కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతులను నిషేదిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకోవడమే తడవుగా మార్కెట్లలో పత్తి ధరలు క్వింటాల్‌కు 500 నుండి 800 రూపాయల వరకు తగ్గిపోయాయి. ఆత్మహత్యా సదృశ్యమైన ఎగుమతి`దిగుమతుల విధానం రైతులకు ప్రాణసంకటంగా మారింది. ఏప్రిల్ 2011లో క్వింటాల్ పత్తి ధర 6500 రూపాయలు ఉండగా, ఫిబ్రవరి 2012లో 4000 రూపాయలకు ధరలు తగ్గించారు. దీనికి తోడు ఎగుమతి నిషేదం విధించడంతో మరో 800 రూపాయలు ధరలు తగ్గి ప్రస్తుతం క్వింటాల్ 2800`3000 మధ్య అమ్మకాలు సాగుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాపితంగా రైతుల ఆందోళనలు పెల్లుబికాయి. శాసనసభలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇది గమనించిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ప్రధానికి లేఖలు వ్రాశారు. విచిత్రమేమంటే! కేంద్ర వాణిజ్యశాఖ ఎగుమతులను నిషేదిస్తూ తీసుకున్న నిర్ణయం తన దృష్టికి రాలేదని ప్రధాని ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్‌పవార్ ఎగుమతి నిషేదాన్ని బలపర్చడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రైతులను నష్టపరిచి, వ్యాపారుల ఒత్తిడికి లొంగి ఎగుమతి నిషేదాన్ని అమలు జరపడం గతంలో జరిగింది, నేడు జరుగుతున్నది. పత్తి వ్యాపారుస్తులు మరియు పత్తి మిల్లర్ల బలమైన లాభి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమకు ఆర్థిక లాభదాయకమైన విధానాలను రూపొందించుకోవడం గతం నుంచి వస్తున్నది. అంతర్జాతీయ మార్కెటులో ధరలు పెరిగినప్పుడు ఎగుమతుల నిషేదం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ కన్నా తక్కువ ధరలకు ఇక్కడ రైతుల నుండి తమ అవసరాల మేరకు కొనుగోళ్లు చేస్తారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెటులో తక్కువ ధరలు ఉన్నప్పుడు దేశీయంగా కొనుగోలు చేయకుండా దిగుమతులపై ఆధారపడి స్థానిక రైతులను మరింత నష్టపరుస్తున్నారు. ఉభయత్రా ఎగుమతులు, దిగుమతుల వల్ల లభ్దిపొందుతున్నదీ వ్యాపారులు మరియు పత్తి మిల్లుల వారే. కేంద్ర ప్రభుత్వం రైతుల రక్షణ కొరకు ఉన్నామని చెప్పడమే తప్ప, ఆచరణలో వ్యాపారస్తుల కుయుక్తుల నుండి రైతులను రక్షించడంలో వైఫల్యం ప్రదర్శిస్తున్నది. ఫలితంగా రుణగ్రస్తులైన రైతులు ఎక్కువగా ఈ రంగంలోనే ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఇతర దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తిదారులకు తగిన వసతులు, రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తూ వారిని రక్షిస్తున్నాయి. ధరల ఎగుడు`దిగుడులలో రైతులు ఆర్థికంగా దెబ్బతినకుండా కాపాడుతున్నాయి. కానీ మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని బహుళజాతి సంస్థలకు, వ్యాపారులకు అప్పగించే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. పత్తి ధరలు తగ్గినపుడు నూలు ధరలు తగ్గించాలి. కానీ వ్యాపార వర్గాలు పత్తి ధరలు తగ్గినా, నూలు ధరలు పెంచుకుంటూనే పోతున్నాయి. దాదాపు 15లక్షల టన్నుల దూది చిన్న మిల్లులకు, చేనేత కార్మికులు వినియోగిస్తున్నారు. కనీసం వీరికైనా తక్కువ ధరలకు నూలు లభ్యమయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నారు. క్రమంగా చేనేత రంగాన్ని ఎత్తివేసి వారిని నిరుద్యోగులుగా తయారుచేసే విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇటు రైతులకు, అటు చిన్న పరిశ్రమలకు చేనేత కార్మికులకు ఈ ఎగుమతుల విధానం అత్యంత ప్రమాదకరంగా తయారైంది.
ప్రపంచం పత్తి ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. చైనా, అమెరికా తర్వాత భారత్ పత్తి ఉత్పత్తి కొనసాగిస్తున్నది. ప్రపంచంలో 9కోట్ల ఎకరాలలో పత్తిపంట వేయడం ద్వారా 260 లక్షల మెట్రిక్ టన్నుల దూది దిగుబడి అవుతున్నది. భారతదేశం 3కోట్ల ఎకరాలు సాగు చేస్తూ, 40 లక్షల మెట్రిక్ టన్నుల దూది దిగుబడి సాదిస్తున్నది. కానీ ఉత్పాదకతలో భారతదేశం 13వ స్థానంలో ఉన్నది.
దేశీయంగా 2011`12లో 356 లక్షల బేళ్ళదూది (బేలుR170 కిలోలు) ఉత్పత్తి కాగా, 2010`11లో 28లక్షల బేళ్ల పత్తి నిలువలు ఉన్నాయి. దీనికి తోడు మరొక 5లక్షల బేళ్లు లాంగ్ స్టేపుల్ పత్తిని దిగుమతి చేసుకున్నారు. ఈ విధంగా మొత్తం నిల్వలు 388 లక్షల బేళ్లకు చేరింది. ఇందులో నుండి దేశ అవసరాలకు 280 లక్షల బేళ్లు అవసరమైంది. మరో 80 లక్షల బేళ్ళు ఎగుమతికి అవకాశం కల్పించారు. అయినప్పటికీ, 28 లక్షల బేళ్లు క్యారీవోవర్‌గా రాబోవు సంవత్సరానికి నిలువలు ఉంటాయి. 80లక్షల బేళ్ల ఎగుమతికి అనుమతించిన ప్రభుత్వం 65లక్షల బేళ్లు ఎగుమతి కాగానే నిషేదం ప్రకటిస్తూ తీర్మానించడంతో ధరలు తగ్గిపోయాయి. అంతకు ముందే ఎగుమతి చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో నిలువలు పెట్టుకున్న దేశీయ వ్యాపారులు, ప్రస్తుత ఎగుమతులు కొనసాగిన స్థితిలో తమ నిలువ దూది ధరలు తగ్గిపోతాయని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిషేదం విధించినట్టు వార్తలు తెలుపుతున్నాయి. ఏది ఏమైనా రైతుల నుండి కొనుగోలు ధరలను తగ్గించడం లక్ష్యంగా, తమ లాభాలను గ్యారెంటీ చేసుకునే విధానాన్ని కేంద్రం ద్వారా వ్యాపారులు అమలు చేయించుకుంటున్నారు. రైతులు నష్టపోవడం ద్వారానే వ్యాపారులకు లాభాలు వస్తున్నాయనేది ఈ విధానం ద్వారా స్పష్టమవుతున్నాయి.
2007`08 నుండి యేటా ఐదు నుండి ఎనిమిది లక్షల బేళ్లు లాంగ్ స్టేపుల్ పేరా దిగుమతులు చేసుకుంటున్నారు. మన దూదిలో లాంగ్ స్టేపుల్ దూది కలపడం ద్వారా దారం పొడవు ఎక్కువ వస్తుందని, నాణ్యత ఉంటుందని ఈ దిగుమతులు కొనసాగిస్తున్నారు. కానీ లాంగ్ స్టేపుల్ దూదిని దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే కాలంలో 50నుండి 80 లక్షల బేళ్లు ఎగుమతులు చేస్తున్నారు. ఎగుమతుల ద్వారా 12`14 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాము. ఇంత విదేశీ మారకద్రవ్యం సంపాదిస్తున్న పత్తి వాణిజ్యంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని అమలు జరపడం లేదు. దాదాపు కోటి 50 లక్షలకు పైగా ఉన్న రైతులు ఆర్థికంగా దివాళాతీసి రుణగ్రస్తులవుతున్నారు. క్వింటాల్ పత్తిలో గింజలు తీసివేయగా మూడవ వంతు దూది వస్తుంది. అనగా ప్రస్తుత ధరల ప్రకారం పరిశీలిస్తే తొమ్మిది రూపాయలకు కిలో దూది (కూలిరేట్లు కాక) వస్తుంది. కిలో దూదితో ఎనిమిది మీటర్ల బట్ట నేస్తారు. మీటర్ సగటున 30 రూపాయలకు అమ్మినా 240 రూపాయల ఆదాయం వస్తుంది. 355 కిలోల బరువు ఉన్న క్యాండి దూది ఈ సంవత్సరం 46వేల నుండి 63 వేల వరకు అమ్మింది. బహిరంగ మార్కెట్టులో ఇంత ధర ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయతను పాటించలేదు. గత సంవత్సరంపై క్వింటాల్‌కు 200`300 రూపాయలు పెంచడం ఆనవాయితీగా వస్తున్నదే తప్ప, పంటల ఉపకరణాల పెరుగుదలను కూడా పరిగణించకపోవడం జరిగింది. క్వింటాలు పత్తి ఉత్పత్తికి రు.3,800/`లు వ్యయం చేస్తున్నారని కేంద్ర ధరల నిర్ణాయక కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రికమండ్ చేసింది. కనీసం డా॥ఎం.ఎస్. స్వామినాధన్ కమీషన్ చెప్పిన ప్రకారం ఉత్పత్తి వ్యయానికి 50శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలి. కాని ధరల నిర్ణాయక సంఘం రికమండేషన్ పరిశీలించిన కేంద్ర వ్యవసాయ శాఖ ఈ రెండు రికమండేషన్‌లను పరిశీలించినప్పటికీ గత సంవత్సరంపై క్వింటాలకు రు.300/లు పెంపుదల చేస్తూ (రు.3,300`లు) నిర్ణయించింది. కనీసం అంతర్జాతీయ ధరలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ సంవత్సరం నిత్యావసర సరుకుల చట్టం క్రిందికి పత్తి విత్తనాలను చేర్చి, అంతకు ముందు 450 గ్రాములున్న ప్యాకెట్ ధరను 750 రూపాయలనుండి 930 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఈ వ్యాపారులే బ్లాక్ మార్కెట్‌లో 1500 రూపాయలకు ప్యాకెట్ అమ్మారు. గతంలో ఎకరాకు ఒక ప్యాకెట్ అవసరం కాగా, నేడు రెండు ప్యాకేట్‌లు వేయమని చెప్పుతున్నారు. నాణ్యతలేని విత్తనాల వల్ల యేటా నాలుగైదు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. మరోవైపున ఎరువుల ధరలు ఈ సంవత్సరం 100శాతం పైనే పెరిగాయి. డిఎపి 50 కిలోల బస్తా ధర 486 ఉండగా, దానిని ప్రభుత్వమే 1030 రూపాయలకు పెంచింది. ఇది కూడా బ్లాక్ మార్కెట్‌లో 1100 రూపాయల వరకు అమ్మారు. క్రిమిసంహారక మందుల ధరలను ఏనాడు నిర్ణయించలేదు. డిమాండ్‌ను బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు ఒక్క సంవత్సరంలోనే పెద్ద ఎత్తున పెంచారు. విచిత్రమేమంటే పంట వేసిన 90 రోజుల లోపు ఫెర్రీత్రాయిడ్ మందులు పత్తిపంటపై చల్లకూడదన్న నిషేదం ఉన్నప్పటికీ వ్యాపారస్తుల ప్రోత్సాహం ఉండడంతో ఆ క్రిమి సంహారక మందులు చల్లుతున్నారు. దీని ఫలితంగా మేలు చేసే క్రిములు చనిపోయి, పంటలను నాశనం చేసే క్రిముల సంఖ్య పెరుగుతున్నది. గత సంవత్సరం ఈ మందులు చల్లి ఆ మందు ఘాటుకు 30 మంది రైతులు చనిపోయారు. మరో 250 మంది రైతులు ఆసుపత్రుల పాలయ్యారు. బహుళ పంటల విధానం పోయి, మోనోక్రాప్ (ఒకేపంట) విధానం రావడంతో క్రిముల దాడి ద్వారా లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. దీనికి తోడు ప్రకృతి వైఫరిత్యాల వల్ల 15 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులకు రైతులు పూర్తిగా నష్టపోయినారు. ఉపకరణాల పరిస్థితి ఈ విధంగా ఉండగా, మరో వైపున వచ్చిన దిగుబడితో పెట్టుబడిని పొందాలన్న రైతుకు ఎగుమతుల నిషేదంతో మార్కెట్‌లో ధరలు తగ్గి పెట్టుబడి రాని పరిస్థితి ఏర్పడిరది. ఇన్ని విధాలుగా పంటలు నష్టపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే విధానాన్ని మాత్రం ఈ ప్రభుత్వాలు నిర్ణయించలేదు. ఎక్కడో కొద్దో, గొప్పో పరిహారం నిర్ణయిస్తే అది రైతుకు చేరడం లేదు.
2009`10లో రాష్ట్రంలో 36.42 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా 53 లక్షల బేళ్ల దూది దిగుబడి వచ్చింది. 2011`12లో పత్తి విస్థీర్ణం మరో 10 లక్షల ఎకరాలు పెరిగి 46లక్షలకు చేరుకుంది. ప్రకృతి వైఫరిత్యాలు వచ్చినప్పటికీ దిగుబడి 66లక్షల బేళ్లుగా అంచానా వేసారు. ఇందులో ఇంత వరకు 35 లక్షల బేళ్ల వరకు అమ్మారు. దాదాపు మరో 30`35శాతం పత్తి అమ్మకానికి రైతుల వద్ద ఉంది. ఈ రైతులకు కనీస మద్దతు ధరలు కూడా లభ్యం కాని పరిస్థితి ఏర్పడిరది. ఎప్పటికప్పుడు అంంచనాలు వేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతుల వద్దనున్న నిలువ పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా గాని, సివిల్ సప్లయ్స్ సంస్థ దారా గాని కొనుగోలుకు ముందుకు రావడం లేదు. రైతులు ఆందోళన చేసిన ప్రతి సందర్భంలో ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరాలు వ్రాయడం, చేతులు దులుపుకోవడం అలవాటుగా ఉంది. నేడు రుణభారం పెరిగి ఆత్మహత్మలకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది పత్తిరైతులే. ఒకవైపు ఆత్మహత్మలను నివారిస్తామని అట్టహాసంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం తమ విధానాల ద్వారా ఆత్మహత్యల పెంపుదలకు ప్రోత్సహిస్తున్నట్లు విదితమవుతున్నది.
అమెరికా, అస్ట్రేలియా, ఇజ్రాయిల్, సిరియా, చైనా దేశాల్లో పత్తిరైతులకు కల్పిస్తున్న రాయితీలను భారత ప్రభుత్వం కల్పించడం లేదు. హెక్టార్‌కు 1000 నుండి 1555 కిలోల దూది దిగుబడి వస్తుండగా మన దేశంలో హెక్టారు దిగుబడి 496 కిలోలు మాత్రమే. దిగుబడిని పెంచడానికి దూది స్టేపుల్ లెంత్‌ను పెంచడానికి ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు చేయడం లేదు. చివరికి విత్తన టెక్నాలజీకి కూడా బహుళజాతి సంస్థలపైననే ఆధారపడాల్సి వస్తున్నది. అమెరికాలో ఒక ఫండు పత్తి ధర 2010 ఆగస్టులో 90.35 సెంట్లు ఉండగా 2011 ఏప్రిల్ 216.62 సెంట్లకు ధర పెరిగింది. చైనాలో కూడా ఈ దామాషాలోనే ధరలు పెంచారు. కానీ ఈ దేశంలో మాత్రం పెరిగిన ఉపకరణాల ధరలను దృష్టిలో పెట్టుకోకుండా ధరల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చితే వారి ఉపకరణాల ధరలు తక్కువగానూ, ఉత్పాదకత ఎక్కువగాను ఉండగా మన దేశంలో ఉపకరణాల ధరలు అపరిమితంగానూ, దిగుబడి అత్యల్పంగానూ ఉంటున్నది. సగటున ఎకరాకు ఐదు నుండి ఆరు క్వింటాళ్ల పత్తి మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. గతంలో చేసిన రుణభారాన్ని తగ్గించుకోవడానికి రైతులు పత్తిపంటను ప్రధానంగా ఎంచుకున్నారు. కాటన్ అడ్వయిజరీ బోర్డు ఉన్నప్పటికీ దేశంలోని పత్తిరైతుల గురించి, వారి సంక్షేమం గురించి ఉత్పిత్తి ఖర్చులను తగ్గింపు చేసి, ఉత్పాదకతను పెంచడానికి సలహాలు ఇవ్వడంలాంటి చర్యలు ఏవీ చేయడంలేదు. పైగా ఈ బోర్డు ఎగుమతిదారులకు, వ్యాపారులకు అనుకూలంగా కేంద్రానికి సూచనలు చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెటును అధ్యయనం చేసి అనువైన భూముల్లో పంటను వేయడానికి ప్రోత్సహించే విధంగా అటు వ్యవసాయ శాఖ గాని, ఇటు ప్రభుత్వం గాని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
దేశవ్యాపితంగా వచ్చిన నిరసనను గమనించి కేంద్ర ప్రభుత్వం వాణిజ్యశాఖ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నాయకత్వాన కమిటీ సమాశం జరిపి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ కమిటీ సమావేశం జరిపి నిర్ణయం తీసుకునే లోపు తక్కువ ధరలకు అమ్ముకున్న రైతాంగానికి వారి నష్టాన్ని పూడ్చేదెలా? వారం`పదిరోజులలో ధరలలో వందల, వేల రూపాయల తగ్గడంతో రైతుల మానసిక స్థితి ఎలా ఉంటుంది? పసుపు, మిరప ధరలు క్వింటాలుకు పదివేలకు పైన ఉన్న ధర పంటల కోతకాలం రాగానే సగానికి సగం తగ్గించారు. ఇవీ ఎగుమతి ఆధారిత పంటలే. చెరుకుకు నిర్ణయించిన కనీస మద్దతు ధర అమలులేదు. మిగిలిన పంటల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. కేంద్ర వ్యవసాయ శాఖ, వాణిజ్య శాఖ రైతుల ఆదాయాన్ని తగ్గించే విధానాలనే అమలు చేస్తున్నాయి.
ఎగుమతి విధానం వలన నష్టపోయిన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం గత ధర ప్రకారం పరిహారాన్ని చెల్లించాలి. ఎగుమతి విధానాన్ని పునరుధ్దరించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
08.03.2012

No comments:
Post a Comment