రాష్ట్ర ప్రభుత్వ పంటల మార్పిడివిధానంతో సాగు భూముల్లో సుబాబుల్ మరియు జామాయిల్ పంటలు పెద్దయెత్తున వేస్తున్నారు. ఆహార పంటల విస్తీర్ణం తగ్గుతున్నది. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లోని ఆహార పంటల విస్తీర్ణంలో ప్లాంటేషన్ పెద్దయెత్తున సాగుచేస్తున్నారు. ముఖ్యంగా, కోస్తా జిల్లాల్లో కౌలు రైతులకు భూములు యివ్వకుండా భూ యజమానులే సుబాబుల్ లేదా జామాయిల్ పంటలను వేసి పట్టణాల్లో నివాసం వుంటున్నారు. వారే సాగుచేసుకుంటూ కౌలుదార్లను బేదఖల్ చేస్తున్నారు. పరిస్థితులు యిలాగే కొనసాగినచో ముతక ధాన్యాలు (జొన్నలు, రాగులు, సజ్జలు, వగైరా) మరియు పప్పుధాన్యాల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతున్నది. నూనెగింజల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 12లక్షల ఎకరాలలో ఈ పంటలను వేశారు.
ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు విస్తరించిన అటవీ ప్రాంతంలో 2లక్షల ఎకరాల్లో జామాయిల్ తోటలు వేశారు. మరింత విస్తరణ అటవీ ప్రాంతంలో జరుగుతున్నది. భద్రాచలం పేపరు మిల్లు (ఐటిసి) వారు రైతులనుండి భూమి బలవంతంగా సేకరించి మరో 30వేల ఎకరాల్లో జామాయిల్ తోటలు వేశారు. పశ్చిమగోదావరిలో జీడిమామిడి తోటలు తీసివేసి జామాయిల్, సుబాబుల్ తోటలు వేస్తున్నారు. రేయాన్ పల్పు ఉత్పత్తి ఫ్యాక్టరీలు ఈ పంటల విస్తీర్ణం పెంచడానికి సబ్సిడీలు, రాయితీలు యిస్తూ, ప్రోత్సహిస్తున్నారు.
ప్రభుత్వం - కొనుగోలుదార్లు మరియు రైతు సంఘాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం జామాయిల్‌కు టన్నుకు రు.1750/-, సుబాబుల్‌కు రు. 1600లు మార్కెట్ కమిటీల ద్వారా చెల్లించాలి. కొనుగోళ్ళన్నీ మార్కెట్ యార్డులలో జరగాలి. మార్కెట్‌లు వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలి. అందుకనుగుణంగా మార్క్‌ఫెడ్‌కు రు. 10 కోట్లు టర్నోవర్ నిధిని ఏర్పాటు చేశారు.
కానీ పై ఒప్పందం అమలుకు నోచుకోలేదు. కొనుగోలుదారులలో ఐటిసి గుత్తాధిపత్యం కల్గివుంది. ఎ.పి రేయాన్స్ వంటి సంస్థలు యితర రాష్ట్రాల నుండి కర్ర దిగుమతి చేసుకుంటున్నారు. ఆవిధంగా నిర్ణయించిన ధరలను కంపెనీలు చెల్లించకుండా టన్నుకు రు. 800-1000ల వరకే చెల్లిస్తున్నారు. కటింగ్‌కు టన్నుకు రు. 300ల వరకు వ్యయం అవుతుంది. చేను నుండి మార్కెట్‌కు తీసుకెళ్ళడానికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు వుంటుంది. ఈ ట్రాన్స్‌పోర్టు ఖర్చులు మరియు కటింగ్ ఖర్చులు తగ్గిస్తామంటూ ప్రచారం చేసి చేల వద్దనే ట్రేడర్లు కొనుగోలు చేస్తున్నారు. అక్కడి కొనుగోళ్ళపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేదు. కొంతమంది రైతులు గిట్టుబాట్లు లేవని ఈ ప్లాంటేషన్‌ను కూడా నరికివేస్తున్నారు. ఎక్కువ భూమికల్గిన భూస్వాములు ఈ పంటల విస్తీర్ణాన్ని యింకా కొనసాగిస్తున్నారు.
కాగితం వినియోగం :
సుబాబుల్, జామాయిల్ కర్ర ద్వారా రేయాన్ ఫ్యాక్టరీలు పల్పును తయారుచేస్తాయి. ఆ పల్పును కాగితంగా లేదా గుడ్డగా తయారుచేస్తాయి. ఇప్పటివరకు ప్రధానంగా కాగితాన్నే తయారుచేస్తున్నారు. మనదేశంలో 90 లక్షల టన్నుల కాగితం వినియోగంలో వుంది. దేశంలో 93 లక్షల సామర్థ్యం కల్గిన ఫ్యాక్టరీలు వున్నప్పటికీ వాటి ఉత్పాదకత మాత్రం 76 లక్షల టన్నులు మాత్రమే. అయితే అవి ప్రస్తుతం 52లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తిచేస్తున్నాయి. 2020 నాటికి 132 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి పథకాలు వేస్తున్నారు. ముడిసరకు (జామాయిల్, సుబాబుల్) ఉత్పత్తికి దేశంలోని అడవులలో పెంపకానికి అనుమతినివ్వాలని కంపెనీలు ఆందోళనలు చేస్తున్నాయి. 40 లక్షల ఎకరాల అడవులను ప్లాంటేషన్ పెంపకానికి యివ్వాలని కొత్తగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పేపర్ వాడకం భారత్‌లో 2008-09 నాటికి తలసరి వాడకం 8.5 కిలోలుగా వుంది. అంతర్జాతీయంగా తలసరి వాడకం 45 కిలోలు వుంది. కాగితం వాడకంలో మన దేశం అతితక్కువగా వుంది. ఈ తలసరి వాడకాన్ని పెంచడానికి తగినంత ఉత్పత్తిని పెంచాలి. అందుకనుగుణమైన ప్రణాళికలు ప్రభుత్వం వద్ద లేవు.
ధారం ఉత్పత్తి :
ఈ పల్పుద్వారా కాగితమే కాకుండా కృత్రిమ ధారాన్ని కూడా ఉత్పత్తిచేస్తారు. వరంగల్ జిల్లాలోని ఎ.పి.రేయాన్స్ ఫ్యాక్టరీ యేటా 1.08 లక్షల టన్నుల పల్పు ఉత్పత్తిచేస్తుంది. దీన్ని ధారానికి మాత్రమే వినియోగిస్తున్నారు. మూడున్నర టన్నుల సుబాబుల్‌గానీ, జామాయిల్ గానీ వినియోగించడం ద్వారా ఒక టన్ను పల్పు దిగుబడి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఫలితంగా కృత్రిమ ధారాన్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా గత ఐదునెలలుగా ఎ.పి రేయాన్స్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. కనీసం ఎగుమతి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి సహకరించడంలో వైఫల్యం చెందింది.
సేద్యయోగ్యంగాని లేదా తక్కువ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ఈ ప్లాంటేషన్ పెంపుదల వల్ల ఉభయత్రా లాభం వుంటుంది. ఇటు ఉత్పత్తిదారునికి, అటు ఫ్యాక్టరీలకు తగినంత ఆదాయ వనరు కల్గుతుంది. కానీ అందుకు తగినట్టు ప్రభుత్వం పథకాలను రూపొందించలేదు. మన రాష్ట్రంలో పరిశీలించినప్పుడు అనంతపురం, మహబూబ్‌నగర్ లాంటి వర్షపాతం తక్కువగల్గిన జిల్లాల్లో ఈ పంటలు వేయడం వలన అటు రైతులకు లాభదాయకంగా వుంటుంది. మొత్తం భూమి సేద్యయోగ్యమవుతుంది. ఇందుకు అనుగుణమైన విధానాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూపొందించాలి.
గుత్తాధిపత్యం :
కాగితం ఉత్పత్తిలో కీలకపాత్ర వహిస్తున్న రేయాన్స్ ఫ్యాక్టరీల యజమానులు ఈ రంగంపై గుత్తాధిపత్యం వహించియున్నారు. ముఖ్యంగా, ఐటిసి లాంటి సంస్థలు చిన్న ఫ్యాక్టరీల యజమానులను కట్టడిచేసి నిర్ణయించిన ధరల కన్నా తక్కువకు రైతులనుండి కొనుగోలు చేస్తున్నారు. ఒప్పందాలు ఉల్లంఘన జరిగి తక్కువ ధరలకు కొనుగోలు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ జోక్యం కల్గించుకొని ఒప్పందాన్ని అమలు చేయించాలి. కానీ, ఈ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడితెచ్చి అధికార్లను బాధ్యతలు నిర్వర్తించకుండా చేస్తున్నారు. పంటల మార్పిడి విధానంతో ముతక ధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు నూనెగింజల ఉత్పత్తులు తగ్గినప్పటికీ కనీసం కాగితం ఉత్పత్తి చేయడానికి ప్లాంటేషన్లు వేస్తున్నా, ఆ పంటకు కూడా ధరను తగ్గించి రైతులను దివాళా తీయించడం అత్యంత దుర్మార్ఘం. ప్రతి పంటకు మద్దతు ధరలు నిర్ణయించి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోలుచేయాలి. ఫ్యాక్టరీల గుత్తాధిపత్యాన్ని నిరోధించాలి. రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తిచేయాలి.
---

No comments:
Post a Comment