ఫిబ్రవరి 2013లో రాష్ట్రంలోని 2,929 సంఘాలకు ఎన్నికలు జరిపారు. 18 మాసాల వాయిదా అనంతరం ఈ ఎన్నికలు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా జరపాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిరది. 1995 నుండి 2005 వరకు ఎన్నికలు జరగలేదు. ఒక విధంగా సహకార ఎన్నికలు జరపడానికి తమకు అనుకూలమైన రాజకీయ వాతావరణం కలిగినప్పుడే పాలక పార్టీలు ఎన్నికలు జరుపుతున్నాయి. 1964 చట్ట ప్రకారం ఏర్పాటైన ఈ సంఘాలు గతంలో చాలా పటిష్టవంతంగా, నిష్పాక్షికతగా మరియు ఎకౌంటిబులిటీగా పనిచేసాయి. సంస్కరణలు చేపట్టిన తర్వాత సహకార వ్యవస్థకు పాలకులే చెదలు పట్టించారు. అనేక మార్పులు చేసారు. ఏ మంత్రి కొత్తగా ఈ సంఘం బాధ్యతలు చేపట్టినా సవరణలు తేవడం అనివార్యంగా జరుగుతున్నది. 31.03.2004కు ముదు 4,610 ప్రాథమిక సంఘాలు ఉండగా, వాటిని వైద్యనాధన్ సిఫార్సుల మేరకు 2,749కి తగ్గించారు. కోటి 38 లక్షల సభ్యత్వంలో కోటి సభ్యత్వాన్ని తొలగించివేసారు. మొదట రు.300, తర్వాత రు.500 వాటాలు ఉన్నవారికే ఓటు హక్కు కల్పించారు. ఆ విధంగా సన్న`చిన్నకారు రైతులను బయటకు పంపి ధనిక, పెట్టుబడిదారులకు సహకార సంఘాల్లో అవకాశం కల్పించారు. సంస్కరణలు చేపట్టిన తర్వాత సహకార సంఘాలపై సర్వేలు చేయగా, వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు జరిగిన సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు నిబంధనలకు మించి సొసైటీలలో, జిల్లా సంఘాల్లో నిర్వహణ ఖర్చులు పెట్టగా, సభ్యులు పూర్తిగా అప్పు చెల్లించినప్పటికీ సొసైటీ బాకీ ఉండే పరిస్థితి ఏర్పడిరది. ఈ విధంగా ఇన్‌బ్యాలెన్స్ రు.700 కోట్లకు చేరింది. రు.1,500 కోట్లు నిధుల దుర్వినియోగం జరిగాయి. మరో రు.500 కోట్లు తిరిగిరాని రుణాలు ఇచ్చారు. మొత్తం రాష్ట్ర సహకార బ్యాంకు రు.6,000 కోట్లు వ్యాపారం నిర్వహిస్తుండగా, అందులో 2,700 కోట్లు తిరిగిరాని రుణాలుగా మారాయి. గత రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో ఈ అవినీతి అంతా కొట్టుకుపోయింది. దానినే అవకాశంగా తీసుకుని తిరిగి మానేజింగ్ కమిటీల్లోకి రావడానికి ధనికవర్గం వేల కోట్లు ఎన్నికల వ్యయం చేసి అందులో స్థానం సంపాదించుకున్నారు. తాము పెట్టిన ఎన్నికల ఖర్చులను రాబట్టుకోవడానికి, సమాజంలో పలుకుబడి పొందడానికి ఈ సహకార సంఘాల పదవులను లక్ష్యంగా పెట్టుకుంటున్నారే తప్పా, ఈ సంఘాలను సహకార స్పూర్తితో నిర్వహించగలిగే స్థితి కనపడడంలేదు.
