కృష్ణా జలాల రెండవ ట్రిబ్యునల్ (బ్రిజేష్‌కుమార్) తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది.
ట్రిబ్యునల్ కర్నాటకకు ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.25 మీటర్లుకు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు నీటిరాక తగ్గుతుంది. నాగార్జునసాగర్ ఆయకట్టు, కృష్ణాడెల్టాకు నీటి కొరత ఏర్పడుతుంది. హైదరాబాదుకు త్రాగునీటి సమస్య వస్తుంది. రాష్ట్రంలో కరువు, వెనకబడిన ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు కేటాయింపుల గురించి కమిషన్ ప్రస్తావన కూడా చేయలేదు.
రాష్ట్రానికి కేటాయించిన మిగులు జలాలను సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో ‘క్యారీ ఓవర్’ ఉంచాలని నిబంధన పెట్టింది. అనగా రాష్ట్రానికి కేటాయించిన 145 టిఎంసీల మిగులు జలాలు నిలువపెట్టడం వల్ల ఖరీఫ్ పంటలకు కూడా కొరత ఏర్పడుతుంది. గత ట్రిబ్యునల్ 75శాతం ప్రతిపాదికగా నికర జలాలను గుర్తించగా, ప్రస్తుత ట్రిబ్యునల్ 65శాతం ప్రాతిపదికను తీసుకున్నది. దీనివలన నికర జలాలు పెరిగి, మిగులు జలాలు తగ్గాయి. మిగులు జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌కు గల హక్కును ఈ ట్రిబ్యునల్ రద్దు పరచింది. ఇంతే కాక మిగులు జలాల ఆధారితంగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబడిన హంద్రీనివా (40 టిఎంసీలు), వెలిగొండ (43.50 టిఎంసీలు), కల్వకుర్తి (25 టిఎంసీలు), గాలేరునగరి (38 టిఎంసీలు), ఎస్‌ఎల్‌బిసి (26.22 టిఎంసీలు), నెట్టెంపాడు (22 టిఎంసీలు) ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండదు. ట్రిబ్యునల్ తీసుకున్న ఇటువంటి నిర్ణయాల మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది. మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, రంగారెడ్డి జిల్లాలలోని కరువు ప్రాంతాలకు శాశ్వతంగా నీటి వనరులకు దూరమవుతారు.
తుంగభద్ర నుండి అనంతపురం జిల్లాకు ప్రస్తుతం గల ఎగువకాలువ పూడిక వలన కేటాయించిన 32.5 టిఎంసీలు రావడం లేదు. అందుకు తుంగభద్ర ప్రాజెక్టు నుండి వరద ప్రవాహ ఎగువ సమాంతర కాలువ త్రవ్వకానికి కూడా ట్రిబ్యునల్ అంగీకరించలేదు. ఎగువతుంగ ముందు కర్నాటక అక్రమ నిర్మాణాల తొలగింపు ఈ తీర్పులో లేదు. గత సంవత్సరం ఆల్మట్టి నిండగానే వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోకి చుక్క నీరు రాలేదు. ఆవిధంగా ఆ రెండు ప్రాజెక్టుల వెనుక పంటలు వేయలేదు. కృష్ణా నది మరియు తుంగభద్ర నుండి దామాషా పద్దతిలో నీటి కేటాయింపు ఉండాలి.
ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు కోర్టు స్టే మూలంగా అమలులోకి రాలేదు. ఇప్పుడు తుది తీర్పును గజెట్‌లో ప్రచురిస్తే 2050 వరకు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సవరించుకోవడం కూడా సాధ్యంకాదు.
రాష్ట్ర విభజన నోట్‌లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదన చేస్తున్నందున (1) బ్రిజేష్‌కుమార్ తాజా తీర్పును గజెట్ చేయకుండా నిలిపివేయాలి. (2) కేంద్ర ప్రభుత్వం చొరవతో సంబంధిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దే విధంగా ఒప్పందాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై

No comments:
Post a Comment