‘‘రాష్ట్రంలో 2011`12 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 228.15 లక్షల టన్నులుగా నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 30% సబ్సిడీపై 26 లక్షల క్వింటాళ్ల విత్తనాలకు 400.10 కోట్లు కేటాయించింది. 79.05 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తారు. 12.12 కోట్లతో పొలంబడి కార్యక్రమం, 81.50 కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ, 75 కోట్లు పావలా వడ్డీ క్రింద కేటాయించారు. 48 వేల కోట్లు పంట రుణాలు ఇస్తామని ప్రకటించారు. ప్రతి 250 కుటుంబాలకు ఒకరు చొప్పున 41.062 మంది ఆదర్శరైతుల నియామకానికి 50 లక్షల గౌరవ వేతనం క్రింద చెల్లిస్తారు. వ్యవసాయ శాఖ ప్రకటిస్తున్న ‘‘పాడిపంటల మాసపత్రిక’’ లక్ష సర్క్యులేషన్ చేస్తారు. రాష్ట్రాయ కృషి వికాస్ యోజన పథకం క్రింద 293.28 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వ్యవసాయ టెక్నాలజీ మానేజ్‌మెంట్ ఏజెన్సీ పథకం 22 జిల్లాల్లో 57.17 కోట్లతో అమలు జరుపుతారు. ఈ పథకానికి కేంద్రం, రాష్ట్రం 90:10 శాతం భరిస్తారు.’’ అని వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జి మంత్రి దామోదరం రాజనర్సింహ గారు 2.7.2011న ప్రకటించారు. 2011`12 రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ క్రింద ప్రణాళికేతర రు. 557.98 కోట్లు, ప్రణాళిక క్రింద రూ.2148.65 కోట్లు కేటాయించారు. 1.28 లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించింది ````` శాతం మాత్రమే. ఈ కేటాయింపులతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఆశించిన లక్ష్యం నెరవేరగలదా?
గత అనుభవాన్ని బట్టి చూస్తూ వాతావరణం అనుకూలించినప్పుడు ఉత్పత్తి పెరగడం, అననుకూల వాతావరణం ఏర్పడినప్పుడు ఉత్పత్తి తగ్గడం జరుగుతున్నది. అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వరదల మరియు కరువుల నష్టాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి శాశ్వత ప్రణాళికలు లేవు. ఈ దిగువ ఆహార ధాన్యాల ఉత్పత్తిని గమనిస్తే ప్రభుత్వం ఏ మేరకు చొరవ చూపింది అర్థమవుతోంది.
సంవత్సరం ఉత్పత్తి విస్థీర్ణం
2004`05 133.94 66.66
2005`06 169.50 71.68
2006`07 162.29 72.74
2007`08 198.87 73.87
2008`09 204.04 74.30
2009`10 152.90 65.90
2010`11 207.56 79.32
(ఉత్పత్తి లక్షల టన్నుల్లో, విస్థీర్ణం లక్షల హెక్టార్లలో)
2009`10లో సంభవించిన కరువు ఫలితంగా అంతకు ముందు సంవత్సరంపై 26శాతం ఉత్పత్తి తగ్గింది. విస్థీర్ణం మాత్రం తగ్గలేదు. ప్రత్తి, హార్టీకల్చర్ తదితర వాణిజ్య పంటల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. రైతులు మాత్రం పంటల ఉత్పత్తి తగ్గినా, పెరిగినా పెట్టుబడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఎరువుల ధరలు, విత్తనాల ధరలు 30 నుండి 50% వరకు పెరిగాయి. యాంత్రిక వ్యవసాయంలో ట్రాక్టర్ దున్నకం, కోత వ్యయం కూడా బాగా పెరిగింది. ఈ రోజు ఒక ఎకరం ట్రాక్టర్‌తో దున్నించాలంటే 4000 నుండి 5000 రూపాయలు చెల్లించాలి. అదే విధంగా కోత యంత్రాలకు కూడా ఎకరాకు 3000 వరకు చెల్లిస్తున్నారు. పెట్టుబడి పెరిగినా కనీస మద్దతు ధరలు మాత్రం పెరగలేదు. అంతే కాకుండా నిర్ణయించిన మద్దతు ధరలు మార్కెట్ యార్డుల్లో అమలు జరగడం లేదు.
విత్తనాల సమస్య: రాష్ట్రంలో అన్ని పంటలకు కలిపి 50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. నేడు విత్తన రంగం పూర్తిగా బౌహుళ జాతి సంస్థలపరమైంది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా వదలుకుంది. విదేశీ బహుళజాతి సంస్థలైన మన్‌సాంటో, కార్గిల్, సింజెంట, డూపాయింట్ స్వదేశీ సంస్థలైన ఐటిసి సంస్థలు పూర్తి విత్తనంపై ఆధిపత్యాన్ని వహించినాయి. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ, జాతీయ విత్తనాభివృద్ది సంస్థ సుప్తావస్థలో పెట్టారు. 2003లో మన్‌సాంటో కంపెనీ 9600 బీటి పత్తి ప్యాకెట్స్ (ఎకరాకు) సరఫరా చేయగా, 2010`11లో 91లక్షల ప్యాకెట్లను సరఫరా చేసింది. బీటీ విత్తనాలు రాకముందు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన మల్లిక, నర్సింహ విత్తనాలను ఎకరాకు 230 రూపాయలు వ్యయం చేయగా, బీటీ విత్తనాలు వచ్చాక 1850 రూపాయలకు పెరిగింది. రైతాంగ ఉద్యమం వల్ల ఎకరా విత్తనాలను 750 రూపాయలకు తగ్గించారు. కంపెనీలు తాము సరఫరా చేసే 450 గ్రాముల విత్తన ప్యాకెట్లలో 30% నాన్‌బీటీ విత్తనాలు ప్రవెశపెట్టడంతో ఎకరాకు 2 ప్యాకెట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఆ విధంగా తిరిగి ఎకరాకు 1500 పెట్టుబడి పెట్టారు. 2011`12కు 750 ఉన్న ధరను రాష్ట్ర ప్రభుత్వం 930కి పెంచింది. ప్రస్తుతం రెండు ప్యాకెట్లు వేయాలంటే రైతు 1860 రూపాయలు పెట్టుబడి పెట్టారు. దీనికి తోడు కృత్రిమ కొరత సృష్టించి ఒక్కొక్క ప్యాకెట్ 2000 వరకు అమ్మారు. రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ విత్తన ధరను 3600 నుండి 5200లకు పెంచి క్వింటాల్‌కు 1600 రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ మధ్య దళారీలకే చెందింది. రైతు మార్కెట్ ధరకే సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేసారు. 16 జిల్లాల్లో 25 రాష్ట్ర సీడ్స్ ఫామ్స్ పెట్టామని చెప్పినప్పటికీ రైతులకు విత్తనాలు మాత్రం సరఫరా కాలేదు. నాణ్యత లేని విత్తనాల సరఫరా విత్తనాలతో ఏటా 4`5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. నేటికీ విత్తనాల కొరకు రైతులు బ్లాక్ మార్కెట్లపై ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంది.
ఎరువుల పరిస్థితి: ఏప్రిల్ 2010 నుండి ‘‘మూలకాల ఆధారిత సబ్సిడీ’’ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఈ మధ్య కాలంలో ఎరువుల ధరలు విఫరీతంగా పెరిగాయి. గత సంవత్సరం ఎరువుల కొరకు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలోని 17 మిక్సింగ్ ప్లాంట్లకు సబ్సిడీ ఎరువులను మళ్లించడం ద్వారా ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయి. రాష్ట్ర అవసరాలకు ఖరీఫ్, రబీలకు కలిపి యూరియా 28 లక్షల టన్నులు, డిఏపి 10 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 28 లక్షల టన్నులు, సూపర్ ఫాస్పేట్ 3 లక్షల టన్నులు, పొటాష్ 7 లక్షల టన్నులు మొత్తం 76 లక్షల టన్నులు అవసరం. ధరలు పెరగడానికి తోడు వ్యాపారులు కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. 2011 ఖరీఫ్ సీజన్‌లో కూడా రైతులు నల్లబజారులో ఎరువులను కొనుగోలు చేస్తున్నారు.
నల్లబజారులో ఎరువులు అమ్ముతున్నట్లు తెలిసినా వ్యవసాయ శాఖలో కదలిక లేదు. ఈ వ్యాపారంలో కూడా బడా కంపెనీల ఆధిపత్యమే ఉంది. సహకార సంస్థల ద్వారా గాని, ప్రభుత్వ సంస్థల ద్వారా గాని గతంలో చేసిన సరఫరాను విరమించుకున్నారు. దేశ అవసరాలకు నత్రజని 150, భాస్వరం 65, పొటాషియం 30 లక్షట టన్నుల మూలకాలు అవసరం కాగా, దేశంలో 120 లక్షల టన్నుల నత్రజని, 44 లక్షల టన్నుల భాస్వరం మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నది. పొటాషియం మొత్తం దిగిమతులపైననే ఆధారపడుతున్నాం. 2008`09లో 40 లక్షల టన్నుల నత్రజని, 30 లక్షల టన్నుల భాస్వరం, 34 లక్షల టన్నుల పొటాషియం దేశంలో దిగుమతి చేసుకున్నాం. స్వయం పోషకత్వంలో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే వైఫల్యం చెందింది. రామగుండం, గోరక్‌పూర్, దుర్గాపూర్, ట్రాంబే, కొచ్చిన్, టాల్చేర్, సింద్రి, బరోని, నైవేలీలలోని 28.46 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి సమర్థ్యం గల ఫ్యాక్టరీలను 1999 నుండి 2002 మార్చి మధ్య మూసివేసారు. దీనితో దిగుమతులు తప్పనిసరి అయ్యాయి. మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరారెడ్డి శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రాష్ట్రంలో మూలపడిన నాలుగు ఎరువుల ఫ్యాక్టరీలను తెరిపించి, గ్యాస్ ధ్వారా ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందేట్లు చేస్తామన్నారు. కానీ ఇంత వరకు ఆ ఫ్యాక్టరీల రీతిలో ఏ మాత్రం కదలిక రాలేదు. ఎరువులను రైతులు విచక్షణా రహితంగా వాడుతున్నారని అందువలన సబ్సిడీ విషయంలో మార్పులు తెచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఎరువులను అవసరం మేరకు వినియోగించాలంటే భూసార పరీక్షలు జరిపి రైతులకు ఏ ఎరువును ఎంత వాడాలో తెలియజేయాలి. మరోవైపున భూసార పరీక్షలు చేసే ప్రభుత్వ సంస్థలను మూసివేసారు. ఎరువుల వ్యాపారులు ఇచ్చిన సలహాల మేరకే రైతులు ఎరువులు వినియోగిస్తున్నారు. పరోక్షంగా మధ్య దళారీలకు (ఎరువుల ఉత్పత్తి దారులకు) లాభాలు చేకూర్చిపెట్టడానికి సబ్సిడీ విధానాన్ని మార్చారు. 2008`09లో దేశంలో ఎరువుల సబ్సిడీ క్రింద 74 కోట్లు వ్యయం చేయగా 2011`12లో 50 వేల కోట్లకు కుదించారు. రానురాను ఎరువులను రీకంట్రోల్ చేసి పూర్తి భారాన్ని రైతులపై వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాల వలనే ఎరువుల ధరలు విఫరీతంగా పెంచుతున్నారు.
రుణ సమస్య:
2011`12 రాష్ట్ర రుణ ప్రణాళికను మే 27న ఆలస్యంగానైనా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేస్తున్నామంటూ మొత్తం రుణ ప్రణాళిక 1.04 లక్షల కోట్లలో 48 వేల కోట్లు కేటాయించామని రుణ వితరణకు చెందిన సమావేశంలో ప్రకటించారు. ప్రతి బ్రాంచి 100 మంది కొత్త వారికి లేదా కౌలుదారులకు విధిగా రుణాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. వాణిజ్యబ్యాంకులు వడ్డీ మాఫీ రికార్డుల తయారీలో నిర్లక్ష్యం చేసాయని నిరసన తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఏటా మార్చి, ఏప్రిల్‌లో రుణ ప్రణాళిక విడుదల చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి అందుకు భిన్నంగా మే చివరిన రుణ ప్రణాళికను విడుదల చేసారు.
రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం మొత్తం బ్యాంకుల వ్యాపారంలో 40 శాతం ప్రాధాన్యతా రంగానికి (వ్యవసాయం దాని అనుబంధ రంగాలు) కేటాయించాలి. ఇందులో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలకు 18 శాతం నిధులు కేటాయించాలి. 2011 మార్చి 31 నాటికి అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు 2,83,600 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. 40 శాతం అనగా రు.1,13,440 కోట్లు ప్రాధాన్యతా రంగానికి కేటాయించాలి. 18 శాతం వ్యవసాయ రంగానికి అనగా రు.51,048 కోట్లు కేటాయించాలి. కానీ పంట రుణాలుగా రు.30,985 కోట్లు,అనగా 10.92 శాతం కేటాయించారు.ధీర్ఘ కాలిక రుణాలకు 1.84 శాతం కేటాయించారు. మొత్తంగానూ చూసినాపంటరుణాలు, మరియుధీర్ఘకాలిక రుణాలకు కలిపి 12.76 శాతం మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులతో ప్రాధాన్యతా రంగం అభివృద్ది చెందుతుందా? మొత్తం ప్రాధాన్యతా రంగం(వ్యవసాయం,వ్యవసాయేతరమరియు ఇతర రంగాలు) కేటాయింపులు 1,03,915 కోట్లు (36.64 శాతం) కేటాయించారు.ఇప్పటికే వ్యవసాయ రంగానికి తగినంత రుణం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో 1.24 కోట్ల కమతాలుండగా 64 లక్షల కమతాలకు మాత్రమే రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్యాంకుల నివేదికలు తెలుపుతున్నాయి. రుణార్హత కలిగిన సన్న,చిన్నకారు రైతులు మరియు జాయింట్ లయబిలిటీ గ్రూపులలోని కౌలు రైతులు రుణాల కొరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు, మైక్రోఫైనాన్స్ సంస్థల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఒకవైపున పంటలు దెబ్బతినడం, మరోవైపున వడ్డీభారం పెరగడం తట్టుకోలేక వేల సంఖ్యల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి రుణ విధానాన్ని మెరుగుపర్చాలన్న ఆలోచన గానీ, వాస్తవసాగుదారులకు రుణసౌకర్యం కల్పించాలన్న ఆలోచన గానీ లేకపోవడం గమనించాలి.
2012 డిపాజిట్లపై పంటరుణాల శాతాలు 31.03.2011 నాటి 283600 ను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది.
ప్రయోజనంలేని పంటల భీమా :
పంటల భీమా పథకం ప్రారంభించిన 1985 నుండి నేటికీ ప్రయోగాల దశలోనే ఉంది. ఈ మద్య వాతా వరణ భీమా పథకం ప్రవేశపెట్టారు. ఏ పథకం ప్రవేశపెట్టినా రెండుమూడు సంవత్సరాలు మినహా మిగిలిన అన్ని సంవత్సరాలు రైతుల నుండి వసూలు చేసిన ప్రీమియంలో శాతం కూడా పరిహారంగా చెల్లించలేదు. నేటికీ అన్ని పంటలకు భీమా వర్తింపులేదు. ప్రీమియం 7శాతం వరకు పెంచారు. భీమాకింద వసూలు చేసిన సొమ్ముకు రైతులు అనాయాచితంగా రైతులు వడ్డీ చెల్లిస్తున్నారు. గత సంవత్సరం 15 జిల్లాలలోని 669 మండలాల్లో 27 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. తిరిగి 2011 ఏప్రిల్‌లో మరో 3.25 లక్షల ఎకరాల పంటలకు నష్టం జరిగింది.కరువులు ఏటా 300,400 మండలాల్లో వస్తున్నాయి. అదేవిధంగా వరదలవల్ల వేలాది కోట్ల పంటల నష్టం వాటిల్లుతుంది. 1977నవంబరునుండి 2010 నవంబరు మే నాటికి 21 భారీ తూఫాన్‌లలో వేలాది కోట్ల పంటకు నష్టం వాటిల్లింది. పరిహారం మాత్రం అందలేదు.
పై అంశాలను గమనించినపుడు వ్యవసాయరంగాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రపంచబ్యాంకు విధానాలలననుసరించి వ్యవసాయం ఎడల ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యాన్ని వహిస్తున్నది.పంటల మార్పిడి ద్వారా ఆహార పంటల విస్తీర్ణన్ని తగ్గించి మార్కెట్‌లేని ఎగుమతి ఆధారిత వాణిజ్య పంటలను ప్రత్యేక శ్రద్దతో ప్రోత్సహిస్తున్నారు. ఈ పంటలకు ధరలు రాక రైతులు రుణగ్రస్తులవుతున్నారు. పండ్లతోటలు, కూరగాయలు, పూలతోటలు, సుబాబుల్, జామాయిల్,ఆయిల్‌ఫామ్, చేపలపెంపకం, ఉప్ప ఉత్పత్తి తదితర పంటల ద్వారా మధ్యదళారీలు ముఖ్యంగా బహుళజాతి సంస్థలు లబ్దిపొందుతున్నారు. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు అమలుకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించడంలేదు. 2011`12కు గత మద్దతు ధరలపై రాష్ట్రప్రభుత్వం 100 శాతం పెంచాలని కోరగా కేంద్రప్రభుత్వం 8 శాతం ధరలు పెంచారు. ఫలితంగా రైతులు‘‘ పంటల సెలవు ’’ ప్రకటిస్తామంటూ ఆందోళనలు చేస్తున్నారు. మిగులు ఉత్పత్తులనే దిగుమతులు చేసుకోవడం వలన ఆ పంటల ధరలపై తీవ్రప్రభావాని చూపగా, మిగులు పంటల విస్తీర్ణం తగ్గిస్తున్నారు. సాగునీటి సంస్కరణలు చేపట్టి సాగునీటినుండి రైతులను దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. వాటర్‌రెగ్యులేటరీ కమిషన్ వేసి నీటిని పారిశ్రామిక సంస్థలకు , త్రాగునీటి వ్యాపార సంస్థలకు విక్రయించే ప్రయత్నంచేస్తున్నారు. 200`05 నుండి 2010`11 మార్చి చివరి నాటికి 62,833.36 కోట్లు జలయజ్ఞంపై వ్యయం చేసి సాధించింది బహుతక్కువ. కాంట్రాక్టర్ల,పాలకుల అవినీతికి జలయజ్ఞంబలైంది. మైనర్ ఇరిగేషన్, బావులు సేద్యం, ఎత్తిపోతల పథకాల కింద చేపట్టిన ఇరిగేషన్ వనరులు నేడు సాగునీటికి నోచకుండా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే ఈ వ్యవస్థను రైతులకు అప్పజెప్పడం ఫలితంగా వాటిని నిర్వహించుకునే ఆర్థికస్థోమత లేక, తగువిజ్ఞానం కొరత వలన ఎత్తిపోతల పథకాలు ప్రతిజిల్లాలో పనిచేయడంలేదు. ముఖ్యంగా దళిత గిరిజనులకు ఏర్పాటు చేసిన మైనర్ ఇరిగేషన్ స్కీములు వృధాఅయినాయి.
సంస్కరణల నేపథ్యంలో కౌలు రైతుల సంఖ్య అన్ని జిల్లాలలో పెరుగుతూ ఉంది. వీరికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం 1956 కౌెలుదారీ చట్టం అమలుకు నిరాకరించి నామ మాత్ర హక్కులతో ఆర్డినెన్స్‌ను తెచ్చింది. దానిని కూడా అమలు జరపగల చిత్తశుద్ది లోపించింది. 2004 నుండి నేటివరకు రాష్ట్రంలో 6 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. వీటి నివారణకు ప్రభుత్వం ఎలాంటి పథకాలూ రూపొందించలేదు. కనీసం గతంలో వేసిన నిపుణుల కమిషన్ సూచనలను కూడా పాటించడంలేదు. కార్పోరేట్ విధానాల అమలుకే రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విధానాన్ని రెండు విధాలుగా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నది. 1. రైతులను భూమల నుండి వెల్లగొట్టి భూములను కార్పోరేటీకరణ కిందికి తేవడం 2. రైతుల వద్దనే భూములనుంచి కార్పోరేట్ విధానంలో పంటలను పండిరచడం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, రైతుల చైతన్యం దృష్ట్యా రెండవ విధానానికే ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. రైతులతో ఘర్షణ వైఖరి రాకుండా కార్పోరేట్ విధానాన్ని అమలు జరుపుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఉపకరణలన్నీ కార్పోరేట్ బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లాయి. చివరికి రుణాలు కూడా మైక్రోఫైనాన్స్ సంస్థలు ఆధీనంలోకి వచ్చింది. దేశంలో 70 వేల కోట్ల బ్యాంకు రుణాలతో మైక్రో ఫైనాన్స్ సంస్థలు వడ్డీవ్యాపారాలు చేస్తున్నాయి. ఇవి 30 శాతం వడ్డీ వసూలు చేస్తూ స్వయం సహాయక బృందాల ద్వారా రైతులను రుణగ్రస్తులను చేసి భూములనుండి వెళ్ళగొడుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తులు తగ్గలేదు. అయినా రైతులు మాంధ్యం నుండి సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు. పాడిఆవుగా ఉన్న వ్యవసాయాన్ని రైతులకు ఉపాధిలేని రంగంగా మార్చి వేస్తున్నారు. ‘‘ సంస్కరణల ’’ ముద్దు పేరుతో రైతులను వ్యవసాయరంగం నుండి తరిమివేసే విధానాలు అమలవుతున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సమైక్యతతో ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైంది.
సారంపల్లి మల్లారెడ్డి
తేది:16.07.2011
ప్రజాశక్తి సావనీర్ 2011 ఆగస్టు 15

No comments:
Post a Comment