Sunday, 10 August 2014

ప్రకృతివైపరీత్యాలు - నష్టాలు

1. 10-11 ఫిబ్రవరి 2008న కురిసిన అకాల వర్షాల వలన (తుపాన్‌) ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,విజయనగరం జిల్లాల్లో 8 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శనగ, పొగాకు, మిరప, వరి, పెసర, మామిడిపూత పంటలకు నష్టం వాటిల్లింది.  ప్రకాశం 1.42, కృష్ణా 1.43, గుంటూరు 0.29, శ్రీకాకుళం, నెల్లూరు 0.08, విశాఖ 0.03 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 14-02-2008న ముఖ్యమంత్రి కేంద్రానికి రు. 695 కోట్లు నష్టం జరిగినట్టు తెలిపారు. కేంద్ర బృందం పర్యటకు రావాలని, శనగ పంట రుణం పెంచాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఇది ఎప్పుడూ జరిగే తతంగమే.
2. 03-11 ఆగస్టు 2008లో అతివృష్టివల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలతో పాటు 15 జిల్లాల్లో నష్టాలు సంభవించాయి. 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం నష్టం యిలా వుంది.

4,499 గ్రామాలకు 15 జిల్లాల్లో నష్టం జరిగింది. ఈ వర్షాలలో 130 మంది మరణించారు. 9626 ఇళ్ళు పూర్తిగాను, 37,521 ఇళ్లు తీవ్రంగానూ (మొత్తం 47,147ఇళ్ళు) దెబ్బతిన్నాయి. 6354 పశువులు మరణించాయి.
పై నష్టపోయిన వారికి 871.85 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసినట్లు అధికారిక అంచనా. తాత్కాలిక సహాయంగా రు. 382.05 కోట్లు, శాశ్విత సహాయంగా 718.91 కోట్లు (మొత్తం 1100.96 కోట్లు) అవసరమని గుర్తించారు.
3. 2008 నవంబర్‌ రెండో వారంలో వచ్చిన తుపాన్‌ ''ఖైముక్‌'' తుపాన్‌వల్ల నాలుగైదు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
4. 2008, నవంబర్‌ 28, 29తేదీలలో వచ్చిన తుపాన్‌ (నిశా) వలన లక్షలాది ఎకరాలకు నష్టం వాటిల్లింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇది యింకా కొనసాగుతూనే వుంది.
5. 2008 ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో అతివృష్టివల్ల 16 లక్షల ఎకరాల వేరుశనగ పంట కాయ కాయకుండా నష్టం వాటిల్లింది.

---

No comments:

Post a Comment