 17శాతం 2025 నాటికి తగ్గించుకుంటామని ప్రకటించాయి. కానీ నేటికి 3శాతం కూడా తగ్గించలేదు. పైగా అభివృద్ది చెందితున్న దేశాలలో తమ పరిశ్రమలను ధనిక దేశాలు ఏర్పాటు చేసి ఉద్గారాలను పెద్దఎత్తన విడుదల చేస్తున్నారు. అదే సందర్భంలో వెనుకబడిన దేశాలపై ఒత్తిడి తెచ్చి వారి పరిశ్రమలను మూయించటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ కర్బన ఉద్గారాల విడుదల తగ్గించుకోడానికి సుముఖంగా లేరు. వాతావరణంలో వికృత మార్పులకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2020 కల్లా 25నుండి 40 శాతం తగ్గించుకోవాలని ఐరాస, వాతావరణంలోని ప్యానల్‌ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ముసాయిదా పైన అలాగే క్యోటో ప్రోటోకాల్‌ సమస్యలపైన, సంపన్న దేశాలకు వర్థమాన దేశాలకు మధ్య వైరిధ్యం పెరిగింది. కోపెన్‌హగెన్‌ సమావేశంలో భారత్‌, చైనా, బ్రెజిల్‌తో సహా 77 దేశాలు, ఇతర బడుగు దేశాలు సమావేశంనుండి బయటకు వచ్చాయి. ఒకరోజంతా సమావేశం స్థంబించింది.
    క్యోటో ప్రోటోకాల్‌ కాలపరిమితి 2012 వరకు ముందే ఆ ఒప్పందాన్ని సమాది చేసేందుకు అమెరికా మన్నించింది. 1990 సంత్సర ప్రాతిపదికగా 5 శాతం కాలుష్యాన్ని తగ్గించాలన్న లక్ష్యాన్ని దనిక దేశాలు బాహాటంగానే ఉల్లంఘించాయి. ` ఈ కాలుష్యాన్ని తగ్గించకపోగా మరో 10 శాతం కాలుష్యం విడుదలను పెంచాయి. ఆవి వెలువరించే కాలుష్యం మూలకంగా జరుగుతున్న నష్టాలకు తగుపరిహారం చెల్లించేలా ఆదేశాలను ఒప్పించాలని వర్దమాన దేశాలు కోరుతున్నాయి. దనిక దేశాలు విడుదల చేస్తున్న కాలుష్యం ఉద్గారాలను తగ్గించడానికి వర్ధమాన దేశాలలో అడవులు పెంచటానికి ఐక్యరాజ్య సమితి ద్వారా ‘కార్బన్‌ఋణాలు’ ఇస్తామని ప్రచారంచేసారు. ` ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు పరిచే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు ‘‘ఆంద్రప్రదేశ్‌ నీరు, చెట్టు, భూమి సంరక్షణా చట్టం 2002లో ప్రపోజల్‌ చేయగా, 2006లో యాక్ట్‌’’ అయ్యింది. ఈ చట్ట ప్రకారం ప్రతిరైతు తనభూమిలో 5వ వంతులో చెట్లు నాటాలి. అడవులు పెంచాలి. భూగర్బ జల దోపిడి జరుగకుండా బావి, బావి మద్య 250 మీటర్ల దూరం ఉండాలి. చెరువులలో తట్టు ఆక్రమణలు పరిశీలించాలి.
    అదే విధంగా వర్థమాన దేశాలను తమ కర్బన ఉద్గారాలను విడుదలకు బలిపశువులుగా దనిక దేశాలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌, చైనా దేశాలే ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని ధనిక దేశాలు మరో ఆరోపణ చేసాయి. ` భారత్‌లో సాగుభూమి 1420 లక్షల హెక్టార్లుండగా, అడవులు 698 లక్షల హెక్టార్లున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం 120 లక్షల హెక్టార్లు కాగా అడవులు 62 లక్షల హెక్టార్లున్నాయి. ఫారెస్టుగా గుర్తిపంపు  ఉన్నా అందులో చెట్లను తొలగించిబీళ్ళుగా మార్చిన ఘనత మన పాలకవర్గాలదే.  చైనా విషయానికి వస్తే సాగుభూమి 1220 లక్షల హెక్టార్లు కాగా అడవులు 195 లక్షల హెక్టార్లున్నాయి. ` ప్రపంచ అడవులలో 20.36 శాతం చైనాలో అడవులున్నాయి. 4,000 ప్రభుత్వేతర సంస్థలు పర్యావరణ పరిరక్షణలో పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. ధనిక దేశాలలు, వర్తమాన దేశాలలో అడవుల నరికివేత, పరిశ్రమల స్థాపన మరి కాలుష్యం విడుదల చేసే పరిశ్రమల స్థాపన  పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు.
