నీటి కేటాయింపులు :
1. మహారాష్ట్ర :
కోయిన హైడల్ ప్రాజెక్ట్‌కు గత ట్రిబ్యునల్ 67.5 టిఎంసీలు కెేటాయించగా, ప్రస్తుత ట్రిబ్యునల్ మరో 25 టిఎంసీలు కేటాయించారు. ఈ నీరు ఆరేబియా సముద్రానికి వెళ్ళుతుంది. (ఇవి నికర జలాలు.)
2. కర్ణాటక :
అప్పర్ భద్రకు 10 టిఎంసీలు, అప్పర్ తుంగకు 12 టిఎంసీలు, సింగటలూరుకు 18 టిఎంసీలు (మొత్తం 40 టిఎంసీలు) కెేటాయించారు.
కర్ణాటకకు ఆల్‌మట్టి ఎత్తు 524.256 మీటర్ల ఎత్తు) ప్రస్తుత ఎత్తుకు అదనంగా 4.656 మీటర్లు) పెంచుతూ 130టిఎంసీల నిలువ శక్తిని పెంచారు. ఆల్‌మట్టిలో 303 టిఎంసీల నిలువ ఉంటుంది.
3. ఆంధ్రప్రదేశ్ :
1. 9 టిఎంసీలు జూరాల ప్రాజెక్ట్‌కు, 25 టిఎంసీలు తెలుగుగంగాకు, 150 టిఎంసీలు శ్రీశైలం, నాగర్జున సాగర్ ప్రాజెక్ట్‌కు ముందస్తు నిలువ (రానున్నపంట కాలనికి) పెట్టాలి.
2. జూరాల ప్రాజెక్ట్‌కు కర్ణాటక ఆల్‌మట్టి నుండి 8`10 టిఎంసీల నీరు జూన్, జూలై మాసాలలో విడుదల చేయాలి.
3. ఆర్.డి.ఎస్ కు 10 మీటర్ల ఎగువన 4765క్యూసెక్కుల ప్రవాహంతో నిర్మిస్తున్న హైడల్ ప్రాజెక్టును కట్టరాదు.
(పేజీ 581).
4. ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర వెనక నీటి నుండి హైలెవల్ సమాంతర కాలువ త్రవ్వ కూడదని కమిషన్ పేర్కొంది.
(పేజీ 592)
ప్రస్తుతం ఉన్న హైలెవల్ కాలువకు పూడిక కేటాయించిన నీరు చేరగా 32.5 టిఎంసీలు పూర్తిగా రావడం లేదు.
` కృష్ణా జలాల తీర్పు అమలుకు బోర్డు ఏలా ఉండాలో అపెన్‌డిక్స్ `1లో వివరించారు.
` 16 టిఎంసీల నీటిని కృష్ణా నదిలో పర్యావరణ పరిరక్షణకు కనీస ప్రవాహాన్ని అనుమతించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలు :
1.భద్ర, తుంగ, సింగటలూరుకు ఎగువన కర్ణాటక నిర్మించిన 9 చిన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ సీరియస్‌గా అభ్యంతరం చెప్పలేదని కమీషన్ పేర్కొంది. (పేజీ 548)
2.ఆల్‌మట్టి ఎత్తు పెంచకుండా వాదనలలో ‘‘దిగువకు నికర జలాలు రావడం లేదని మాత్రమే వాదించారు’’.
(పేజీ 615)
కమిషన్ తుంగభద్ర ద్వారా 190, కృష్ణా ద్వారా 702 మిగులు జలాలు దేవపూరం ద్వారా 350 నుండి 400 టిఎంసీలు. మొత్తం 1300 టిఎంసీలు ఆంధ్రప్రద్‌శ్‌కు వస్తున్నట్లు కమీషన్ గణాంకాలు పేర్కొన్నాయి. (పేజీ 657,658) ఆంధ్రప్రదేశ్ దిగువన జలయజ్ఞంలో చేపట్టబడ్డ ప్రాజెక్టులను కమీషన్ దృష్టికి తేలేదు.
