Tuesday, 12 August 2014

ఆదిలాబాద్‌ జిల్లా ముదోల్‌ మండలం తరోడ గ్రామానికి చెందిన సాగురైతులకు రక్షణ కల్పించుట గురించి ...

తేది: 18.09.2010
శ్రీ కొణిజేటి రోశయ్య గారు,
గౌెరవ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
హైదరాబాద్‌.
విషయం: ఆదిలాబాద్‌ జిల్లా ముదోల్‌ మండలం తరోడ గ్రామానికి చెందిన  సాగురైతులకు రక్షణ కల్పించుట  గురించి ...
అయ్యా,
తరోడ గ్రామం, ముదోల్‌ మండలం, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పేద సాగుదారులం విన్నవించుకొను విజ్ఞప్తి.
తరోడ గ్రామానికి చెందిన 400 ఎకరాల భూమిని 75 కుటుంబాలకు చెందిన దళిత, గిరిజన, మైనార్టీ, బిసీలకు చెందిన పేదలము 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్నాం. భూమిని చదునుచేసి బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నాం. ఈ భూములు తప్ప మాకు మరో ఆధారాలు లేవు. ఇక్కడే మేము గత తరాలుగా నివసిస్తున్నాం. 1985లో పట్టాలు కొందరికి ఇచ్చారు. బ్యాంకుల నుండి రుణం తీసుకొని చెల్లిస్తున్నాం. భూమి శిస్త్తులు చెల్లిస్తున్నాం.
ఈ భూములను శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు ముంపుకు గురైనవారికి 20 సంవత్సరాల క్రితం కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పింది. కాని ముంపు గ్రామాల ప్రజలు ఈ భూముల వద్దకు రాలేదు. మొదటి నుండి మేమే సాగు చేస్తున్నాం.
తరోడ గ్రామానికి దగ్గర్లో ‘‘బాసర’’ పట్టణంలో ఐఐటి కళాశాలను ప్రభుత్వం గత రెండు సంవత్సరాల క్రితం స్థాపించింది. దీనితో ఆ చుటుపక్కల భూములకు గిరాకి ఏర్పడిరది. అక్రమంగానైనా భూములను సంపాదించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని కొందరు పలుకుబడి కల్గిన వారు ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ లావాదేవిలు సాగిస్తున్నారు. వీరి ప్రభావానికి గురైన రెవెన్యూ అధికారులు దీర్ఘకాలం సాగులో నూన్న మాపై నిర్భందం ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా ముదోల్‌ మండల రెవెన్యూ అధికారి పూర్తిగా రియాల్టర్ల పక్షం వహిస్తున్నారు.
గత సంవత్సరం నుండి తెలుగుదేశం ముదోల్‌ శాసన సభ్యులు వేణుగోపాల చారితో పాటు మరికొందరు ‘‘ఈ భూములు ‘‘మా పేరుతో రిజిస్టరీ జరిగినవి మీరు భూముల నుండి వెళ్ళిపొండి’’ అంటు మాపై నిర్భంధం చేస్తున్నారు. అక్రమ సివిల్‌ కేసులు బనాయిస్తు కోర్టు చుట్టూ తిప్పితున్నారు. కోర్టు తిరగగలిగే ఆర్థిక స్తోమత్తు లేదు. మా భూములలో పెద్దగా పంటల దిగుబాటులు రావు. అయినప్పటికి వాటి ఆధారంతో పాటు ఇతర కూలీ పనులు చేసి బతుకుతున్నాం. పోలీస్‌ సిబ్బందిని మరియు రెవెన్యూ సిబ్బందిని మాపైకి ఉసిగొలిపి ఇబ్బందుల పాలు చేస్తున్నారు.
కావున దయచేసి వాస్తవ విచారణ చేసి చాల కాలంగా ఆ భూములనే నమ్ముకొని ఉంటున్న మాకు నాయ్యం చేయగలరని కోరుతున్నాం.
        ఇట్లు
తరోడ గ్రామ నిరుపేద రైతులు,  
మం. ముధోల్‌,  జిల్లా : ఆదిలాబాద్‌,
                    (బి.నాగాజీ)    (గంగాధర్‌)     (మౌనాజీ)     (ముగులాజీ)

                                                                                                            

No comments:

Post a Comment