    ఇంతవరకు అమెరికా క్యోటోప్రోటోకాల్‌పై సంతకం చేయ నిరాకరిస్తున్నది. ధరిత్రి సమావేశం నుండి  కోపన్‌హేశన్‌ సదస్సు వరకు దనిక దేశాలు ` మెజార్టీ దేశాలు ఆమోదించిన ` పర్యావరణ పరిరక్షణ తీర్మానాలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఉష్ణోగ్రత పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతున్నది. ప్రాణి శరీరంలో ఉండాల్సిన నీరు ఆధిక భాగం చమట ద్వారా ఆవిరైపోతుంది. శరీరంలో ఉండాల్సిన నీరు తగ్గిపోవడంతో ప్రాణాలు విడుస్తున్నారు. వడదెబ్బ తగిలిన తర్వాతా నీరు తాగినా ఫలితంవుండదు. గ్లోబల్‌ (ప్రపంచం) విషయానికోస్తే భూగోళంపై ఆవరించియున్న ఓజోన్‌ పొర ఆవిరైన ప్రాంతంనుండి ప్రసరించే సూర్యుని నీలలోహిత కిరణాలు ప్రాణికోటిని చంపివేస్తాయి. ఆకిరణాల వేడిని తట్టుకోవడం ఏప్రాణికి సాధ్యంకాదు. సూర్యునిలో నిరంతరం అంతర్ఘతంగా జరుగుతున్న ఘర్షన వలన అత్యంత వేడి బయటకి ప్రసరిస్తుంది. గతంలో ఉన్న సరిసృపాల జాతులు ఆవిధంగానే అంతరించాయి. తర్వాత ప్రకృతిలో వచ్చిన మార్పుల ఫలితంగా అడవులు పెరుగుటవలన భూవాతావరణంపై ఓజోన్‌ పోర ఏర్పడినాక ప్రాణికోటి తిరిగి ఉద్భవించింది. కోట్ల సంవత్సరాల తర్వాత ఆవిధంగా ఏర్పడిన ప్రకృతిని ధనిక దేశాలలోని బహులజాతి సంస్థలు తమ స్వార్థపూరిత లాభాలకు కాలుష్య సహిత పరిశ్రమల స్థాపన ద్వారానూ ` అపరిమిత విద్యుత్‌ వినియోగం ద్వారానూ నాశనం చేస్తున్నారు.
     బొగ్గుగనుల తవ్వకాలలో వచ్చిన మార్పును కూడా గ్లొబల్‌ వార్మింగ్‌కు ఉపయోగపడుతున్నాయి. గతంలో సొరంగ మార్గంద్వారా భూగర్భంలోనుండి బొగ్గును వెలికి తీసి ఆప్రదేశంలో ఇసుక నింపేవారు. నేడు ఒపెన్‌ కాస్ట్‌ విధానంవలన భావినుండి నేరుగా లారీల ద్వారా పైకి తెస్తారు. ఒపెన్‌ కాస్ట్‌కొరకు తీసిన మట్టిని గుట్టలుగా పోస్తారు. ఇది పర్యావరణంపై తీవ్ర వేడి ప్రభావం చూపుతుంది. దీనికి తోడు మైనర్‌ ఇరిగేషన్‌ (చెరువు కుంటలు) నిర్మూలన వలన భూగర్భ జలాలు ఇంకి పోతూ భూమిపై వేడిని పెంచుతున్నాయి. అడవుల నరికివేత సరేసరి! చివరకు పెట్రోల్‌, డీజిల్‌ ఇతర పారిశ్రామిక కాలుష్యం విడుదల వలన సముద్రాలు కాలుష్యానికి గురౌతున్నాయి. తద్వారా సముద్రంపై ప్రసరించే గాలుల్లో మార్పులస్తున్నాయి. సముద్ర జీవరాశులు నాశనమవుతున్నాయి.
    ఒకజీవి మరొకజీవిపై ఆధారపడి బ్రతుకుతున్నాయి. ప్రకృతి సమతుల్యత రక్షించబడాలంటే అన్ని జీవజాతుల మధ్య సమతుల్యత ఉండాలి. కొన్నిజాతులను నశింప చేయటంవలన (బహులజాతి సంస్థల లాభాలకోసం) ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. ఈ మధ్య భూగోళ నాశనం గురించిన ప్రచారంతోపాటు సినిమాలు కూడా వస్తున్నాయి. అయినా బహుళజాతి కంపెనీల దృక్పదంలో మార్పురాలేదు. సూర్య తాపం పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలి అప్పుడే ధరిత్రిపై ప్రాణికోటి మనగలుగుతుంది.
సారంపల్లి మల్లారెడ్డి
తేది. 27.05.2013

No comments:

Post a Comment