కేంద్ర ప్రభుత్వం కిరోసిన్, వంటగ్యాస్, ఎరువులపై రాయితీలను ప్రభుత్వం సరాసరి లబ్దిదారుల ఖాతాలో జమచేయబోతున్నట్లు ప్రకటించింది. యుఐడిఏఐ అధ్యక్షులు నందన్ నీలేకని నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన నివేదికను శరద్‌పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, శ్రీకాంత్ జన, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా పాల్గొన్నారు. మొదట తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, హర్యాన, ఢల్లీి, రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాల్లో అక్టోబర్ నుంచి పైలెట్ ప్రాజెక్టులు అమలు చేస్తామన్నారు. కానీ తర్వాత జనవరి 2013 జనవరి 1 నుండి ముందు 51 జిల్లాల్లో ఆరంభించి ````` 2014 వరకు దీన్ని దేశవ్యాపితంగా అమలు చేయాలని సంకల్పించారు. ఇందులో ఐదు అంశాలను గుర్తించారు. (1) నగదు బదిలీ ప్రాంతాలను అమలు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించడం (2) అలా గుర్తించిన ప్రాంతాల్లో పథక అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం (3) ఆధార్ అమలును వేగవంతం చేయడం (4) అందరికీ బ్యాంకింగ్`ఆర్థిక వ్యవస్థను అందుబాటులోకి తేవడం (5) నగదు బదిలీ అమలు చేయబోయే ప్రాంతాల్లో క్షేంత్రస్థాయిలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. వీటన్నింటినీ అమలు చేయడానికి మరో కమిటీని నియమిస్తూ అన్ని మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని కొనసాగించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు.
ఐదు అంశాలు :
(1) పట్టణ ప్రాంతాల్లోగానీ, గ్రామీణ ప్రాంతాల్లో గాని నగదు బదిలీ ప్రాంతాలను గుర్తించలేదు. ముఖ్యంగా దళిత, గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాలను, మురికివాడలను, పేదలు నివసించే ప్రాంతాలను గుర్తించాలి. ఇది గుర్తించాలంటే ఎంత ఆదాయం వచ్చినవారు దారిద్య్రరేఖకు దిగువన ఉంటారో ముందు ప్రభుత్వం నిర్ణయించాలి. ఆ నిర్ణయం ఇంత వరకు జరగలేదు. ఒక్కో కమిటీ ఒక్కో విధంగా అంచనా వేసింది. (2) గుర్తించిన ప్రాంతాల్లో అమలుకు యంత్రాంగం ఏర్పాటు చేయలేదు. ఆ యంత్రాంగం ఆధార్ కార్డులు ఇప్పించడం, బ్యాంకు ఎకౌంట్లు తెరిపించడం తదితర పనులు చేయాలి. ముఖ్యంగా పేదలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాలకు పనుల కొరకు వసలు వెళ్తుంటారు. అప్పుడు వారికి ఈ నగదు బదిలీ పథకం కూడా వారున్న ప్రాంతంలో వారికి అందేటట్లు చూడాలి. ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం స్థిర నివాసం ఉన్నవారికే ఇది ఉపయోగపడుతుంది. నెలల తరబడి వలసలు వెళ్లి, తిరిగి వచ్చి స్వగ్రామంలో ఉండేవారికి ఇది వర్తించదు. (3) ఆధార్‌కార్డు అమలును వేగవంతం చేయాలని చెప్పడమే తప్ప, ఫోటోలు దిగి వివరాలు ఇచ్చిన వారికి లక్షలాది మందికి కార్డుల పంపిణీ జరగలేదు. పోస్టఫీసుల్లోనూ, కాంట్రాక్టర్ల వద్ద వేలకొలది పోగుపడి ఉన్నాయి. ఈ కార్డులు కూడా డూప్లికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జన సంఖ్యకు మించి కార్డులకు డిమాండ్ ఉంది. (4) అందరికీ బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు అందుబాటులో పెట్టాలి. కానీ, రాష్ట్రంలో 52వేల ఆవాసాలుండగా, గ్రామీణ ప్రాంతంలో 3245 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. వీటిని విస్తరించాలి. ప్రస్తుతం రిజర్వ్‌బ్యాంకు అన్ని జాతీయ బ్యాంకులను ఆదేశిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో 25శాతం బ్రాంచీలను అదనంగా ఏర్పాటు చేయాలని కోరింది. వాణిజ్యబ్యాంకులు, జాతీయ బ్యాంకులు కష్టంగానైనా ఈ విధానాన్ని అమలు చేయవచ్చు. కానీ విదేశీ బ్యాంకులు రాష్ట్రంలో 25 ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతంలోకి వెళ్లడానికి సుముఖంగా లేవు. పైగా ప్రభుత్వ నగదు బదిలీ పథకాల సేవకు అవి సిద్ధంగా లేనట్లు కనపడుతున్నాయి. లాభాల వేటే వాటి లక్ష్యం. (5) క్షేత్ర స్థాయిలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఏ శాఖకు బాధ్యత అప్పగిస్తారు? ఇంత వరకు సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ చవకడిపోల కార్యక్రమం నిర్వహిస్తున్నది. సివిల్ సప్లయ్ శాఖను విస్తరింపచేసి ప్రతి గ్రామ స్థాయిలో ఒక్కరిద్దరిని శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
పై ఐదు అంశాలకు సంబంధించిన వ్యయాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికావకాశాలు తక్కువ. కేంద్రం సహకరిస్తే తప్ప పై పనులను పూర్తిచేయడం సాధ్యం కాదు. దానికి ప్రత్యేకమైన లక్ష్యశుద్ది కలిగిన సిబ్బంధి కావాలి.
ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూన్ 1 నుండి గ్యాస్ సరఫరాకు నగదు బదిలీ ప్రారంభించడానికి గడువు నిర్ణయించారు. కానీ ఇది అమలు జరగడం లేదు. నేటికీ చాలా మందికి ఆధార్‌కార్డులు గాని, ఆధార కార్డులు ఉన్నవారికి బ్యాంక్ అకౌంట్లు కానీ లేవు. ఆధార్‌కార్డు పొందడానికి ఇప్పటికీ రెండుసార్లు గడువును పొడిగించారు. మరలా 2013 అక్టోబర్ వరకు గడువును పొడిగించారు.
2013`14లో ఎరువులపై 66 వేల కోట్లు, చౌక డిపోల ద్వారా బియ్యం, గోదుమలు 90,775 కోట్లు, పెట్రోల్`గ్యాస్ ద్వారా 65,188 కోట్లు రాయితీలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ నివేదికలో చెప్పింది. ఈ మూడు రాయితీల్లో కిరసనాయిల్, ఎరువులు రాయితీలు లెక్కవేస్తే 73,637 కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా. ఈ రాయితీ పొందడానికి ఆధార్‌కార్డు తప్పనిసరి చేసారు. ప్రభుత్వం ప్రతి వ్యక్తికి నిర్ణయించిన కోటాను బట్టి నగదు ఎంత రాయితీ పొందుతున్నది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన మొత్తాన్ని లబ్ధిదారుడు తన సరుకులు కొనుగోలు చేసిన తర్వాత అతని పేరుపై బ్యాంకులో జమ అవుతాయి. ఆ విధంగా సంవత్సరానికి కావాల్సిన మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయిస్తారు. ఇక నుండి ప్రభుత్వం మార్కెట్ ధరకే సరుకులను వినియోగదారులకు ఇస్తుంది. రాయితీ పొందే అర్హత కలవారు తమ బ్యాంకు ఖాతాలో జమచేసిన మొత్తాన్ని వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఆహార సబ్సిడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కిలో 5.65 పైసలకు బియ్యం సరఫరా చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 4.65 పైసలు సబ్సిడీ ఇస్తూ ఒక రూపాయికీ కిలో ఇస్తున్నది. ప్రస్తుతం ఇచ్చే రాయితీ కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వాలంటే తాను భరిస్తున్న 3వేల కోట్ల ఆహార సబ్సిడీని కూడా లబ్దిదారులకు అందజేయాలి. లేని తీరుకు కేంద్రం ఇచ్చే రాయితీని మాత్రమే పొందగలుగుతారు. ఆధార్ కార్డు లేని వారికి ఈ సౌకర్యం ఉండదు. ఇప్పటికీ 40శాతం మందికి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు లేవు.
