రానున్న 20 సంవత్సరాలలో ఇండియా ప్రపంచంలో అగ్రదేశంగా మారుతుంది !
- అమెరికా ఆర్థికమంత్రి ఉవాచ
2008 జూలై 21న ప్రపంచ వాణిజ్య సంస్థ జి-33 మంత్రిత్వస్థాయి సమావేశం జెనీవాలో జరగనుంది. ఆ సమావేశంలో వ్యవసాయ రంగంపై ఒప్పందం ఖరారు చేస్తామని ప్రకటించారు.
2001 నవంబర్ 9 నుండి 14వ తేదీ వరకు కతార్ దేశంలోని దోహాలో డబ్ల్యుటీవో నాల్గవ మంత్రిత్వ స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి రూపొందించిన ఎజెండా ఆమోదం పొందక సమావేశం వాయిదాపడింది. అదే ఎజెండాను తిరిగి ఐదవ మంత్రిత్వ స్థాయి సమావేశాలలో మెక్సికో దేశంలోని కాన్‌కూన్‌లో 2003 సెప్టెంబర్ 9-14 తేదీల మధ్య చర్చించారు. అందులో కూడా అంగీకారానికి రాక ఎజెండా వాయిదాపడింది. తిరిగి ఆరవ మంత్రిత్వస్థాయి సమావేశాలు చైనాలోని హాంకాంగ్‌లో 2005 డిసెంబర్ 13-14 తేదీలలో జరిగినప్పటికీ, అందులో కూడా ఏకాభిప్రాయానికి రాక వాయిదా పడ్డాయి. ఆ ఎజెండాను జెనీవాలో జరగనున్న ఏడవ మంత్రిత్వస్థాయి సమావేశంలో చర్చించి ఆమోదించాలని ధనిక దేశాలు పెద్దయెత్తున మూడవ ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెస్తున్నాయి.
జూలై 1, 2007న విడుదల చేసిన డాక్యుమెంట్‌లో కొన్ని మార్పులు చేస్తూ తిరిగి చర్చకు తెస్తున్నారు. '' వ్యవసాయ మరియు వ్యవసాయేతర అందుబాటు మార్కెట్ '' సంప్రదింపుల అధ్యక్షులయిన న్యూజిలాండ్, కెనడా రాయబారులుగా వున్న క్రాఫోర్ట్ ఫాల్కోనర్, కాన్ స్టీఫన్‌సన్‌లు 2008 మే 19న చర్చకు డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈసారి సమావేశాల్లో ఎజెండాను ఆమోదింపజేయాలని డబ్ల్యుటీవో డైరెక్టర్ పాస్కల్ లామీ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దోహాలో ఈ దిగువ ఎజెండా నిర్ణయించారు.
1. డబ్ల్యుటీవో ఒప్పందాల్లోని అసమానతలు, అమలులోని సాధక బాధకాలు
2. వ్యవసాయ రంగం
3. మేధోసంపత్తి హక్కులు
4. వాణిజ్యం మరియు పెట్టుబడుల మధ్య సంబంధం
5. వాణిజ్యం మరియు పోటీ విధానాల మధ్య సంబంధం
6. ప్రభుత్వ సేకరణలో పారదర్శకత
7. వాణిజ్య సదుపాయం
8. సేవారంగం
9. వ్యవసాయేతర ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం
10. డబ్ల్యుటీవో నియమాలు
11. తగాదాల పరిష్కారాల అవగాహన
12. వాణిజ్యం మరియు పర్యావరణం
13. ఎలక్ట్రానిక్ వాణిజ్యం
14. కార్మిక ప్రమాణాలు
ఇందులో ప్రధానంగా మొదటి మూడు అంశాలపై చర్చించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు పట్టుబడుతున్నాయి. ధనిక దేశాలు సింగపూర్ అంశాలతోపాటు తమకు లాభించే మరికొన్ని అంశాలు చర్చించాలని పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితులలో అమెరికా నేతృత్వంలోని ధనిక దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్రంగా ఒత్తిడి పెంచాయి.
2008 మే 19న మార్పులు చేసిన డాక్యుమెంట్‌లో సమావేశాల చైర్మన్ క్రాఫోర్డ్ ఫాల్కోనర్ చూపిన మార్పులు యిలా వున్నాయి.
1. పేద దేశాలు తమ సుంకాలలో 8 నుండి 20శాతం సుంకం విలువలను ''ప్రత్యేక ఉత్పత్తులు''గా పరిమితులు పెట్టుకోవచ్చు.
2. మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు పేద దేశాలు '' ప్రత్యేక రక్షణ యంత్రాంగాన్ని'' కల్పించుకొనుటకు చర్యలు చేపట్టవచ్చు. అయితే ధరలు 30శాతం కన్నా తగ్గడం లేదా ఉత్పత్తులు 35శాతం పెరగాలి. గతంలో నిర్ణయించిన ఉరుగ్వే రౌండ్ స్థాయిని మించకూడదు.
వ్యవసాయ రంగం: వ్యవసాయ రంగంపై ధనిక దేశాలు కేంద్రీకరించాయి. ప్రతిపాదిత ఒప్పందంలో వున్న అభిప్రాయభేదాలను తగ్గించే ప్రయత్నం చేస్తామని ధనిక దేశాలు తెలిపాయి. మొదట 235 వరకు అభిప్రాయభేదాలు వున్నట్లు నిర్వచించి వాటిని 32కు తగ్గించారు. కానీ వాస్తవానికి వీటి సంఖ్య పెరిగింది. 32 అభిప్రాయభేదాల్లోనే మిగిలిన సమస్యలన్నింటినీ చేర్చారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు డబ్ల్యుటీవో ఒప్పందంలో వ్యవసాయ రంగంపై నిర్థేశించిన సూచనలను ఉపసంహరించుకోవాలని ప్రపంచ వాణిజ్య సంస్థ ఫాస్కల్ లామీకి అనేక సందర్భాల్లో సూచించారు. తమకు ఆమోదయోగ్యం అయ్యేవరకు సంతకాలు చేయుటకు అంగీకరించలేదు.
2008 జూలై నాటికి ఒప్పందంపై అంగీకారానికి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. అదే సందర్భంలో అభివృద్ధి చెందిన దేశాలు యిస్తున్న రాయితీలపై ఎలాంటి చర్చ సాగడంలేదు. వారు యిస్తున్న రాయితీలను తగ్గించడానికి డబ్ల్యుటీవో ఒత్తిడి తేకుండా నిర్లిప్తతగావుంది.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ్యవసాయ స్థూల వాణిజ్య సబ్సిడీలను 66శాతం నుండి 73శాతం వరకు కోత విధించినప్పటికీ రాయితీ పరిమితి సంవత్సరానికి 13 బిలియన్ డాలర్ల నుండి 16.4 బిలియన్ డాలర్లుగా వుంటుంది. 2006లో అమెరికా 10.8 బిలియన్ డాలర్లు రాయితీలు యిచ్చింది. 2007లో ధరల పెరుగుదల వలన తగ్గిన మార్కెట్ రుణాలకు అమెరికా చెల్లింపులు చేసింది. ఈ విధంగా అమెరికా పెద్దగా రాయితీలు కత్తిరింపు చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. యూరోపియన్ యూనియన్ పరిస్థితి కూడా యింతే. ఈ దేశాలు తాము యిచ్చే మద్దతులను గ్రీన్‌బాక్స్‌లోకి మార్చి చూపిస్తున్నారు. వీరు 75 నుండి 85 శాతం రాయితీలు తగ్గించాల్సి వున్నప్పటికీ గ్రీన్ బాక్స్ మరియు బ్లూ బాక్స్‌లోకి రాయితీలను మార్చి గరిష్ట పరిమితి ప్రమాదం నుండి తప్పించుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 80శాతం వరకు రాయితీలు బ్లూ లేదా గ్రీన్ బాక్స్‌లలో వున్నాయి. ఈ విధంగా తమ దేశాల్లోని వ్యవసాయ రంగానికి పెద్దయెత్తున రాయితీలు యిస్తూనే అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలలో వ్యవసాయ రాయితీలను తగ్గించాలని, దిగుమతులపై ఆంక్షలను తొలగించాలని వాదనలు చేస్తున్నారు.
దోహా సమావేశాలకు చర్చకు యిచ్చిన నివేదికలో చెబుతున్నదాని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు చేస్తున్న వాణిజ్యంలో ఎక్కువ లాభాలు రావు. ప్రస్తుత వాణిజ్యాన్ని పరిశీలించినప్పుడు, మొత్తం 38.4 బిలియన్ డాలర్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేవలం 6.7 బిలియన్ డాలర్లు మాత్రమే వస్తాయి. భారతదేశ ఎగుమతులకు యిది యేమాత్రమూ లాభసాటికాదు.
మత్స్య పరిశ్రమ : సముద్రాలపై విచిక్షణా రహితంగా చేపల వేట సాగుతున్నదని 2001 నవంబర్‌లో జరిగిన దోహా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మత్స్య సంపద యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వాణిజ్య సంస్థ చేపల సేకరణపై రాయితీలను క్రమబద్దీకరించాలని కోరింది. ప్రస్తుతం అమలులో వున్న చేపల రాయితీల వ్యవస్థలో మార్పులకు దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాలు అంగీకరించలేదు. యిప్పటికే ఆ దేశాలలో చేపల సేకరణపై అధికంగా రాయితీలు యిస్తున్నారు. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు చేపల వేటకు మరియు చేపల నిల్వల కోసం యింకా రాయితీలు కావాలని కోరుతున్నాయి. 2008 ఏప్రిల్‌లో ఇండియా, చైనా, ఇండోనేషియా దేశాలు 10 మీటర్ల పొడవు వున్న ఓడలకు మాత్రమే రాయితీలు యివ్వాలని కోరగా, 24 మీటర్ల పొడవుగల పడవలకు అనుమతినివ్వాలని అధ్యక్షునికి నివేదిక సమర్పించారు. దీనివలన ధనిక దేశాలు పెద్ద పడవలను ఉపయోగించి ఎక్కువ చేపలను వేట సాగించే అవకాశం వుంది. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చేపల వేట తగ్గిపోతున్నది. ఆ దేశాలకు గతంలో వస్తున్న ఆదాయం కూడా రాదు.
వ్యవసాయేతర ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం : ఎగుమతి, దిగుమతి సుంకాల తగ్గుదల విషయంలో జి-20 దేశాలు (అభివృద్ధి చెందుతున్న దేశాలు) యిచ్చిన ప్రతిపాదనలనే ముసాయిదాలో చూపారు. దీని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో సున్నితమైన ఉత్పత్తులతో కలిపి సుంకాలలో గరిష్ట కోత 36 శాతం వుండాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో కనిష్ట సగటు కోత 54శాతం వుండాలని తెలిపారు. ఇప్పటికే పెద్ద మొత్తాలలో రాయితీలు యిస్తున్న ధనిక దేశాలకు యీ కోత వల్ల పెద్దగా నష్టం వుండదు. పేద దేశాల రక్షణకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా, '' ప్రత్యేక ఉత్పత్తులు మరియు ప్రత్యేక రక్షణ చర్యలు '' క్రింద సుంకాలపై సడలింపు వుంటుందని ముసాయిదాలో చెప్పారు.
ముఖ్యంగా ప్రత్యేక రక్షణలు చెపట్టాలంటే, 30 శాతం ధరలు తగ్గాలి. లేదా 35 శాతం ఉత్పత్తులు పెరగాలి. నిర్ణయించిన సుంకం ఉరుగ్వే రౌండ్ స్థాయిలో చెప్పినదానికి మించరాదు. అదనపు సుంకం ఎగుమతి ధర 50శాతానికి మించరాదు. ప్రత్యేక రక్షణ చర్యలను ఒక సంవత్సరంలో మూడు నుండి ఎనిమిది ఉత్పత్తులకు మించి ఉపయోగించకూడదు. ఇటువంటి కఠినతర నిబంధనల మధ్య అభివృద్ధి చెందుతున్న దేశాలలో '' ప్రత్యేక రక్షణ చర్యల''ను ఉపయోగించడం సాధ్యంకాదు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రత్యేక రక్షణ చర్యలను దేశీయంగా ఉపయోగించుకోవడం చాలా సులువుగాను, అనువుగాను వుంటుంది.
వాణిజ్యం మరియు పర్యావరణం : పర్యావరణ రక్షణ పేరుతో ధనిక దేశాలు తమ దిగుమతులపై అనేక ఆంక్షలు పెడుతున్నాయి. భారత్ నుండి చేపల ఎగుమతులకు అమెరికా పర్యావరణం పేరుతో ఆటంకం కల్పించింది. చిన్న కన్నాలు వున్న వలల ద్వారా పట్టిన చేపల వలన ఒక రకమైన తాబేళ్ళు మరణిస్తాయని, యిది పర్యావరణానికి నష్టమని దిగుమతులపై ఆంక్షలు పెట్టి చేపల ఉత్పత్తిదారులను తీవ్రంగా నష్టపరిచారు. అదేవిధంగా మన మిరప ఎగుమతులపై ఎక్కువగా క్రిమిసంహారక మందుల లక్షణాలు వున్నాయని, అవి తమ ఆరోగ్యానికి హానికరమని అమెరికా త్రిప్పి పంపింది. వాస్తవానికి అమెరికాలో ఉత్పత్తి అయిన క్రిమిసంహారక మందులు (అవాంట్, ట్రేసర్) వినియోగించారు.
కార్మిక ప్రమాణాలు : అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల ప్రమాణాలను అమలుచేయాలి. నిర్బంధ శ్రమను మరియు బాల కార్మికులచే పనులు చేయించకుండా వుండటం, కనీస వేతనాలు చెల్లించడం తదితర ప్రమాణాలకు లోబడి ఉత్పత్తులు చేయాలి. ప్రయివేటు పెట్టుబడికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి. అలాంటి ఉత్పత్తులపైననే ఎగుమతులకు అవకాశం వుంటుంది. కార్మిక ప్రమాణాలకు, వాణిజ్యానికి లంకె పెట్టడం అన్యాయమని వర్థమాన దేశాలు వాదిస్తున్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణా ప్రకారం ఉత్పత్తిచేసి ఎగుమతి చేయడానికి భారతదేశానికి అనేక ఆటంకాలు వున్నాయి. ఇక్కడ బాల కార్మికులచే ఉత్పత్తులు సాగుతున్నాయి. దీనిని అడ్డంగా పెట్టుకొని మన ఎగుమతులను అనేక సందర్భాలలో ధనిక దేశాలు తిరస్కరించాయి.
ధనిక దేశాలు కఠినమైన ఆరోగ్య ప్రమాణాలను పెట్టి పండ్లు, రొయ్యలు, చేపలు మొదలైన వ్యవసాయోత్పత్తులను తిరస్కరిస్తున్నాయి. మన ఉత్పత్తులను దెబ్బతీస్తున్నాయి.
ఈ డబ్ల్యుటీవో సంస్థ మొదట ఏర్పడినప్పుడు దీని స్వభావ, స్వరూపాలు వేరుగా వున్నాయి.
డబ్ల్యుటీవో చరిత్ర:
రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా చితికిపోయిన పశ్చిమ యూరఫ్ దేశాలను ఆదుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్థకు బలం చేకూర్చడానికి బ్రిట్టన్ ఉడ్‌లో 1944లో ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచబ్యాంకు సంస్థలను ఏర్పాటు చేశారు. మొదట ప్రపంచబ్యాంకు యొక్క అసలు పేరు ''ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ-కనస్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్'' గా వుండేది. వీటి లక్ష్యాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
1. ఐ.ఎం.ఎఫ్: ఎగుమతి, దిగుమతుల రుణాల చెల్లింపు సమస్యలను పరిష్కరిస్తుంది. తాను విధించిన షరతులకు లోబడితేనే రుణాలిస్తుంది.
2. ప్రపంచబ్యాంకు: దేశాలలో అభివృద్ధి కొరకు రుణాలు యిస్తుంది. ముఖ్యంగా విద్యుత్‌రంగం, రోడ్లు, ఇరిగేషన్‌లాంటి రంగాలకు షరతులతో కూడిన రుణాలు యిస్తుంది.
ప్రస్తుతం ఐ.ఎం.ఎఫ్ యూరఫ్, ఆఫ్రికా ఖండాలకు పరిమితం కాగా, ఆసియా ఖండానికి ప్రపంచబ్యాంకు రుణాలిచ్చే బాధ్యతలను పంచుకున్నాయి. వివిధ దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మరో అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాల్సిన అవసరం ధనిక దేశాలకు కలిగింది. 1947లో జనీవాలో (స్విట్జర్లాండ్) 23 దేశాలు ''గాట్'' సంస్థను ఏర్పరిచాయి. ఇందులో భారతదేశం కూడా భాగస్వామిగా వుంది. ఈ సంస్థ 01-01-1948 నుండి అమలులోకి వచ్చింది.
గాట్ (జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్) సంస్థ లక్ష్యాలు :
'' వ్యాపార సరుకులపై సుంకాలు నిర్ణయించు సాధారణ ఒప్పందం'' దీని ప్రకారం వివిధ దేశాలు పరస్పరం చేసుకొనే ఎగుమతి, దిగుమతులపై ఆయా దేశాలు ఎంత సుంకాలు విధించాలనేది ఈ సంస్థ క్రమబద్దీకరిస్తుంది. ఈ సంస్థలో సభ్యత్వం పొందిన దేశాలకే ఇది వర్తిస్తుంది. ఈ సంస్థ ఎనిమిది సమావేశాల (అనుబంధం -1లో చూపనైనది) కొనసాగింపుగా సుంకాల వరకే పరిమితం కాకుండా యితర అనేక రంగాలను ఈ వ్యవస్థలోకి తెచ్చారు. 1986లో ఉరుగ్వేలో జరిగిన ఈ గాట్ సమావేశంలో సర్వీరు రంగాలలో పెట్టుబడుల ప్రతిపాదనతో పాటు వ్యవసాయాన్ని మొదటిసారిగా ఎజెండాలో చేర్చారు. మేధో ఆస్తి హక్కుల సంరక్షణ, విదేశీ పెట్టుబడులపై నియంత్రణను సడలించడం, తదితర అంశాలు చేర్చబడినాయి. ఈ అంశాలపై ఏకాభిప్రాయానికి రావడానికి నాటి ''గాట్'' సంస్థ డైరెక్టర్ జనరల్ డంకెల్ ఒక ముసాయిదా ఒప్పంద పత్రాన్ని తయారుచేసి సభ్య దేశాల ముందు వుంచారు. 26 వేల పేజీలలో రూపొందించబడిన ఈ పత్రం బరువు 1.75 క్వింటాళ్లు వుంది. ఈ ఒప్పందాలు సహజంగా అర్థం కావు. డంకెల్ ప్రతిపాదనలను ఏమాత్రం మార్పులు చేయకుండా వున్నది వున్నట్లుగా అంగీకరించాలని షరతు విధించారు. మార్పు కోరేవారు సంతకాలు చేయాల్సినవసరం షరతు విధించారు. ధనిక దేశాలు ఈ ఒప్పందంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై విధించాల్సిన ఆంక్షలను ఈ భారీ నివేదికలో ఎక్కడో ఒకచోట ప్రాధాన్యతలేని విషయంగా చేర్చారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేయాలని సభ్యదేశాలపై ఒత్తిడి తెచ్చారు. భారతదేశం ఈ ఒప్పందంపై సంతకం చేయరాదని దేశవ్యాపితంగా పెద్దయెత్తున ఆందోళనలు సాగాయి. నేడు ప్రధానిగా వున్న మన్మోహన్ సింగ్ నాడు ఆర్థికమంత్రిగాను, మరియు నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు దేశంలో జరుగుతున్న ఆందోళనలను నిర్లక్ష్యం చేస్తూ ''గాట్ ఒప్పందం''పై 1994 డిసెంబర్ 31న సంతకాలు చేశారు. ఆ రోజుకు 140 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
జనవరి 1, 1995 నుండి గాట్ సంస్థ పేరును ప్రపంచ వాణిజ్య సంస్థగా మార్చారు. నాటినుండి షరతులు అమలులోకి వచ్చాయి. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి సభ్య దేశాల మంత్రిత్వస్థాయి సమావేశాలు జరిపి నాడు వచ్చిన ఎజెండాపై ఒప్పందాలు కుదుర్చుకోవాలనే నియమం వుంది. ఈ సంస్థ ఆర్టికల్ 1 (38) ప్రకారం సభ్యదేశాలన్నీ ఉత్పత్తిలోను, సేవా రంగంలోను సమాన ప్రతిపత్తి కల్గివుండాలని తన నిబంధనలలోని పేర్కొంది. సంస్థ నిర్వహనకు రెండు ఉపాంగాలను ఏర్పాటు చేశారు.
1. తగాదాల పరిష్కార శాఖ (డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ బాడీ)
2. వ్యాపార విధానాల సమీక్షా శాఖ ( ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ)
మొదటి అంగంలోని సభ్యులందరూ నెలకు రెండుసార్లు సమావేశాలు జరిపి ఏ దేశం నిబంధనలు ఉల్లంఘించిందో విచారించి తీర్పు చెప్పాలి. దీనిదే అంతిమ తీర్పు. రెండవ అంగం వ్యాపార, సేవా రంగాలతో పాటు మేధో సంపత్తి హక్కుల (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) పరిరక్షణలకు సంబంధించి నిర్ణయాలు చేస్తుంది.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందంలో వ్యవసాయ రంగానికి సంబంధించినవి:
1. సభ్యదేశాలు వాగ్ధానం చేసిన దానికంటే మించి సబ్సిడీలు యివ్వరాదు.
2. వర్తమాన దేశాల్లో 1995-2000 నాటికి రాయితీలు 13.3 శాతానికి తగ్గించాలి.
3. అభివృద్ధి కొరకు పెట్టే ఖర్చులు రాయితీల క్రిందకు రావు. ( వ్యవసాయ బీమా పథకం, అభివృద్ధి)
4. ఎగుమతి సబ్సిడీల కొరకు కేటాయించిన బడ్జెట్ తగ్గించుకోవాలి.
5. మొక్కలు, పశుగణంపై పేటెంట్ హక్కులు 20 యేండ్లు కొనసాగాలి. (7 సంవత్సరాల నుండి) పేటెంట్ చట్టం 2005 నుండి అమలు కావాలి.
6. మన వ్యవసాయోత్పత్తిలో అవసరం లేకున్నా 5శాతం దిగుమతి చేసుకోవాలి.
7. ఎగుమతి సబ్సిడీలు అభివృద్ధి చెందిన దేశాలు 36శాతం, వర్థమాన దేశాలు 26 శాతం తగ్గించుకోవాలి.
8. వర్థమాన దేశాలు తమ వ్యవసాయోత్పత్తుల విలువలో 10 శాతం రాయితీ యివ్వవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు 2000 సంవత్సరం నాటికి 20 శాతం తగ్గించుకోవాలి.
9. విత్తనంలో జీన్ ద్వారా ఏ కొద్ది మార్పుచేసినా దానిపై వారికే పేటెంట్ హక్కు వుంటుంది. ఇతరులు దానిపై పరిశోధనలు చేయరాదు.
10. ప్రపంచీకరణ ద్వారా పెట్టుబడి రావడానికి - పోవడానికి అభ్యంతరాలు వుండరాదు.
11. మార్కెట్ సౌలభ్యం (దిగుమతి సుంకాల పెంపు - ఆరోగ్యం - పర్యావరణ కారణాల పేరుతో దిగుమతుల నిషేధం - లైసెన్సింగ్ విధానం రద్దు) గురించి ఒప్పందంలో వుంది.
12. భారీ యంత్రాల దిగుమతిని ఆపరాదు.
డబ్ల్యుటీవో నిబంధనలలో వున్నదానికి భిన్నంగా భారత ప్రభుత్వం ముందే దిగుమతి ఆంక్షలను తొలగించింది. 2005 నాటికి ఆంక్షలు విధించాల్సిన అవకాశం వున్నప్పటికీ ఏప్రిల్ 1, 2000లో 714 సరుకులపైన మరియు ఏప్రిల్ 1, 2001లో 715 సరుకులపైన పూర్తి దిగుమతి ఆంక్షలను తొలగిస్తున్నట్లు నాటి కేంద్ర వాణిజ్యశాఖామాత్యులు మురశోలి మారన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఆంక్షలు తొలగించే విధానం ఆత్మహత్యా సదృశ్యమైంది.
అమెరికా నిబంధనలు:
డబ్ల్యుటీవోలో ఏ నిబంధనలు వున్నప్పటికీ అమెరికా చట్టాలకు లోబడి వుండాల్సిందే. అమెరికా ''సుంకమేతర ఆంక్షలు'' పేరుతో దిగుమతి దేశాలపై తన చట్టాల పేరుతో ఆంక్షలు విధిస్తున్నది.
1. స్పెషల్ 301 : నిబంధన ప్రకారం ఔషధ మొక్కలు, వ్యవసాయోత్పత్తులతో ప్రాణహాని వుంటుందని భావించినచో దిగుమతులు నిషేధం.
2. సూపర్ 301 : తమ దేశ బహుళజాతి సంస్థలకు నష్టం వున్నచో దిగుమతుల నిషేధం
3. హెల్మ్స్ బర్టన్ చట్టం : క్యూబాతో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ఆంక్షలు విధించడం
4. డీ అమాటో యాక్ట్ : లిబియా, ఇరాన్, తదితర ఉగ్రవాద దేశాలతో సంబంధాలు కొనసాగించినచో ఆంక్షలు
5. ప్రెస్లర్ యాక్ట్ : భారత్ - పాకిస్తాన్ దేశాలు అణ్వాయుధాలు తయారుచేసినచో ఆ దేశాలపై ఆంక్షలు
6. న్యూక్లియర్ : అణు ఉత్పత్తులు సాగిస్తున్న భారత్ - ఉత్తర కొరియాలపై ఆంక్షలు విధించడం
పై సుంకమేతర ఆంక్షలు వల్ల తమ ఉత్పత్తులకు మరియు ఎగుమతులకు నష్టం రానివిధంగా రక్షణ చర్యలు తీసుకొంది. వాస్తవానికి డబ్ల్యుటీవోలోని సభ్యదేశాలన్నింటికీ సమాన హక్కులు వుండాలని మొట్టమొదటగా నిర్థేశించారు. దానికి యిది విరుద్ధ చర్య మాత్రమే. ఇవిగాకుండా అమెరికా తమ దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడానికి పెద్దయెత్తున సబ్సిడీలను యివ్వడానికి నిర్ణయించింది. డబ్ల్యుటీవో నిబంధనలలోకి రాకుండా తప్పించుకోవడానికి ఈ దిగువ బాక్స్‌లను సృష్టించింది.
గ్రీన్ బాక్స్:
1. దేశంలో అంతర్గతంగా ఆహార సరఫరాలకు (సబ్సిడీ) ఆర్థిక సహకారం.
2. ఆహార పదార్థాల నిల్వకు ఆర్థిక సహకారం
3. పర్యావరణ అభివృద్ధి, ట్రైనింగు, ప్రాథమిక సౌకర్యాలు, పరిశీలనాంశాలు, సాధారణ పరిశోధనలు తదితర సేవలకు ఆర్థిక సహాయం.
4. ప్రభుత్వం ద్వారా ఇతర సేవలు
5. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పేదలకు వ్యవసాయోపకరణల (ఇన్‌పుట్) సబ్సిడీ, ఎగుమతి సబ్సిడీ
బ్లూ బాక్స్:
పంటలు - పశు సంపద ఉత్పత్తిపై పరిమితి విధించినందుకుగాను పరిహారం నేరుగా రైతులకు చెల్లించడం (భూములు బీడుగా (పడావు) పెట్టినందుకు పరిహారం చెల్లింపు మున్నగునవి) ఈ సహాయం పంటకు సమానంగా వుండేట్లు చూస్తారు.
అంబర్ బాక్స్:
- ఉత్పత్తిదారులకు కనీస మద్దతు ధర చెల్లింపు : దీనిని కూడా నేరుగా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
వీటిద్వారా యిస్తున్న ఆర్థిక సహాయం డబ్ల్యుటీవో నిబంధనలలోకి రాదు. అదే సందర్భంలో యితర దేశాలలో వ్యవసాయ రంగానికి ఎలాంటి రాయితీలు యివ్వరాదని ఆంక్షలు విధిస్తున్నది.
యూరఫ్ దేశాలు కూడా యిదేవిధానిన్ని కొనసాగిస్తున్నాయి. ఏటా అమెరికా మరియు యూరఫ్ దేశాలు బిలియన్‌ల కొలది డాలర్లు వివిధ బాక్స్‌ల పేరుతో వ్యవసాయ రంగానికి రాయితీలు యిస్తున్నాయి.
వ.నెం దేశం గ్రీన్ బాక్స్ బ్లూ బాక్స్ అంబర్ బాక్స్ మొత్తం
1. యూరఫ్ దేశాలు 26.83 30.81 51.01 108.66
2. అమెరికా 50.06 - 16.80 66.86
3. కెనడా 1.85 - 0.68 2.53
4. జపాన్ 24.26 0.87 6.35 31.47
5. స్విట్జర్‌లాండ్ 2.67 - 2.75 5.42
6. నార్వే 0.69 1.16 1.70 3.55
మొత్తం 106.55 32.84 79.29 218.49
ధనిక దేశాలు యేటా 30వేల కోట్ల డాలర్లు రాయితీల క్రింద యిస్తున్నాయి. ఒక్క అమెరికాయే పత్తి రైతులకు 300 కోట్ల డాలర్లుయిస్తున్నది. జపాన్ ప్రభుత్వం వరి పెట్టుబడిపై 7 రెడ్లు నగదుగా రైతులకు యిస్తున్నది. ఈ రాయితీలేవీ డబ్ల్యుటీవో నిబంధనల క్రిందకు రావని ఆ దేశాలు చెబుతున్నాయి.

No comments:
Post a Comment