....కార్మిక`కర్షక ఐక్యత ద్వారానే దేశంలో ‘‘ జనతా ప్రజాతంత్ర విప్లవం’’ సాధించాలి.
కార్మిక వర్గ నాయకత్వాన కార్మిక ` కర్షక ఐక్య పోరాటాలకు సన్నద్దం కావాలి. భారతదేశంలో నేటికి 59 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వారు మొత్తం ప్రజానీకానికి ఆహారం ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ బూర్జువా ప్రభుత్వంలో వారి బ్రతుకులు దుర్భరంగా మారాయి. 1997 నుండి అమలు జరుపుతున్న సంస్కరణల ఫలితంగా 2.60 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీ అమలవుతున్న నేటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్దం వచ్చినా ఇంత మంది చనిపోరు. ఆత్మహత్యల గురించి ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది. కార్పోరేటీకరణ విధానాల ఫలితాలే ఈ ఆత్మహత్యలకు కారణం.
సంస్కరణలు ఎవరికి లాభం చేస్తున్నాయి?
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో బహుళజాతి సంస్థలకు లైసెన్సింగ్ విధానాన్ని సరళతరం చేయడం, ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించడం విచక్షణా రహితంగా దేశంలోకి దిగుమతులను ఆహ్వానించడం వలన వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతున్నది. ఆహార ఉత్పత్తులు లేకుండా కార్మికవర్గం మనజాలదు. ఎన్ని వేల రూపాయల ఉద్యోగం సంపాయించినా ఆహారాన్ని ఉత్పత్తి చేసే రంగం తప్పనిసరిగా అభివృద్ధిలోకి రావాలి.
నేటి ప్రభుత్వాలు కార్మికులకు హాని కలిగించే విధానాలు అమలు చేస్తున్నాయి.
1) శాశ్విత ఉద్యోగాలకు బదులు కాంట్రాక్టు ఉద్యోగాలు, అసంఘటిత కార్మికవర్గం పెరుగుతున్నది.
2) ప్రమాదకర ఫ్యాక్టరీలలోనూ, ఇతరంగాను తక్కువ వేతనాలిస్తున్నారు.
3) 8గంటల పనికి బదులు 12`16 గంటలు పనిచేయిస్తున్నారు.
4) కనీస వేతనాలు నిర్ణయించినా చెల్లించడంలేదు.
5) పని జరిగే చోట రక్షణ చర్యలు లేక అనేక మంది మరణిస్తున్నారు.
6) నిత్యావసర సరుకుల ధరలు పెంచడం
7) నిజవేతనాల తగ్గింపు
8) వలసల ప్రోత్సాహం
9) పర్యావరణానికి హాని కలిగించే ఫ్యాక్టరీల స్థాపన
10) లాభాపేక్షే తప్ప కార్మికుని సంక్షేమం చూడకపోవడం
11) పోరాటాలను అణచడానికి లాకౌట్లు, లేఆఫ్‌లు
అయినా కార్మికవర్గం సంఘటితమై తమ సమస్యలపై పోరాటాలు చేసి కొన్ని విజయాలు సాధిస్తున్నారు.
కర్షక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు
1) ఇది బహుళవర్గ సంఘం, వ్యవసాయ కార్మికులు, పేదరైతులు, మధ్యతరగతి, ధనిక రైతులు, భూస్వాములు కలిసి కొన్ని సమస్యలపై ఒకే లక్ష్యం కొరకు పోరాడుతారు.
2) వర్గరీత్యా వ్యవసాయ కార్మికులు, పేదరైతులు కేంద్రంగా జరిగే ఉద్యమాలకు, కార్మికవర్గ సహకారం నాయకత్వం ఉండాలి.
3) ఇది సహజంగానే అసంఘటితవర్గం
4) స్వార్థం ఈ వర్గంలక్షణం వీరిని ఐక్యపర్చడం తేలిక కాదు.
