2011 ఏప్రిల్ ` మే నెలల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వామపక్ష పాలిత రాష్ట్రాలైన బెంగాల్, కేరళలలో లెఫ్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్‌లో 34 సంవత్సరాల లెఫ్ట్‌ఫ్రంట్‌ను తృణమూల్ కూటమి ఓడిరచింది. 2006లో 233 స్థానాలు పొందిన లెఫ్ట్‌ఫ్రంట్‌కు 2011లో 41 శాతం ఓట్లతో 63 స్థానాలు పొందింది. 54 స్థానాలున్న తృణమూల్ నేడు 49% ఓట్లతో 225 స్థానాలు సాధించింది.మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. కేరళలో ఎల్‌డిఎఫ్ తృటిలో అధికారం కోల్పోయింది. యుడిఎఫ్‌కు 72, ఎల్‌డిఎఫ్‌కు 68 వచ్చాయి. ఉమెన్‌చాందీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తమిళనాడులో అన్నాడియంకె కూటమి 202 సీట్లతో విజయం సాధిస్తే డియంకెకు 32 స్థానాలు లభించాయి. జయలలిత ముఖ్యమంత్రి పదవినలంకరించారు. అసోంలో 78 స్థానాలు కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంది. తరుణ్ గోగాయ్ మరల సియం అయ్యారు. పుదుచ్చేరిలో అన్నాడియంకె కూటమి విజయం సాధించింది. తమిళనాడులో సిపియంకు 10 స్థానాలు, సిపిఐకి 9 స్థానాలు వచ్చాయి.
ఈ ఎన్నికలలో అసోం మినహా మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రేస్‌కు పెద్దగా లాభించింది లేదు. కాంగ్రేస్ విచ్చిన్న వాదులతోనూ, మావోయిస్టులతోనూ కలిసి కేరళ, బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వాలను గద్దెదించడానికి గత మూడు సంవత్సరాలుగా ఉద్యామాలు చేసింది. అసోంలో ఉల్ఫా ఉగ్రవాదులతో సైతం చేతులు కలిపింది. అయినప్పటికీ ఐదు రాష్ట్రాలలో విజయసాధనలో కాంగ్రేసు విఫలమైంది. ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
తృణమూల్ కూటమికి 48.54 శాతం ఓట్లు రాగ వామపక్ష కూటమికి 41.12 శాతం ఓట్లు పోలయ్యాయి. 7.42 శాతం ఓట్ల ఆధిక్యతతో తృణమూల్ కూటమి 227 స్థానాలు పొందింది. వామపక్ష కూటమికి 2009 లోక్ సభ ఎన్నికలన్నా 11 లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి. మొత్తం 1.95 ఓట్లు వచ్చాయి. తృణమూల్ కూటమికి లోక్‌సభ ఎన్నికలకన్నా 35 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. వామపక్షాన్ని ఓడిరచేందుకు కాంగ్రేస్ పాలకవర్గాలు, సామ్రాజ్యవాదులు, విచ్చిన్నవాదులు కలిసికట్టుగా కృషి చేశారు.వామపక్ష ఉద్యమానికి బలమైన కేంద్రమైన పశ్చిమ బెంగాల్‌లో తమ పాలనను ప్రతిష్టించుకోవడానికి అన్ని అక్రమ మార్గాలు అనుసరించారు. సిపిఎం పార్టీకి 2001 శాసన సభ ఎన్నికలలో 143 స్థానాలు, 2006 లో 176 స్థానాలు లభించాయి. ప్రస్తుతం 40 స్థానాలకు పరిమితమైంది.
తృణమూల్ కూటమి ‘‘ మార్పు’’ జరగాలన్న ప్రచారాన్ని విస్తృతంగా చేశారు.1977 తర్వాత వచ్చిన తరానికి అంతకు ముందు చేసిన పోరాటాలను, కాంగ్రేస్ ప్రభుత్వం వామపక్షాలపై సాగించిన దమనకాండ గురించిన ప్రచారం జరగలేదు.
ప్రధానంగా గత మూడు సంవత్సరాలుగా కాంగ్రేసు ` తృణమూల్ కాంగ్రేస్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వామపక్ష పార్టీలు వైఫల్యం చెందాయి. గత లోక్ సభ ఎన్నికల్లో లోపాలను సమీక్షించినప్పటికీ వాటిని సరిదిద్దడంలో వేగవంతం చేయలేదు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పై భారం వేశారు. చౌకడిపోల నిర్వాహాణ, గ్రామీణ విద్యుదీకరణ, విద్యా,ఆరోగ్యం సంక్షేమ చర్యల అమలులో జరిగిన అలసత్వం వలన ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సింగూరు, నందీగ్రాం భూసేకరణ పై తృణమూల్ కూటమి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేక పోయారు. భూములు పంచిన ప్రభుత్వమే తిరిగి భూములను లాక్కుంటుందని చేసిన ప్రచారాన్ని అక్కడి ప్రజలు నమ్మడం వలన ఆందోళనలు సాగాయి. నందీగ్రాంలో జరిగిన కాల్పులతో మేధావులు, మధ్యతరగతి వర్గాలు అసంతృప్తి చెందాయి. కార్మికులు, గ్రామీణ పట్టణ పేదల మద్దత్తు తగ్గింది. వారి వర్గ సమస్యలు సకాలంలో వాయపక్షాలు చేపట్టలేక పోయాయి. దీనికి తోడు కార్పోరేటు మీడియా వామపక్ష ప్రభుత్వం పై పెద్దఎత్తున గత మూడు సంవత్సరాలుగా దుష్ప్రచారం సాగించింది. పెద్దఎత్తున డబ్బును ఎన్నికల్లో పంపిణీ చేశారు.
ఎన్నికల అనంతరం సిపిఎం పార్టీపై పెద్దఎత్తున దాడులు, హత్యాకాండ సాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రేస్ ,మావోయిస్టులు,కాంగ్రేస్ పార్టీ ఐక్యంగా ఈదాడులు నిర్వహిస్తున్నారు. మే 13 తర్వాత 20 రోజుల్లో 12 మంది సిపిఎం నాయకులను హత్య చేశారు. 425 మంది గాయాలకు గురయ్యారు. 412 పార్టీ కార్యాలయాలు ధ్వసానికి ,లూటీకి గురయ్యాయి. ఐదింటిని తగులబెట్టారు. 65 ట్రేడ్‌యూనియన్ కార్యాలయాలు దాడులకు గురయ్యాయి. 445 పార్టీ, ప్రజాసంఘాల కార్యాలయాలపై బలవంతంగా తృణమూల్, కాంగ్రేస్ పథాకాలను ఎగురవేశారు. 7,351 మందిని ఇళ్ళనుండి తరిమి వేశారు. తిరిగి 1972 నాటి అర్థపాశిస్టు విధానాన్ని పాలక తృణమూల్` కాంగ్రేస్ కొనసాగిస్తున్నాయి. అధికారినికి వచ్చిన ఈ వర్గం గత వామపక్ష ప్రభుత్వం ఎలాంటి ఆరోపణలు చేయలేక పోతున్నది. పశ్చిమ బెంగాల్లో పారిశ్రామిక అభివృద్ది జరగలేదని వామపక్ష ప్రభుత్వంపై తృణమూల్ అనేక ఆరోపణలు చేసింది. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2010లో మధ్య, చిన్న స్థాయి పరిశ్రమలకు 27,926 కోట్లు రుణాలు మంజూరు చేసి దేశంలో 4 వ స్థానంలో నిలిచింది. 22,515 కోట్ల రుణాలతో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. రాష్ట్రాన్ని వ్యవసాయంగంలో దేశంలోనే వామపక్ష ప్రభుత్వం అగ్రగామిగా నిలిపింది. వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1977లో రాష్ట్ర ఆహారధాన్యాల ఉత్పత్తి 70 లక్షల టన్నులు కాగా, 2010 నాటికి దేశంలోనే ప్రథమ స్థానం సాధించి 170 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2.75 కోట్ల ఎకరాల సాగు భూమిలో 140`150లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా పశ్చిమబెంగాల్‌లో 1.40 కోట్ల ఎకరాలలో 170 లక్షల టన్నులు ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది కల్పించడానికి చేస్తున్న కృషికి నేటి పాలక వర్గాలు తీవ్రంగా అడ్డుపడ్డాయి. సింగూరు కార్ల ఫ్యాక్టరీ తరలిపోయే వరకు ఉద్యమాలు చేశారు. ప్రజాస్వామ్య యుతంగా పరిపాలన సాగించాలన్న వామపక్ష ప్రభుత్వం విధానాలకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రారిశ్రామిక ప్రగతికి అడ్డుపడిరది. అయినప్పటికీ అదనపు పెట్టుబడులను ఆహ్వానించి ప్రజల ఉపాధికల్పనకు వామపక్ష ప్రభుత్వం కృషి చేసింది. రాష్ట్రాన్ని విచ్చిన్నం కాకుండా సమైక్యంగా ఉంచడానికి గూర్ఖా హిల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి ప్రాంతీయ కమిటీ ద్వారా అభివృద్దికి బాటలు వేసింది. నాడు వేసిన హిల్ కౌన్సిల్ ప్రతిపాదననే నేడు తృణమూల్ కాంగ్రేస్ కేంద్రప్రభుత్వం చేత అధికారిక ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆ విధంగా వామపక్ష సూచనలను తమ సూచనలుగా ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలోనే వామపక్ష ప్రభుత్వాలను గద్దెదించి తమ మెగా అవినీతికి ఆస్కారం కల్పించుకుంటున్నారు. 20 సంవత్సరాల క్రితం పురూలియాలో హెలికాప్టర్ నుండి ఆయుధాల చేరవేతపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఉద్ధేశ్య పూర్వకంగానే నిర్లక్ష్యం చేసింది. అలాంటి ప్రభుత్వం నేడు ఆయుధాల సోదాపేరుతో సిపిఎం కార్యాలయాలపై దాడులు సాగిస్తున్నారు. ఈ దాడులను, నిర్భందాలను వామపక్షాలు ధైర్యంగా ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాపితంగా ఈ దాడులకు వ్యతిరేకంగా జూలై 1 నుండి 8 వరకు నిరసనలు, సభలు, సమావేశాలు జరిపి సంఫీుభావాన్ని కూడగట్టాలని కార్యక్రమం అమలు జరపుతున్నారు
వామపక్ష కూటమి కన్నా కాంగ్రేస్ కూటమికి 0.89 శాతం ఓట్లు అనగా 1.55 లక్షల ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. నువ్యావ,నేనా అన్నట్లు జరిగిన పోటీలో ఎన్నికలు జరిగాయి. 2001లో 23 స్థానాలు సాధించిన సిపిఐ(ఎం) 61 స్థానాలు సాధించి అధికారానికి వచ్చింది.ఐదేళ్ళకొక సారి ప్రభుత్వం మారే విధానాన్ని రూపుమాపడానికి వామపక్ష ప్రభుత్వం మరింత ఐక్యతగా ప్రజల వద్దకు వెళ్ళడానికి కృషి చేసింది. నియోజక వర్గాల విభజనలో జరిగిన మార్పుల ఫలితం ఈ ఎన్నికలను ప్రభావితం చేసింది. ఎల్‌డిఎఫ్‌కు ప్లాంటేషన్, మత్య్స,కొబ్బరిపీచు, జీడిపిక్కల కార్మికులు పెద్దసంఖ్యలో ఓట్లు వేశారు. ఈ ఎన్నికలలో విద్యారంగంలో ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా కొన్ని క్రస్తవ సెక్షన్లు వ్యతిరేకంగా పనిచేశాయి. విద్యార్థుల పై ఆర్థికభారాన్ని తగ్గించడంలో ఎల్‌డిఎఫ్ చేసిన కృషిని ప్రజలు ఆహ్వానించారు. ప్రస్తుత అధికార యుడిఎఫ్‌లో కుంభకోణాలకు బాధ్యులైన వారు ఉన్నారు. ఒక యుడిఎఫ్ మాజీ మంత్రికి సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. మరొక మంత్రి ఐస్‌క్రీంపార్లర్ సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉందన్న కేసు కొనసాగుతున్నది. గత వామపక్ష ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి రు.2కే కిలో బియ్యం, పెన్షన్ల పెంపుదల, మూసివేసిన ప్లాంటేషన్లను తెరవడం, మత్య్సకారులకు సంక్షేమ చర్యలు చేపట్టడం, ప్రభుత్వరంగ సంస్థలను లాభసాటిగా తీర్చిదిద్దడంలో ప్రజల మద్దత్తును సంపాదించింది.యుడిఎఫ్ పాలన కత్తిమీద సాము లాంటిది. బలమైన ప్రతిపక్షంగా వామపక్షాలు ఉన్నాయి.
ఎఐఎడిఎంకె( ఆలిండియా అన్నాడిఎంకె) కూటమి 51.81 శాతం ఓట్లు గెలుచుకోగా, డిఎంకె(ద్రవిడ మున్నెట్ర కజగం) 39.43 శాతం ఓట్లు సాధించింది. అధికారంలో ఉన్న డిఎంకె గోరంగా ఓడిపోయింది. అన్నాడిఎంకెకు 12.4 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డిఎంకె అనేక అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయింది. డిఎంకెకు చెందిన కేంద్ర టెలికాం మంత్రి ఎ. రాజా, కలైంజర్ టివి. బాధ్యురాలైన కనిమొళి జైలులో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిది బంధువైన మారన్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి కరుణానిది కుటుంబం రాష్ట్రంలో అనేక కుంభకోణాలలో కూరుకు పోయింది. కుటుంబ`వ్యాపార సంబంధాలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యకలాపాలను దిగజార్చాయి. ధరల పెరుగుదల, విద్యుత్తుకోతతో పాటు అణచివేత కార్యక్రమాలు పెద్దఎత్తున సాగించింది. 2001లో 132 స్థాలు పొందిన అన్నాడిఎంకె 2006లో 61 స్థానాలకు పరిమితమైంది. 2011 ఎన్నికల్లో 150 స్థానాలు గెలుచుకుంది. డిఎంకె 2001లో 31 స్థానాలు,కాంగ్రేస్ 7 స్థాలు గెలుచుకోగా, 2006 లో డిఎంకె 96 స్థానాలు, కాంగ్రేస్ 36 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చాయి. 2011 ఎన్నికల్లో డిఎంకెకు 23 స్థానాలు, కాంగ్రేస్‌కు 5 స్థానాలు మాత్రమే వచ్చాయి. వామపక్షాలకు 19 స్థానాలు వచ్చాయి. ఎన్నికలకు ముందు డిఎంకె ప్రజాకర్షక పథకాలను ప్రకటించి అమలు చేయపూనుకుంది. ఎన్నికల కమీషన్ జోక్యంతో టెలివిజన్‌ల పంపిణీ ఆగిపోయింది. టెలివిజన్‌ల పంపిణీ ద్వారా తన కుంటుంబసభ్యులకు చెందిన టెలివిజన్ చనల్స్‌కు లబ్ది చేకూర్చే ప్రయత్నం జరిగింది. ఎన్ని బ్రమలు కల్పించినా తమిళనాడు ఓటర్లు అవినీతి అధికారపక్షానికి చెల్లుచీటీ ఇచ్చారు. నేడు కాంగ్రేస్‌కు డిఎంకె అవినీతి గుదిబండగా తయారయ్యింది. అయినప్పటికీ కుంభకోణాల వారసత్వం కలిగిన కాంగ్రేస్ ప్రస్తుతం డిఎంకె మద్దత్తుతో పార్లమెంటులో కొనసాగుతున్నది.
2006 శాసన సభ ఎన్నికలలో 49 స్థానాలు సంపాదించిన కాంగ్రేస్ 2011లో 78 స్థానాలు గెలుచుకుంది. 8 శాతం పెరుగుదల ఉంది. 39.38 శాతం ఓట్లతో అత్యధిక స్థానాలను గెలుపొందింది. 2001లో 71 స్థానాలు సంపాదించిన కాంగ్రేస్ 49 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం 78 స్ధానాలు సాధించింది. రాష్ట్రవిచ్చిన్నవాదులతో, ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పర్చుకుంది. 2006లో 10 సంపాదించిన బిజెపి నేడు 5 స్థానాలకు పరిమితమైంది. 2001లో 20 స్ధానాలు సంపాదించిన అస్సాంగణ పరిషత్ 2006లో 24 స్థానాలు. 2011లో 10 స్థానాలకు పరిమితమైంది. 2006 లో 2 స్థానాలున్న సిపిఎం పార్టీ ఆస్థానాలను కోల్పోయింది. అస్సాంగణపరిషత్ సంఘటితంగా లేదు. అన్ని ప్రతిపక్షపార్టీతో కూటమి ఏర్పాటు చేస్తూనే బిజెపితో కలిసి పనిచేయడానికి అది అనుసరించిన వ్యూహాన్ని అవకాశవాదాన్ని ప్రజలు తిరస్కరించారు. శాంతి`అభివృద్ధి నినాదాల ప్రచారం కాంగ్రేస్‌కు లాభించింది. ప్రతిపక్షాల ఓట్లు చీలడంతో పాటు కాంగ్రేస్ విపరీతంగా ధనప్రవాహం కల్పించింది.
పుదుచ్చేరి `2011
పదుచ్చేరిలో ఎన్నికలకు ముందు కాంగ్రేస్‌లో పెద్ద చీలిక వచ్చింది. చీలిక వర్గం ఆలిండియా అన్నాడిఎంకెతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. 30 స్థానాలున్న పుదుచ్చేరి శాసన సభలో చీలిక వర్గమైన ఎన్‌ఆర్ కాంగ్రేస్‌కు 16స్థానాలు, ఎఐఎడిఎంకెకు 5 స్థానాలు వచ్చాయి. డిఎంకె కూటమిలో డిఎంకెకు 2 స్థానాలు, కాంగ్రేస్‌కు 7 స్థానాలు మాత్రమే వచ్చాయి. 2001లో 11 స్థానాలున్న కాంగ్రేస్ 2006 లో 10, ప్రస్తుతం 7 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడు ఎన్నికల ప్రభావం ఈ రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తుంది.
కడప ఉప ఎన్నికల ఫలితాలు : రాష్ట్రంలో కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభా స్థానాలకు ఎన్నికలు మే 8న జరిగాయి. 13న ఫలితాలు వచ్చాయి. వైయస్ జగన్‌కు ఐదున్నర లక్షల మెజార్టీ లభించింది. టిడిపి, అధికార కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. పులివెందులలో రికార్డు స్థాయిలో (81వేలు) విజయలక్ష్మి గెలుపొందారు. ఊహించిన దానికంటే అదనంగా మెజార్టీ వచ్చింది. ఈఎన్నికలను ప్రతిష్టంగా తీసుకొని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వయంగానూ,క్యాబినెట్ మంత్రులతో సహా విస్తృతమైన ప్రచారం చేశారు. ఎన్నికలలో డబ్బు ప్రవాహం పెద్దఎత్తున సాగింది. ఎన్నికల కనీస ప్రమాణాలు కూడా పాటించలేదు. కాంగ్రేస్ గోర పరాజయం చవిచూసింది.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment