Monday, 11 August 2014

నిజాం షుగర్స్‌ శాసనసభా కమిటీ రిపోర్టు

    నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ 1936లో బోధన్‌ (నిజామాబాద్‌)లో స్థాపించబడింది. 17000 ఎకరాలలో చెరకు పంటకు కేటాయించారు.
ఈ ఫ్యాక్టరీలు నెలకొప్పారు.
వ.నెం    ఫ్యాక్టరీ పేరు    స్థలం    జిల్లాపేరు
1.    నిజాం షుగర్స్‌    జహీరాబాద్‌    మెదక్‌
2.    నిజాం షుగర్స్‌    మిర్యాలగూడెం    నల్గొండ
3.    నిజాం షుగర్స్‌    మెట్‌పల్లి    కరీంనగర్‌
4.    నిజాం షుగర్స్‌    ముంబోజిపల్లి    మెదక్‌
5.    నిజాం షుగర్స్‌    హిందూపురం    అనంతపురం
6.    నిజాం షుగర్స్‌    లచ్చయ్యపేట    విజయనగరం
7.    నిజాం షుగర్స్‌    బొబ్బిలి    విజయనగరం
8.    నిజాం షుగర్స్‌    సీతానగరం    విజయనగరం
డిస్టిల్లరీలు :
1.     శక్కర్‌నగర్‌      బోధన్‌     నిజామాబాద్‌
2.     చాగల్లు    -    పశ్చిమగోదావరి
3.    ముంబోజిపల్లి    -    మెదక్‌
4.    షుగర్‌ మెషినరీ డివిజన్‌    నాగార్జున సాగర్‌    నల్గొండ
దేశంలో బాగా విస్తరించిన ప్రభుత్వ కంపెనీగా వుంది. దీనిలో 10000 మందికి ఉపాధి కల్పించారు.
ఉప ఉత్పత్తుల సంస్థలు నెలకొల్పారు
1. పశువుల దాణా ఉత్పత్తి ఫ్యాక్టరీ - బోధన్‌
2. కార్బన్‌డై ఆక్సైడ్‌ యూనిట్‌ - బోధన్‌
3. రైస్‌ మిల్లు - బోధన్‌
4. ఎథనాల్‌ తయారు యూనిట్‌ - బోధన్‌
5. చాకొలెట్‌ & పిప్పర్‌మెంట్‌ యూనిట్‌ - హైదరాబాద్‌
- 1947 మరియు 1948లో ఎథనాల్‌ను పెట్రోల్‌కు బదులుగా వాహనాలకు వినియోగించారు.
- 1937లో బోధన్‌లో కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో శిక్షక్‌ భవన్‌కు మార్చారు.
- ఎం.డిగా ఈ సంస్థకు ఐఎఎస్‌ అధికారినే నియమిస్తూ వచ్చారు. - ఐపిఎస్‌ కూడా.
- బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ వున్నారు.
- 1993 -94లో ఇన్ని అవాంతరాలున్నా రు. 50 కోట్ల లాభాలు వచ్చాయి. హిందూపూర్‌, బొబ్బిలి, సీతానగరం, మిర్యాలగూడ సంస్థలు నష్టాలో వుండగా వాటిని డీ-లింక్‌ చేశారు.
1990 నుండి నష్టాలు :
- మధురానగర్‌ (మెదక్‌), మెట్‌పల్లి (కరీంనగర్‌) ఫ్యాక్టరీలను 2500 టన్నులకు రీ- మోడలింగ్‌కు బిన్ని కంపెనీకి యిచ్చారు. (మద్రాస్‌)
- ఒక సంవత్సరంలో రీ-మోడల్‌ చేయాలి. కానీ నాలుగు సంవత్సరాల కాలం తీసుకుంది. - ఫలితంగా 1997లో రు. 67 కోట్లు నష్టం వాటిల్లింది. దీని బాగన్న కమిటీ (శాసనసభ) ధృవీకరించింది. (జహీరాబాద్‌ ఎం.ఎల్‌.ఏ బాగన్న) ఇది 1995లో నియమించబడింది. 1997లో అవార్డు యిచ్చారు.)