దేశంలో దారిద్య్ర పరిస్థితి :
దేశంలో 121 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని అంచనా వేయడానికి ఇంత వరకు కేంద్రం ఒక నిర్ణయానికి రాలేదు. తాను వేసిన కమిషన్లు ఒక్కోటి ఒక్కో విధంగా గణాంకాలు సమర్పించాయి. టెండూల్కర్ కమిటీ 37.2శాతంగా గుర్తించగా, సక్సేనా కమిటీ 50శాతంగానూ, వాద్వా కమిటీ 70శాతంగానూ, అర్జున్‌సేన్ గుప్తా కమిటీ 77శాతంగానూ అంచనాలు వేసాయి. టెండూల్కర్ కమిటీ వేసిన 37.2శాతం దారిద్య్రరేఖ నుండి ప్రజలు 32 శాతానికి తగ్గినట్లు మరో అంచనా వేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని నిర్ణయించకుండానే నగదు బదిలీని ఎలా అమలు చేస్తారు? ప్రస్తుతం గ్రామల్లో రూ.26, పట్టణాల్లో రూ.32 ఆదాయం రోజూ వచ్చినవారిని దారిద్య్ర రేఖ దిగువ నుండి తొలగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 46శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 28శాతం మందికి ఆహార భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని 88 దేశాల్లో భారత్ 66వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆకలికి గురవుతున్నవారు 5.7 కోట్లుగా అంచనా వేసారు. ప్రస్తుతం ఐదు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు చౌక డిపోల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2014 నాటికి ఆహార భద్రత చట్టం వస్తే 7.4కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు కావాలి.
ఎరువుల వినియోగం :
దేశానికి అవసరమైన ఎరువుల్లో నత్రజనితో పాటు ` భాస్వరం, పోటాషియం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశ వినియోగం (మూలకాలలో) నత్రజని 160 లక్షల టన్నులు, 70 లక్షల టన్నులు బాస్వరము, 33 లక్షల టన్నులు పొటాష్ వినియోగిస్తున్నాం. గతంలో నత్రజని, భాస్వరం మన అవసరాల్లో 40 శాతం వరకు దేశీయ ఉత్పత్తులపై ఆధారపడ్డాం. కానీ దేశీయ ఉత్పత్తులను సరళీకరణకృత ఆర్థిక విధానాల ఫలితంగా తగ్గించి మొత్తం దిగుమతులపై ఆధారపడుతున్నాం. నత్రజని 35లక్షల టన్నులు, భాస్వరం 28లక్షల టన్నులు, పోటాష్ 26లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో 28 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేసే పరిశ్రమలను 2009 నుండి మూసివేసారు. ఫలితంగా దిగుమతులపై ఆధారపడడంతో ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఎరువుల తయారీకి వినియోగించు నాఫ్తా ధర పెరిగినప్పుడు ధరలు పెరగడం, తగ్గినప్పుడు ధరలు తగ్గడం జరుగుతున్నది. ప్రస్తుతం 50 కిలోల యూరియా బస్తా నాఫ్తాతో తయారు చేయడానికి రూ.1750లు అవుతుంది. డీఏపీ 50 కిలోల బస్తాకు 2513 రూపాయలు అవుతుంది. గతంలో ప్రభుత్వ సబ్సిడీ విధానం ప్రకారం ఎరువులకు ధర నిర్ణయించి, మిగిలిన ఉత్పత్తి ఖర్చును కేంద్రం భరించింది. ఉత్పత్తి ఖర్చు, తగ్గినా, పెరిగినా రైతుకు సంబంధం లేదు. 2010 ఏప్రిల్ నుండి ఎరువుల సబ్సిడీ విధానాన్ని మార్చింది. ‘‘మూలకాల ఆధారిత సబ్సిడీ’’ పేర ఎరువుల బస్తాకు ప్రభుత్వం సబ్సిడీ నిర్ణయించి, సబ్సిడీ పోగా ఉత్పత్తి ఖర్చు రైతు భరించాలి. ఉత్పత్తి ఖర్చు పెరిగినా, తగ్గినా ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. ప్రస్తుతం ఎరువుల సబ్సిడీ నత్రజని కిలో రు.27.48, బాస్వరం రు.29.40, పొటాషియం రు.24.63, సింగల్ సూపర్ పాస్పేట్ రు.1.69 (2011`12) సబ్సిడీ నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల 484 రూపాయలు ధర గల 50 కిలోల డిఏపీ బస్తా నేడు రు.1350లకు పెరిగింది. ప్రస్తుతం యూరియాపై కంట్రోల్ ఉండడం ఫలితంగా 280 రూపాయలకు 50 కిలోల బస్తా అమ్ముతున్నారు. కంట్రోల్ ఎత్తివేస్తామని ప్రధాని ఎత్తివేస్తున్నారు. అప్పుడు 50 కిలోల బస్తా ధర రు.1200లకు చేరుకుంటుంది (సబ్సిడీ పోగా). ఈ విధంగా మార్కెట్ ధరల ఎగుడు, దిగుడు జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే నగదు బదిలీలో హెచ్చుతగ్గులుంటాయా అనేది సందేహాస్పదం.
ఒక రైతుకు అతనికున్న భూమిని బట్టి ఎన్ని ఎరువుల బస్తాలు వేయాలన్నది నిర్ణయిస్తారు. పరిస్థితుల బట్టి అదనంగా ఎరువులు వాడాల్సి వస్తే సబ్సిడీలేని ఎరువులు కొనుగోలు చేయాలి. ఇది ధనిక రైతులు కూడా భరించలేని భారంగా ఉంటుంది. కౌలుదారులకు ఎలాంటి రికార్డులు ఉండవు. వారికి కావాల్సిన ఎరువులు ఎలా కొనుగోలు చేయాలి. భూయజమాని కౌలుదారుకు ఎక్కువ రేట్లకు ఎరువులు అమ్ముకునే అవకాశం కల్పించబడుతుంది. ఆ విధంగా పేద కౌలుదారులు ఎరువులకు దూరమవుతారు. దిగుబడులు తగ్గుతాయి.
కిరసనాయిల్ ` గ్యాస్ :
పెట్రోలియం ఉత్పత్తుల్లో కిరసనాయిల్ ఒకటి. ఇది పేదలకు వంటతోపాటు, దీపాలకు ఉపయోగిస్తారు. చాలా మంది నేటికీ గ్యాస్‌ను వినియోగించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నేటికీ 12శాతం పిడకలతో, 25శాతం కట్టెలతో వంటలు చేస్తున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. పోగా మిగిలినవారిలో 15 శాతం మంది కిరసనాయిల్‌తో వంటలు చేస్తున్నారు. వీరు కిరసనాయిల్ ధరలు పెరిగినప్పుడు అదనపు భారానికి గురవుతున్నారు. చౌకడిపోల ద్వారా వచ్చే కిరసనాయిల్ కొంత మేరకు వెసులుబాటు కలిగించినప్పటికీ, పూర్తిగా వారి అవసరాలను తీర్చలేదు. కిరసనాయిల్‌ను పెట్రోల్, డీజిల్‌లలో కలిపి పెద్దపెద్ద బంకులు అవినీతి వ్యాపారం చేయడంతో చౌక డిపోల ద్వారా వచ్చే కిరసనాయిల్ కూడా సక్రమంగా రావడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే గ్యాస్ బాధితులు కూడా ఉన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర సబ్సిడీతో 425 రూపాయలు కాగా, దానిని 975కు పెంచారు. పెంచిన 550 రూపాయలు నగదు బదిలీగా మార్చుతారు. రేపు అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధర పెరిగినప్పుడు లేదా స్థానికంగా ఉత్పత్తి అవుతున్న గ్యాస్ ధరను రిలయన్స్ కంపెనీ పెంచినప్పుడు నగదు బదిలీగా ఇచ్చు రాయినీ ఆ దామాషాలో పెంపుదల చేస్తారా? అనేది అనుమానస్పదం.
ఫలితాలు :
విదేశాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని మన దేశంలో అమలు చేయాలని కోరుకోవడం, ఇక్కడి పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయో లేవో అని చూడకుండా నిర్ణయించడం జరుగుతున్నది. 2014 ఎన్నికల్లో ఓటర్లకు ప్రత్యక్ష్యంగా డబ్బు అందజేసే కార్యక్రమంగా ఇది కనపడుతుంది. ముఖ్యంగా లబ్ధిదారుని చేతికి వచ్చిన తర్వాత ఆ సరుకుకే వినియోగిస్తాడన్న నమ్మకం అనుమానస్పదం. కారణం` భాహ్య పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు, ఇతర అవసరాలకు లాగే ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వెలసిన మద్యం షాపులు ఈ డబ్బును ఆకర్షించడానికి పోటీలు పడతాయి. ఈ విధానాకి బొక్కలు సృష్టించి అందుగుండా పథకం అమలు కాకుండా చేసే అవకాశం ఉంది. నేటికీ రాష్ట్రంలో చదువురాని వారి సంఖ్యం 50శాతం ఉంటుంది. (ప్రభుత్వం 64శాతం అక్షరాస్యత ఉన్నట్లు చెబుతున్నది.) అందువల్ల పరిపూర్ణత లేని సందర్భాల్లో ఈ పథకం అమలు అంత తేలికైన పని కాదు. రెండువ ముఖ్య విషయం` కొనుగోలు చేయాల్సిన సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్, లేదా జాతీయ మార్కెట్టు ప్రభావానికి గురై ధరలు పెరిగినా, తగ్గినా నగదు బదిలీ పథకం అందుకు ప్రభావితం కానిచో లబ్ధిదారుడు నష్టపోతాడు. ఒకసారి నిర్ణయించిన సబ్సిడీని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్ణయించాలి. మూడవ ముఖ్య విషయం ` నగదు బదిలీ డబ్బు వెంటవెంట ఖాతాలకు జమ కావాలి. ప్రస్తుత ప్రభుత్వ పథకాలు చూస్తుంటే, ప్రభుత్వం బడ్జెట్ నుండి కేటాయింపులు చేయడమే తప్పా, నిధులు విడుదల చేయకపోవడం పరిపాటిగా ఉంది. ఉదాహరణకు ` దళిత, గిరిజన పథకాలకు కేటాయించిన డబ్బు, మైనారిటీ, మహిళా, శిషు సంక్షేమానికి కేటాయించిన నిధులు, అలాగే కొన్ని భారీ`మధ్య తరహా ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు విడుదల చేయడంలో ఆర్థిక శాఖ ఇబ్బందులు పడుతున్నది. ముఖ్యంగా ప్రకృతి వైఫరీత్యాల పరిహారం చెల్లించడానికి కేంద్రం నిధులిచ్చినా, మ్యాచింగ్ గ్రాంట్లు చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నది మనం చూస్తున్నాం. ఘనంగా నిధులు కేటాయించడం అలవాటుగా మారింది. కానీ విడుదలకు అంత శ్రద్ద చూపడం లేదు. పైగా బడ్జెట్లు అస్థిరంగా ఉంటున్నాయి. శాసనసభలో ఆమోదం పొందిన బడ్జెట్టు 12 శాతం నుండి 20 శాతం వరకు లోటు కొనసాగుతున్నది. రెవెన్యూలోటు, ద్రవ్యలోటు వల్ల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతున్న వాస్తవాన్ని ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో అంగీకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో నగదు బదిలీ ఆలస్యం జరిగినచో పేదలు ఆకలిచావులకు గురికావడమే తప్ప, మరో దారి కనపబడదు. ప్రస్తుతం ఆహార భద్రతా చట్టం తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. అందరికీ ఆహార భద్రత కల్పించే విధంగా చట్టంలో సవరణ చేసి, సరుకులనే లబ్ధిదారులకు అందించే విధంగా పథకాలను కొనసాగించడం ఈ దేశ పరిస్థితులకు అనుకూలంగా ఉంది. అందువలన తాత్కాలిక ప్రజోజనాన్ని ఆశించి సంక్షేమ పథకాలను పరోక్షంగా కోత పెట్టడం సరికాదు. చివరికి రాయితీల కోతకే ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇది ఆత్మహత్యా సదృశ్యం. అందువలన పథకాన్ని పునరాలోచించి ప్రభుత్వం అడుగులు ముందుకేయాలని ప్రజలు కోరుతున్నాను.
సారంపల్లి మల్లారెడ్డి
07.06.2013

No comments:
Post a Comment