` గోదాంలు ఖాళీగా లేవు. ఈ సారి ధాన్యం కొలుగోలు సాధ్యం కాదు. కొలుగోలు చేసిన ధాన్యం నిల్వ చేయడం కష్టసాధ్యం అవుతుంది. ` ఎఫ్.సి.ఐ. ప్రకటన
` 2010`11 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం లెవీ విధానంలో మార్పులు తెచ్చింది. ఈ మార్పుల వల్ల వ్యాపార వర్గాలకు మిల్లర్లకు నష్టం కల్గుతుంది. ప్రస్తుతం ప్రకటించిన విధానాన్ని సవరించాలి. లేని తీరుకు రైస్ మిల్లులు సమ్మె చేస్తాయి. రైతుల నుండి ధాన్యం కొనుగోలు నిలిపి వేస్తాం. ` వ్యాపారుల ప్రకటన
రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు పై ప్రకటనలకు స్పందిస్తూ ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందుల పాలు చేయకూడదని వ్యాపారులకు, మిల్లర్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా పై విధంగా వారం రోజులుగా వ్యాపార వర్గాలు ప్రకటనలపై ప్రకటనలు చేస్తున్నాయి. ఒక విధంగా ప్రభుత్వం మిల్లర్లు మరియు వ్యాపారులు రానున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అవకాశాలు లేవంటూ, బలవంతపు కొనుగోలు చేసినచో కనీస మద్దతు ధరలోపునకు తగ్గిస్తామని రైతులను మానసికంగా ఇప్పటి నుండే తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పంటల వచ్చే కాలంలో ధరలు తగ్గించడం ఆ తరువాత క్రమేణా ధరలు పెంచడం అనవాయితీగా వస్తున్నది. గత దశాబ్ద కాలంలో జరిగిన ఉత్పత్తుల కన్నా ఈ సంవత్సరం అదనంగా జరిగే ఉత్పత్తి ఏమి లేదు. 2008`09లో రాష్ట్రంలో 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2009`10లో గత సంవత్సరంపై 26 శాతం ఉత్పత్తులు తగ్గాయి. 2010`11 సంవత్సరానికి 209 లక్షల టన్నులు ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2008`09పై ఈ సంవత్సరం జరిగే ఉత్పత్తులు పెద్దగా లేవు. అయినా పంటకాలానికి మాసం రోజుల ముందు నుండే రైతులను నిరాశ పరుస్తూ ధరలు తగ్గిస్తామనే సంకేతాలు విడుదల చేస్తూ ప్రకటించడం జరుగుతున్నది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వ్యవసాయ ఉత్పత్తులు గతం కన్నా మించి రానప్పుడు ఈ సంవత్సరం గోదాముల కొరత, లెవీ విధానం సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతున్నట్లు? వాస్తవాలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిన కనీసం మద్దుతు ధర లభించేటట్లు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
రాజ్యాంగం రీత్యా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం, కొనుగోళ్ళ బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకొని కేంద్రం పైకి తోసివేస్తున్నది. ఫలితంగానే ప్రస్తుతం కొనుగోలు సంక్షోభం కొనసాగుతున్నది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు సన్నాల ధాన్యాన్ని పండిరచే విధంగా ప్రోత్సహించింది. తీరా పంట చేతికి వచ్చాక నల్ల మచ్చ ఉందంటూ కింట్వాల్‌కు 100`150 రూపాయాలు తగ్గించి కొనుగోలు చేసారు. అదే ధాన్యాన్ని బియ్యంగా మార్చి కేంద్రం నిర్ణయించిన లెవి ధరకు ఎఫ్‌సిఐ సేకరించింది. మధ్యలో నష్ట పోయింది రైతులు మాత్రమే. కేంద్ర కొనుగోలు సంస్థలైన ఎఫ్‌సిఐ, సిసిఐ, నాఫెడ్‌లు రాష్ట్ర మార్కెట్లలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కాని రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలు మార్కుఫెడ్, సివిల్ సప్లయ్స్ సంస్థల ద్వారా రాష్ట్ర అవసరాల మేరకైనా (ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా) కొనుగోలు చేయాలన్న లక్ష్యం లేదు. ఈ సంస్థలకు మార్కెట్ల సౌకర్యంతో పాటు కొనుగోలు సిబ్బంది, క్వాలిటీ నిర్ణయించే అధికారులు, గోదాంలున్నాయి. పెట్టుబడికి మార్కెట్ల నుండి వస్తున్న ఫీజుతో పాటు బ్యాంకు నుండి ‘కీ లోన్’ తీసుకునే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు కొనుగోలు బాధ్యత అప్పగించకుండా దూరం పెడుతున్నది. మార్కెటింగ్ శాఖలో ఒక మేనేజింగ్ డైరక్టర్‌కు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి వేతనాలు ఇస్తున్నది. మిగతా మొత్తం సిబ్బందికి మార్కెట్ ఫీజు నుండే వేతనాలు చెల్లిస్తున్నారు. అయినా ఈ యంత్రాంగానికి కొనుగోలు బాధ్యత ఎందుకు అప్పగించడం లేదు? ఐకెపి (ఇందిరా క్రాంతి పథం) ద్వారా ఏటా 2,3 లక్షల టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నది. మిగతా ఉత్పత్తుల జోలికి వెళ్ళటం లేదు.
