యాత్రలు, సదస్సులు జరుగుతున్నాయి. కాని సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే వుంటున్నాయి. రైతుల సంక్షేమం పేరుతో అనేక ప్యాకేజీలు ప్రకటించారు. బిందు సేద్యం, తుంపరసేద్యం, ఇందిరప్రభ, పశుక్రాంతి, ప్రధాని రుణ ప్యాకేజి, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణాల మాపీ పథకం లాంటివి నిరంతరం ప్రకటిస్తూనే వున్నా మరో వైపున రైతుల రుణ భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటూనే వున్నారు.
మే 17 నుండి జూన్ 3 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు చైతన్య యాత్రలకు ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 5 నుండి 9వరకు సదస్సులు నిర్వహించి రైతులెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని భారీయెత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెసు ప్రభుత్వం అధికారానికి రాగానే చేవెళ్ళ నుండి ముఖ్యమంత్రి 2005 ఏప్రిల్ 23న మొదటి రైతు చైతన్య యాత్ర ప్రారంభించారు. మే 25 నుండి జూన్5వరకు సదస్సులు జరిపారు. రెండవసారి 2006లో ఏప్రిల్ 2 నుండి 22 వరకు చైతన్యయాత్రలు నిర్వహించారు. మూడవసారి మే 2 నుండి మే6 వరకు యాత్రలు సాగాయి. ప్రస్తుతం నిర్వహించబోతున్న యాత్ర నాల్గోది. రాష్ట్రవ్యాప్తంగా ఈయాత్రలను నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరిస్తానని చెబుతున్నాడు. ఇంతవరకు జరిగిన యాత్రలలో, సదస్సులలో వేలాది అర్జీలు వచ్చినప్పటికీ ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. ముఖ్యంగా కాలువల బాగుచేత, క్రొత్తవారికి రుణాలు, పాసుబుక్‌ల పంపిణీ, వాస్తవ సాగుదారు నమోదు లాంటి ఆర్థిక భారం లేని సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. అయినా యాత్రలు మీద యాత్రలు జరుపుతూనే వున్నారు. ఏటా వార్షికం లాగా ఈ యాత్రలు జరుపుతూనే వున్నారు.
రుణ మాఫీ పథకంతో తమ రుణాలన్నీ రద్దవుతాయని రైతులు ఆశించారు. కాని వారి ఆశలు అడియాశలయ్యాయి. 60 వేల కోట్లతో నాల్గు కోట్లమంది రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రకటించినప్పుడు కాంగ్రెస్ సభ్యులు పెద్దయెత్తున హర్షద్వానాలు చేశారు. పథకంలో పెట్టిన షరతులు రైతులకు ఆశనిపాతంగా వున్నాయి. మార్చి 31, 2007 నాటికి బకాయి పడి వుండి, ఫిబ్రవరి 28, 2008నాటికి చెల్లించని వారికి మాత్రమే ఈ రద్దు పథకం వర్తిస్తుంది. వీరు ఐదెకరాలకు లోపు కల్గివుండాలి. ఐదెకరాలు పైగల్గినవారికి వన్‌టైమ్ షెటిల్‌మెంట్ క్రింద 25 శాతం మాత్రమే మాఫీ ఇస్తారు. ఈ పథకాన్ని అన్వయింపచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 70 లక్షల మందికి రు. 12 వేల కోట్లు రుణాలు రద్దవుతాయని అట్టహాసంగా ప్రకటించారు. ఈ ప్రకటన వాస్తవాన్ని మరుగుపర్చడానికి ఉద్దేశించిందే తప్ప మరొకటి కాదు. నిరంతరం కరువుకు గురవుతున్న అనంతపురం జిల్లాలో 7.23 లక్షల మంది రు. 2244 కోట్లు బాకీపడి వున్నారు. ఇందులో రు. 530 కోట్లు మాత్రమే రుణ మాఫీ జరుగుతున్నట్లు సమాచారం సేకరించారు. సహకార బ్యాంకులో రు. 480కోట్లు బాకీ వుండగా రు. 283 కోట్లు మాఫీ అవుతున్నాయట!