5) వృత్తిని బట్టి ప్రవృత్తి వుంటుంది.
కార్మిక`కర్షక సంఘాలు ఉభయులూ కలిసి ఎదుర్కొంటున్న సమస్యలు
` వ్యవసాయ ఉపకరణల ఉత్పత్తి( విత్తనాలు,ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర పనిముట్లు)
` మార్కెట్లలో సరుకుల అమ్మకంలో రైతుల సమస్యలు ` మార్కెట్లలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలు
` పత్తి మిల్లులు` జిన్నింగు మిల్లులు(జిన్నింగులు మూతపడితే పత్తికొనుగోలు ఆగిపోతుంది)
` నూనెమిల్లులు, రైస్‌మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలలో, జ్యూట్‌మిల్లులు` వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాలు, కోల్డ్‌స్టోరేజీలు, ట్రాక్టర్ల నిర్వహణలలో కార్మికులు`కర్షకులు కలిసి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
` పొగాకు ప్రాసెసింగ్‌లో రెండు వర్గాలు కలిసి పనిచేయాలి.
పై సమస్యల సందర్భంగా రెండు రంగాలలోనివారు కలిసి పనిచేయడం ద్వారా రెండువర్గాల వారికి బూర్జువావర్గం కల్పిస్తున్న సమస్యలు, దోపిడీలను కొంతవరకు ఎదుర్కొనవచ్చు.
ముఖ్యంగా ఆహారధరల పెరుగుదల ఒకవైపున జరుగుతున్నా ఉత్పత్తి ధరలకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. పారిశ్రామివేత్తలు వ్యవసాయ ఉపకరణాల ధరలు పెంచుతూ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలను తక్కువకు కొనుగోలు చేస్తూ ఇటు ఉత్పత్తిదారులు అటు వినియోగదారుల నుండి వేలకోట్లలాభాలు సంపాదిస్తున్నారు. నేషనల్ షాంపుల్ సర్వే గణాంకాల ప్రకారం దేశంలో 50 వేల కోట్ల ఆదాయాన్ని మధ్యదళారీలు సంపాయిస్తున్నారు.
1) ఆహారభద్రతా బిల్లు
ఇది రెండు వర్గాలకు సంబంధించిన కీలక సమస్య. ఆహారధాన్యాల ఉత్పత్తి తగినంత జరిగినప్పుడే ఆహారభద్రత అమలవుతుంది. ఎంతవేతనం వచ్చినా కార్మికులకు ఆహారభద్రత అత్యంత కీలకం. ఆహార భద్రత అంటే పౌష్టికాహారం లభ్యం కావాలి. అంతేకాని బియ్యం, గోదుమలు సరఫరా కాదు.
1973 `2004 వరకు వేసిన అంచనా ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 2,400 కెలరీలు, పట్టణాలలో 2,100 కెలరీల శక్తిగల ఆహారం ఉండాలని పేర్కొన్నారు. దీన్నిబట్టి గ్రామాలలో రోజుకు రు.49, పట్టణాలలో రు. 56.60 పైసలతో ఆహారాన్ని పొందవచ్చని నిర్ణయించారు. చివరకు 2005లో దీనిని తగ్గించి పట్టణ ప్రాంతాలలో రు.18, గ్రామీణ ప్రాంతాల్లో రు.12కు రోజువారీ ఆదాయాన్ని తగ్గించి నవ్వులపాలు చేశారు. 2009`10లో రోజుకు రు.22.40/లు లేదా రు.28.70/లకు పెంచారు. అయినా ఆ ఆదాయంతో 1900కెలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే పొందగలం. 2004।05 నుండి 2009`10 మధ్య 7శాతం దారిద్య్రరేఖకు దిగువనున్నవారు ఎగువకు రావడం వలన దారిద్య్రరేఖకు దిగువనున్న వారు 37.2శాతం నుండి 29.8 శాతానికి పడిపోయినట్లు పేర్కొన్నారు. ఒకవైపున 8.2 కోట్ల టన్నుల ఆహారధాన్యాల నిల్వలు చూపిస్తు మరోవైపున 40 కోట్ల మందిని ఒకపూట పస్తులు పెడుతున్నారు. పంపిణీ, సరఫరా సక్రమంగా ఉంటే ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 24 కోట్ల టన్నుల స్థాయిని కనీసం 28 కోట్ల టన్నులకు ఉత్పత్తిని పెంచాలి. దీనికి రైతుల సహకారం లేకుండా సాధ్యం కాదు. వారి పోరాటాలకు మన అండదండలుండాలి.
2) పంటల మార్పిడి
దేశంలో సరళీకరణ విధానాల ఫలితంగా, ప్రపంచబ్యాంకు, ప్రపంచవాణిజ్య సంస్థ ఆదేశాలకు అనుగుణంగా ఆహారధాన్యాల విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. యేటా 15శాతం విస్తీర్ణం తగ్గించాలని ప్రపంచబ్యాంకు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్ మోడరైజేషన్ కిందగల 25లక్షల ఎకరాలలలోను, విద్యుత్తు పంపుసెట్ల కిందగల 15లక్షల ఎకరాలలో రెండో పంట వరి వేయకూడదని నిబంధనలు విధించారు. ఎన్నికల వల్ల ప్రస్తుతం ఈ ఆదేశాన్ని అమలు చేయడం లేదు. అమలు చేస్తే దేశంలో ఆహారకొరత ఏర్పడుతుంది. దిగుమతులపై ఆధారపడాల్సివస్తుంది. ఈ విధానం వలన నేడు దేశం వంటనూనెల్లో స్వయంసముద్రత్తను కోల్పోయి దిగుమతులపై ఆధారపడుతున్నాం. యేటా 40లక్షల టన్నులవంటనూనెల దిగుమతులస్థాయి 90లక్షల టన్నులకు చేరుకుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.
3) ఎగుమతి`దిగుమతులు
వ్యాపారస్తులకు అనుగుణంగా ఎగుమతి`దిగుమతుల విధానాన్ని కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు హెచ్చుగా ఉన్నప్పుడు ఎగుమతులు నిషేధించడం, తక్కువగా ఉన్నప్పుడు దేశంలోకి అవసరం లేకున్నా దిగుమతులను ప్రోత్సహిస్తున్నారు. పంచదార, పత్తి, గోదుమలు మిగులు ఉత్పత్తులున్నప్పటికీ దిగుమతులు చేసి రైతులకు ధరరాకుండా చేస్తున్నారు. పంచదార, పత్తి దిగుమతుల వల్ల రైతాంగం వారి ఉత్పత్తులకు ధరరాక పెద్దఎత్తున నష్టపోయారు.
4) కనీస మద్దతు ధర నిర్ణయం
కనీస మద్దతు ధరలు పెంచితే కనీసవేతనాలు పెంచాల్సి వస్తుంది. ఆహారధాన్యాల ధరల ఆధారంగానే కనీస వేతనాలు నిర్ణయించబడుతున్నాయి. రైతులు ఉత్పత్తి చేసే ఆహారధాన్యాల ధరలు పెంచితే కోట్ల మంది కార్మికుల వేతనాలు పెంచాల్సి వస్తుంది. అందువల్ల బూర్జువావర్గం వేతనాలను పెంచకుండా చూడడానికీ ఆహారధాన్యాలకు కనీసమద్దతు ధరల విధానాన్ని 1982 నుండి అమలు చేస్తున్నది. కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించిన మద్దతు ధరలుకూడా అమలు జరపకపోవడంవలన రైతులు రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపున వినియోగదారులైన కార్మికులకు ధరలు పెంచి దోపిడీ చేస్తున్నారు.
5) విత్తన చట్టం
2004లో రూపొందించిన విత్తన చట్టం నేటికీ 8 సంవత్సరాలు గడిచినా ప్లామెంటువద్ద పెండిరగులో ఉంది. బహుళజాతి సంస్థలైన మోన్‌శాంటో, డూపాయింట్, కార్గిల్ సంస్థల ప్రయోజనాన్ని ఆశించి బిల్లు ఆమోదించడం లేదు. ఫలితంగా విత్తనాల ధరలను 10`15 రెట్లు పెంచి లాభాలు సంపాదిస్తున్నారు. పైగా నాణ్యతలేని విత్తనాల వలన యేటా దేశంలో లక్షలాధి ఎకరాల పంటలకు నష్టాలు వాటిల్లుతున్నాయి. విత్తనోత్పత్తి ప్రాసెసింగ్‌లో కార్మికవర్గం పాల్గొంటున్నది. వారికి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఇటు రైతులకు అటు కార్మికులకు తక్కువ ధర చెల్లించి వేలకోట్లలాభాలు సంపాదిస్తున్నారు.
6) బడ్జెట్
2012`13లో కేంద్రం 14.91లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వ్యవసాయ రంగానికి 20 వేల కోట్లు (1.34శాతం మాత్రమే) మాత్రమే కేటాయింపు చేశారు. ఎరువుల సబ్సిడీ, ఆహారసబ్సిడీ, వ్యవసాయ పరిశోధనలకు గత సంవత్సరంపై నిధులను తగ్గించారు. వ్యవసాయోత్పత్తులు పెరిగితేనే పరిశ్రమలకు ముడిసరుకు వస్తుంది. పరిశ్రమలు అభివృద్ధి కావాలంటే వ్యవసాయోత్పత్తులు పెరగాలి. కానీ వ్యవసాయోత్పత్తులు యేటా 4శాతం లక్ష్యం నిర్ణయించినా గత దశాబ్దకాలంగా యేనాడూ 3%వృద్ధిరేటు దాటలేదు. కొన్ని సంవత్సరాలలో మైనస్ ఒకశాతం కూడా గ్రోత్‌రేటు ఉంది. కనీసం 8శాతం బబ్జెట్ కేటాయించే విధంగా రైతులు చేస్తున్న ఉద్యమాలను కార్మికవర్గం బలపర్చాలి.
7) ఇరిగేషన్
గత రెండుదశాబ్దాలుగా దేశంలో ఇరిగేషన్ వనరులు పెంచలేదు. ఫలితంగా ఉత్పత్తులు పెరగడంలేదు. నదుల అనుసంధానం చేపట్టాలని 2002లో ఎన్‌డిఎ ప్రభుత్వం నిర్ణయించి కమిటీ వేసినప్పటికీ చివరకు సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ నదీజలాల వినియోగంలో భారతదేశం పూర్తిగా వెనకబడి ఉంది. చివరకు అనేక గ్రామాలు త్రాగునీటికి ఫ్లోరైడ్‌తో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. 20 సంవత్సరాల వయసులోనే 60 సంవత్సరాలు నిండుతున్నాయి. తగినన్ని నీటి వనరులు దేశంలో ఉన్నాయి. హిమాలయాల నుండి కర్నాటక వరకు నదుల నీరు వృధాగా సముద్రంపాలవుతున్నది. ఈ నీటి వినియోగం ద్వారా వ్యవసాయరంగం, తద్వారా పారిశ్రామిక రంగం అనూహ్యమైన అభివృద్ధిని సాధించవచ్చు. ప్రాథమికవనరుల కల్పన ద్వారా మాత్రమే ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందుతాయి.
