గ్రామీణ భారతంలో పంచాయితీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత వుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక సంస్థలు అత్యంత కీలకపాత్ర వహించాలి. దేశంలో 73,74 రాజ్యాంగ సవరణలు చేసి స్థానిక సంస్థలను ప్రజలకు అందుబాటులో వుంచాలని నిర్ణయించారు. కానీ అనేక రాష్ట్రాలలో స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసి పాలకులకు జేబు సంస్థలుగా మార్చుకున్నారు. ఈ సంస్థల ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా చేశారు. అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లోనే పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ ప్రణాళికలు ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడేదీ సమీక్షించిన పాపాన పోలేదు. ఎప్పటికప్పుడు స్థానిక సంస్థలను బలపరుస్తామని, అన్ని అధికారాలను వాటికే యిస్తామంటూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెప్పడం పొరపాటిగా వుంది. స్థానిక సంస్థలకు అధికారం యివ్వడమంటే తమ అక్రమార్జనను వదులుకోవడమే. అందుకే ధనిక, పెట్టుబడిదారీ వర్గాలు అన్ని అధికారాలను తమ గుప్పిట్లోనే పెట్టుకొని స్థానిక సంస్థలను ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ సంస్థల ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆందోళనలు చేసినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. కానీ పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లోని పంచాయితీ వ్యవస్థలు యిందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. గ్రామ పంచాయితీల ద్వారా ప్రణాళికలు రూపొందించి వాటి అమలుకు తగిన నిధులను పంచాయితీలలోనే రాష్ట్ర ప్రభుత్వాలు డిపాజిట్ చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులలో 50శాతం పంచాయితీ సంస్థల ద్వారానే వ్యయం చేస్తున్నారు.
ఆదర్శవంతమైన కేరళ పంచాయితీలు:
కేరళ రాష్ట్రంలో మొత్తం 990 పంచాయితీలు వున్నాయి. ఒకవిధంగా ఆంధ్రప్రదేశ్‌తో పోల్చిచూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనే 800 నుండి 900 పంచాయితీల వరకు వున్నాయి. కానీ కేరళలో పంచాయితీల యొక్క విస్తీర్ణ పరిధి విశాలంగా వుంది. బెంగాల్ లోనూ అలాగే వున్నాయి.
నల్లేపిల్లి గ్రామ పంచాయితీ వివరాలు :
ఈ పంచాయితీ చిత్తూరు బ్లాకు (తాలుకా)లో వుంది. ఈ పంచాయితీకి శ్రీ వి. రాజన్ గారు అధ్యకక్షులుగా ఎంపికయ్యారు. మూడు గ్రామాలతో (1. నల్లేపల్లి 2. చిత్తూరు 3. తిక్కేదేశం) కలిసివుంది. గ్రామ పంచాయితీని 18 వార్డులుగా విభజించారు. ఈ వార్డులలో 33శాతం మహిళలకు రిజర్వు చేయబడినాయి. ఈ గ్రామ పంచాయితీలో నాలుగు వార్డులు దళితులకు, ఒకటి గిరిజనులకు కేటాయించబడ్డాయి. మొత్తం ఓట్లు 24000. జనాభా 32000. ఇందులో హరిజనులు 6000 మంది వుండగా, గిరిజనులు 147 మంది మాత్రమే వున్నారు. అయినా వీరికి ఒక స్థానాన్ని కేటాయించారు.
గ్రామ పంచాయితీ కమిటీలు :
1. ఫైనాన్స్ కమిటీ : దీనికి ఉప సర్పంచ్ ఛైర్మన్‌గా వుంటాడు.
2. డెవలప్‌మెంట్ కమిటీ
3. సంక్షేమ కమిటీ
గ్రామంలో ప్రభుత్వ పథకాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సివచ్చినప్పుడు విధిగా గ్రామ సభలలోనే ఎంపిక చేయాలి. లాభోక్తుల ఎంపికకు ఈ పంచాయితీలో 01-01-2009 నాటికి నాలుగు గ్రామ సభలు జరిగాయి. రెండు సంవత్సరాల్లోనే నాలుగు సభలు జరిపారు. పంచాయితీ కమిటీ సమావేశం ప్రతి నెలా విధిగా జరపాలి. మూడు సమావేశాలు జరగనిచో కమిటీ రద్దవుతుంది. సభ్యుడు సమావేశాలకు వరుసగా మూడుసార్లు రానిచో అనర్హులవుతారు.
బడ్జెట్ : 2008-09కి రు. 1,14,89,104గా వుంది. 1. ఇంటిపన్ను 2. లైసెన్స్ రుసుం 3. వృత్తిపన్ను 4. వినోదపు పన్నులు మాత్రమే వసూలు చేస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు సిబ్బంది వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం లెక్కవేసి వీరి బడ్జెట్‌కు జమచేస్తుంది. ప్రతి అభివృద్ధి పనికి ఒక వర్కింగ్ గ్రూపును గ్రామ పంచాయితీ నిర్ణయిస్తుంది.
ఈ గ్రామ పంచాయితీ పరిధిలో ముగ్గురు బ్లాకు కమిటీ సభ్యులు (ఉదా: మన రాష్ట్రంలో ఎంపిటిసీల వలే) వుంటారు. ఈ పంచాయితీ చిత్తూరు బ్లాకు (మండలం)లో వుంది. ఈ బ్లాకులో మొత్తం 12 మంది సభ్యులు వున్నారు. ప్రతి ఎనిమిది వార్డులకు ఒక బ్లాకు మెంబర్‌ను ఎంపికచేస్తారు. బ్లాకు కమిటీ మెంబర్ పంచాయితీ సమావేశాలలో ఎక్స్- అఫిషియోగా వుంటారు. ఈ పంచాయితీలో యిద్దరు జిల్లా పరిషత్ సభ్యులు ఎంపిక కాబడతారు. స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు మరియు బ్లాక్ కమిటీ సభ్యులు ఎక్స్-అఫిషియోగా సమావేశాల్లో పాల్గొంటారు. గ్రామ పంచాయితీలో ఈ దిగువ కార్యాలయాలు వున్నాయి.