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థకు, హస్టళ్ళకు, అంత్యోదయ అన్నపూర్ణకు ఏటా 25 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అందులో ఎపిఎల్ కార్డుల వారికి రాష్ట్రంలో ప్రతినెల 1.70లక్షల టన్నులు 9/`లకు కేజీ చోప్పున ఇవ్వాలి ` ఈ పథకం అమలుకావడం లేదు. ` అర్హత గల వారికి రేషన్ లేదు. సుప్రీం కోర్టు బియ్యం నిల్వలు చెడిపోకుండా అర్హులకు పంపిణీ చేయాలని అదేశించినా కేంద్ర ` రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు అదేశాలను అమలు చేయాడానికి సుముఖంగా లేదు. ఒక్క వైపున బియ్యం నిల్వలు చెడిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్న ప్రభుత్వాలు, మరొక వైపున ఆకలితో అలమటిస్తున్న పేదలకు పంపిణీ చేయడానికి ఎందుకు నిరాకరిస్తున్నట్లు? ప్రస్తుత అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులకు ప్రభుత్వం బియ్యం విడుదల చేయడం ద్వారా ధరలు తగ్గి నష్టం వస్తుందని పాలకులపై ఒత్తిడి తెస్తున్నారు.
రాష్ట్రంలో స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, మరియు ఏడు సంవత్సరాలకు కాంట్రాక్టు తీసుకున్న ప్రైవేట్ గోదాంల నిల్వ సామర్థ్యం 17.60 లక్షల టన్నులు, ఎఫ్‌సిఐ స్వంత గోదాములు 12.73 లక్షల టన్నులు, సెంట్రల్ వేర్ హౌసింగ్ వద్ద 1.36 లక్షల టన్నుల నిల్వచేయు గోదాంలున్నాయి. వీటిలో ఎప్పుడు 50 శాతం మాత్రమే నిల్వలుంటాయి. ఒక వైపున గోదాంలలోకి సరుకులు వస్తుండగా, మరో వైపు వినియోగానికి ప్రతి నెల దాదాపు 4 లక్షల టన్నులు విడుదలవుతుంటాయి. ఇవి కాక మరో 30 లక్షల టన్నుల గోదాములు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం విశాల ప్రతిపాదికపై గోదాముల నిర్మాణం జరుగుతున్నది. మార్కెట్ యార్డులో ఉన్న గోదాములలో రైతుల పేరుతో (రైతు బంద్ పథకం) వ్యాపారుల నిల్వలు పెడుతున్నారు. ఇవి కాక ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన గోదుమలు,ఇతర సరుకులు ఇక్కడ నిల్వలు పెడుతున్నారు. గోదాముల నిర్వహణను క్రమబద్దీకరిస్తే సమస్యను పరిష్కరించవచ్చు. మరో వాదన లెవి సేకరణ. దాదాపుగా రాష్ట్రంలో 60 నుండి 70 లక్షల టన్నుల బియ్యం సేకరణ ఏటా జరుగుతున్నది. 2010`11లో ఈ రాష్ట్రంలో 90 లక్షల టన్నుల సేకరణను లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యానికి మించి మిల్లర్లు కొనుగొలు చేసినచో అందులో నుండి 2/3 రాష్ట్రంలోనూ, మిగతా 1/3 శాతం ఇతర రాష్ట్రాలోనూ అమ్ముకోడాని వీలుకల్పించినట్లు కేంద్రం విధానాన్ని ప్రకటించింది. దీనిని సవరించాలని వ్యాపారులు కోరుతున్నారు. గత సంవత్సరం కూడా బకాయి లెవి చెల్లించాలని మిల్లర్లను అదేశించడంతో మిల్లర్లు ధాన్యం ధర తగ్గించారు. ప్రభుత్వ విధానాలలో వస్తున్న మార్పులు, మిల్లర్లు, వ్యాపారుల కోరికల పరిష్కారంలో రైతులు బలిపశువులవుతున్నారు.
మాసం రోజుల క్రితం పత్తి క్వింటాల్ 4500 వరకు అమ్మకాలు జరిగాయి. కొత్త పత్తి వస్తున్న ఈ తరుణంలో (09.10.10) వరంగల్‌ల్లో క్వింటాల్ 3600, నిజామాబాద్‌లో 3030 నుండి 3300వరకు మరియు ఆధోని మార్కెట్‌ల్లో 4200 అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కోమార్కెట్లో ఒక్కోవిధమైన ధర నిర్ణయించబడుతున్నది. ధరల నిర్ణయానికి ఏ శాస్త్రీియత పాటిస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్కెట్ కమిటీలు మారుతాయి. నేడు కొన్ని మార్కెట్లకు కమిటీలే లేవు. ఉన్నా అవి ధరల నిర్ణయం గురించి కాని, కనీసం రాష్ట్రంలోని మార్కెట్లలోని ధరలనైనా సమన్వయ పరిచి తమ మార్కెట్లలో ధరలను నిర్ణయించే విధానం లేదు. వ్యాపారస్తుల దయాదక్షిణాలకు రైతులను నెడుతున్నారు. సూబాబుల్, చెరుకు, పొగాకు, అయిల్ పామ్, మిరప, పత్తి, పప్పుధాన్యాల ధరలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో ఏవ్వరు చెప్పగల స్థితిలో లేరు. రైతు ఒక్కసారి పంట అమ్ముకున్నాక ధరలు పెరిగితే వ్యాపారులు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు తమ ఉత్పత్తులను పొలం నుండే నేరుగా మార్కెట్‌కు తరలిస్తున్నారు గతంలో ఉన్న నిల్వ పద్దతులు నేడు లేవు. పైగా రుణ ధాతలు త్వరగా తమ ఉత్పత్తులు అమ్మి బాకీలు చెల్లించమంటు వెంటబడుతుంటారు. రైతుల పరిస్థితి గమనించిన వ్యాపారులు పంటకాలంలో మాసం రోజుల పాటు ఏవో కారణాలు చూపి ధరను తగ్గిస్తున్నారు. అందులో భాగంగానే గోదాముల ఖాళీగా లేవని, లెవి విధానాలను మార్చాలని, సరుకుల నాణ్యత మెరుగ్గాఉండబొదాని ముందే ప్రచారం చేస్తూ కనీస మద్దతు ధరల కన్న తక్కువ ధరలకు రైతులు అమ్ముకునే విధంగా వారిని మానసికంగా తయారు చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేరళ, బెంగాల్‌తో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంటలకు కేంద్రం నిర్ణయించిన ధరల కన్నా అధనంగా నిర్ణయించి వారికి రైతులకు రక్షణ కల్పిస్తున్నారు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడు వ్యవసాయ ఉత్పత్తులకు ధరల నిర్ణయం, అమలు గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. మంత్రిగారి సమక్షంలో మార్కెటింగ్ శాఖాధికారులకు, రైతులకు సూబాబులు టన్నుకు 1850 మరియు జామాయిల్ టన్ను 1950 రూపాయలకు కొనుగోలు చేయాలని ఒప్పదం చేసుకున్నప్పటికి కొనుగోలుపై గుత్తాదిపత్యం గల ఐటిసి ఒప్పందాన్ని ఉల్లంఘించి టన్నుకు 1000రూపాయాల లోపు కొనుగోలు చేస్తున్నది. ఇది ఒక్క చిన్న ఉదాహరణ మాత్రమే.
నేడు గోదాములు ఖాళీ లేవంటే రైతులు ఉత్పత్తులు తగ్గించాలా? లెవీ విధానం మార్చలన్న పేరుతో వ్యాపారులు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తే ఎవరు కొనుగోలు చేయాలి? దీనికి ప్రభుత్వ బాధ్యత ఏమిటి? నేడు వాస్తవాలను వక్రీకరించే ప్రచారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. పంజాబ్‌లో 90 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సిఐ సేకరించి మిల్లు అడిరచి బియ్యాన్ని వినియోగిస్తూన్నది. అదే ఎఫ్‌సిఐ ఈ రాష్ట్రంలో 5,6 లక్షల టన్నులకు మించి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మిల్లర్ల నుండి బియ్యం సేకరించే విధానం ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మిల్లర్లు, ఎఫ్‌సిఐ, వ్యాపారులు కూడాబల్కుంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇది రాష్ట్రంలో నేడు జరుగుతున్న స్థితి. జబ్బు ఒక్కటైతే మందు మరొకటి వేసినట్లు నేడు మార్కెట్ల పరిస్థితి ఉంది. హైదరాబాద్‌లో ఉండి విధానాలు వల్లించే అమాత్యులు మాత్రం మార్కెట్ల పరిశీలనకు వెళ్ళిన ధాఖలాలు లేవు. పంట వేసే నాడే ధరలు నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. అందుకు తగిన యంత్రాంగాన్ని కొనుగోళ్ళ సందర్భంలో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కాకున్నా న్యాయమైన ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి.
తేది:09.10.10.
సారంపల్లి మల్లారెడ్డి.

No comments:
Post a Comment