2009 జనవరి 26తో 60వ రిపబ్లిక్ వార్షికోత్సవంలోకి భారత్ అడుగిడింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ రిపబ్లిక్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో పౌరుల హక్కులు, బాధ్యతలేగాక వారి హక్కుల రక్షణకు నిబంధనలను రూపొందించారు. రాజ్యాంగం ఆమోదించిన నిబంధనలను అందరూ పాటించాలి. ముఖ్యంగా పాలకవర్గాలు రాజ్యాంగం అమలుకు ప్రాతినిథ్యం వహించాలి. ఆ రాజ్యాంగం రూపొందించిన హక్కులే దళితుల రక్షణకు ఉపయోగపడాలి. కానీ రాజ్యాంగం ఆమోదించినా, పాలకులు మాత్రం దానిని అమలుచేయడంలో ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నారు. అలాంటి దానిలో దళితులకు కేటాయించిన స్పెషల్ ఎకనమిక్ కాంపొనెంట్ ఒకటి. కేంద్రం, రాష్ట్రాలు ఆమోదించిన చట్టాలు, నిబంధనలు అమలు ఎందుకు జరుగుటలేదు? దీనికి ఎవరు బాధ్యులు?
1980లో ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తూ దళితుల అభివృద్ధికి '' స్పెషల్ ఎకనమిక్ కాంపొనెంట్ '' ద్వారా వారి అభివృద్ధికి ప్రత్యేక నిధిని కేటాయించాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికగా ప్రతి శాఖ తను వ్యయం చేస్తున్న నిధులలో విధిగా దళితుల అభివృద్ధికి మాత్రమే కేటాయించాలని చెప్పారు. దళితుల అభివృద్ధికి వారి జనాభా ప్రాతిపదికగా అన్ని శాఖలూ తమ బడ్జెట్‌లలో నిధులను కేటాయించడాన్నే స్పెషల్ కాంపొనెంట్‌గా పరిగణిస్తారు. ఈ కేటాయింపుకు కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపింది. తద్వారా ఈ కేటాయింపు చట్టబద్ధంగా మారింది. ఈ చట్టబద్ధతను అన్ని శాఖలూ తప్పనిసరిగా పాటించాలి. అందుకు భిన్నంగా ఏ శాఖా నిధుల కేటాయింపును తగ్గించకూడదు.రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌నుండి ఈ నిధులు కేటాయించాలి. 2008-09 ప్రణాళికా బడ్జెట్ దాదాపు 50వేల కోట్లుంది. అంటే స్పెషల్ కాంపొనెంట్ క్రింద రు. 8100 కోట్లు కేటాయించాలి. ప్రణాళికా బడ్జెట్‌లో రాష్ట్ర ఇరిగేషన్‌కు రు. 16400 కోట్లు కేటాయించారు. దీనిలో రు. 2600 కోట్లు కేటాయించాలి. ఈ నిధులతో దళితుల భూములకు సాగునీటి వనరులు కల్పించాలి. ఇది జరుగుతున్నదా?
ప్రస్తుత సంవత్సరంలో 16.2 శాతంగా కేటాయింపులు చేయాలి. కానీ, 2008-09లో రాష్ట్ర ప్రభుత్వం 17.3శాతం కేటాయించి అత్యధికంగా నిధులను దళితులకు వివిధ శాఖల ద్వారా యిస్తున్నట్లు ఘనంగా బడ్జెట్ ప్రసంగంలో మంత్రి రోశయ్యగారు సెలవిచ్చారు. బడ్జెట్ ముగింపు ఉపన్యాసంలో ముఖ్యమంత్రిగారు మరింతగా నొక్కి ఈ ప్రత్యేక కాంపోనెంట్ ద్వారా దళితులు అభివృద్ధి అవుతారని శాసనసభలో చెప్పారు.