1. వ్యవసాయ శాఖ : ఒక వ్యవసాయ శాఖాధికారి, ముగ్గురు వ్యవసాయ అసిస్టెంట్‌లు వున్నారు.
2. పశు సంక్షేమం : దీనికి ఒక అధికారి, ఒక అసిస్టెంట్ వున్నారు.
3. అంగన్వాడీ హెల్త్ వర్కర్ : ప్రతి గ్రామ పంచాయితీలో 1.అల్లోపతి 2. హోమియోపతి 3. ఆయుర్వేదం వైద్యశాలలు వుంటాయి. ఇవి ఉచితంగా వైద్య సౌకర్యాలు అందిస్తాయి.
4. విద్యారంగం : ఈ పంచాయితీ ఏరియాలో నాల్గవతరగతి లోపు ఆరు పాఠశాలలు, ఐదు- ఏడవ తరగతి లోపు మూడు అప్పర్ - ప్రైమరీ పాఠశాలలు, 10+2 ఉన్నత తరగతికి ఒక పాఠశాల, ఒక జూనియర్ టెక్నికల్ కాలేజీ, ఒక ఆర్ట్స్ కాలేజీలు వున్నాయి. విద్యా రంగానికి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యత యివ్వబడింది. 100శాతం విద్యార్హత కల్పించబడుతుంది.
5. విద్యుత్: వ్యవసాయరంగానికి 100శాతం విద్యుత్ రెండున్నరెకరాల వరకు ఉచిత సరఫరాగా వుంది. వరి పంట వేసినచో ఎన్ని ఎకరాలకైనా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ పంచాయితీలో 29 రైతు సమితులు పని చేస్తున్నాయి. రైతుకు కావాల్సిన ఎరువులు, విత్తనాల్లో 50శాతం సబ్సిడీ యిస్తున్నారు.
ప్రజా ప్రతినిథుల గౌరవ వేతనాలు :
గ్రామ సర్పంచ్ : రు. 4200 + ఫోన్‌బిల్లు + 500 టి.ఏ,
వార్డు మెంబర్ : రు. 1500/-
స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రు. 1800/-
ఉపాధ్యకక్షుడు : రు. 3300
బ్లాకు మెంబర్ : రు. 1800/-
బ్లాకు స్టాండింగ్ కమిటీ మెంబర్ : 1800/-
బ్లాకు ప్రెసిడెంట్ రు. 5600/-
బ్లాకు వైస్ ప్రెసిడెంట్ రు. 3800/-
ప్రతి సమావేశానికి రు. 60లు సిట్టింగ్ ఛార్జీ యిస్తారు.
వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు :
వ్యవసాయ కార్మికులకు కనీస దిన కూలి రు. 124.65 పైసలుగా నిర్ణయించారు. ఉపాధి హామీ పథకం కార్మికులకు రు. 125లు యిస్తున్నారు. పని కల్పించడమే గాక ఆ పనిద్వారా ఆస్తుల సంపాదన జరిగేవిధంగా ప్రణాళిక రూపొందించారు.
పెన్షన్‌లు : గ్రామ పంచాయితీలో 1200 మందికి రు. 200 చొప్పున పెన్షన్లు యిస్తున్నారు.
చౌకదుకాణాలు : రు. 22000ల ఆదాయం లోపుగల వారికి తెల్లకార్డులు (బిపిఎల్), ఆ పై ఆదాయం గల(ఎపిఎల్) వారికి గులాబి కార్డులు యిచ్చారు.
బిపిఎల్ వారికి తలసరి ఆరు కిలోల బియ్యం చొప్పున 19 కిలోల పరిమితి వరకు యిస్తారు. కిలోకు రు. 3లు మాత్రమే తీసుకుంటారు. కుటుంబానికి కిలో రు. 6ల చొప్పున ఆరు కిలోల గోధుమలు మరియు కిలో రు. 11ల చొప్పున రెండు కిలోల పంచదార యిస్తున్నారు. వ్యవసాయ కార్మికులు మరణిస్తే వారికి ఆర్థిక సౌకర్యం కల్పిస్తున్నారు. బిపిఎల్ వారికి ఇండ్ల నిర్మాణంలో యితరులకు రు. 50వేలు, దళితులకు రు. 75వేలు, గిరిజనులకు రు. లక్ష ఉచితంగా యిస్తున్నారు.
ఎపిఎల్ వారికి కిలో రు. 8.90ల చొప్పున 7 కిలోల బియ్యం, కిలో రు. 7ల చొప్పున ఐదు కిలోల గోధుమలు, రు. 13.50ల చొప్పున కిలో పంచదార, లీటరుకు రు. 2.5 చొప్పున రెండు లీటర్ల కిరోసిన్ యిస్తున్నారు.
అంత్యోదయ అన్నయోజన పథకం క్రింద కిలో రు. 3ల చొప్పున 35 కిలోలు యిస్తున్నారు. విడిగా బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన బియ్యం కిలో రు. 15లకు మాత్రమే అమ్ముతున్నారు.
---

No comments:
Post a Comment