Wednesday, 13 August 2014

గోదావరిపై కంతాలపెల్లి ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి

2009 ఫిబ్రవరి 19న మాజీ ముఖ్యమంత్రి కీ.శే.డా॥వైఎస్‌.రాజశేఖరరెడ్డి కాంతాలపెల్లి `ధర్మారెడ్డిగూడెం లిప్టు పథకానికి శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై ఇచ్చంపెల్లి ప్రాజెక్టుకు బదులుగా కాంతాలపెల్లి ప్రాజెక్టును ప్రతిపాదించారు. 44 టిఎంసిల ఆవిరి నష్టంతో( మొత్తం 129టిఎంసిలు) ఆంధ్రప్రదేశ్‌కు 85 టిఎంసిల నీటిని కేటాయించడంతోపాటు అంతరాష్ట్ర ప్రాజెక్టుగా ఇచ్చంపెల్లి ప్రాజెక్టును ప్లానింగ్‌ కమీషన్‌ ఆమోదించింది. ఈ ప్రాజెక్టు వలన 239 గ్రామాలు ముంపుకు గురికావడం వలన 1975లో ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర అంగీకరించిన ఈ పథకం చత్తీష్‌ఘడ్‌(మధ్యప్రదేశ్‌) నిరాకరించడంతో అటకెక్కింది.  ఇచ్చంపెల్లికి ప్రత్యామ్నాయంగా కాంతాలపెల్లి ప్రాజెక్టు గుర్తించబడిరది. ఇచ్చంపెల్లికి 29వ కిలోమీటర్ల దిగువన ఏటూరునాగారం మండలం, కాంతాపెల్లి గ్రామంలో పూర్తి రిజర్వాయర్‌ నీటి మట్టం G86 మీటర్ల ఎత్తుతో 22.5 టిఎంసిల నిలువ నీటి శక్తితో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 85 టిఎంసిల నీటిని లిప్టు ద్వారా తరలించి, వరంగల్లు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 7.50 లక్షల ఎకరాలకు సాగునీటికి, త్రాగునీటికి వినియోగించాలి.
గోదావరి జలాల వినియోగం
1980 జూలై 7, బచావత్‌ ట్రిబ్యునల్‌ గోదావరి నికర జలాలు పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ట్రిబ్యుల్‌ 1969 ఏప్రిల్‌ 10న కేంద్రప్రభుత్వం నియమించింది. పంపిణీ ఈ విధంగా ఉంది.(టిఎంసిలలో)
రాష్ట్రం కేటాయించిన వాటా రాష్ట్రంనుండి గోదావరికి  75శాతంనికరజలాలు లభ్యమయ్యేనీరు


భూపాలపట్నం వద్ద మహారాష్ట్ర ప్రభత్వం హైడల్‌ ఉత్పత్తికి వినియోగించిన 306.87టిఎంసిల నీటిని ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ రీ`జనరేషన్‌ను 108.50 టిఎంసిలను వినియోగించుకోవాలి. రీ`జనరేషన్‌ నీరు కాకుండా ఆంధ్రప్రదేశ్‌ 1479.65టిఎంసిలనీటిని వినియోగించుకోవాలి. కానీ ఇంతవరకు 793.19 జలాలు మాత్రమే వినియోగించుకుంటున్నాం.786.46 నికరజలాలు నేటికీ సముద్రంపాలవుతున్నాయి. గతంలో జరిగిన అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. గంగానది తర్వాత రెండవ పెద్దనదిగా ఉన్న గోదావరిపై చట్టబద్దంగా ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌`మధ్యప్రదేశ్‌7.11.1975న, కర్నాటక`మహారాష్ట్ర 29.1.1979న 03,1.1979న మరియు ఒరిస్సా`మద్యప్రదేశ్‌11.7.1979న జరిగిన ఒప్పందాలను బచావత్‌ కమీషన్‌ దృవీకరించింది.
రాష్ట్రం బేసిన్‌ల ప్రకారం బచావత్‌ రివార్డు నాటికి రాష్ట్రంలో నీటివినియోగం జరుగుతున్నది.