1995 పరస్పర సహకార సహకార చట్టాన్ని తెచ్చి పూర్తిగా స్వేచ్ఛ కల్పించారు. ప్రభుత్వ బాధ్యతను పూర్తిగా తొలగించారు. దాదాపు 11 మంది సభ్యులుగా చేరి (ఒక కుటుంబమైనా), సంఘంగా ఏర్పడి, తామే డిపాజిట్లు సేకరించడం, తమకు నచ్చినవారికి రుణాలు ఇవ్వడం, తమ సంస్థ ఆడిట్‌ను చార్టెడ్ అకౌంట్ల ద్వారా జరుపుకోవడం, లాభాలు వస్తే పంచుకోవడం, నష్టాలు వస్తే పెట్టుబడిపెట్టిన బ్యాంకు దివాళాతీయడం జరుగుతున్నది. 1995 చట్ట ప్రకారం సహకార సంఘాలను మార్చడానికి పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అనేక మంది మేధావుల పేరుతో చలామణి అయ్యేవారు కూడా బలపరుస్తున్నారు. ధనికవర్గం కొమ్ముకాస్తున్నారు. ఈ చట్టం క్రింద రిజిష్టర్ అయిన సంఘాలు చాలా వరకు దివాళా తీసాయి. 1964 చట్ట ప్రకారం ఏర్పడిన సంఘాల వాటాలపై వీరు వ్యాపారం చేసి దివాళా తీయించారు.
ఒక్క వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మినహా, మిగిలిన సంఘాలన్నీ 1995 చట్ట పరిధిలోకి వెళ్లాయి. రైతుల, ప్రజల ఒత్తిడివల్ల ఈ రంగంలోని సంఘాలు నేటికీ 1964 చట్టం ఆధారంగా పనిచేస్తున్నాయి. 40 లక్షల మందికి రుణాలు ఇస్తున్నారు. ఈ సంఘాల్లో చేరిన కొందరు రుణ వసూళ్ల యెడల శ్రద్ద చూపకపోవడం వలన ‘‘బుక్ అడ్జెస్ట్‌మెంట్’’ చేసి రైతుల రుణ భారాన్ని పెంచుతున్నారు. దాదాపుగా సహకార వ్యవస్థలో బుక్ అడ్జెస్ట్‌మెంట్‌పైనే వసూళ్లు సాగుతున్నాయి. ఆ విధంగా సహకార సంఘాల రుణ వ్యవస్థ పరిస్థితి అధ్వాన్నంగా దిగజారింది. రుణ పంపిణీ ఈ దిగువ విధంగా ఉన్నది.
సహకార రంగంలో ఇచ్చిన రుణాలు (కోట్లలో)
సం॥రం పంటరుణాలు దీర్ఘకాలికరుణాలు మొత్తం
2009`10 4347 281 4628
2010`11 5498 421 5919
2011`12 4699 513 5212
2012`13 డిశంబర్ వరకు 5597 2253 7850
ఈ రంగంలో సభ్యులు 38 లక్షలు కాగా, నేటికీ 25 లక్షల మంది కొత్త సభ్యులుగానే (రుణం పొందని సభ్యులుగా) కొనసాగుతున్నారు. ఏటా ప్రతి బ్రాంచ్ వంద మంది కొత్త సభ్యులకు రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయిస్తున్నది. కానీ, ఇంత వరకు వారు నిర్ణయించుకున్న లక్ష్యం పూర్తికావడం లేదు. కొత్త సభ్యులకు 3వేల నుండి 5వేల మధ్య మాత్రమే రుణాలు ఇస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను అమలు జరపడం లేదు. కౌలుదార్లకు సంబంధించి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఆంధ్రప్రదేశ్ భూమి లైసెన్స్ సాగుదార్ల చట్టం ` 2011’’ను 23.12.2011న తెచ్చింది. కౌలు రైతులకు (లైసెన్స్‌డ్ సాగుదారులు) గుర్తింపు కార్డులు ఇచ్చి, వారికి (1) రుణాలు (2) పంటల భీమా సౌకర్యం (3) ప్రభుత్వ పథకాలు (4) ప్రకృతి వైఫరిత్యాల సందర్భంగా ఇన్‌పుట్ సబ్సిడీ మాత్రమే ఇచ్చే విధంగా కార్డుల్లో నమోదు చేసారు. కానీ 40 లక్షల మంది కౌలుదార్లు ఉన్నట్టు రైతుసంఘాలు చెబుతుండగా, ప్రభుత్వం మరియు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మాత్రం 25 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు నివేదికలో చూపింది. అయినప్పటికీ ఈ చట్టం క్రింద 2011`12లో 7.53 లక్షల మంది గుర్తింపు కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోగా, 5.76 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇచ్చారు. అందులో 1,97,747 కార్డులు పొందినవారికి 393.45 కోట్లు మాత్రమే రుణ సౌకర్యం కల్పించారు. 2012`13లో 3,87,928 మందికి కార్డులు ఇవ్వగా (కొత్తగా 1,56,872 మంది, రెన్యూవల్ చేసుకున్నవారు 2,31,056 మంది) అందులో 95,973 మంది కార్డు హోల్డర్లకు మాత్రమే 196.85 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చారు. 2012`13లో 2వేల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇటు రైతులకు, అటు కౌలుదారులకు రుణాలు ఇవ్వడానికి ప్రధాన బాధ్యత సహకార రంగంపై ఉంది. కానీ సహకార రంగానికి రుణాలు ఇవ్వడానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితి కల్పించబడలేదు. అందువలన సహకార రంగం నామమాత్రమైంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు గతంలో సహకార వ్యవస్థ నుండి మాత్రమే సింగిల్ విండో ద్వారా పంపిణీ చేసే విధానం కొనసాగింది. కానీ సంస్కరణల తర్వాత వాణిజ్యబ్యాంకులు తమ వ్యాపార విస్తరణను వ్యవసాయ రంగంలోకి పెంచారు. ఆ విధంగా వ్యవసాయ రంగంలో గల వ్యాపార అవకాశాలను విస్తారంగా వినియోగించుకున్నారు. వడ్డీల రూపంలో వేల కోట్ల లాభాలు సంపాదించారు. ప్రస్తుతం పారిశ్రామిక పెట్టుబడులు, సెజ్‌ల ఏర్పాటుతో పాటు, ఆర్థిక`వాణిజ్య ప్రాంతాలను ఏర్పాటు చేసి తమ నిధులను అటువైపు మళ్లించారు. ఆ విధంగా వ్యవసాయ రంగంలో ఇస్తున్న రుణాలను క్రమానుగతంగా వాణిజ్యబ్యాంకులు తగ్గించుకున్నాయి. ఒక రకంగా సహకార వ్యవస్థను బలహీనపరచి, మరోవైపున తమ రుణాలను పరిశ్రమల వైపు, రియల్ ఎస్టేట్‌ల వైపు మార్చుకుంటున్నారు. నేడు సహకార వ్యవస్థ నుండి వ్యవసాయ రంగానికి 15శాతం మాత్రమే రుణాలు లభ్యమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సహకార వ్యవస్థను పటిష్టపరచి ఈ వ్యవస్థ ద్వారా మాత్రమే వ్యవసాయ రుణాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు రూపొందించాలి. అందుకు అవకాశాలు ఉన్నాయి.
29.08.2006న వైద్యనాధన్ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలతో నాబార్డ్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను రక్షించడానికి రు.4,839కోట్లు అవసరమని తేల్చింది. పరపతి సంఘాల మనుగడ కాపాడడానికి ఈ నిధులను కేంద్రం, రాష్ట్రం, సహకార సంఘం 74:11:15 నిష్పత్తిలో పాలుపంచుకునేలా ప్యాకేజీని అమలు చేయాలని కోరింది. ఈ ప్యాకేజీలో 1500 కోట్లు కంటిన్‌జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. నష్టాల్లో ఉన్న సంఘాలను లాభాల్లో ఉన్న సంఘాల్లో కలిపి 4,610 సంఘాలను 2,949 సంఘాలకు కుదించింది. కానీ ఇన్ని నష్టాలు కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు భరించినప్పటికీ కుదించిన సంఘాల్లో నేటికీ మరలా 350 సంఘాలు నష్టాల్లో ఉన్నాయి. ఈ సంఘాలకు రుణాలు పంపిణీ చేసే హక్కు నిరాకరించబడిరది. వీటిని లాభాలలోని సంఘాల్లో కలపాలని పైనుండి ఆదేశాలు వస్తున్నాయి. ఇలా నష్టాలు వచ్చిన సంఘాలను రద్దుచేస్తూ పోతుంటే చివరకు సహకార వ్యవస్థే పోతుంది. అలా రద్దు చేయకుండా, రద్దుకు గల కారణాలను పరిశీలించి వాటిని సంస్కరించాలి. అంతేకాని సంఘాలను రద్దు చేయడం ద్వారా నష్టాలు భర్తీకావు. ఒకవైపున కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు వాయిదా వేస్తుంది. అలా వాయిదా వేసినప్పుడు రుణ వసూలు చేయని బ్యాంకులు దివాళా తీస్తాయి. రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలంటే వాటి ఆర్థిక పరిస్థితి సరిపోదు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటిన్‌జెన్సీ ఫండ్ నుండి ఆ సంఘానికి రక్షణ కల్పించాలి.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలు ఇవ్వాల్సి వస్తే 40వేల కోట్లు సరిపోతాయి. మరొక 15వేల కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రుణాలను సహకార వ్యవస్థ ద్వారా ఇవ్వడానికి ఆ రంగాన్ని పటిష్టపర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా సహకార సంఘాల్లో డిపాజిట్లు చేయాలి. ఆ డిపాజిట్లు రుణ వ్యాపారం చేసే విధంగా నిబంధనలు రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వ డిపాజిట్లు ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా అవసరం ఉండదు. అవసరాన్ని బట్టి డిపాజిట్ నిధులను వినియోగించుకున్నప్పటికీ రుణం పొందిన రైతులకు తమ చెల్లింపు వాయిదా వచ్చేంతవరకు ఎలాంటి ఇబ్బంది కలగదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా సహకార వ్యవస్థలో కాకుండా, వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఆ బ్యాంకులు డిపాజిట్‌దార్లను ఆకర్షించే చర్యలు చేపడుతున్నారు. వాణిజ్యబ్యాంకుల ఆకర్షణలకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వమే తమ డిపాజిట్లు సహకార రంగంలో డిపాజిట్ చేయాలన్న నిబంధనలను రూపొందించాలి. వసూళ్ల విషయంలో సహకార బ్యాంకు అధికారులను వాణిజ్యబ్యాంకు అధికారులలాగా అకౌంటుబులిటీ బాధ్యతను పెట్టాలి. 1964 నుండి 1997 వరకు సహకార వ్యవస్థ బాగా పనిచేసింది. ఒక విధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ రంగం ఆధ్వర్యంలో జిల్లా మార్కెటింగ్ సంఘాలు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాక, ప్రాసెస్ చేసి చౌకడిపోల ద్వారా తక్కువ ధరకు వినియోగదారులకు సరుకులు అందించారు. నిత్యావసర సరుకులేకాక, బట్టలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. మధ్య దళారీల తొలగింపు వలన రైతుల ఉపకరణాల ధరలు కంపెనీ ధరలకు లభించాయి. అందులో నాణ్యమైన సరుకు లభించింది. నాణ్యతలేని విత్తనాల వల్ల కాని, క్రిమిసంహారక మందుల వల్ల కాని ఒక ఎకరా పంట నష్టం జరగలేదు. నేడు మధ్యదళారీల రాకతో సహకార వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఎరువుల ఫ్యాక్టరీలు, బట్టల ఫ్యాక్టరీలు, చెరుకు ఫ్యాక్టరీలు, ఎరువుల మిక్సింగ్ ఫ్లాంట్లు ఈ రంగంలో పనిచేసాయి. వాటన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలి. జిల్లా మార్కెటింగ్ సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. కొత్తగా వచ్చిన కమిటీలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాత పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రాసెస్ చేసే విధానాన్ని కొనసాగించాలి.
రుణాలకు సూచనలు :
1. స్కేలు ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలివ్వాలి - రుణ మొత్తంపై పరిమితి విధించరాదు. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి.
2. వ్యవసాయ కార్మికులకు వినియోగ రుణాలివ్వాలి.
3. సొసైటీలు వ్యవసాయేతర వ్యాపారం చేయడానికి వీలుగా సొసైటీ వాటాధనంతో పాటుగా బ్యాంకులు రుణ సదుపాయం చేయాలి. ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు అద్దెకు, అందించాలి.చౌకదుకాణాలు నిర్వహించాలి. అన్ని నిత్యావసర వస్తువులు అమ్మించాలి. విత్తనాలు కూడా అమ్మాలి.
4. రుణ వసూళ్ల సందర్భంలో పంటలను కొనుగోలు చేయుటకు అవకాశం కల్పించాలి. (కొనుగోలు చేసిన పంటను అమ్మి జిల్లా బ్యాంకుకు రుణం చెల్లించాలి.)
5. కేంద్ర - రాష్ట్రాలకు నిధులు (పెన్షన్లు మానవ వనరుల అభివృద్ధి నిధులు, వేతనాలు, ఇతర బడ్జెటు వనరులు) సహకార బ్యాంకులలో డిపాజిటు చేసి, దాని ద్వారా ప్రభుత్వాలు వ్యయం చేయాలి.
6. ఒకే కుటుంబంలో ఒకరికే రుణం ఇవ్వాలి. (ఎంత భూమి ఉన్నా - ఎంత మొత్తమైనా ఇవ్వాలి).
7. గ్రామంలో డిపాజిట్లు సేకరించాలి.
8. దళిత, గిరిజనులకు మొత్తం రుణంలో ప్రస్తుతం 15 శాతం ఇవ్వాలన్న నిబంధనకు బదులుగా35 శాతం పంట రుణంగా ఇవ్వాలి.
9. సభ్యులుగా నున్న వారందరికి రుణాలివ్వాలి. - బినామి సభ్యత్వం తొలగించాలి.
10. చేతివృత్తుల వారు గాని, ఇతరులు గాని సభ్యులుగా వుంటే రుణం ఇవ్వాలి.
11. ప్రతి వాస్తవసాగుదారు పేరు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలి - రెవెన్యూ రికార్డుల ప్రకారం రుణ పట్టిక తయారు చేయాలి.
12. వాస్తవ సాగుదారు (కౌలుదారు) పంటరుణం ఇవ్వాలి.
13. వ్యవసాయాధికారులతో రైతులకు పంటలు పండిరచటంపై శిక్షణ ఇవ్వాలి. ఏ భూమిలో ఏ పంట వేయాలో చెప్పాలి.
14. పాడిపరిశ్రమ - గొఱ్ఱెల, మేకలపెంపకం - కూరగాయల పెంపకం వారికి రుణాలివ్వాలి.
15. చేతివృత్తుల వారికి వారి సంఘాల ద్వారా రుణాలివ్వాలి.
జిల్లా మార్కెటింగ్ సహకార సంఘాలు ` వాటి సేవలు :
రాష్ట్రంలో గత 22 జిల్లాలకు ‘‘ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు’’ ఉన్నాయి. వీటికి అనుబంధంగా తాలుకా మార్కెటింగ్ సహకార సొసైటీలు పనిచేశాయి. ఈ సొసైటీలు రైతులకు, ప్రజలకు చౌకధరలకు ఈ దిగువ సరుకులు అందించాయి.
1. ఎరువులు, క్రిమిసంహారక మందులు,
2. విత్తనాలు,
3. వ్యవసాయ పనిముట్లు(డస్టర్లు, వీడర్లు, పవర్‌స్ప్రేయర్లు వగైరా)
4. బట్టలు
5. 14 రకాల నిత్యావసర సరుకులు(బియ్యం, నూనెలు, సబ్బులు వగైరా)
పై సూచనలు అమలు చేయడం ద్వారా సహకార వ్యవస్థ పటిష్టపడడమే కాక, ఈ వ్యవస్థ ద్వారా సన్న`చిన్నకారు రైతులకు, మధ్యతరగతి వ్యాపారులకు లబ్ది కలుగుతుంది. సహకార సంఘం పటిష్టవంతమవడమే కాక, ప్రజల మధ్య సహకారం పెంపొందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పై విధానాలను అమలు జరపాలి.
24.03.2013
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment