Monday, 11 August 2014

మైనర్‌ ఇరిగేషన్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. ఇప్పటికే (జూన్‌ 8) వర్షాకాలం ప్రారంభమై మూడు వారాలు గడచింది. సాధారణ వర్షపాతం పడలేదు. కోస్తాలో -62 శాతం, తెలంగాణాలో -51 శాతం, రాయలసీమలో -3.7 శాతం వర్షాలు సగటున తగ్గాయి. అక్కడక్కడా పడిన వర్షాలకు వేసిన పంటలు మొలకెత్తకుండానే ఎండిపోతున్నాయి. ఎండ వేడి ఉధృతికూడా తీవ్రంగా వుంది. సహజంగా వర్షాకాలం జూన్‌ 8 నుండి అక్టోబర్‌ 10వరకు వుంటుంది. ఈ నాలుగు మాసాల్లో వర్షాలు సకాలంలో రానప్పుడు ఖరీఫ్‌ పంటలు దెబ్బతింటాయి. గత దశాబ్ధకాలంగా ఖరీఫ్‌లో వేసే పప్పుధాన్యాలు, ముతక ధాన్యాలు, నూనెగింజల పంటలకు నష్టపోతూనే వున్నారు. ఈ పరిస్థితులను గమనించిన పూర్వీకులు మైనర్‌ఇరిగేషన్‌పై కేంద్రీకరించారు. 100 ఎకరాల ఆయకట్టుకు పైబడిన చెరువులు 9376 వుండగా ( 20.80లక్షల ఎకరాల ఆయకట్టు) మరియు 100 ఎకరాల లోపు ఆయకట్టు కల్గిన 63031 కుంటలు (14.90లక్షల ఎకరాల ఆయకట్టు) కల్గినవి నిర్మాణం చేశారు.  ఈ చెరువు కుంటలను నిరంతరం రిపేర్లు చేయడానికి తగిన ఆర్థిక వనరులను ఏర్పాటు చేశారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో మైనర్‌ ఇరిగేషన్‌ వనరులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
2009-10లో ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌లో మైనర్‌ ఇరిగేషన్‌కు ప్రణాళికా వ్యయం క్రింద రు. 810 కోట్లు కేటాయించారు. ఇందులో రు. 600 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌నుండి కాగా, రు. 60 కోట్లు ఎఐబిపి (ఏంద్రం) మరియు ఆర్‌ఐడిఎఫ్‌ క్రింద రు. 150 కోట్లు గ్రాంటుగా వచ్చాయి. ఇదికాగా ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు రు. 173.67 కోట్లు ప్రణాళికా వ్యయం చూపారు. ఈ నిధులు ఏ ఒక్క జిల్లాలో శిథిలావస్థలో వున్న చెరువులను రిపేర్లు చేయడానికి కూడా సరిపోవు. భారీ, మధ్యతరహా నీటిప్రాజెక్టులకు 2009-10లో రు. 12183 కోట్లు కేటాయింపు చూపారు. ప్రస్తుతం సాగవుతున్న 35లక్షల ఎకరాల ఆయకట్టుగల్గిన మైనర్‌ ఇరిగేషన్‌ను నిర్లక్ష్యం చేయడం సరిjైునదికాదు. జలయజ్ఞ ఫలితాలు నేటికీ రైతాంగానికి అందలేదు. గత ఐదు సంవత్సరాలలో రు. 45వేల కోట్లు వ్యయం చేయగా 2.10 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం కల్పించబడిరది. అది కూడా నేటి వర్షాభావ పరిస్థితుల వలన నీరందడంలేదు. భారీ నీటిపారుదల శాఖామాత్యులు తన స్వంత జిల్లాలో రు. 2500 కోట్లు వ్యయం చేసి నిర్మాణం చేస్తున్న దేవాదుల ప్రాజెక్టు వలన యీ రోజుకు ఒక్క ఎకరానికి కూడా సాగునీటి వసతి కల్పించబడలేదు.
- సారంపల్లి

No comments:

Post a Comment