2000 సంవత్సరంలో అమెరికన్ బహుళజాతి సంస్థ అయిన మోన్‌శాంటో రాష్ట్రంలోని మహికో, ప్యారీ కంపెనీలతో కలిసి విత్తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ కంపెనీ ''బి.టి పత్తి విత్తనాలను'' ప్రవేశపెట్టింది.
- అంతకముందు ఎకరాకు సరిపడు పత్తి విత్తనాలు (అధికోత్పత్తి వంగడానికి)స్థానికంగా రు. 230లకు లభ్యమయ్యేవి. మోన్‌శాంటో కంపెనీ బి.టి విత్తనాలు ప్రవేశపెడుతూ ఎకరానికి విత్తనం ఖరీదు 450 గ్రాములకు రు. 1850లుగా నిర్ణయించి అమ్మారు. రు. 100 కోట్ల వరకు విత్తనాల అమ్మకం ద్వారానే యీ కంపెనీ ఆర్జించింది.
- 2007 ఖరీఫ్‌లో రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి 450 గ్రాముల ఖరీదు రు. 750లకు తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ ఎకరాకు 900 గ్రాములు వాడాలని చెప్పి రైతులనుండి ఎకరానికి రు. 1500 వసూలు చేస్తున్నది.
- బి.టి విత్తనాలు గతంలో నాణ్యతాలోపం కారణంగా యేటా లక్షలాది ఎకరాలలో పంటలకు కాయ, పూత లేకుండా పోయాయి. దీనికి ఎలాంటి పరిహారం యివ్వలేదు.
1. ప్రకాశం జిల్లా పావులూరులో యీ కంపెనీ బి.టి మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేయడం ద్వారా అక్కడి రైతులు పంట రాకుండా నష్టపోయారు. దీనిపై ''పరస్పర అవగాహన ఒప్పందం'' కమిటీ రైతులకు రు. 40లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది. ఆ తీర్పు నేటికీ అమలు కాలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంకూడా పరిహారం చెల్లించాలని కంపెనీకి నోటీసు యివ్వడంతో పాటు లైసెన్సు రద్దుచేసింది.
2. 2008 ఖరీఫ్‌లో వరంగల్ జిల్లాలో మహికో కంపెనీ సరఫరా చేసిన నాణ్యతలేని పత్తి విత్తనాల (''బి.టి- నీరజ'') వలన ములుగు, నర్సంపేట డివిజన్‌లలో 40వేల ఎకరాలలో పంటలు పూత- కాయ లేకుండా పోయాయి. ఒక్కోరైతు ఎకరానికి రు. 10వేల వరకు నష్టపోయారు. నేటికీ రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వున్నారు.
3. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న విత్తన చట్టం బహుళజాతి కంపెనీల నియంత్రణకు ఉపయోగపడదు. 2004 విత్తన చట్టం నేటికీ పార్లమెంట్ వద్ద ఆమోదం లేకుండా పెండింగ్‌లో వున్నది.
వాస్తవానికి రాజ్యాంగం రీత్యా విత్తన చట్టం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ, కేంద్రంపైకి నెట్టి తప్పుకొంటున్నది. బి.టి టెక్నాలజీని వాణిజ్యపరంగా ఉత్పత్తికి విడుదల చేసినప్పుడు రాష్ట్ర కేంద్రంలోని ఎన్.జీ రంగా యూనివర్సిటీలో పరిశీలించాక ఇక్కడి వాతావరణానికి సరిపోతుందని ధృవీకరణ పత్రం పొందిన తర్వాతనే విడుదల చేయాలి. కానీ అలాగాకుండా బి.టి టెక్నాలజీని మొక్కజొన్న, పత్తి, బెండ, వంకాయ లాంటి ఉత్పత్తులలోకి ప్రవేశపెట్టారు. బి.టి టెక్నాలజీ వల్ల శనగపచ్చ పురుగు తాకిడి తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండగా కంపెనీ అధికోత్పత్తి వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నది.
నేటికీ రాష్ట్రంలో 95శాతం పత్తి పంట బి.టి కంపెనీకి చెందినదే.
---

No comments:
Post a Comment