వరంగల్ జిల్లా జనగాం మండలంలోని సిద్దంకి గ్రామం పరిశీలించగా ఐదెకరాల లోపు కల్గిన వారు 219 మంది సభ్యులున్నారు. వీరు సహకార బ్యాంకు నుండి రు.8.36 లక్షలు, ఆంధ్రాబ్యాంకు నుండి రు.36.18 లక్షలు రుణం పొందారు. ఇది గాక ప్రైవేటు వ్యక్తుల నుండి రు. 46. 68 లక్షలు రుణం తెచ్చారు. ఈ గ్రామం నిరంతరం కరువులకు గురవుతున్నది. అయినప్పటికీ వీరి వద్ద నుండి బలవంతంగా రుణాలు రుణాలు వసూలు చేసే పద్ధతిని కొనసాగించారు. బ్యాంకుల జబర్‌దస్తీని తట్టుకోలేక ప్రైవేటు వడ్డీవ్యాపారులనాశ్రయించి వారివద్ద నుండి రెండు మూడు రోజులకు మాత్రమే వడ్డీకి తెచ్చి బ్యాంకులో చెల్లించారు. తిరిగి వారికి రుణం ఇవ్వగానే ప్రైవేటు వడ్డీవ్యాపారికి ఆ డబ్బును చెల్లించి, పాతరుణాన్ని కొత్త రుణంగా మార్చుకున్నారు. ఈ మార్పు చేసుకున్నందుకు రెండు రోజులకు వందకు రెండురూపాయల చొప్పున చెల్లించారు. రుణాన్ని తిరిగి క్రొత్తరుణంగా మార్చుకోలేకపోయినా 51 మందికి మాత్రమే ప్రస్తుత రుణ రద్దు పథకం వర్తిస్తున్నది. ఈ 51 మందికి రు. 8.52 కోట్లు మాఫీ చేయబోతున్నారు. ప్రైవేటు రుణాలతో కలిపి కోటి రూపాయలు బాకీ వున్న రైతులలో 51 మందికి రు.8.52 లక్షలు మాత్రమే మాఫీ కావడం రుణ రద్దుపథకం బాగోతాన్ని తెలియజేస్తున్నాయి.
కృష్ణా జిల్లా మెరకనపల్లి రు. 70 లక్షలు, వక్కలగడ్డ రు. 50 లక్షలు, మేకవారిపాలెం రు. 45 లక్షలు, నాగాయితిప్ప రు. 45 లక్షల రుణాలు రైతాంగానికివ్వగా ఈగ్రామాలలో ఏ ఒక్కరికి రుణాలు రద్దు కావడం లేదు. శీలపల్లెలో రు. 80 లక్షలు రుణం తీసుకోగా రు. 25 లక్షలు మాఫీ అవుతున్నాయి.
గతంలో పాదయాత్రలు నిర్వహించిన వై.యస్. రాజశేఖరరెడ్డి రైతాంగ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ఆదుకుంటానన్నారు. తనకు కలిసొచ్చే చేవెళ్ళ నుండి సల్పిన యాత్రల సందర్బంగా రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నాల్గు తడవలుగా జరుగుతున్న చైతన్య యాత్రలలో నేడు రైతాంగం ఎదుర్కొంటున్న రుణ సమస్యలు శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి దృష్టికి రావడం లేదా?