సంవత్సరం స్పెషల్ కాంపొనెంట్ కేటాయించినవి జరిగిన వ్యయం
- (రు. కోట్లలో) (రు. కోట్లలో) (రు. కోట్లలో)
2004-05 1993.68 1181.03 1341.50
2005-06 2347.62 1445.35 1341.50
2006-07 3240.00 1537.00 2250.25
2007-08 5340.87 4249.00 3460.00
2008-09 6997.00 7470.00 2500.00 (నవంబర్ 2008 నాటికి)
పై పట్టికను పరిశీలిస్తే చట్టబద్ధంగా కేటాయించాల్సిన కాంపొనెంట్ కన్నా అదనంగా కేటాయింపులు చూపినా వాస్తవ వ్యయం మాత్రం కాంపొనెంట్ మొత్తానికి తగ్గింది. కేటాయింపులు ఎక్కువచూపడం, దళితులకు భ్రమలు కల్పించడం నిధుల వ్యయాన్ని పరిశీలిస్తే అతి తక్కువ విడుదల చేయడం పరిపాటి అయింది. స్పెషల్ కాంపొనెంట్ ప్రకటించినప్పటినుండి నేటికి దాదాపు రు. 20వేల కోట్లు దారిమళ్ళినట్లు తెలుస్తుంది. ఇలా దారిమళ్ళడంపై గతంలో రాష్ట్ర ఆడిట్ నివేదికలో కూడా విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వాలు ఆ విమర్శలను ''బుట్టదాఖలు'' చేశాయి. అనునిత్యం దళితుల అభివృద్ధికి తామంతా కృషిచేస్తున్నట్లు ఫోజులు మాత్రం పెడుతున్నారు.
104 ప్రభుత్వ శాఖలు స్పెషల్ కాంపొనెంట్‌ను కేటాయించి అమలుజరపాలి. అనేక శాఖలు కేటాయింపులు కూడా చేయలేదంటే అతిశయోక్తికాదు. ఈ నిధులతో భూముల కొనుగోలుకు, ఉపాధి కల్పనకు, ఇళ్ళ స్థలాల కొనుగోలుకు, విద్యారంగంలో స్కాలర్‌షిప్పులకు మరియు సంక్షేమ పథకాలకు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, భూమి అభివృద్ధి, స్వయం ఉపాధి పథకాల ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారిని ఎగువకు తేవడానికి ఈ స్పెషల్ ఎకనమిక్ కాంపొనెంట్‌ను వినియోగించాలి. ఇప్పటికి దళితుల్లో 40శాతం దారిద్య్రరేఖకు దిగువన వున్నారని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. కానీ, వాస్తవానికి దళితుల్లో 60శాతానికి పైగా అత్యంత దారిద్య్రంలో మ్రగ్గుతున్నారు. గ్రామాల్లోని దళితవాడలను సందర్శిస్తే నేటికీ గృహవసతితో పాటు తిండి, బట్టకు నోచనివారు కనబడతారు. ఏపూటకాపూట వెళ్ళదీయడానికి యిబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి పౌష్టికాహారం యిప్పించి అభివృద్ధి చేస్తామని ఐసిడిసిఎస్ సంస్థలు ఏర్పాటు చేశామన్నారు. ఆ సంస్థలు అందించే సహాయం కూడా నామమాత్రమే.
ఇప్పటికి దళితుల్లో శిశుజనన సందర్భంగా మరణిస్తున్న తల్లుల సంఖ్య తక్కువేమీకాదు. దీనికి ప్రధాన కారణం రక్తహీనత, పౌష్టికాహార లోపమేనని వైద్యులు చెబుతున్నారు. నేడు దళితులలో 60శాతం మంది పౌష్టికాహారానికి అతి దూరంగా వున్నారు. ఆహారమే లేనివారికి పౌష్టికాహారం ఎక్కడ? ఇలాంటి వారిని సమాజంలో అభివృద్ధిలోకి తెస్తామని 1947 నుండి ఉద్బోధిస్తూనే వున్నారు. రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించారు. ఎప్పటికప్పుడు జీవోలు విడుదల చేస్తున్నారు. కానీ, దళితులు మాత్రం ''ఎక్కడవేసిన గొంగళి అక్కడే''అన్న చందంగా వున్నారు.
బ్యాంకులు కూడా తమ వ్యాపార ధనంలో జనాభా ప్రాతిపదికగా 16.2శాతం రుణాన్ని దళితులకు యివ్వాలి. నేడు 5శాతం కూడా వారికి యివ్వడంలేదు. బ్యాంకుల సమీక్షలలో మాత్రం రుణం పొందే అర్హతగల వారు లేరని ప్రచారం చేస్తున్నారు. కనీసం 15శాతం తమ వ్యాపార ధనంలో రుణ సౌకర్యం విధిగా కల్పించాలి. అందుకు భిన్నంగా వున్న ఆర్థిక సంస్థలపై చర్యలు తీసుకొనేవిధంగా నిబంధనలు రూపొందించాలి.
శాసనసభలో ప్రవేశపెట్టిన దళిత సంక్షేమ బడ్జెట్‌ను పరిశీలిస్తే మరిన్ని ఆశ్చర్యకర సంఘటనలు తెలుస్తాయి.
2008-09 సంవత్సరంలో రు. 2251.03 కోట్లు దళిత సంక్షేమ శాఖకు కేటాయింపు చూపారు. ఇందులో విడుదల చేసేదెంతో, తిరిగి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి తగ్గించేది ఎంతో, ఫిబ్రవరి-2009 చివరగాని తెలియదు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 123.39 లక్షలు (16.19శాతం) దళితులు వున్నారు. కేటాయింపులు మాత్రం 16.2 శాతానికే చేస్తున్నారు. 06-06-2003న గెజెట్ యంఎస్‌నెం. 33 ప్రకారం రాష్ట్రంలో దళిత సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. దీనిద్వారా 1995 పౌర హక్కుల చట్టాన్ని పరిరక్షించడం, 1989 అత్యాచార చట్టాన్ని అమలుచేయడంతో పాటు వారి సంక్షేమానికి కూడా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చట్టాలు ఎన్ని వున్నా దళితులకు పౌరహక్కుల రక్షణలోను, అత్యాచారాల నిరోధకంలోను పెద్దగా సాధించిందేమీలేదు. దళితులపై అకృత్యాలు, అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. దళితులను విద్యారంగంలో అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే సమస్య కొంత పరిష్కారమవుతుంది. పట్టణాల్లో కొంతమేర చైతన్యం పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని దళితుల్లో తమ హక్కుల సాధనలో చైతన్యాన్ని పెంచాల్సివుంది.
విద్యారంగం : దళితుల్లో ఉన్నత విద్య గరపడానికి ఉచితంగా స్టడీ సర్కిల్స్, కోచింగ్ సెంటర్స్ నిర్వహించాలని బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఐఎఎస్, ఐపిఎస్‌లతో పాటు గ్రూప్-1, గ్రూప్-2స్థాయి పరీక్షలకు హాజరయ్యేవిధంగా ఉచిత కోచింగ్‌తో వారిని తయారుచేయాలి. ఉద్యోగాలలో వారికి కేటాయించబడిన రిజర్వేషన్ల సంఖ్యకు తగ్గకుండా వారిని అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని రూపొందించాలి. అయినప్పటికీ సరియైన అభ్యరులు లేరన్న వాదనతో అనేక రిజర్వేషన్ ఉద్యోగాలు ఖాళీగా పెడుతున్నారు. హాస్టళ్ళ అభివృద్ధి, స్కాలర్‌షిప్‌ల పెంపుదల చేయాలని నిర్ణయించినా, ఆ హాస్టళ్ళు మురికి కూపాలుగానే వున్నాయి. బాలికల హాస్టళ్ళు మరింత దారుణంగా వున్నాయి. కనీస శానిటరీ సౌకర్యాలు కూడా లేనివి చాలా వున్నాయి. 70శాతం దళితులే వుండేవిధంగా నిర్ణయం చేసినా కొన్ని హాస్టళ్ళలో వారికి కేటాయించిన శాతం కూడా భర్తీ కాలేదు. హాస్టళ్ళ భవనాలు శిథిలావస్థలో వున్నాయి. వాటి రిపేర్ల గురించి ఆర్ & బి శాఖగానీ, పిడబ్య్లుడి శాఖ గానీ పట్టించుకోదు. బుక్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశారు. కానీ పుస్తకాల సరఫరా వుండదు.
బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలంటూ అనేక సంవత్సరాలుగా దళితులు ఆందోళనలు చేస్తూనే వున్నారు. ఇన్ని సంక్షేమ చర్యలు చేపట్టినప్పుడు వారికి కేటాయించబడిన ఉద్యోగాలకు అర్హతగల అభ్యర్థులు ఎందుకు దొరకడంలేదు? దీనినెప్పుడైనా ప్రభుత్వం సమీక్షించిందా?
కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రు. 5వేల నుండి 10వేలకు సహాయాన్ని పెంచారు. ఈ సహాయాన్ని పొందడానికి ఎంత ఖర్చు చేయాలో ! అసలు కులాంతర వివాహాలను ప్రోత్సహించి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాధికారులే అగ్రకులాల వారి అధికారానికి లొంగి వివాహాలకు ఆటంకాలు కల్పిస్తున్న ఘటనలు అనేకం వున్నాయి. అనాధలను సంరక్షించడానికి ఆనంద నిలయాలు, అనాద సదనాలు ప్రారంభించారు. ఈ సదనాలలో 100 సీట్లు నిర్ణయించి అందులో 50శాతం అనాదలు, 50శాతం అపరిశుభ్ర వృత్తి చేస్తున్న వారికి కేటాయించారు. రాష్ట్రంలో బాలుర సదనాలు 46 వుండగా, బాలికల సదనాలు 33 మాత్రమే వున్నాయి. ఇవి అనాదలకు ఏమేరకు సహకరిస్తాయి?
ప్రధానంగా తమ జీవనాదాయాన్ని తామే కల్పించుకొనేవిధంగా తమకున్న కొద్దిపాటి భూమిని అభివృద్ధి చేసుకోవడానికి వాటర్‌షెడ్ పథకాలను పెట్టారు. 1998-99 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50శాతం నిధులు కేటాయించగా, 1999-00 నుండి 75 : 25 శాతంగా మార్చారు. వాటర్ షెడ్ కాలపరిమితిని 4 సంవత్సరాలనుండి 5 సంవత్సరాలకు పెంచారు. 1250 ఎకరాలు కల్గిన ఒక పథకానికి రు. 20 లక్షల నుండి 30లక్షలకు పెంచినట్లు శాసనసభలో ప్రకటించారు. ఇందిర ప్రభ పేరుతో దళితులకు అసైన్డ్ చేసిన భూముల అభివృద్ధికి రు. 499 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రిగారు 2006లో గుంటూరు జిల్లాలో పథకాన్ని ప్రారంభించారు. ఇంతవరకు ఆ నిధులలో 50శాతం కూడా వ్యయం చేయలేదు. ఎడారి అభివృద్ధి కార్యక్రమం (డిడిపి) క్రింద మరియు ఏకీకృత బంజరు భూమి అభివృద్ధి కార్యక్రమం (ఐడబ్ల్యుడిపి) క్రింద 20 లక్షల ఎకరాల్లో 1638 వాటర్ షెడ్‌ల ద్వారా 19 జిల్లాల్లో అభివృద్ధి పథకాలు ప్రకటించారు.ఈ పథకాలకు కేంద్రం రు. 39.19 కోట్లు, రాష్ట్రం రు. 3.70 కోట్లు (11 : 1) కేటాయించాయి. దీనితో జరిగే దళితుల భూమి అభివృద్ధి ఎంత? ఇందిరమ్మ పెన్షన్ల పేరుతో 2008-09 సంవత్సరంలో రు. 15లక్షలు అదనంగా యివ్వాలని, పెన్షన్‌ను రు. 200 నుండి 500లకు పెంచాలని నిర్ణయించారు. గతంలో 26లక్షల మందికి పెన్షన్లు యిస్తున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లు 17.19 లక్షలు కాగా, వితంతు పెన్షన్లు 2.77లక్షలు యిస్తామన్నారు. వికలాంగులకు 01-04-2006 నుండి 2 లక్షల మందికి రు. 200 చొప్పున యిస్తున్నట్లు ప్రకటించారు. పెన్షన్లు పొందడంలో దళితులు పడుతున్న యిబ్బందులను ప్రత్యక్షంగా చూడాల్సిందే.
రాజీవ్ యువశక్తి పేరుతో ఉపాధి కల్పన, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా ప్రాజెక్టు క్రింద 30లక్షల మంది పేదవారిని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కేటాయింపులపైన ఏనాడైనా మండలస్థాయిలోగానీ, కనీసం జిల్లాస్థాయిలోగానీ అఖిల పక్షాలతో అభివృద్ధిపై సమీక్షించారా?
స్థానిక సంస్థలకు ఎన్నికైన వారికి (సర్పంచ్, ఎంపిటిసీ, జడ్‌పీటిసీ) శిక్షణ యిస్తామన్నారు. 2007-08లో 1,46000 మందికి శిక్షణ యిచ్చామన్నారు. శిక్షణ పొందినవారికి అధికారాలు యిచ్చారా? యింతవరకు పంచాయితీలకు అధికార బదలాయింపులే జరగలేదు. అందులో దళితుల పదవుల అధికారాలను ప్రస్తుత అధికార వర్గం కొనసాగనిస్తుందా? వారి అధికారాలను కూడా నేడు కొనసాగనివ్వకుండా అనేక ఆటంకాలు కల్పిస్తున్నారు.
25-10-1976న ఆర్డినెన్స్ జారీచేసి వెట్టిచాకిరీ విముక్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్, డిఆర్‌డిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌లతో 09-06-1997న జిల్లాస్థాయి సంఘాలను ఏర్పరిచారు. వెట్టి చాకిరీ నుండి విముక్తిచేసి తక్షణం రు. 1000లు వారికి యివ్వాలి. ఆ తర్వాత రు. 10000లు వారికి యిచ్చి పునరావాసం కల్పించాలి. ప్రస్తుతం రు. 10,000లను రు. 20,000లకు పెంచారు.ఈ చట్టం అమలవుతున్నదా? ఇప్పటికీ గ్రామీణప్రాంతాల్లో గానీ, పట్టణ ప్రాంతాల్లోని ఉన్నత వర్గాల ఇండ్లలో గానీ వెట్టిచాకిరీ చేస్తున్న వారు వేలాదిగా వున్నారు. వారిని ఏ పరిస్థితుల్లోను విముక్తికాకుండా చూస్తున్నారు. ఏదో విధమైన ఆటంకాలు, రాజకీయ వత్తిడిలు పెట్టి వెట్టిచాకిరీని కొనసాగిస్తున్నారు. అందుకే నేటికీ దళితుల పిల్లలు, బాలబాలికలు వెట్టి చాకిరీలో మ్రగ్గుతూనేవున్నారు. వెట్టిచాకిరీ చేయించుకుంటున్న కుటుంబాల వారే బహిరంగంగా వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా అనర్గళంగా ఉపన్యాసాలు చేస్తున్నారు.
దళితులకు కేటాయించిన స్పెషల్ ఎకనమిక్ కాంపొనెంట్ నిధులతో పాటు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు జతచేసి వారి అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి సాగిస్తే సమాజంలో వీరిని అభివృద్ధి చేయడం అంత కష్టమేమీ కాదు. కనీసం జనాభా ప్రాతిపదికగా కేటాయింపులు చేయాలి. వాస్తవానికి వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండానే అవసరంమేరకు కేటాయింపులు చేసి కొద్దికాలంలోనే వారిని సమాజంలోని వారితో సమానహోదాకు తీసుకురావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారి స్థాయిని పెంచాలి. అప్పుడే ఈ కేటాయింపుల లక్ష్యం సార్థకమవుతుంది.
- సారంపల్లి
---

No comments:
Post a Comment