1983లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ - నక్సలైట్లు, పోలీసులు మరియు భూస్వాములు కలిసి సిపిఐ(ఎం) పార్టీని జిల్లాలో నామరూపాలు లేకుండా చేయాలని పెద్దయెత్తున నిర్బంధ కాండ సాగిస్తున్న రోజులవి. సిపిఐ(ఎం) నాయకత్వంపై వేలాది కేసులను బనాయించారు. అనేకమంది కార్యకర్తలు అజ్ఞాతంలో వున్నారు. అందులో నేను కూడా వున్నాను. ఆ సందర్భంగా ఎగ్నెస్ స్మెడ్లీ రచించిన ''జైత్రయాత్ర'' (జనరల్ చూటే జీవిత పథం) చదివాను. నిరంతరం నిర్బంధాలతో సతమతమవుతున్న పరిస్థితుల్లో ఈ పుస్తకం నూతనోత్తేజాన్ని కల్గించింది. కమ్యూనిస్టు అనేవాడు విరామంలేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్బంధాలు వచ్చినా తట్టుకొని నిలబడాలన్న దీక్ష కల్గింది. మొత్తం కుటుంబం తలాఒక్కదిక్కు అజ్ఞాతంలో వున్నా శత్రువుతో పోరాడటంలో జనరల్ చూటే సల్పిన పోరాటం మహా గొప్పది.
1961లో నాకు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1956-57లో పదోతరగతి ఉత్తీర్ణుడైన తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువును ఆపివేయాల్సివచ్చింది. మా గ్రామం తిమ్మంపేట. నర్సంపేట నియోజకవర్గంలో వుంది. మా గ్రామంలోని భూస్వాములు, కరణం - మాలి పటేల్ కుటుంబాలు మొత్తం గ్రామాన్ని తమ చేతుల్లో పెట్టుకొని పేద ప్రజలపై దోపిడీ సాగించారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా వుండేది. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టేవిధంగా 1961 చివర కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1962లో జరిగిన ఎన్నికల్లో గ్రామంలోని పేదలు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి మొదటిసారిగా ఓట్లు వేశారు. నాడు పోటీచేసిన పార్టీ అభ్యర్థి అర్షనపల్లి వెంకటేశ్వరరావు గెలిపొందారు. ఆ గెలుపు స్పూర్తితో నియోజకవర్గంలో కమ్యూనిస్టుపార్టీ అభివృద్ధి సాగింది.
1964లో సిపిఐ(ఎం) పార్టీ ఏర్పాటుతో అందులోకి రావడం జరిగింది. ఉద్యమ పెరుగుదలను నిరోధించడానికి 1974 నుండి 1984 వరకు పెద్దయెత్తున నిర్బంధకాండ సాగింది. దాదాపు 40మంది కార్యకర్తలు శత్రువులచే హత్యకు గురయ్యారు. మూడు వేల మందిపై బెయిలు అనుమతిపొందని కేసులు బనాయించారు. జిల్లాలో యింత నిర్బంధం సాగుతున్నా కార్యకర్తలు, ప్రజలు ఆ నిర్బంధానికి ఎదురుగా నిలిచారు.1982లో ప్రథమముద్రణ జరిగిన ''జైత్రయాత్ర'' గ్రంథాన్ని చదవాను.
'' మనం పోరాడినా, పోరాటం విరమించినా మరణిస్తాం. కాబట్టి పోరాడదాం''. ''మనం ప్రజలకు ద్రోహం చేయకూడదు. వాళ్ళకు మనం ఒక మహత్తరమైన ఆశ కల్పించాం. వాళ్ళు మనమీద గొప్ప విశ్వాసం పెట్టుకున్నారు. ఆ విశ్వాసానికి మనం అంకితం కావాలి.'' ప్రజలను విప్లవపథంలో నడుపుతానని చెప్పిన కొమిన్‌టాంగ్ పార్టీని హెచ్చరిస్తూ చూటే చెప్పిన మాటలివి. సన్‌యెట్ సేన్ మరణానంతరం కొమిన్‌టాంగ్ పార్టీకి చాంగ్ కైషేక్ నాయకత్వం వహించి విప్లవాన్ని తప్పుదారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా కొమిన్‌టాంగ్ సైన్యంతో పోరాడాలని చూటే ఉద్బోధించాడు. విప్లవం పేరు చెప్పి పోరాటాలు చేసేవారంతా విప్లవవాదులు కానట్టే నాడు వరంగల్ జిల్లాలో సిపిఐ(ఎం) పార్టీపై అందరూ కలిసి సాగించిన నిర్బంధం దాదాపు అలాంటిదే.
