ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నం చివరంటా సాగి ఎన్నికలు జరిగే వరకు ప్రజల్లో అనుమానాస్పదం నెలకొంది. 73`74 రాజ్యాంగం రీత్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వామపక్ష ప్రభుత్వాలు మినహా మిగిలిన రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలను సంవత్సరాల తరబడి వాయిదాలు వేయడం వలన కేంద్ర ప్రభుత్వం 73`74రాజ్యాంగ సవరణను తెచ్చింది. ఈ సవరణతో విధిగా ప్రతీ 5సం।కు ఒక్కసారి ఎన్నికలు జరపాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994ను 30.05.1994నుండి అమలులోకి తెచ్చారు. కాని చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుటలేదు. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాలుపడుతున్నది. ఎన్నికల సంఘం ప్రభుత్వ సంస్థగా పని చేస్తున్నది. ఎన్నికల సంఘం స్వతంత్య్రంగా ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణీత కాలంలో తన బాధ్యతను అమలు జరపాలి.
1956నుండి 2013వరకు గల 57సంవత్సరాల కాలానికి 12సార్లు ఎన్నికలు నిర్వహించాల్సి వుండగా, 8సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగే ప్రతి సారి గత విధానాలకు వ్యతిరేకంగా మార్పులు, చేర్పులు చేయడం పాలక పార్టీలకు అలవాటుగా మారింది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే, మరోసారి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు.సర్పంచ్, ఎంపిపి, వార్డుమెంబర్లు, జెడ్‌పిటిసీ, జిల్లా పరిషత్ చైర్మన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచిన వారికి తమ సంస్థలో మెజార్టీ వున్నా, లేకున్నా స్థిరంగా 5సంవత్సరాల పాలన కొనసాగుతుంది. పరోక్ష ఎన్నికలలో గెలిచిన తీరుకు నిరంతరం పదవి కాపాడుకోడానికి ప్రయత్నించాల్సి వుంటుంది. సుస్థిర, స్థానిక పాలన ప్రజలకు లభించదు. పార్టీ గుర్తుపై ఒకసారి, గుర్తులేకుండా ఒకసారీ ఎన్నికలు నిర్వహించడం వలన ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని స్థితిలో ఓటర్లు, పోటీ చేయాలనుకునేవారు స్థిర నిర్ణయానికి రాలేకపోతున్నారు. గతంలో ఎన్నికల డిక్లరేషన్‌కు ముందుగానే ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాయి. కానీ గత సహకార ఎన్నికలను గమనిస్తే డిక్లరేషన్ వచ్చే వరకు ఏవిధానం స్పష్టంగా తెలియపర్చక పోవడం, వారంరోజుల్లోనే ఎన్నికలు నిర్వహించడం వలన పోటీ చేసే అభ్యర్థులు తమ గురించి ఓటర్లకి తెలియజెప్పే అవకాశం లేకుండా పోతున్నది. పైగా మంత్రులకు నచ్చని సంస్థల ఎన్నికలను నిలిపివేసే స్టే హక్కు కలిపించడం ఏ ప్రజాస్వామ్య సూత్రాలు నిర్ణయించాయి. ఆలాంటి హక్కును గతంలో దుర్వినియోగం చేసి 200సహాకార సంఘాలకు పైగా స్టే ఇచ్చారు. జిల్లా, రాష్ట్రాల సహాకార కమిటీలు ఏర్పడినప్పటికీ ఆ ‘‘స్టే’’ ఇచ్చిన సంఘాలకు ఇంతవరకు ఎన్నికలు నిర్వహిచలేదు. కొన్ని జిల్లాలలో ‘‘స్టే’’ పొందిన సంఘాల ఓట్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం వుంది. పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఫలితాలు రాకుండా చూడాలంటే ప్రతిపక్ష పార్టీలకు చెంది వారు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే అవకాశం ఉన్నప్పుడు వాటికి స్టే ఇవ్వడం జరుగుతున్నది. ఎన్నికలు ప్రకటించగానే ఎక్కడ వాయిదాలు వేయాలో, అతి శాంతి భద్రతల సమస్య అయినచో, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోని నిర్భంద పరిస్థితులను ఒక పక్షం వారు కల్పించినప్పుడు ఆ సమస్యను పరిశీలించి ఆ సంస్థకు స్టే ఇవ్వడం రాష్ట్ర ఎన్నికల కమీషన్ బాధ్యతగా వుండాలి. పాలక వర్గం వారుకూడా ఏదో ఒక పార్టీకి చెందిన వారే కదా! బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో నిరంకుశంగా ఎన్నికలు నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసం.? ఎన్నికల కమీషన్ నిర్ణయానికి అందరూ తల ఒగ్గాల్సిందే. రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతీ5 సం।కు ఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ స్థానికసంస్థల ఎన్నికలు కొనసాగించాలి. లొక్‌సభ, రాజ్యసభ, శాసన సభలు, శాసన మండలులకు ఎలాంటి పరిస్థితులలోనూ ఆరు మాసాలకుమించి ఎన్నికల కమీషన్ వాయిదా వేయదు. అలాంటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వేఛ్చగా ఎన్నికలు నిర్వహించడానికి పాలక పక్షాలే ఎందుకు అడ్డుపడుతున్నాయి.? వారి అనుమతిపై మాత్రమే ఎన్నికలు నర్వహించాల్సి వస్తుంది దీని వలన రాజ్యాంగ సవరణ అబాసు పాలవుతున్నది.
2006 ఏప్రిల్ 21న కేంద్రపంచాయితీ రాజ్ మంత్రి మణిశంకర్ అయ్యర్ ముందు రాష్ట్రముఖ్యమంత్రి పంచాయితీల అధికారాలలో 10అంశాలను 2007నాటికి, మిగిలిన 19అంశాలను 2008నాటికి పంచాయితీ రాజ్ అధికారాలను బదలాయిస్తానని అంగీకరించారు. కానీ నేటికీ ఆపని చేయలేదు. పంచాయితీ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకోడానికి అధికారాలను తమవద్దే ఉంచుకోవడం జరిగింది. చివరకు గ్రామీణ విద్యా, ఆరోగ్యం, విద్యుత్, గ్రంధాలయాలు దారిద్య్ర నిర్మూలన, త్రాగునీరు, భూసంస్కరణలు, మార్కెట్లు, పౌరసరఫరాలు, చిన్ననీటి వనరుల రిపేర్లపై రాష్ట్ర ప్రభత్వంపై ఆదారపడాల్సి వస్తున్నది. అందువల్ల రాష్ట్ర సచివాలయంలో గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు, సర్పంచ్‌లు, జెడ్‌పీటిసిలు పైరవీలు చేయడం మంత్రుల చుట్టూ తిరిగి గ్రామాభివృద్ధి పనులు మంజూరు చేసుకోవడం జరుగుతున్నది.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిధుల కొరత కొనసాగుతుంది. తగినన్ని నిదులు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడటంవలన వారి స్వతంత్రత కోల్పోతున్నారు. పంచాయితీలు, వార్డుల రిజర్వేషన్లు ప్రతీ ఎన్నికల ముందు మార్పు,చేర్పులకు గురౌతున్నాయి. దళిత, గిరిజన, మైనార్టీ, మహిళా మరియు బిసీ రిజర్వేషన్లకు ఎప్పటికప్పుడు విధాన్నాన్ని మారుస్తున్నారు. 2011జనాభా లెక్కలు ముగిసి 2సం। కావస్తున్నది. నేటికి 2001 జనభా లెక్కల ప్రాతిపదికగా జరపాలా? 2011గణాంకాల ప్రకారం జరపాలా అన్నది చర్చ నీయాంశంగా మారింది. రిజర్వేషన్లకు శాశ్వత ప్రాతిపదికగా శాతాలు నిర్ణయించాలి తప్ప ప్రతిసారీ రిజర్వేషన్ల సమస్యలను ఎజండాకు తెస్తున్నారు. కొన్ని సార్లు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవడం మరొకసారి జిల్లాను యూనిట్‌గా తీసుకోవడం, వలన వారి రిజర్వేషన్ కోటాకు రావలసిన స్థానాల సంఖ్య తగ్గుతున్నది. జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్ల్ నిర్ణయిస్తామని అనడమే తప్ప ఆచరణలోలేదు.
పార్టీ గుర్తుపై ఎన్నికలు నిర్వహిస్తే పార్టీ ఫిరాయింపు దార్ల పదవులను రద్దుచేయవచ్చు, కానీ తమకు రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు పార్టీ గుర్తు ఉపయోగించడం, అననుకూల వాతావరణం ఉన్నప్పుడు పార్టీ రహితంగా ఎన్నికలు నర్వహించి గెలిచినవారినందరిని తమ పార్టీ వారుగా చెప్పుకోవడం, ఆవిధంగా పార్టీ నైతిక బలాన్ని పరిరక్షించుకోవడానికి దోహదం చేస్తున్నారు. పార్టీ గుర్తుపైనే ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుదార్ల పదవులను రద్దుచేయాలి.
బడ్జెట్ కేటాయింపు:
రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ స్థానిక సంస్థలకు రాష్ట్ర ఆదాయంలో 39.24శాతం ఇవ్వాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం 11.09శాతం మాత్రమే ఇవ్వడానికి అంగీకరించింది. అదికూడా అమలు జరుగుటలేదు. వామపక్ష ప్రభుత్వాలు 40శాతం బడ్జెట్‌ను కేటాయించి స్థానిక సంస్థలకు ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు అమలు చేసారు. 2008లో రద్దైన కమీషన్‌ను తిరిగి పునర్దురించలేదు.
ప్రస్థుతం స్థానిక సంస్థలకు 3.13శాతం నుండి 3.95శాతం వరకు గత దశాబ్ద కాలంలో బడ్జెట్ కేటాయింపులో చేసారు. సకాలంలో విడుదల లేక స్థానిక సంస్థలు నిర్వీర్యమైయ్యాయి. ప్రజల ఉత్సాహం, ప్రోత్సాహం తగ్గింది. ఫలితంగా అవినీతి పరులు సంస్థలలో అక్రమార్గంగా ప్రవేశించి దివాలా తీయిస్తున్నారు.కోట్ల రూపాయలు వ్యయంచేసి గెలుపు సాధిస్తున్నారు. అప్రజాస్వామికంగా కొన్ని గ్రామాలలో వేలం పాటలు పెట్టి సంస్థలను కొనుగోలు చేస్తున్నారు. స్థానిక సంస్థలు బలంగా వుండాలంటే 40శాతం బడ్జెట్ నుండి కేటాయించాలి. వారే 5సం। ప్రణాళికను తయారు చేసుకుని దానిని ఆమోదింపజేసుకుని వాటికి మాత్రమే వ్యయం చేయాలి. ప్రణాళికలో లేని అభివృద్ధి పనులకు ఆమోదం పొందడానికి తిరిగి ఆ సంస్థ సమావేశం జరిపి ఆమోదం పొందాలి. అంతే గానీ కాంట్రాక్టర్ల ఇష్టాయిష్టాలను బట్టీ పనులు నిర్ణయించడం వలన అభివృద్ధి జరగక పోగా నిధుల దుర్వినియోగం మాత్రం జరుగుతున్నది. రాను రాను స్థానిక సంస్థలలో ప్రజల చొరవ తగ్గిపోతున్నది. చివరికి సమావేశాలకు హాజరు కాకుండానే ఒకేసారి సంతకాలు తీసుకుంటున్న సంస్థలు కూడా ఉన్నాయి. చట్టపరంగా (ఎ) గ్రామ సభలు సంవత్సరానికి రెండు సార్లు (ఆరుమాసాలకు ఒక్కసారి) జరపాలి. వాటి సూచనలను పంచాయితీ సంస్థ అమలు చేయాలి. (బి) గ్రామ పంచాయితీ సమావేశాలు మూడు మాసాలకొక్కసారి నిర్ణీత స్థలంలో అందరికీ అమోదమైన చోట జరపాలి. మండలాలకు, జిల్లా పరిషత్‌లకు విడిగా చట్టం ప్రకారం సమావేశాలు జరపాలి. ప్రభుత్వ జోక్యం వుండరాదు. గ్రామ పంచాయితీ సెక్షన్ 41ప్రకారం ఉప సంఘాలు వేయాలి. మండల, జిల్లా పరిషత్ సంస్థల ఉప సంఘాలను రెగ్యులర్‌గా జరపాలి. ఉప సంఘాల నిర్ణయాలను సంస్థలో అమలు చేయాలి.
స్థానిక సంస్థలను స్వేచ్ఛగా పనిచేయించడం ద్వారా స్థానికాభివృద్ది, ప్రజాస్వామ్యం ప్రజల మధ్య అనుబంధం పెంపొందుతాయి. నిధుల సక్రమ వినియోగానికి అవకాశం వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు చట్టబద్దంగా ఇవ్వాల్సిన నిదులను, విధులను బదలాయించటంతో పాటు 93,94రాజ్యాంగ సవరణను ఖచ్చితంగా అమలు జరపడం ద్వారా గ్రామరాజ్యాలు ఏర్పడి వారి సమస్యలను పరిష్కరించుకుంటాయి. ప్రస్తుతమున్న చట్ట ఫరిధిలోనే ఈ పనులు చేయవచ్చు. అంతేకానీ వేలంపాటల ద్వారా స్థానికసంస్థలను కొనుగోలుచేసి వాటిని వ్యాపార సరుకుగా మార్చడం ప్రజాస్వామ్యానికి హనికరం.
సారంపల్లి మల్లారెడ్డి
తేది. 21.06.2013

No comments:
Post a Comment