జనవరి 18న ఆంధ్రజ్యోతిలో ‘‘భూమాయ’’ పేరుతో వార్త ప్రచురితం అయింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లే గ్రామంలో 29ఎకారల భూ కుంభకోణం జరిగినట్లు, ఈ కుంభ కోణంలో పోలీస్ ఉన్నతాధికారులతో పాటు సమాజంలో పలుకుబడి కల్గిన వారి ప్రమేయం ఉన్నట్లు తెల్సింది. ఇలాంటి కుంభకోణాలు భూ దురాక్రమణలు నిరంతరం నిత్యకృత్యమైనాయి. ఈ విధమైన కుంభకోణల్లో బలివుతున్నది అమాయకులే. రియల్‌ఎస్టేట్ వ్యాపారం పెరిగిన ఈ రోజుల్లో న్యాయంగా వాస్తవ హక్కు కల్గినవారెందరో తమ భూములు, ఇండ్ల స్థలాలు కొల్పోయి దిక్కు తోచనిస్థితిలో ఉన్నారు. పాలక వర్గాల కనుసన్నలలోనే ఈ కుంభకోణలు సాగుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిరది? ప్రభుత్వం మాత్రం ‘‘ చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అంటూ నిత్యం హోరెత్తె ప్రకటనలు చేస్తున్నది. అయిన దుడ్డున్నవాడిదే బర్రే సందంగా మాఫియా గ్యాంగ్‌లు తయారై పెద్ద ఎత్తున భూములను అక్రమించి రోజులలోనె కోట్లు గడిస్తున్నారు. దీనికి అంత ఎపుడాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
మాఫియా గ్యాంగ్‌లకు భూ ఆక్రమణదారులకు అనుకూలమైన రీతిలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భూ చట్టాలలో మార్పులు తెస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ బడ్జెట్ ఆదాయం పెంచుకోవడం కూడా ఇందులో ఇమిడి ఉంది. రిజిస్టేషన్ చట్టంలో సవరణలు తెచ్చి ఈ అక్రమాలకు నాంది పలికారు.
గతంలో భూముల క్రయ, విక్రయాలకు సంబందించి చట్టంలో లోసుగులు లేకపోవటం మూలంగా అక్రమాలకు తావులేదు. భూమి అమ్మే వ్యక్తి సంబందిత అధికారుల నుండి ఆ భూమి పై తనకె హక్కు కలదని ద్రువీకరణ పత్రం పొందాలి. గ్రామ పంచాయతి అయితే, డివిజనల్ పంచాయతి అధికారి నుండి ద్రువీకరణ పత్రం పొందాలి. ఆ పత్రం ఉంటేనే రిజిస్టెషన్ జరిగెేది. ఆ పత్రం సంపాదించడానికి సంబందిత అధికారికి ధరఖస్తు పెట్టుకొనగా సదరు అధికారి నోటిఫికేషన్ జారిచేసి, రికార్డులు పరిశీలించి ఎలాంటి అభంతరాలు లేనపుడు హక్కు పత్రం జారి చేసేవారు. ఈ చట్టం వలన కోనుగోలు దారుకన్న అమ్మకపు దారే తన హక్కును నిరూపితం చేసుకోవాలి. ఆప్పుడు తగాదాలకు ఆస్కారం రాలేదు. దీని వలన రిజిస్టేషన్లు తక్కువ జరిగి ప్రభుత్వ అదాయం పెరగడం లేదని పై నిబందనలను సడలించారు. కొనుగోలుదారే అన్ని బాధ్యతలు చూసుకోవాలి. అమ్మే వ్యక్తికి హక్కు ఉందా? లేదా? అన్నది, కొనుగోలుదారు బాధ్యతే. దీని వల్ల ఏ హక్కులేని వారైనా విక్రయించే స్వేచ్ఛ లభించింది. ఈ స్వేచ్ఛను సాకు గా పెట్టుకొని నేడు వేలకువేల రిజిస్టేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాదాయం పెరిగింది.
సంవత్సరం ఆదాయం(కోట్లలో)
2000`01 670.93
2001`02 804.88
2002`03 999.65
2003`04 1111.74
2004`05 1388.00
2005`06 2013.45
2006`07 2865.38
2007`08 3750.00
2008`09 4537.50
ఆదాయం పెంపుదలనే లక్ష్యంగా బావిస్తున్న ప్రభుత్వం రిజిస్టేషన్లలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టలేకపోతున్నది. అంతేకాదు అసైన్డ్ భూ చట్టంలో మార్పు తెచ్చింది. 9/77సవరణ చేస్తూ వారసత్వంగా వచ్చే హక్కు కల్గిన భూములను అమ్ముకొడానికి అవకాశం కల్పించారు. 2009 జూలై 16న భూ సంస్కరణ చట్టం 1973కు సవరణ తెచ్చారు. ఈ సవరణ ప్రకారం సెక్షను 14లోని సబ్ సెక్షన్ 6, క్లాజు 3కు సవరణ చేస్తూ మిగులు భూములను పొందిన వారు ‘‘వినియోగం/ ప్రాథమిక అవసరాలకల్పనకు అమ్మకం/ పారిశ్రమలభివృద్దికి/ ప్రజోపయోగ పనులకు పంపిణి చేయవచ్చు’’ అని సవరించారు. ఈ చట్టం 2004 జనవరి నుండి అమల్లోకి వచ్చింది. సవరించక ముందు ‘‘ మిగులు భూములు వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ వృత్తిధారులకు, సాగుకు, ఇండ్ల స్థలాలకు లేదా వ్యవసాయ అనుబంధ అవసరాలకు మాత్రమే కేటాయించాలి’’. సవరణలో చెప్పినట్లు ప్రజోపయోగపనులకు/ ప్రాథమిక వనరుల కల్పనకు అను పదాలకు విస్తృతార్ధం ఉంది. ఈపేరుతో ఏ భూములైన సంస్థలు స్వాదినం చేసుకోవచ్చును. చట్టం చేసిన తేదికి ముందు 5సంవత్సరాల కాలనికి వర్తింపచేయటం అంటే గతంలో జరిగిన లోపాలను కప్పి పెట్టడమే అవుతుంది.
ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చట్టాలను సవరిస్తూ రియల్‌ఎస్టేట్ వ్యాపారులను, భూ మాఫియాలను, బడా పారిశ్రామిక వేత్తలను భూ కుంభకోణాలకు పాల్పడానికి అవకాశం కల్పిస్తున్నది. నేడు జరుగుతున్న భూ అక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి సర్వేచేసి భూమిపై యాజమాన్య హక్కును నిర్ధారించే విధానం 5 దశాబ్దాలు గడిచినా నేటికి అమల్లో లేదు. దురాక్రమ దారులకు ఈ విదానం మరింత వెసులుబాటు కల్పిస్తున్నది.
ఏజెన్సీ ఏరియాలో గల 1/70 చట్టం అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. పలితంగా షెడ్యూలు ఏరియాలోకి నాన్` షెడ్యూలు ప్రజల ప్రవాహం పెరిగింది. ప్రభుత్వ భూములు ‘‘ప్రజోపయోగం పేరుతో’’ బడా బాబులు వేలాది ఏకరాలు స్వాదీనం చేసుకుంటున్నారు. అసెన్డ్ భూములు మరియు మిగులు భూములకు చట్ట సవరణ చేసారు. రిజిస్టేషన్ నిబంధనలను సడలించారు. రికార్డులను రాత్రికి రాత్రే మార్పులు చేస్తున్నారు. వాస్తవ హక్కు దారులకు నష్టం జరిగే విధంగా తెచ్చిన మార్పుల ఫలితంగా భూములు కొల్పోయినవారు దిక్కుతోచని వారు అవుతున్నారు. భూ దురాక్రమణ దారులకు ప్రభుత్వ అండదండలు, చట్టంలో వెసులుబాటులు ఉండడమే ఈ పరిస్థితులను కల్పిస్తున్నది.
విక్రయ దారుకు హక్కులున్నట్లు దృవపత్ర విధానాన్ని తిరిగి అమల్లోకి తేవాలి. చట్టాల్లోని లోటు పాట్లను సవరించి వాస్తవ హక్కుదారులకు రక్షణలు కల్పించాలి. అప్పుడే ఈ భూ మాయలకు తిలోదకాలు ఇవ్వగలం.
తేది: 22.01.2010
సారంపల్లి మల్లారెడ్డి ఎఐకెఎస్ ఉపాద్యక్షులు

No comments:
Post a Comment