ఒకటవ నల్లమందు యుద్ధంలో చైనాకు ఓటమి సంభవించి అర్థవలస దేశంగా మారింది. ఎక్కడ చూసినా ఆకలి, పస్తులు సార్వసాధారణం. చూటే పెదనాన్న ఇతనిని చదివించడానికి పాఠశాలకు పంపించారు. బడిలో 16మంది మాత్రమే వుండేవారు. మా గ్రామంలో కూడా పాఠశాలలో నాతో సహా ఏడుగురు మాత్రమే చదువుకొనేవారు. అర్థవలస దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈతిబాధలు తొలగించటానికి డాక్టర్ సన్-ఎట్‌సేన్ నాయకత్వాన రిపబ్లికన్‌లు అనేక పోరాటాలు సాగిస్తు వస్తున్నారు. బాక్సర్ తిరుగుబాటుతో పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయి. ఒకే సంవత్సరంలో ఆరు, ఏడు సార్లు శిస్తులు వసూలు చేసేవారు. 1907లో సన్-ఎట్‌సేన్ విప్లవ సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసారు. జర్మనీలో ఉండగా జపాన్ భాష నేర్చుకోమని టీచర్ చెబితే, జపాన్ వ్యతిరేకతతో ఆ భాష నేర్చుకోవడానికి నిరాకరించాడు. జపాన్ టీచర్ అంటేనే చీదరించుకోనేవాడు. చదువు పూర్తియిన తర్వాత సంవత్సరానికి 150 డాలర్ల వేతనంతో బిజినెస్ మేనేజర్‌గా ఇలింగ్స్‌యస్ గ్రామంలో ఉన్నాడు. 1908లో సైన్యంలో చేరడానికి ప్రయత్నించగా కుటుంబం పూర్తిగా వ్యతిరేకించింది. అయినా తన 22వట మిలటరీ అకాడమీలో చేరాడు. అకాడమీలో చేరాక రిపబ్లికన్ రహస్య సంస్థ సభ్యుడిగా చేరాడు. ఆ సంస్థలో సభ్యుడుగా చేరాలంటే తన రక్తంతో ప్రమాణ పత్రంతో సంతకం చేయాలి. ఇద్దరు జమీందార్లు కావాలి. మొదటిసారి జమీన్‌దార్లు దొరకలేదు. 1911లో జర్మనీలో ఉండగా చౌ -ఎన్‌లై చొరవతో కమ్యూనిస్టు సభ్యుడిగా చేరాడు.ఆతర్వాత చైనానుండి పూర్తికాలం సభ్యుడిగా ఆమోదం లభించింది.
చూటే వివాహం- చూ-పెన్‌తో జరిగింది. ఆమె చెంగ్దులో చదువుకుంటుండగా వివాహం జరిగింది. వివాహనంతరం చదువు కొనసాగించింది. చూటే మిలటరీ అకాడమీలో ఉండేవాడు. వారానికొకసారి మాత్రమే భార్యభర్తలు కలుసుకొనేవారు. వీరికి మగపిల్లవాడు జన్మించాడు. కొత్తకాలానికి భార్య టైఫాయిడ్‌తో మరణించింది. తల్లి లేని పిల్లవాణ్ని స్నేహితుల వద్ద వదిలి వెళ్ళారు. ఈ దుఃఖ సమయంలోనే సుప్రీం కమాండర్‌ల నుంచి పిలుపు వచ్చింది. 1916లో రెండు బ్రిగేడ్‌ల సైన్యంతో చూటే సెచువాన్ వైపు వెళ్ళారు. స్నేహితుల వత్తిడితో రెండవ పెళ్ళికి అంగీకరించి వుయూలాన్‌ను రెండవ పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరికి సంగీతంపై మక్కువ ఎక్కువ. తన తల్లి లేని పిల్లవానితో ఈమె అత్యంత సన్నిహితంగా మెలిగింది. వివాహితులైన తన ఇద్దరు తమ్ముళ్ళను కుటుంబం వారించినా మిలటరీ ఆకాడమీలో పెట్టాడు. వారు 1919లో యుద్ధ ప్రభువులతో జరిగిన యుద్ధంలో మరణించారు. 13 సంవత్సరాల తర్వాత భార్య, బిడ్డను సెచువాన్ ప్రభువులు హత్య చేశారు.
పెంకింగ్ విశ్వవిద్యాలయ ఆచార్యులయిన ప్రొఫెసర్ చెన్‌దూ జియాని కార్యదర్శిగా చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1 జూలై 1921 న పార్టీ అవతరించింది. నాడు రైల్వే కార్మికుల పోరాటాలు సాగాయి. 8 గంటల పనిదినాన్ని సాధించారు.
మాతృదేశ విమోచనానికి కిటుకు ఏమిటో అన్వేషించడానికి విదేశాలు వెళ్ళారు. మార్సెయిల్స్ తర్వాత ఫ్రాన్స్, జర్మనీల్లో పర్యాటనలు చేశారు. అన్ని దేశాల్లో చైనాలాగే దారిద్య్ర పరిస్థితులున్నాయి. ఫ్రాన్స్‌లో చౌఎన్‌లై కార్యదర్శిగా చైనా కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పరిచారు. చౌఎన్‌లై చూటే కంటె 10 సంవత్సరాలు చిన్నవాడు. చూటే పూర్తికాలం సభ్యుడిగా అయిన తర్వాత నిరంతర అధ్యయనం సాగించాడు. కమ్యూనిస్టు పార్టీ మ్యానిఫెస్టో - సాహిత్యం - చైనా కమ్యూనిస్టు పత్రిక గైడ్ అధ్యయనం చేశారు. జర్మన్ భాష నేర్చుకున్నారు. 1924లో బెర్లిన్ వెళ్ళాడు. అక్కడ కొమిన్‌టాంగ్ తీర్చిదిద్దే బాధ్యతను చూశాడు. జాతీయ ఐక్యసంఘటన కోమింటాంగ్ రూపుదిద్దుకోవడం కొత్త అంశంగా చూటే భావించాడు. డాక్టర్ సన్ ఇందుకు మూడు ప్రతిపాదనలు చేశాడు. 1. కమ్యూనిస్టు పార్టీతో సహకారం 2. కార్మిక -కర్షక ప్రయోజనాల కొరకు కృషి 3. సోవియట్ యూనియన్‌తో మైత్రి పై మూడు ప్రతిపాదనలను చూటే అంగీకరించాడు. దున్నెవాడికే భూమి, కౌలు రేటు నాలుగోవంతుకు తగ్గింపు పోరాటాలు కొనసాగాయి. రైతు సంఘాల ఆత్మ రక్షణ దళాలు ఏర్పడ్డాయి. భూస్వాములు కిరాయి మూకలతో కలసి రైతాంగంతో యుద్ధానికి దిగారు. బెర్లిన్‌లో చూటే తాను నిర్వహించే పత్రికకు ముద్రణాలయం లేకపోవడంతో స్టెన్సిల్‌తో నకళ్ళు తీయించి పంపిణి చేశాడు. అయినే వ్యాసాలు సేకరించేవాడు. రోనియో తిప్పేవాడు. ఆఫీస్ బాయ్ నుంచి మేనేజర్ వరకు అతనే. డాక్టర్ సన్ 40 సంవత్సరాలు చైనా విముక్తికి పోరాడి 1925 మార్చి 12న పెకింగ్‌లో మరణించాడు. అయిన మరణంతో కోమింటాంగ్ పార్టీలో ముఠాలు, వర్గాలు తలెత్తాయి. అయిన నిర్మించిన విప్లవ కట్టడాన్ని కూల్చడానికి ఆ వర్గాలు ప్రయత్నించాయి. అనంతర కాలంలో ఈ పార్టీకి చాంగ్- కై షేక్ నాయకుడుగా ఉన్నాడు.