జి`4 బేసిన్‌లో 94.74 టిఎంసిలు,
జి`5 బేసిన్‌లో 182.61 టిఎంసి,
జి`6 బేసిన్‌లో 83.62 టిఎంసి,
జి`7బేసిన్‌లో 2.79 టిఎంసి,
జి`8 బేసిన్‌లో 0.86 టిఎంసి,
జి`9 బేసిన్‌లో 298.46 టిఎంసి,
జి`12 బేసిన్‌లో 10.11 టిఎంసిలు
మొత్తం 680.44 టిఎంసిలు మాత్రమే తీర్పునాటికి వినియోగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ గోదావరిపై దవళేశ్వరం వద్ద 263.60 టిఎంసిలు( గోదావరిడెల్టా 15లక్షల ఎకరాలకు ) వరంగల్‌ జిల్లా లక్నవరం సరస్సుకు 2.61 టిఎంసి, ఖమ్మం జిల్లా కిన్నెరసాని ప్రాజెక్టుకు 8.41 టిఎంసి, తూ.గోదావరి జిల్లా తొర్రిగడ్డ పంపింగ్‌స్కీంకు 2.41 టిఎంసి, ప.గోదావరి జిల్లా గూటాల పంపింగ్‌ స్కీంకు 3.65 టిఎంసి, జి`9 బేసిన్‌లో మైనర్‌ ఇరిగేషన్‌ కింది 18.50 టిఎంసిల నీటిని వినియోగిస్తున్నాం.
1963 జూన్‌ 26న నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నాటి అంచనా ప్రకారం రు.40.10 కోట్లతో 5.70లక్షల ఎకరాల సాగుకు ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. రిజర్వాయరు పూర్తి నీటిమట్టం 1091 అడుగులుగా, 112 టిఎంసిల నిల్వ నీటిశక్తి కలిగి ఉండాలి. అనంతరం ప్రాజెక్టు దశలు మార్చి 16.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద 179.02 టిఎంసిలతో  మొదటిదశ 9.80 లక్షల ఎకరాలకు, రెండవదశ 5.87 లక్షల ఎకరాలకు చేపట్టటం జరిగింది. కానీ ఇంతవరకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరు కల్పించబడిరది. జనవరి 2010 నాటికి రు.3378.59 కోట్లు వ్యయం చేసి 9.63 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన కాకతీయ కాలువ 284వ కిలోమీటరు వరకు మొదటి దశ కాగా, 284 నుండి 346వ కిలోమీటరు వరకు రెండవదశగా పొడిగించారు. వరంగల్‌ పట్టణం వరకు గల 234వ కిలో మీటరు వరకు మాత్రమే శ్రీరాంసాగర్‌ నీరు వస్తున్నది. మొదటి దశ 50 కిలోమీటరుకు, రెండవదశ మొత్తానికి నీరు రావడంలేదు. ప్రాజెక్టులోకి పూడిక రావడంతో 112 టిఎంసిలకు బదులు 80 టిఎంసిల నీరు మాత్రమే నిలువ ఉంటున్నది. దీనికితోడు మహారాష్ట్ర 13 అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీరురావడం తగ్గింది.
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు అనంతర గోదావరి పరిస్థితి
శ్రీరాంసాగర్‌ మహారాష్ట్రలోని నాసిక్‌లోని త్రయంబకెశ్వరం వద్ద ప్రారంభమై 689వ కిలోమీటరు వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. 764వ కిలోమీటరు వద్ద శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించబడిరది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు అనంతరం 141వ కిలోమీటరు దూరంలో ఎల్లంపల్లి బ్యారేజి నిర్మిస్తున్నారు. ఎల్లంపెల్లి ప్రాజెక్టుకు 160కిలోమీటర్ల దూరంలో సర్‌ఆర్థర్‌ కాటన్‌ ఇచ్చంపల్లి ప్రాజెక్టును ప్రారంభించి వదిలివేశారు. ఇచ్చంపెల్లి ప్రాజెక్టుకు 7కిలోమీటర్ల దూరంలో దేవాదుల లిప్టుపథకం నిర్మించబడిరది. దేవాదులలిప్టుకు 22కిలోమీటర్ల దూరంలో కంతనపెల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి.
దేవాదుల పథకం
వరంగల్‌ (1.95), నల్లగొండ(1.10), మెదక్‌(1.00), కరీంనగర్‌(0.95) మొత్తం 5లక్షల ఎకరాలకు లిప్టుద్వారా గోదావరీ జలాలను అందించడానికి 16.6.2001న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. కానీ పనులు చేపట్టలేదు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 8.11.2004న ఇదే పథకాన్ని మార్పు చేసి శంకుస్థాపన చేశారు. మార్పు చేసిన ప్రకారం వరంగల్లు 4.57లక్షల ఎకరాలు, నల్లగొండ1.50 లక్షల ఎకరాలు, కరీంనగర్‌ 0.14లక్షల ఎకరాలు మొత్తం 6.21లక్షల ఎకరాలకు సాగునీటి వసతికి పథకం ప్రారంభించారు. మూడు దశలుగా ఈ పథకాన్ని రూపొందించారు. మొదటిదశ 2008`09లో, రెండవదశ 2009`10లో, మూడవదశ 2010`11లో పూర్తికావాలి. కానీ ఇంతవరకు ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. రు.9427.73 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు. డిశంబర్‌ 2011 నాటికి 5775.85 కోట్లు వ్యయం చేశారు. 2012`13కు రు.713 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు. డిశంబర్‌ 2011 నాటికి 45 వేల ఎకరాలకు సాగునీటిని కల్పిస్తామని బడ్జెట్‌ ప్రతాలలో ప్రకటించారు.
మొదటలిప్టు గంగారం వద్ద , రెండవలిప్టు భీంగణపూర్‌వద్ద, మూడవలిప్టు నాగారంవద్ద, నాలుగవలిప్టు ధర్మాసాగర్‌వద్ద మొత్తం 275 మీటర్లు మొదటిదశలోను, రెండవదశలో 540 మీటర్ల ఎత్తుకు నీటిని పంపుచేయాలి. ధర్మాసాగరం నుండి రెండు పాయలుగా పథకాన్ని విడదీశారు. ఒకపాయ స్టేషన్‌ఘన్‌పూర్‌(లిప్టు), అశ్వరావుపల్లి(లిప్టు), చిట్టకోడురు వరకు వెడుతుంది. రెండవపాయ ధర్మాసాగరం నుండి గండిరామారం(లిప్టు) బొమ్మకూరు(లిప్టు),తపాస్‌పెల్లి వరకుG540 మీటర్ల ఎత్తుకు వెళుతుంది. దీనికి ఐదు పైపులైన్లు వేయాలి. ఒకటి స్టాండ్‌బై ఉండగా నాలుగు పనిచేస్తాయి. దీనికి 384.50 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు అవసరం. మొదటిదశను 7ప్యాకేజీలుగా కేటాయించారు. 38.15 టిఎంసిల నీటిని ఈ మొదటిదశలో లిప్టు చేయాలి. రెండు సంవత్సరాల క్రితం సోనియాగాంధీ నీటిని విడుదల చేస్తూ ప్రారంభోత్సవం చేశారు. గోదావరిలో నీరు ప్రవహించినప్పుడు మాత్రమే లిప్టుకు నీరు అందుతుంది. లేనితీరుకు లిప్టుపనిచేయదు. దేవాదుల వద్ద గోదావరి సముద్రమట్టానికి G71అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ నీరు 71 అడుగులకు మించి వచ్చినపుడు మాత్రమే పనిచేస్తుంది. గోదావరిలో నీటిలభ్యత లేకపోవడం వల్ల సంవత్సరంలో అదీ వర్షాకాలంలో రెండు,మూడు మాసాలు మాత్రమే ఈ లిప్టుపథకం పనిచేస్తుంది. ఇన్నివేల కోట్లు వ్యయం చేసి నిర్మాణం చేస్తున్న ఈ పథకం సంవత్సరం పోడుగునా పనిచేయాలంటే కంతాలపెల్లి ప్రాజెక్టు తప్పనిసరిగా అవసరం. కాంతాలపెల్లి బ్యాక్‌వాటర్‌ ద్వారా ఈ లిప్టు నిరంతరం పనిచేస్తుంది.
కాంతాలపెల్లి `ధర్మారెడ్డిగూడెంపథకం
19.2.2009లో శంకుస్థాపన చేసిన ఈ పథకం బహుళార్థక వినియోగానికి పనిచేస్తుంది. ఈ పథకం ద్వారా 85 టిఎంసిల నీటిని లిప్టు చేయడం, 300 మెగావాట్ల హైడల్‌ స్థాపిత శక్తి ఏర్పడుతుంది. 5 లిప్టులద్వారా నల్లగొండ జిల్లా ధర్మన్న గూడెం వరకు 440 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్ళాలి. ఈ పథకం ద్వారా వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో 7.50 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కలుగుతుంది. ముఖ్యంగా శ్రీరాంసాగర్‌ మొదటిదశ చివర, రెందవదశకు స్థిరీకరణ ఉపయోగడుతుంది. రెండుదశలుగా చేపట్టబడ్డ ఈ ప్రాజెక్టు వ్యయం జాప్యం జరిగినకొద్దీ పెరుగుతున్నది. 2009లో శంకుస్థాపన సందర్భంగా ప్రాజెక్టు వ్యయం రు. 10409 కోట్లు కాగా 2010 నాటికి రు.22,326 కోట్లకు పెరిగింది. 2012 అంచనాలు ఇంకా పెరుగతాయి.శంకుస్థాపన చేసిన సంవత్సరం అనగా 2009`10 నుండి 2012`13 వరకు రు. 210 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కానీ డిశంబర్‌ 2011 నాటికి రు. 3లక్షలు మాత్రమే వ్యయం చేశారు. దీనిని బట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవచ్చు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి గ్యారంటీగా వినియోగపడడంతోపాటు హైదరాబాదుకు 50 టిఎంసిల నీటిని త్రాగునీటికి అందించే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా జరిగే విద్యుత్తు ఉత్పత్తితో ఈ లిప్టు పథకాలకే కాక దేవాదుల ప్రాజెక్టుకు కూడా విద్యుత్తు అవసరాలు తీరుస్తుంది. పైగా ఈ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో దేవాదులకు సంవత్సరం పొడుగునా నీటిలభ్యత గ్యారంటీ ఉంటుంది.
నీటి ముంపు ప్రాజెక్టు నిర్మాణం వలన ఉండదు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గోదావరిపై కేంద్ర ప్రభుత్వం రవాణాకు బ్రిడ్జిలు నిర్మాణం చేస్తున్నారు. ఆ బ్రిడ్జికే గేట్లు పెట్టడం ద్వారా ఉభయతారకంగా ప్రాజెక్టు నిర్మాణం చాలావరకు కలిసి వస్తుంది. ప్రాజెక్టు ప్రాంతంలో యేటా 2500 నుండి 3000 టిఎంసిల నీరు లభ్యత ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 141 కి.మీ. దిగువన గోదావరిలోకి ప్రాణహిత`ఇంద్రావతి నదులు వచ్చి కలుస్తాయి. అక్కడి నుండి గోదావరి నిరంతరం ప్రవహిస్తోంది. నీటిలభ్యతకు కొరతలేదు.
ప్రాజెక్టు వివరణ
గోదావరి జలాల పంపిణీ బచావత్‌ అవార్డు ప్రకారం జి`10 బేసిన్‌లో 85 టిఎంసిల నీటిని ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవాలి. (అవార్డు పేరా నం.119`121) ఇచ్చంపెల్లి ప్రాజెక్టు నిర్మాణం ఎత్తివేసుకోవడం ఫలితంగా ఏర్పడిన నష్టాన్ని దీని ద్వారా పూడ్చవచ్చు. బ్యారేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
1) ఏటూరునాగారం మండలం కంతాలపెల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై 22.50 టిఎంసిల నిలువ శక్తిగల బ్యారేజీని నిర్మించాలి. గోదావరి మట్టం G71 మీటర్లు ఉంది.
2) 185 క్యూమెక్స్‌ల ప్రవాహంతో 9 డయామీటర్ల సామర్థ్యం కలిగిన పైపుల ద్వారా 22 కిలోమీటర్ల తర్వాత తుమ్మలవాగు, కన్నెబోయినపల్లి గ్రామం తాడ్వాయి వద్ద G115 మీటర్ల ఎత్తు లిప్టు ఏర్పాటు చేయాలి.
3) 185 క్యూమెక్స్‌ల ప్రవాహంతో 9డయామీటర్ల G115 మీటర్ల ఎత్తుతో ములుగు మండలం జంగాలపెల్లి మద్ద లిప్టు ఏర్పాటు చేయాలి.
4) 185 క్యూమెక్స్‌ల ప్రవాహంతో 9 డయామీటర్లతో G85 మీటర్ల ఎత్తుతో ధర్మాసాగరం వద్ద లిప్టు ఏర్పాటు చేయాలి. ఇక్కడి నుండి వరంగల్‌కు త్రాగునీటి సౌకర్యం కల్పించవచ్చు.
5) 175 క్యూమెక్స్‌ల ప్రవాహంతో G85 మీటర్ల ఎత్తుతో అనగా మొదటి నుండి G390 మీటర్ల ఎత్తుతో స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండవద్ద లిప్టును ఏర్పరచాలి.
6) 175 క్యూమెక్స్‌ల ప్రవాహంతో 55 మీటర్ల ఎత్తుతో నల్లగొండ జిల్లా ఆలేరు మండలం ధర్మారెడ్డి గూడెం వరకు G440 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేయాలి. ఆలేరు, భువనగిరి, హైదరాబాదుకు ఇక్కడి నుండి 25 టిఎంసిల త్రాగునీటిని సరఫరా చేయవచ్చు.
ఈ పథకాన్ని పూర్తిచేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ నుండి నామమాత్రపు కెటాయింపులే చేసినప్పటికీ నిధుల విడుదల జరుగుటలేదు.
జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు
రాష్ట్రంలో 7 ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పదేపదే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను పంపుతున్నది. కానీ ఈ విజ్ఞప్తులను కేంద్రం బేఖాతరు చేస్తున్నది. ‘‘ అదుగోవచ్చే `ఇదుగో వచ్చే అంటూ ’’ ప్రకటనలు చేస్తున్నది.
1) పివి నర్సింహారావు, కంతాలపెల్లి, సుజల స్రవంతి ప్రాజెక్టు
2) ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టు
3) బాబూ జగ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
4) మహాత్మా జ్యోతిరావుపూలే దుమ్ముగూడెం`నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌
5) జె.చొక్కారావు దేవాదుల లిప్టుపథకం
6) శ్రీపాద సాగర్‌ ఎల్లంపెల్లి ప్రాజెక్టు
7) డా॥ బిఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత `చేవెళ్ళ సుజల ప్రవంతి ` గోదావరి నదీ చేసిన ప్రాజెక్టులనే ‘‘ జాతీయ ప్రాజెక్టు’’లుగా చేయమని కోరడం జరిగింది.
యేండ్ల తరబడి కోరడమే తప్ప ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆవైపు దృష్టి పెట్టింది లేదు. మిగిలిన ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌ నుండి నిధులు కేటాయిస్తున్నారు. ప్రాధాన్యగల ప్రాజెక్టులను వరుస క్రమంలో చేపట్టి పూర్తి చేయుట ద్వారా ఈ పాటికి అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయవచ్చు.  2004 నుండి 72 వేల కోట్లు వ్యయం చేసిన(రాష్ట్రపతి ప్రసంగం) ఇంతవరకు ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. చివరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాలలో గల మధ్యతరహా ప్రాజెక్టులు కూడా పూర్తికాలేదు. 2012`13లో సాగునీటి ప్రాజెక్టులకు రు.15015 కోట్లు కేటాయించినప్పటికీ కేటాయించింది రు. 60 కోట్లు మాత్రమే.
ప్రభుత్వం చేపట్టవలసిన కర్తవ్యం
రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికపై కాంతాలపెల్లి లిప్టు పథకాన్ని చేపట్టాలి. ఇందుకు ఈ బడ్జెట్‌లో రు. 1200 కోట్లు కేటాయించాలి. సత్వరమే పనులు ప్రారంభించాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బచావత్‌ అవార్డు ప్రకారం ఈ బేసిన్‌లో 85 టిఎంసిలు వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. కేంద్ర జలసంఘం ఆమోదం లభిస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణం వలన లేకపోవుట వలన పర్యావరణ సమస్యగానీ, అటవీ సమస్యగానీ ఉత్పతన్నం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే కేంద్రం నుండి ఎఐబిపి నిధులు సాధించవచ్చు. అదేవిధంగా నాబార్డు నుండి, ఆర్‌ఐడిఎఫ్‌ నుండి నిధులు రాబట్టవచ్చు. దీనిని ఇరిగేషన్‌ డిపార్టుమెంటు ద్వారా సర్వే చేయించి, టెండర్లు ఫైనలైజ్‌ చేసి ప్రభుత్వమే ప్రత్యక్ష జోక్యంతో నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం నిర్మాణాలు చేపట్టి పెండిరగులో పెడుతున్న ప్రాజెక్టులలా కాకుండా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయుట ద్వారా బహుళార్థక ప్రయోజనాలు నెరవేరుతాయి. విద్యుత్‌ సమస్య పరిష్కారమవుతుంది.
తక్షణం నిధులు కేటాయించి పనులు ప్రారంభించడానికి ప్రజాఉద్యమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అన్ని గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో సంఘటిత ప్రజాఉద్యమాలను నిర్మించి ఆందోళనలు చేపట్టాలి.

RRRR

No comments:

Post a Comment