3. మొదటి ట్రిబ్యునల్‌లో గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్ళించినప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలకు 80 టిఎంసీలలో 34 టిఎంసీలు నీటిని కేటాయించాలన్న బంధన తొలగించబడలేదు. దీని పై వాదనలు జరగలేదు.
4. దామాషా పద్దతి నీటి విడుదల లేదు. నెల వారి నీటి గణాంకాలు సేకరించి దిగువకు నీరు విడుదల చేయాలన్న నిబంధన పై వాదనలు లేవు.
5. కృష్ణా నది నీటి నిర్వహణ పై ఏర్పాటు చేయు బోర్డు అధికారాలలోని 18 (II) ‘‘రిజర్వాయర్ కేపాసిటి’’ నిర్వచనంలో డెడ్ స్టోరేజీ, లైవ్ స్టోరేజీ మాత్రమే నిర్దేశించారు. వాస్తవానికి కేటాయించబడిన నీటిలో 2/3 వంతు మాత్రమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్న సూచన లేదు. ఆల్‌మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు (కర్ణాటక) కేటాయించిన నీటి నిల్వకు తగిన ప్రాజెక్టులకు అనుమతిచ్చారు. కేటాయించిన నీరు కాక అదనంగా ఎప్పటికప్పుడు వస్తున్న నీటిని పై రాష్ట్రాలు వినియోగించుకుంటాయి.
6. మిగులు జలాల పంపిణీపై జరిగిన వాదనలలో (స్కీం`బి) (పేజీ 434 నుండి 472 వరకు) మిగులు జలాల ఆధారంగా జలయజ్ఞంలో నిర్మించబడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఆంధ్రప్రదేశ్ చర్చకు తేలేదు.
7.ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో 150 టిఎంసీలు ‘‘క్యారీ ఒవరు’’గా పెట్టడం వలన నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాలకు జూన్‌లో ఖరీప్ పంటలు వేయవచ్చనీ కమీషన్ అభిప్రాయ పడిరది. డిసెంబరు వరకు పంటలకు నీరిచ్చిన తర్వాత ‘‘క్యారీ ఒవర్’’ పెట్టడం సాధ్యం కాదు.
ఆల్‌మట్టి, నారాయణపూర్ నిర్మాణ దశలు : (20 లక్షల ఎకరాల సాగు లక్ష్యం)
` 20.12.1963లో 103 టిఎంసీలతో ప్రాజెక్టు మంజూరైంది. (10 లక్షల ఎకరాల సాగుకు అంచనా). (మొదటి దశ)
` 1964లో నిర్మాణం ప్రారంభించారు.
` 1965`66లో 119 టిఎంసీలకు పెంపు చేశారు.
` 1986`87లో రివైజ్‌డ్ చేశారు. (ఇది రెండవ దశ)
` 24.09.1990న ప్లానింగ్ కమీషన్ అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏ అభ్యంతరం చేప్పలేదు.
` జ్యోతిబసు అధ్వర్యాన నడిచిన కమీషన్ 519.6 మీటర్లు ఎత్తు పెంచడానికి 170 టిఎంసీల నీటి నిల్వకు తీర్పు ఇచ్చింది.
` ప్రస్తుత కమీషన్ 524.256 మీటర్ల ఎత్తు నిర్మాణం చేసుకొని అదనంగా 130.9 టిఎంసీలు (మొత్తం 303.9 టిఎంసీలు) నిల్వ పెట్టవచ్చని తీర్పులో చెప్పారు. (ఇది మూడవ దశ).
` కర్ణాటకలోని గుల్‌బర్గా రాయచూర్, బీజాపూర్,బాగల్‌కోట్ జిల్లాలు తీవ్రంగా కరువు వాత పడ్డట్టు కమీషన్‌ను ఒప్పించగలిగారు.
` ఆంధ్రప్రదేశ్‌లో మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల కరువు పరిస్థితులను మన వాదనలలో వినిపించలేక పోయాం.
తేది:15.02.2011,

No comments:
Post a Comment