పై సమస్యల పరిష్కారానికి కార్మిక`కర్షక పోరాటాలు అవసరం. చైతన్యం కలిగిన కార్మికవర్గం నాయకత్వం వహించి కర్షక పోరాటాలను జయప్రదం చేయాలి. కర్షకవర్గం అసంఘటితమైంది. వీరిని సంఘటిపర్చడానికి దీర్ఘకాలిక కృషి అవసరం. పేదరైతులు, వ్యవసాయ కార్మికులు కేంద్రంగా వారు చేస్తున్న ఉద్యమాలకు పరోక్షమద్దతే కాక, ప్రత్యక్ష మద్దతు కూడా ఇవ్వాలి. వారికి గల నాయకత్వ కొరతను తీర్చాలి. కార్మికవర్గం మిలిటెన్సి కలిగినది. తమపై కర్షకులకు విశ్వాసం కలిగే విధంగా వారెదుర్కొంటున్న ప్రతి సమస్యను కార్మికవర్గం అధ్యయనం చేయాలి. కర్షకవర్గానికి తాము అండగా ఉన్నామన్న ధీమాను కల్పించాలి. కలిసి ఉద్యమాలు నిర్వహించాలి. అప్పుడే ‘‘జనతా ప్రజాస్వామిక విప్లవం’’ సాధించగలం.
ఫైనాన్స్ కాపిటల్
నేడు పెట్టుబడి ఫైనాన్స్ కాపిటల్‌గా రూపాంతరం చెందింది. అనగా పెట్టుబడితో ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి ద్వారా లాభాలు సంపాదించాల్సింది పోయి పెట్టుబడి తిరిగి లాభాన్ని సంపాదించే విధంగా షేర్ మార్కెట్ లేదా వడ్డీవ్యాపారం వైపు పెట్టుబడి కేంద్రీకరిస్తున్నది. మరొక మాటలో చెప్పాలంటే ఉత్పత్తి రంగం నుండి విడిపడి షేర్ మార్కెట్ వైపు తరలింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఆ విధంగా పెట్టుబడి కొరత ఏర్పడిరది. వ్యవసాయ పెట్టుబడుల్లో కూడా కార్పోరేట్ పెట్టుబడి, ఫార్వర్డ్ ట్రేడిరగ్ లావాదేవీలలో ఫైనాన్స్ పెట్టుబడి కీలక పాత్ర పోషిస్తున్నది. వ్యవసాయ భూమి ధరలు పెరగడంతోపాటు, భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సరుకుగా మారింది. ఇప్పటికే విత్తన, ఎరువులు మరియు మార్కెట్ రంగాలలోకి ఫైనాన్స్ క్యాపిటల్ చొచ్చుకు వస్తున్నది. అత్యధిక లాభాలనాషించే కార్పోరేట్ సంస్థలు విత్తనాలు, ఎరువుల ధరలను అనేక రెట్టు పెంచారు. రైతులకు రుణాలు తగ్గాయి. అయినా ఫైనాన్స్ పెట్టుబడితో బ్యాంకులు మిలాఖత్ కావడంతో వ్యవసాయ రుణాలు తగ్గాయి. రిజర్వుబ్యాంకు ఆదేశిత సూత్రాల ప్రకారం ప్రతి బ్యాంకు తన వ్యాపార ధనంలో 40శాతం ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగానికివ్వాలి. అందులో 18శాతం పంటరుణాలకు, మిగిలినవి దీర్ఘకాలిక రుణాలకు కేటాయించాలి. ప్రతి రుణమొత్తంలో 15శాతం దళిత, గిరిజన రైతులకు రుణాలు ఇవ్వాలి. ఫైనాన్స్ పెట్టుబడి విధానంలో రైతులకు చిన్న పరిశ్రమలకిచ్చే రుణాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. మరోవైపున బ్యాంకులు తమ రుణాలను 5శాతం వడ్డీకి మైక్రోఫైనాన్స్ సంస్థల కివ్వడం ద్వారా, అవి 30 శాతం వడ్డీకి ఎస్‌ఎహెచ్‌జి గ్రూపులకు, వారి ద్వారా చిన్న రైతులకు రుణాలిస్తున్నారు. ఆ వడ్డీలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

No comments:
Post a Comment