Sunday, 10 August 2014

నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రణాళిక

1. సీతారాం సాగర్‌ ప్రాజెక్టు : ఈ ప్రాజెక్టు ద్వారా 8 టిఎంసీల నీటిని వినియోగించుకొని లక్ష ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలి. ఉదయగిరి, సీతారాంపురం, మర్రిపాడు, దుత్తలూరు, వరికుంటపాడు, విందమూరు మండలాలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దీన్ని 1.5 టిఎంసీలకు తగ్గించి నిర్మిస్తున్నారు.
2. సోమశిల ఉత్తర కాల్వ పొడిగింపు : ఈ కాల్వను రాళ్ళపాడు వరకు దిగువ లెవెల్‌నుండి పొడిగిస్తున్నారు.  ఎగువ నుండి తీసుకెళ్తే కలిగిరి, వింద్యమూరు, కొండాపురం మరియు జలదంకి మండలాలకు ఉపయోగపడుతుంది. ఈ కాల్వను ఎగువనుండి తీసుకెళ్ళాలి.
3. సోమశిల నీటి సమస్య : కడప జిల్లాకు సోమశిల డెడ్‌ స్టోరేజీ నుండి ఐదు టియంసీలను తీసుకెళ్ళడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.  డెడ్‌ స్టోరేజీలో ఎనిమిది టియంసీలు మాత్రమే వుంటాయి. ఐదు టియంసీలు పోగా, మిగిలిన మూడు టియంసీలు ఆవిరవుతాయి. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోతుంది. మొదటి పంటకు నీరు రావాలంటే ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజీ వుండాలి. దీనిని వ్యతిరేకించాలి.
4. జిల్లాలో యేటా తుపాన్‌ల వలన 100 చెరువులకు గండ్లు పడుతున్నాయి. జిల్లాలో 1800 చెరువులు వున్నాయి. తెగిపోయిన చెరువులకు అలుగులు, తూములు మరియు కట్ట రిపేర్లు చేయడంలేదు. ఇప్పటికే చాలా చెరువులు తెగిపోయి వున్నాయి.
5. కృష్ణపట్నం పోర్టు నిర్మాణ పనులు సాగుతున్నాయి. భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలి.
6. జిల్లాలో పరిశ్రమల మూత : - థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ 30 మెగావాట్లు గలది. - నెల్లూరు స్పిన్నింగ్‌ మిల్లు 400 మంది కార్మికులు - నెల్లూరు అట్టల ఫ్యాక్టరీ 200 మంది కార్మికులు - నెల్లూరు సర్కారీ  పేపర్‌ మిల్లు 250 మంది కార్మికులు. - గూడూరు సిరామిక్‌ ఫ్యాక్టరీ 200 మంది కార్మికులు మరియు మైకా పరిశ్రమ దెబ్బతిన్నాయి.
7. జిల్లాలో తడ వద్ద స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. అపాచి (బూట్ల తయారీ ఫ్యాక్టరీ) ఎగుమతి కొరకు మాత్రమే నిర్మిస్తున్నారు. జిల్లాలో నిరుద్యోగం బాగా వుంది. పరిశ్రమలు ఎక్కువగా స్థాపించాలి. ఎలక్ట్రికల్‌ ఫ్యాక్టరీ, జౌళి పరిశ్రమ, ఆటోమొబైల్‌ పరిశ్రమ (స్వరాజ్‌పాల్‌), తమిళనాడు జౌళి ఫ్యాక్టరీలు (రెండు) మరియు స్టీలు ఫ్యాక్టరీలు చేపట్టాలి.
8. కొవ్వూరు - కావలిల మధ్య ప్రభుత్వం ఇఫ్కో ఎరువుల ఫ్యాక్టరీని నిర్మిస్తామని నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని మార్చారు. దాని స్థానంలో కిసాన్‌ సెజ్‌ ఏర్పాటు చేసి ఆగ్రో ఉత్పత్తులు చేయాలని నిర్ణయించారు. ఇది త్వరగా పూర్తిచేయాలి. ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం కూడా చేపట్టాలి.
9. కొవ్వూరు - కావలిల మధ్య  విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. తద్వారా జిల్లాలోకి పెట్టుబడులు బాగా వస్తాయి.
---

No comments:

Post a Comment