ఇదే కాలంలో బెర్లిన్‌లో బహిరంగ సభలో పాల్గొన్ననేరానికి చూటేకి పది రోజులు జైలు శిక్ష అనంతరం 24 గంటల్లో జర్మనీ వదిలిపెట్టి వెళ్ళాలని ఆదేశించారు. 1922లో జర్మనీ వెళ్ళిన ఇతను బహిష్కరణతో 1926లో జర్మనీ వదిలిపెట్టాడు.
మావోసేటుంగ్ నిర్మించిన రైతాంగ ఉద్యమ దాటికి తట్టుకోలేక భూస్వాములు పలాయినం చిత్తగించారు. స్త్రీలపై ఆత్యాచారాలు, సజీవ సమాధి, కార్యవర్గంపై దాడులు కొనసాగించారు. చూటే అటు కోమింటాంగ్ కేంద్ర కమిటీ సభ్యుడుగాను, ఇటు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడుగాను ఉన్నాడు. ఎప్పటికప్పుడు దళాలను నిర్మించి చాంగ్ - కై షేక్‌కు దుష్ట విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాడు. 1927 లో దేశంలో 50 వేల కమ్యూనిస్టులు మరియు 35 వేల మంది కమ్యూనిస్టు యవజన సంఘ సభ్యులున్నారు.
మురికి కారుతూ బట్టలు మసిపోయి, చినిగిపోయి భయానకంగా ఆకలితో పీక్కుపోయి ఉన్నాయి.అయిన ధృడంగా నిలబడి పోరాటాలు సాగించారు. ఒక్కో దళంలో ఒకరు సైనిక దళాధిపతిగా మరొకరు రాజకీయ కమీస్సార్‌గా నిర్ణయించబడ్డారు. ప్రతి దళంలో రాజకీయ కమీస్సార్ వారికి విద్యాబోధన కమ్యూనిస్టు ప్రణాళిక ఎత్తుగడలు చెప్పాలి. శత్రు పక్షం నుండి లొంగిపోయిన వారిని కాల్చిచంపడం కాకుండా వారికి రాజకీయ శిక్షణ జరిపి తనవైపు వేలాది మంది శత్రు సైనికులను తిప్పుకున్నాడు. విజయం సాధించిన అన్నిపట్టణాల్లో, గ్రామాల్లో సోవియట్‌లు ఏర్పాటు చేశారు. భూములు పంపిణీ చేశారు. కోమింటాంగ్ సైన్యంతో ఎర్రసైన్యం తలపడింది. వందలమంది ఎర్రసైనికులు మరణించారు. చూటే వుయూలాన్ శత్రువులకు పట్టుపడింది. ఆమెను చిత్రహింసలు పెట్టి శిరచ్చేదం చేశారు. కొంతకాలానికి అతనికి కుమారుడ్ని కూడా సైనికులు చంపివేశారు. తిరిగి ఒంటరివాడు అయ్యాడు. మావో, చూటేలు విజయం సాధించారు. సైనిక ఎత్తుగడలతో శత్రువులను తికమకపెట్టారు.
1. శత్రువు మీదకి వస్తున్నప్పుడు తిరోగమించారు. 2. శత్రువు ఆగి సేద తీర్చుకుంటున్నప్పుడు వేధించాలి. 3. శత్రువు యుద్ధం తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాడి చెయ్యాలి. 4. శత్రువు తిరోగమిస్తున్నప్పుడు వెంటాడాలి. వీటితో పాటు మూడు క్రమశిక్షణ సూత్రాలను పాటించారు. 1. ఆదేశాలకు విధేయత 2. ప్రజల వద్దనుండి సూది, దారం సైతం తీసుకుపోకూడదు. 3. స్వాధీనం పరుచుకున్న సరుకును అప్పగించాలి. రాత్రి పడకున్న ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తలపు చెక్కలు, ఎండుగడ్డి తిరిగి ఇచ్చి వేయాలి. ప్రజలతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. సాధ్యమైనంతవరకు సహాయపడాలి. అరువు తీసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలి. నష్టపరిచిన వస్తువుకు న్యాయం చెల్లించాలి. వ్యాపార వ్యవహారాల్లో నీతిగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలి. బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఇండ్లకు దూరంగా గుంట తవ్వి, లేచి వచ్చేటప్పుడు పూడ్చి రావాలి. స్త్రీలను హింసించరాదు, ఖైదీలను హీనంగా చూడరాదని 8 నియమాలను రూపొందించుకున్నారు.పై విధానాల వల్ల చివరకు శత్రు సైనికులు కూడా ఈ నియమాలను చూసి చూటే సైన్యంలో చేరిపోయారు.
1929 చివర్లో కాంగ్ కే - చిన్ నలభై మూడో యేట వివాహం చేసుకున్నారు. ఆమె రైతుబిడ్డే. రైతాంగ విప్లవ దళాల్లో పనిచేసేది. లక్షలాది మంది ప్రజలను యుద్ధ ప్రభువులు చంపివేశాయి. ఎర్రసైన్యంలోని వారు కూడా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
1934 అక్టోబరు 15న సైన్యంలో లాంగ్‌మార్చ్ ప్రారంభమైంది. 1936 డిసెంబరు 3న ముగిసింది. ఈ మహా ప్రస్థానంలో జనరల్ చూటే అన్ని యూనిట్‌లను తనిఖీ చేసేవాడు. ప్రతి ఒక్కరిని ఉల్లాసపరిచేవాడు. నిరాశపడడం అన్నది ఆయన నిఘంటువులో లేదు. కియాంగ్సి, ప్యూకిన్ నుంచి పశ్చిమోత్తర చైనాకు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర ఐనిమిది వేల మైళ్ళు సాగింది. టిబెట్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో వందలమైళ్ళు విస్తరించిన గడ్డి భూముల గుండా యాత్ర సాగింది. రక్తం గుడ్డ కట్టే చలిలో పదిరోజుల పాటు ఈ యాత్ర సాగింది.
చైనాపై జపాన్ దురాక్రమణ సాగించిన సందర్భంగా ఐక్య సంఘటన ఏర్పాటుకు కృషి చేశారు. జపాన్ సామ్రాజ్యవాదుల నుండి, కొమిన్‌టాంగ్ సైన్యాలనుండి, స్థానిక భూస్వాములనుండి చైనాకు విముక్తి కల్గించడంలో చూటే పాత్ర కీలకమైంది. జీవితంలో తనకున్న కుటుంబ సంబంధాలను కూడా పూర్తిగా వదులుకొని తన జీవితమంతా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి, ప్రజల విముక్తికి త్యాగం చేసిన మహనీయుడు. శత్రువుతో పోరాడటమేగాక ఐక్య సంఘటనలను ఏర్పాటుచేసి ఉమ్మడి శత్రువును ఓడించిన తర్వాత వర్గ శత్రువును ఎలా ఓడించాలో యీ జైత్రయాత్ర స్పష్టం చేస్తుంది. సరిగ్గా యిదేవిధానాన్ని అనుసరించడం ద్వారా సిపిఐ(ఎం) పార్టీని విస్తృతపర్చాం. కార్యకర్తలతో ఎలా వుండాలో వివరించిన పుస్తకం యిది.
నేటి విప్లవకారులు ఆ త్యాగస్పూర్తితో పని చేసినప్పుడే మనం ఆశించిన లక్ష్యాన్ని చేరగల్గుతామనడంలో సందేహంలేదు.
---

No comments:
Post a Comment