లచ్చయ్యపేట సుగర్‌ ఫ్యాక్టరీ (విజయనగరం జిల్లా): ప్రభుత్వ కోరికపై 1990లో రు. 55 కోట్లతో స్థాపించారు. బిన్ని కంపెనీ స్థాపనలో చేసిన నాలుగు సంవత్సరాల ఆలస్యం వలన రు. 60 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలో చెరకు దిగుబడి తక్కువ.
బొబ్బిలి & సీతానగరం సుగర్స్‌ లిమిటెడ్‌ : ఇవి చాలా కాలంపాటు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో వుండి నష్టాలపాలయ్యాయి. మేనేజ్‌మెంట్‌ వలన రు. 11 కోట్ల నష్టం వచ్చింది.
సుగర్‌ మెషినరీ డివిజన్‌ : 1972లో స్థాపించారు. నాగార్జున సాగర్‌లో ఏర్పాటు చేసిన పిడబ్ల్యుడి వర్క్‌షాప్‌ రు. 5 కోట్ల నష్టాలు వచ్చాయి.
చెరకు ప్లాంటేషన్‌ : 17వేల ఎకరాలలో బోధన్‌ ఫ్యాక్టరీకి చెరకు పంటవేశారు. ఈ భూములను 14 డివిజన్‌లుగావిడదీసి అధికారులచే పంట వేయించారు. నిర్వహణ సరిగాలేదు. 1999-2000 నాటికి రు. 22 కోట్ల నష్టం వాటిల్లింది.
మిర్యాలగూడ - హిందూపూర్‌ ఫ్యాక్టరీల మూత : 1974లో స్థాపించిన మిర్యాలగూడ ఫ్యాక్టరీకి కావాల్సినంత చెరకు రాలేదు. నాగార్జున సాగర్‌  క్రింద పంట రాలేదు. 1999-2000లో రు. 27.6 కోట్ల నష్టం వచ్చింది.
- హిందూపూర్‌ 1978లో స్థాపించారు. గ్యారెంటీ నీటి వనరులు లేక చెరకు రాలేదు. దీని నష్టం రు. 11 కోట్లు. ఈ రెండు యూనిట్స్‌ మొత్తం నష్టం రు. 38.6 కోట్లు
నష్టాల కారణాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన :
1. మిర్యాలగూడ - హిందూపూర్‌ ప్రాంతాలను ఎంచుకోవడంలో లోపం -ఇక్కడ చెరకు ఉత్పత్తిలేదు.
2. 1980 మధ్యకాలంలో నష్టాల్లో వున్న బొబ్బిలి, సీతానగరం ఫ్యాక్టరీలను నిజాం షుగర్స్‌ తీసుకోవడం
3. ఆర్థికంగా లాభాలు రాని చెరకు పంట పండించడం (బధన్‌లోని 17000 ఎకరాలలో)
4. జహీరాబాద్‌ - మెట్‌పల్లి చెరకు మిల్లు దివాళాతీసినా, లచ్చయ్యపేటలో నూతన చెరకు ఫ్యాక్టరీ నిర్మాణం గావించడం
5. ఫ్యాక్టరీలను మోడరైజేషన్‌ చేయడానికి విపరీత జాప్యం చేసిన బిన్ని కంపెనీని స్థాపించడం.
6. ఫ్యాక్టరీల నవీనీకరణకు పెట్టుబడులు వికేంద్రీకరించడం వలన చెరకు రైతులకు ధరలు చెల్లించలేకపోయింది.
- 1993-94 నాటికి రు. 36.15 కోట్ల నష్టాలను నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌కు సంభవించాయి.
- 1999 - 2000 నాటికి ఈ నష్టాలు రు. 85.35 కోట్లకు చేరాయి. రు. 7.66 కోట్ల లాభాలు వచ్చిన ఫ్యాక్టరీలను మినహాయించినా ఈ నష్టాలు వచ్చాయి.
నష్టాలు వచ్చిన ఫ్యాక్టరీలు :
1. హిందూపూర్‌ 2. మిర్యాలగూడ 3. లచ్చయ్యపేట 4. బొబ్బిలి 5. సీతానగరం 6. సుగర్‌ మిషనరీ డివిజన్‌ 7. షుగర్‌కేన్‌ ప్లాంటేషన్‌
    పై వాటికి నష్టాలు 1999-2000 నాటికి రు. 93.01 కోట్లు వచ్చాయి. లాభాలు తీసివేస్తే (రు. 7.66 కోట్లు) రు. 85.35 కోట్ల నష్టాలు వచ్చాయి.
డిస్టిల్లరీస్‌ :
- లాభాలు వస్తున్న మూడు డిస్టిల్లరీస్‌ (బోధన్‌, చాగల్లు (పశ్చిమగోదావరి), మెదక్‌)లను 2001-02లలో వివిధ సంస్థలకు అమ్మారు.
- చెరకుపై కొనుగోలు పన్ను 1993-99ల మధ్య రు. 22/- టన్నును 90/-లకు పెంచడం వలన రు. 300 కోట్ల భారం పడింది.
- ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్‌గా వున్న ఇంగ్లాండ్‌ కంపెనీ ఆడమ్‌స్మిత్‌ వీటిని అమ్మాలని సూచించారు. టి. కృష్ణమూర్తి 10 సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌ఎఫ్‌లో పనిచేసి నేడు ఇంప్లిమెంటేషన్‌ సెక్రటేరియట్‌లో వుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ''ఇంప్లిమెంటేషన్‌ సెక్రటేరియట్‌'' ద్వారా ఏడు ఎన్‌ఎస్‌పి యూనిట్స్‌కు అమ్మకానికి ''బిడ్స్‌'' కోరింది. కానీ మూడు యూనిట్స్‌కే బిడ్స్‌ వచ్చాయి.
1. జహీరాబాద్‌ సుగర్‌ మిల్లు 2. లచ్చయ్యపేట సుగర్‌ మిల్‌ (బొబ్బిలి) 3. ముంబోజిపల్లి డిస్టిల్లరీ (మెదక్‌)
పై మూడు యూనిట్లు బహిరంగ టెండర్ల ద్వారా అమ్మివేశారు.
మరో నాలుగు యూనిట్ల అమ్మకం :
1. శక్కర్‌నగర్‌ సుగర్‌ మిల్లు 2. శక్కర్‌ నగర్‌ డిస్టిల్లరీ 3. మెట్‌పల్లి సుగర్‌ మిల్లు 4. ముంబోజిపల్లి సుగర్‌ మిల్లు
    పై నాలుగు యూనిట్లు అమ్మకానికి ప్రభుత్వం ఎలాంటి టెండర్లు పిలవలేదు. సంప్రదింపుల ద్వారా డెల్టా పేపరుమిల్లు పశ్చిమగోదావరి కంపెనీకి ఎలాంటి డబ్బు తీసుకోకుండానే అమ్మింది. అమ్మకపు ధర రు. 65.4 కోట్లుగా నాల్గు యూనిట్లకు నిర్ణయించి, నాలుగు సమాన వాయిదాలుగా చెల్లించాలని, అవి ఐదు సంవత్సరాల తర్వాత చెల్లింపులు సాగాలని ఒప్పందం చేసుకుంది. అనగా కొనుగోలు డబ్బు చెల్లించకుండానే డెల్టా కంపెనీ ఐదు సంవత్సరాలు చెరకు ఆడించుకొని లాభాలు చేసుకోవచ్చు. సంప్రదింపుల నాడు వాటి విలువ రు. 26.83 కోట్లు లెక్కవేశారు. కన్సల్టెంట్‌ ఆడం స్మిత్‌ ఆ కంపెనీ సలహా ప్రకారం పైసా తీసుకోకుండానే డెల్టా కంపెనీకి అమ్మడం సరికాదని నాటి ప్రతిపక్ష నాయకులు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, నాటి ముఖ్యమంత్రికి 13-04-2002 మరియు 23-05-2002న లేఖ వ్రాశారు. నాల్గు యూనిట్లను ప్రయివేటీకరించడం ఆపాలని తీవ్రంగా కోరారు. అయినా అమ్మకాలు జరిగాయి.
---

No comments:

Post a Comment