31.08.2011 నాడు ఒంగోలులో జరుగుతున్న అఖిల భారత ఉప్పురైతుల సమావేశం సందర్భంగా
‘‘అన్ని వేసి చూడు ` నన్నువేసి చూడు’’ ఉప్పు వినియోగంపై నానుడి చాలా కాలంగా ఉంది. వంటలకే కాకుండా పారిశ్రామికంగా ఉప్పు వినియోగం ఆవశ్యకత చాలా ఉంది. పరిశ్రమల్లో కాస్టిక్ సొడా, సొడాయాష్, ప్లోరైడ్ తదితర ఉత్పత్తులకు వినియోగిస్తున్నాం. 65 లక్షల టన్నులు ఈ విధంగా ఉపయోగపడుతున్నది. మరో 60 లక్షల టన్నులు వంటలకు మరియు పశువుల అవసరాలకు వినియోగిస్తున్నాం. ఉప్పు ఉత్పత్తి చేసే రైతుల సమస్యల యెడల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏనాడూ శ్రద్ద చూపలేదు. పేరుకు 1953లో ఉప్పు నిర్వహణ శాఖను ఏర్పాటు చేసినప్పటికీ ఆ శాఖ వలన ఉత్పత్తి రైతులు పొందిన సహకారం చాలా తక్కువ. నేడు దేశంలో 170 లక్షల టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనా కొనసాగుతుండగా, భారతదేశానికి వనరులు ఉన్నప్పటికీ మన ఉత్పత్తి మాత్రం పెంచడానికి చర్యలు తీసుకోవడం లేదు. ప్రపంచంలో 120 దేశాల్లో 21 కోట్ల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. 1953లో సాల్ట్ సెస్ యాక్ట్ వచ్చింది. ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం నియంత్రణకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ మన అవసరాల కొరకు ఉప్పు దిగుమతులు చేసుకోగలిగిన దుస్థితిలోనే కొనసాగుతున్నాం. అయోడైజ్డ్ ఉప్పు వినియోగం ప్రచారం పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. 2002 డిశంబర్‌లో మొట్టమొదటి సారి ఒ.జి.ఎల్. లైసెన్స్ (డబ్ల్యుటివో విధానం) క్రింద జపాన్, పిలిపైన్స్, ఇండోనేషియా, మలేషియా, నెపాల్, బుటాన్‌లకు మరియు 32,500 టన్నులు సాధారణ ఉప్పు అమెరికాకు ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది.
దేశంలో జరుగుతున్న ఉత్పత్తిలో 72 శాతం గుజరాత్, 14 శాతం తమిళనాడు, 11శాతం రాజస్థాన్, 2 శాతం ఆంధ్రప్రదేశ్, ఒకశాతం మహరాష్ట్ర ఉత్పత్తి చేస్తున్నాయి. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో కూడా ఉత్పత్తి సాగుతున్నాయి. గతంలో సాధారణ ఉత్పత్తి వినియోగించేవారం. తర్వాత అయోడైజ్డ్ ఉప్పును వినియోగించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ప్రస్తుతం తలసరి వాడకం 12 కిలోలు వంట, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నాం. దేశంలో 10,107 కేంద్రాల్లో ఉత్పత్తి సాగుతున్నది. 5.20 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి చేస్తున్నాం. భారతదేశానికి సముద్రతీరం చాలినంత ఉన్నది. ఒక ఆంధ్రప్రదేశ్‌కే వెయ్యి కిలోమీటర్ల తీరం ఉంది. ఈ పనిలో 1.50 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. సంవత్సరంలో ఎనిమిది మాసాలు ఉత్పత్తి కొనసాగుతున్నది. వర్షాకాలంలో ఉత్పత్తి నిలిపివేస్తారు. సంస్కరణల ఫలితంగా అన్ని ఉత్పత్తుల లాగే ఉప్పు ఉత్పత్తిని 1996లో డి`సైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతులు చేసే ఉత్పత్తిలోకి ప్రయివేటు కంపెనీలు ప్రవేశించాయి. దీనితో రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. వీరిపై దోపిడి విపరీతంగా పెరిగింది.
ఉప్పు ఉత్పత్తిలో అనేక ఆరోగ్య సమస్యలు మిళితమై ఉన్నాయి. ఉత్పత్తి చేసేటప్పుడు ఎండ ఉండాలి. సూర్యకిరణాలు ఉప్పు పైనుండి ఉత్పత్తి చేసే వ్యక్తి కండ్లపై ప్రసరించడం వలన చాలా మందికి అందత్వం వస్తుంది. మధ్యాహ్నం ఊష్ణం వలన కాళ్లకు బొగ్గలు వస్తాయి. దానితో జ్వరం వస్తుంది. నిరంతర పని వల్ల గుడ్డితనంతో పాటు, రక్తపోటు, చర్మ వాధ్యులు, కీళ్ల నొప్పులు, వెన్నెముక నొప్పి, అంటువ్యాధులు, మలేరియా లాంటి జబ్బులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సరైన త్రాగునీరు లభించక ఇబ్బందులు పడుతుంటారు. ఉప్పు ఉత్పత్తి చేసే ప్రాంతంలో కనీస సౌకర్యాలు నేటికీ కల్పించలేదు. కల్పించాలన్న లక్ష్యం ప్రభుత్వానికి ఉన్నట్లు కనపడదు. అప్పుడు ఉప్పు తీయడం అతి కష్టంగా మారుతోంది. ఉప్పు వినియోగించేవాడికి ఉత్పత్తిలో ఉన్న సాదకబాధకాలు తెలిసినట్టులేవు. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సందర్భంగా, తుఫాన్లు, వరదలు, భూకంపాల వల్ల ఉత్పత్తికి తీవ్ర నష్టం కలుగుతున్నది. వీరికి రుణాలు లభించవు. ఎక్స్‌గ్రేషియో పేరుతో ఏటా 1.60 కోట్లు మాత్రమే కేటాయిస్తారు. క్రమాణుగతంగా రైతులను ఈ రంగం నుండి తరిమివేసే విధానం కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉప్పు ఉత్పత్తిలో ప్రయివేటు వారు 89.7 శాతం చేయగా, ప్రభుత్వం 2.3 శాతం, సహకార రంగంలో 8శాతం ఉత్పత్తి చేస్తున్నారు. 10 ఎకరాల లోపు ఉత్పత్తి కేంద్రాలు 40 శాతం ఉన్నాయి. వీరు 15 అక్టోబర్ నుండి జూన్ ఆఖరు వరకు ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వం నాలుగు విభాగాలుగా ఉత్పత్తి కొనసాగిస్తున్నది.
1) 100 ఎకరాలకు పైబడిన ఉత్పత్తి కేంద్రాలు
2) 10 నుండి 100 ఎకరాల మధ్య ఉత్పత్తి కేంద్రాలు
3) సహకార రంగంలో ఉత్పత్తి (ప్రతి సభ్యునికి 10 ఎకరాలు)
4) 10 ఎకరాల లోపు ఉత్పత్తి చేయువారు
ఇందులో 10 ఎకరాల లోపు చేయు రైతుల సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉప్పు రవాణా సమస్య తీవ్రంగా ఉంది. మూడు మిగులు రాష్ట్రాల నుండి రవాణాకు రైల్వేలు కీలక పాత్ర వహిస్తాయి. 55 శాతం పంట రైల్వేల ద్వారా, మిగిలినది రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఉత్పత్తి వ్యయం కన్నా రవాణా ఖర్చులు అదనంగా ఉంటాయి. అందులో అవసరం ఏర్పడినప్పుడు రవాణాకు రైల్వేలు అందుబాటులో ఉండవు. చివరికి లారీలు కూడా అందుబాటులో ఉండవు. రవాణాను మెరుగుపరిచే చర్యలు ప్రభుత్వం దృష్టిలో లేవు. ప్రయివేటు కంపెనీలు ఈ రంగంలో ప్రవేశించాక లాభాలను ఆశించి, ఉత్పత్తిదారులకు కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. వీరు అనేక ఆందోళనలు చేసారు.
ప్రకాశం జిల్లాలో 18 గ్రామాల్లో 7 మండలాల్లో ఉప్పు ఉత్పత్తి కొనసాగుతున్నది. వీరి నుండి మధ్య దళారీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ మార్కెటింగ్ సౌకర్యం లేదు. ఉత్పత్తి కేంద్రం నుండి రవాణా మార్గం పూర్తిగా బురదమయం. అక్కడి నుండి ఉత్పత్తిని తరలించడానికి ఎక్కువ డబ్బులు కావాలి. ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వలన ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద 36శాతం నుండి 120 శాతం వరకు వడ్డీ చెల్లిస్తామని రుణం తెస్తారు. అప్పు ఇచ్చినవారు ముందే ఉప్పు బస్తా ధర తక్కువకు నిర్ణయించి ఉత్పత్తిదారుని నుండి వడ్డీ వ్యాపారులు ఉత్పత్తిని కాజేస్తారు. ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడిన సందర్భంలో జరుగు నష్టానికి 2009లో ఒక్కసారి మాత్రమే ఎకరాకు 600 రూపాయలు పరిహారం చెల్లించబడిరది. ఆ తర్వాత ఎన్నడూ పరిహారం చెల్లించిన సమస్య రాలేదు. ఒక ఎకరా ఉత్పత్తి చేయడానికి 50 మంది పని దినాలు అవసరం. రోజుకు 150 రూపాయల కూలి చెల్లించాలి. ఇతర ఖర్చులతో కలిపి ఎకరా పెట్టుబడి 15000 అవుతుంది. ఉత్పత్తి కేంద్రం నుండి రవాణాకు అదనంగా ఖర్చవుతుంది. ఎకరాకు సగటున దిగుబడి 700`800 బస్తాలు (బస్తా అంటే క్వింటాళ్లు) ఉంటుంది. బస్తా 100 రూపాయలకు అమ్మాలి. కానీ మధ్య దళారీలు తగ్గించి కొనుగోళ్లు చేస్తారు. ఎక్కువ మంది కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కొందరు పెద్ద మొత్తంలో కౌలుకు తీసుకుని, సబ్ లీజుకు ఇచ్చి లబ్దిపొందుతున్నారు. కౌలు ఎకరాకు 5 వేల నుండి 10 వేల వరకు ఉంది. కౌలు రేటు, పెట్టుబడి, ప్రయవేటు వడ్డీ పోగా ఉత్పత్తిదారునికి మిగిలేది నామమాత్రమే. అందువలన వీరి బ్రతుకులు హీనంగా ఉన్నాయి. చాలా మందికి సొంత ఇండ్లు లేవు. అతి కొద్ది రోజుల్లో అనారోగ్యానికి గురి కావడం వలన ఉత్పత్తిలో భాగస్వాములు కాలేక ఆదాయాలు పడిపోతాయి. వీరి పిల్లల్లో చదువు చాలా తక్కువ. కొద్ది కాలంలోనే పాఠశాల విరమణ చేస్తున్నారు. 2000 సంవత్సరానికి ముందు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏజెన్సీ టాక్స్ ఉండినది. ప్రస్తుతం ఆ ట్యాక్సును తొలగించారు. రాష్ట్రానికి 7 లక్షల టన్నుల వినియోగపు డిమాండ్ వంట మరియు పరిశ్రమలకు ఉంది. అయోడైజ్డ్ ఉప్పును 4 రూపాయలకు కిలో చొప్పున 42 వేల చౌక దుకాణాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో బిపిఎల్ వారికి (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి) పంపిణీ చేసారు. ఇదే ఉప్పు బహిరంగ మార్కెట్‌లలో 15 రూపాయలకు కిలో అమ్ముతున్నారు. కానీ ఉత్పత్తిదారునికి కిలోకు రూపాయి కూడా లభ్యం కావడం లేదు.
12 సెఫ్టెంబర్ 2006లో విశాఖ పట్నంలో ఉప్పు ఉత్పత్తిదారుల వర్క్‌షాప్ జరిగింది. ఇందులో నాటి సివిల్ సప్లయ్ శాఖా మాత్యులు శ్రీ ఎన్. రఘువీరారెడ్డి, వాణిజ్యశాఖా మాత్యులు శ్రీ కొణతాల రామకృష్ణ, పరిశ్రమల శాఖ కేంద్ర అదనపు కార్యదర్శి నరేష్ చతుర్వేది, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సలహాదారి పికె థివారి సహా మరో ఏడుగురు పాల్గొన్నారు. ఉప్పు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ఐదు సంవత్సరాల పథకాన్ని రూపొందించారు.
(1) ఉచిత విద్యుత్ (2) బోర్‌వెల్స్ వేయడానికి ఆర్థిక సహాయం (3) సముద్రపు ఇసుక తొలగింపుకు అనుమతి (4) కట్టలు వేయడానికి ఆర్థిక సహాయం (5) ఉత్పత్తిదారులకు కౌలుకు బదులు భూములకు పట్టాలు ఇవ్వడం లాంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కానీ నేటికీ అది పరిష్కార దశలోనే ఉన్నాయి. తిరిగి 2006లో భారత`అంతర్జాతీయ ఉప్పు ఉత్పత్తిదారుల సమ్మేళన ` 2010న జరిపారు. ఈ సమావేశంలో 9 అంశాలతో తీర్మానాన్ని ఆమోదించారు. నాణ్యతను, ఉత్పత్తిని పెంచడంతోపాటు, సన్న,చిన్నకారు ఉత్పత్తిదారులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడం, అయోడైజ్డ్ ఉప్పు ఉత్పత్తిని చేయడం, ఉత్పత్తిదారులపై జరుగుతున్న దోపిడీని నివారించడం మరియు మన అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచడం ఓడ రేవులలో ఎగుమతులు పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చడం లాంటి చర్యలు తీసుకుంటామని అన్నారు. తీర్మానాల వరకే పై కోర్కెలు పరిమితమవుతున్నాయి. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిగువ చర్యలు చేపట్టడం ద్వారా ఉప్పు ఉత్పత్తిదారులతో పాటు, వినియోగదారులకు సరసమైన ధరలకు ఉప్పును అందించవచ్చు.
1) అవకాశం ఉన్న మేరకు ఉత్పత్తిని, ఉత్పాదకతను నూతన టెన్నాలజీ ద్వారా పెంచాలి.
2) సోలార్ ద్వారా సముద్రపు నీటి ఆవిరి చేసి ఉత్పత్తిని పెంచే టెక్నాలజీని వినియోగించాలి.
3) ఉత్పత్తిలో పాల్గొనే వ్యక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య భీమాను అమలు చేయాలి. కండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, బిపి, బొబ్బలు రాకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలి.
4) ప్రభుత్వ సంస్థల ద్వారా పావలా వడ్డీకి రుణ సౌకర్యం కల్పించాలి. మధ్య దళారీల పాత్రను తొలగించాలి.
5) సహకార రంగాన్ని అభివృద్ది చేసి ఉత్పత్తిని పెంచాలి. ప్రయివేటు కంపెనీలపై నియంత్రణ పెట్టాలి.
6) మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ఉత్పత్తి ప్రాంతం నుండి రహదారి సౌకర్యం కల్పించి రవాణాకు ప్రాధాన్యతనివ్వాలి. రైల్వేలు అందుబాటులో ఉంచాలి.
7) ప్రకృతి వైపరిత్యాల వల్ల ఉత్పత్తికి జరిగిన నష్టం పూర్తిగా ప్రభుత్వం కానీ, భీమా కంపెనీ ద్వారా గాని చెల్లించే చర్యలు తీసుకోవాలి.
8) ఉత్పత్తిదారుల కుటుంబాల ఆరోగ్యం, విద్య సమస్యలకు తగు ఆర్థిక సహాయం ప్రభుత్వాలు చేయాలి.
9) అందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి.
10) జీవిత భీమా సౌకర్యం కల్పించి మొత్తం కుటుంబాన్ని గ్రూపు భీమా క్రింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి.
పై చర్యలు చేపట్టడం ద్వారా ఉప్పు ఉత్పత్తిని, నాణ్యతను పెంచడమే కాక, వినియోగదారులకు చౌక డిపోల ద్వారా తక్కువ ధరలకు అందరికీ అందించాలి. ఉప్పు డిపార్ట్‌మెంట్‌ను పటిష్టపరచాలి. బడ్జెట్‌లో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయోడైజ్డ్ ఉప్పు వినియోగించాల్ని నిబంధనను అవసరమున్న చోటనే అమలు జరపాలి. ఇందుకు ఆరోగ్య శాఖ సహకారం తీసుకోవాలి. రాష్ట్రంలో మనకున్న పూర్తి అవకాశాలను వినియోగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. ఉత్పత్తి దారులకు రక్షణ కల్పించాలి.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment