''పంట విత్తనంలోనే వుంది'' అన్న నాటి నానుడి నేడు పాతకాలపు నినాదంగా మారిపోయింది. నేడు విత్తన సేకరణ రైతులకు ప్రధాన సమస్యగా తయారైంది. 1965 నుండి 1980 వరకు సాగిన హరిత విప్లపం జయప్రదం కావడానికి విత్తనమే కీలక పాత్ర వహించింది. సాంప్రదాయ విత్తనాల స్ధానంలోకి అధికోత్పత్తి విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. వీటిరాకతో ఉత్పత్తి నాలుగు నుండి ఐదు రెట్లు పెరిగింది. మొట్టమొదటగా థాయ్‌లాండ్ నుండి తైఛుంగ్ నేటివ్-1, ఐ ఆర్ -8, వరి విత్తనాలను తెచ్చి మన విత్తనాలతో సంకరపర్చి ధాన్యాల ఉత్పత్తిలో స్యయం సమృద్ధి సాధించాం. ఆ తర్వాత సంకర విధానాన్ని అన్ని విత్తనాలలోకి ప్రవేశపెట్టారు. 1956లో దేశంలో ఐదు కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తి జరగగా, ఆదే సాగుభూమిలో నేడు 22 కోట్ల టన్నుల ఉత్పత్తికి చేరుకుంది. ముతకధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలే గాక వ్యాపార పంటల్లో కూడా సంకర జాతి విత్తనాల వినియోగంతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి.
విత్తనరంగంలో నిరంతరం సాగుతున్న పరిశోధనల వలన బీటి విత్తనాలు రంగంలోకి వచ్చాయి. రౌండప్ సీడ్స్, టెర్మినేటర్ సీడ్స్ కూడా రాబోతున్నాయి. ఒకసారి విత్తిన విత్తనం నుండి వచ్చిన పంట తిరిగి విత్తనంగా ఉపయోగపడని రీతిలో టెర్మినేటర్ సీడ్స్‌ను పరిశోధనలో కనిపెట్టారు. వీటి వలన ప్రతిసారి రైతు కంపెనీనుండి విత్తనాలను కొనుగోలు చేయాలి. గతంలో తమకు కావాల్సిన విత్తనాలను తమ పంటనుండి సేకరించుకొని పండించే రైతు నేడు యేటా విత్తన కంపెనీలపై ఆధారపడాల్సిన పరిస్థితి యేర్పడింది. గతంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు పరిశోధనలు చేసిన విత్తనాలను సర్టిఫై చేసి వానిజ్యపరంగా ఉత్పత్తికి విడుదలచేశాయి. ప్రభుత్వ జోక్యం వుండడం వలన రైతాంగానికి నాణ్యతగల విత్తనాలు సకాలంలో లభ్యమైనాయి.
1997 సంస్కరణల ప్రారంభంతో విత్తన రంగంలో అనేక మార్పులు వచ్చాయి. సంస్కరణల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనరంగం నుండి తన బాధ్యతను పూర్తిగా విరమించుకొని బహుళజాతి సంస్థలపరం చేయతలపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విత్తన రంగంనుండి తమ బాధ్యతను పూర్తిగా వదులుకొని ఆ రంగాన్ని బహుళజాతి సంస్థలపరం చేశాయి. ఫలితంగా, విత్తన రంగంపై నేడు బహుళజాతి సంస్థల పెత్తనం కొనసాగుతున్నది. రాష్ట్రంలో ''విత్తన చట్టం 1966'' ద్వారా యింతకాలం విత్తన ఎగుమతి, దిగుమతులు కొనసాగాయి. నాడు విత్తన దిగుమతికి చేసుకున్న చట్టం నేటికి కాలదోషం పట్టింది. నేడు రాష్ట్రం విత్తనోత్పత్తి రాష్ట్రంగా వుంది. దేశీయ విత్తనావసరాలలో 60శాతం విత్తనాలు మన రాష్ట్రం నుండే ఉత్పత్తి చేస్తున్నారు. విత్తనోత్పత్తి రాష్ట్రానికి విత్తన చట్టం లేదు. విత్తన చట్టం - 2004 ముసాయిదా నేటికీ కేంద్రం వద్ద పెండింగ్‌లోనే వుంది. పార్లమెంట్ ఆమోదానికి నోచుకోలేదు. ఈ చట్టం ఆమోదం పొందకపోవడానికి బహుళజాతి సంస్థల ప్రయోజనాలే కారణంగా వున్నాయి. సంస్కరణల అనంతరం బహుళజాతి సంస్థలు విత్తన రంగంపై గుత్తాధిపత్యం క్రమానుగతంగా సాగిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లలో 325 రకాల విత్తనాలు వుండగా, నేడవి 50-60ల మధ్యకు తగ్గాయి. తాము ఉత్పత్తిచేసిన విత్తనాలనే కొనుగోలు చేసేవిధంగా మార్కెట్‌ను యీ సంస్థలు నియంత్రించాయి. విత్తనాల ధరలను అనేక రెట్లు పెంచాయి. డిమాండ్‌కు తగిన సరఫరా లేని సందర్భంలో లాభార్జన కొరకు నాణ్యతలేని, కల్తీ విత్తనాలను సరఫరాచేసి కోట్లాది రూపాయలు యీ సంస్థలు ఆర్జిస్తున్నాయి. గతంలో వున్న విత్తన చట్టంలో మార్పులు తెచ్చేవిధంగా ప్రభుత్వంపై వత్తిడి పెంచారు. ఫలితంగా ఉత్పత్తిచేసే కంపెనీయే తన విత్తనానికి '' సెల్ఫ్ సర్టిఫికేషన్'' యిచ్చేవిధంగా నిర్ణయించారు. గత ప్రభుత్వం ఎం.ఓ.యు (పరస్పర అవగాహన ఒప్పందం)ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని తొలగించింది. ఆ విధంగా నేడు నాణ్యతలేని విత్తనాల వల్ల నష్టపోయిన రైతు కోర్టుకు వెళ్ళినా ఫలితం దక్కని పరిస్థితి కొనసాగుతున్నది.
రాష్ట్రంలో విత్తనావసరాలు - పంపిణీ :
రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి మూడు కోట్ల ఎకరాలు సాగుచేస్తున్నారు. ఖరీఫ్‌లో రెండు కోట్ల ఎకరాలు సాగవుతున్నది. ఖరీఫ్‌కు సంబంధించి సుమారు 45లక్షల క్వింటాళ్ళు అవసరం. 2009 ప్రభుత్వ ఖరీఫ్ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా 16.07 లక్షల క్వింటాళ్ళు, ప్రయివేటు ఏజెన్సీల ద్వారా 14 లక్షల క్వింటాళ్ళు, రైతునుండి రైతుకు విత్తనసేకరణద్వారా 15.08 లక్షల క్వింటాళ్ళు సేకరించాలన్న లక్ష్యాన్ని నిర్థేశించాయి. ఇందులో ప్రభుత్వం సరఫరాచేసే 16.91 లక్షల క్వింటాళ్ళకు సబ్సిడీ యిస్తుంది. సుమారు రు. 220 కోట్లు సబ్సిడీగా చెల్లించాలి. 2008 ఖరీఫ్‌లో ప్రభుత్వం 11 పంటలకు కావాల్సిన 13.19 లక్షల క్వింటాళ్ళకు రు. 192 కోట్లు సబ్సిడీ ప్రకటించింది. ఈ సబ్సిడీని విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలకు యివ్వడంలో ప్రభుత్వం చేసిన జాప్యం వలన యీ సంవత్సరం సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడానికి కంపెనీలు ముందుకు రావడంలేదు. పైగా, ఏ విత్తనాలు యేమేరకు సేకరించాలో ప్రభుత్వానికి ప్రణాళిక వున్నప్పటికీ పంట కాలంలో ఆ విత్తనాలు సేకరించకుండా నిర్లక్ష్యంచేసి విత్తనం వేసే సందర్భంగా విత్తన సేకరణకు కంపెనీలను కోరడంతో వారు ఎక్కువ ధరకు కోట్ చేసి టెండర్లు చేపడుతున్నారు. ఆ విధంగా సబ్సిడీ వలన లబ్ధి పొందేది కంపెనీలే. 2009 సంవత్సరంలో 10లక్షల క్వింటాళ్ళ వేరుశెనగ సరఫరా చేయాలన్న లక్ష్యం వుంది. ( 2008 ఖరీఫ్‌లో 8.54 లక్షల క్వింటాళ్ళు) 2009 ఖరీఫ్ 1.20 లక్షల క్వింటాళ్ళు సోయా సరఫరా చేయాలి. (గత సంవత్సరం 1.15 లక్షల క్వింటాళ్ళు). 5.80 లక్షల క్వింటాళ్ళ పప్పు విత్తనాల సరఫరాను లక్ష్యంగా నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాల్లో సకాలంలో విత్తనాలను నిల్వచేయడంలో వైఫల్యం కొనసాగుతున్నది.
రాష్ట్రంలో 400 విత్తనోత్పత్తి కంపెనీలు పనిచేస్తున్నాయి. 497 విత్తన ప్రొసెసింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. గత నాల్గు సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్ని రకాల విత్తనాలను ఉత్పత్తిచేసి, ప్రోసెస్ చేసి దేశవ్యాపితంగా సరఫరాచేస్తున్నారు. 1966 చట్ట ప్రకారం లేబిల్ తనక్కి తప్పనిసరి. కాని దీనిని సడలించడంతో కంపెనీలు నాణ్యతలేని విత్తనాలను కూడా తమ బ్రాండ్ పేరుతో సరఫరా చేస్తున్నాయి. ''ఒకే గ్రామం - ఒకే విత్తనం'' పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులోకి విత్తనం తెస్తామన్నారు. కానీ యింతవరకు యీ పథకం జయప్రదం కాలేదు. కల్తీ నిరోధానికి 1400 మంది విత్తన పరిశీలక ఇన్‌స్పెక్టర్లు వున్నారు. విత్తన పరీక్షలకు రెండు లేబోరేటరీలు వున్నాయి. నలభైవేల సాంపిల్స్‌ను పరీక్షించగల సామర్థ్యం వీటికుంది. అయినా నాణ్యతలేని విత్తనాల బెడద రైతులను వీడలేదు.
1997 నుండి నేటివరకు అనేక పేరుమోసిన కంపెనీలు నాణ్యతలేని విత్తనాలతో రైతులను దివాళా తీయించాయి, యింకా తీయిస్తున్నాయి. ప్యారీ - మోన్‌శాంటో కంపెనీ ప్రకాశం జిల్లా యింకొళ్ళు మండలం పావులూరు గ్రామంలో 40 లక్షల విలువ దిగుబడి గల మొక్కజొన్నల ఉత్పత్తికి నాణ్యతలేని విత్తనాలను సరఫరా చేశాయి. గత సంవత్సరం వరంగల్‌లో నీరజ బిటి పత్తి వలన 40 వేల ఎకరాలు దెబ్బతిన్నాయి. నాణ్యతలేని కార్గిల్ కంపెనీ విత్తనాలు కూడా పంటలను దెబ్బతీశాయి. టమోటా, మిరప, మొక్కజొన్నలు, పెసలు, వరి, పత్తి, కూరగాయలు మొదలగు పంటలకు యేటా ఉత్పత్తి నష్టం జరుగుతూనే వుంది.
బిటి విత్తనాలను వానిజ్యపరంగా వినియోగించడానికి ముందు సరియైన పరీక్షలు నిర్వహించలేదు. ఫలితంగా ఆ పంటలను మేసిన పశువులు మరణించడం, చేలో పనిచేసిన వారికి గర్భశ్రావాలు, చర్మవ్యాధులు సోకినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. అయినా సరియైన పరీక్షలు జరిపిన తర్వాతనే అనుమతులు యివ్వడానికి ప్రభుత్వం నిరాసక్తతగావుంది.
ప్రపంచంలోని అతిపెద్ద విత్తన కంపెనీలు :
1. మోన్సాంటో (అమెరికా) + సెమినిస్
2. డూపాంట్ + పయోనీర్ ( అమెరికా)
3. సింజెంటా (స్విట్జర్లాండ్)
4. లినిగ్రేమిన్ గ్రూప్ (ఫ్రాన్స్)
5. కె. డబ్ల్యు.యస్. ఎ.జి (జర్మనీ)
6. ల్యాండ్ ఒ లాక్ ( అమెరికా)
7. సాకేటా (జపాన్)
8. బేయర్ గ్రూప్ సైన్స్ ( జర్మనీ)
9. లూయీ కి (జపాన్)
10. డి ఎల్ ఎఫ్ - ట్రిబోలియం (డెన్మార్క్)
11. డెల్టా అఫైన్‌ల్యాండ్ ( అమెరికా)
ఈ కంపెనీలు భారత కంపెనీలతో మిలాఖతై వ్యాపారాలు చేస్తున్నాయి. భారత కంపెనీలకు గల ''గుడ్ విల్''ను ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే యేటా మొత్తం రు. 900 కోట్ల విత్తన వ్యాపారం సాగుతున్నది. విత్తనరంగంలోనే లాభాలు ఆర్జించే ఉద్దేశ్యంతో యీ కంపెనీలు తమ పేటెంట్ హక్కులను అడ్డం పెట్టుకొని విత్తన ధరలను విపరీతంగా పెంచేశాయి. విత్తన రంగంలోనే లాభాలు సంపాదించాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాయి.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలను ఉనికిలోకి తెచ్చి వాటిద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి విత్తన కంపెనీ ఉత్పత్తులను సర్టిఫై చేయడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలచే ధృవీకరించబడాలి. కొత్త టెక్నాలజీ విత్తనాలను వినియోగించడానికి ముందు పూర్తిస్థాయిలో మన వాతావరణ పరిస్థితులకు సరిపోయింది లేనిదీ పరీక్షల ద్వారా రుజువుపర్చుకోవాలి. ధరల నియంత్రణ కమిషన్ ద్వారా విత్తన ధరలను నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తెచ్చి యిటు రైతులకు, అటు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చాలి. సాంపిల్స్‌ను సేకరించి నాణ్యతలేని విత్తనాలు సరఫరాచేసిన కంపెనీలపై చర్యలు తీసుకొనేవిధంగా చట్టంలో మార్పులుచేయాలి. విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ముందు ప్రభుత్వం పరిహారం చెల్లించి, ఆ తర్వాత కంపెనీల నుండి రాబట్టుకోవాలి. విత్తన వ్యాపారాన్ని మార్కెట్ కమిటీల ద్వారా నిర్వహించాలి. ఆ విధంగా రైతులకు రక్షణ కల్పించి అధికోత్పత్తికి దోహదపడేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సారంపల్లి మల్లారెడ్డి
---

No comments:
Post a Comment