ప్రధాని ప్యాకేజి క్రింద ప్రకటించిన వడ్డీ రద్దు పథకాన్ని కూడా ఇదే గతి పట్టింది. రాష్ట్రంలోని 16 జిల్లాలకు రు.9650 కోట్లు, ఆత్మహత్యల నివారణకు 2006 ఆగస్టులో కేటాయించారు. నేటికీ ఆ పథకం అమలు పూర్తి కాలేదు. వడ్డీ మాఫీ క్రింద ప్రకటించిన రు. 1436 కోట్లకు బదులుగా మరో 500 కోట్లు అదనంగా పెంచారు. అయినా రైతుల రుణభారం ఏమాత్రం తగ్గలేదు. రుణాలు రద్దయిన వారికి తిరిగి రుణాలివ్వడానికి బ్యాంకులు సుముఖత చూపడం లేదు. గతంలో వి.పి.సింగ్ ప్రధానిగా వున్నప్పుడు మాఫీ జరిగిన రైతులకు నేటికీ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రకటించిన రుణ రద్దు పథకం క్రింద రావల్సిన పూర్తి నిధులు తమ బ్యాంకులకు వచ్చేవరకు రుణాలివ్వలేమని స్పష్టం చేస్తున్నాయి. ఇటు రుణాలు రద్దు కాక, అటు బ్యాంకులు రుణాలివ్వక ప్రైవేటు వడ్డీవ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను నెట్టివేస్తున్నారు.
రుణాల రద్దు కోరితే పాడిపశువులిస్తామంటూ పశుక్రాంతి పథకాన్ని తెచ్చారు. ఈ పథకం క్రింద ప్రతి పాడి పశువుకు రు. 30 నుండి 40 వేల రూపాయల వ్యయం అవుతుంది. ముందుగా రైతు 25శాతం చెల్లించుకోవాలి. ఒక వైపున రుణభారంతో క్రుంగిన రైతు 25 శాతం చెల్లించడం సాధ్యం కాదు. అయినప్పటికీ పాడిపశువు వస్తుందన్న ఆశతో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీకి తెచ్చి కొనుగోళ్ళు చేశారు. తీరా పశువును కొన్నాక అది మూడు, నాలుగు మాసాలలో వట్టిపోయింది. ఆ తర్వాత ఆ పశువును మేపడానికి రోజుకు రు. 40/-ల వ్యయం చేయాల్సి వస్తున్నది. తాను కూలికి వెళ్ళి పశువును పోషించాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది. రుణ భారం పెంచడమా? తగ్గించడమా ? ప్రభుత్వమే చెప్పాలి.
ఇందిరప్రభ పేరుతో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను చదును చేసుకోడానికి రెండేళ్ళ క్రితం రు. 500 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి స్వయంగా నాలున్నర లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లు ప్రకటించారు. ఈ భూములు పొందిన రైతులకు భూములను సాగులోకి తేవడానికి, చదును చేసుకోడానికి మిగులు లేక బీళ్ళుగానే వుంటున్నాయి. ప్రభుత్వం కేటాయించిన ఇందిరప్రభ పథకం ఏ పేద రైతుకు అందుబాటులో లేదు.
విత్తన రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసిన ప్రభుత్వం నేడు రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం లేదు. ఈ సంస్థలు తమకున్న స్వేచ్ఛను ఆసరా చేసుకుని నాణ్యత లేని విత్తనాలనిచ్చి రైతులను నిలువునా ముంచుతున్నాయి. ఏటా లక్షలాది ఎకరాల పంటలు పూత లేకుండా పోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు నష్టపోతున్నారు. కొంతమంది రైతులు పరిహారాలు చెల్లించాలని వినియోగకోర్టులనాశ్రయించారు. వరంగల్ కోర్టు తీర్పు నిస్తూ నష్టపోయిన రైతుకు ఎకరాకు రు.13500, మైకో-మాన్‌శాంటో కంపెనీలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చాయి. ఆ తీర్పు ఇంతవరకూ కంపెనీ అమలు జరపలేదు. ప్రకాశం జిల్లా పావులూరులో ఇదే కంపెనీ రైతులకు నాణ్యతలేని మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేసి నష్టపర్చింది. రు. 40లక్షలు పరిహారం చెల్లించాలని పరస్పర అవగాహనా కమిటీ తీర్పు ఇచ్చింది. అదీ నేటికీ అమలు లేదు.
రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలురైతులున్నారు. వీరికి గల చట్టబద్ధమైన హక్కులు ప్రభుత్వం అమలు చేయ నిరాకరిస్తున్నది. ఫలితంగా రుణాలు, పంటల పరిహారం తదితర సౌకర్యాలన్నీ భూయజమాని పొందుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ కౌలుదార్ల సమస్యలపై సిఫారసు చేస్తూ వీరందరికీ రుణ గుర్తింపు కార్డులివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. కానీ నేటికీ ఎక్కడా అమలు కాలేదు. అమలు చేయమని కోరిన రైతులను భూయజమానులు భూముల నుండి గెంటివేస్తున్నారు. వాస్తవానికి రెవిన్యూ చట్టంలో వాస్తవ సాగుదారు పేరున నమోదు చేయాలని స్పష్టంగా చెప్పబడింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడానికి భూస్వాముల లొంగి జంకుతున్నాయి. అక్రమ కౌలురేట్లు వసూలు చేస్తూ కౌల్దార్లను పూర్తిగా రుణగ్రస్తులను చేస్తున్నాయి.
ఇవేవీ ప్రభుత్వానికి చైతన్య యాత్రలలో కన్పించలేదా? యాత్రలకు వచ్చిన అధికారులు, అనధికారులు గ్రామంలో చిన్నపాటి సభ జరిపి పూలదండలు మార్చుకుని నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ యాత్రలకు లక్షల కొద్దీ రూపాయలు వ్యయం చేస్తున్నారు. రైతులు వారికి అడ్డుపడి తమ సమస్యలు విన్నవించుకున్నా ఏఒక్కటీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. రైతు చైతన్య యాత్రలంటే రైతులను కలవకుండా వారి సమస్యలను పరిష్కరించకుండా జరిపే యాత్రలుగా సాగుతున్నాయి. ఇదంతా ఎన్నికల దృష్ట్యా చేస్తున్న ఆర్భాటం తప్ప మరొకటి కాదని రైతులు గుర్తిస్తున్నారు. గత ప్రభుత్వం రైతులకొరకు జన్మభూమి కార్యక్రమం పెట్టి ఇదేవిధమైన ఆర్భాటాన్ని కొనసాగించింది. వేలకొలదీ దరఖాస్తులు స్వీకరించి వాటిని చెత్తబుట్టపాల్జేశారు. అదే విధానాన్ని ఈ ప్రభుత్వం యాత్రల రూపంలో, సదస్సుల రూపంలో కొనసాగిస్తున్నాయి.
రైతులు చైతన్యంతో ఈ యాత్రలలో వచ్చిన అధికారులను, అనధికారులను తమ సమస్యలు పరిష్కరించే వరకు నిలవరించాలి. పనికిరాని నిబంధనలతో రుణభారాన్ని పెంచే విధానాలను సరిచెయ్యాలి. ఫిబ్రవరి 28, 2008నాటికి గల రుణాలన్నింటినీ రద్దు చేయాలి. కరువు ప్రాంతాలలో ఐదెకరాల నిబంధనను మినహాయించాలి. రైతులందరినీ రుణ విముక్తులను చేసి ఆత్మహత్యలను నివారించాలి. సన్న, చిన్న కారు రైతులకొరకు ప్రకటిస్తున్న పథకాలను సక్రమంగా అమలు చేయాలి. విత్తన రంగం నుండి కార్పొరేట్ రంగాన్ని దూరంగా వుంచాలి. ప్రభుత్వమే తన విత్తన సంస్థల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించాలి. పై సమస్యలు సాధించడానికి రైతాంగం సమైక్య ఉద్యమాలు నిర్వహించడం మినహా మరో విధంగా పరిష్కారాన్ని సాధించలేమని గుర్తించాలి. ఇందుకు గత థాబ్ద కాలంగా సాగుతున్న యాత్రలు, సదస్సులు, క్లబ్బుల ఏర్పాటు, జన్మభూమి లాంటి పథకాలు సాక్ష్యాలుగా వున్నాయి. ఇప్పటికే భ్రమలు వీడిన సన్నచిన్న కారు రైతులు ఉద్యమాలలోకి వస్తున్నారు. ప్రభుత్వం రైతులను భ్రమలకు గురిచేయకుండా వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి.
- సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment