2012 సంవత్సరంలో దేశంలో మొత్తం 13754 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 2572 మంది(19శాతం) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1997 నుండి సంస్కరణలు అమలు జరుపుతున్న సంవత్సరమే ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2004`12 సంవత్సరాలలో యేటా సగటున 2376 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే నేడు ప్రభుత్వాలు సన్నచిన్నకారు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఒకవైపు చెబుతుండగానే మరో వైపు ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. సంస్కరణలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచకపోగా రైతులను సంక్షోభంలోకి నెట్టాయి. సన్నచిన్నకారు రైతులు వ్యవసాయ రంగం వదిలివేస్తున్నారు.
అనగా రోజుకు 375 మంది వ్యవసాయరంగాన్ని వదిలిపోతున్నారు.
ప్రధానంగా ఈ దిగువ సమస్యలు రైతులను సంక్షోభానికి గురి చేస్తున్నాయి.
1) భూ సమస్య ` కౌలుదారుల విస్తరణ ` భూసేకరణ ` ప్రభుత్వ విధానాలు
2) వ్యవసాయ ఉపకరణాలు ` విత్తన ప్రైవేటీకరణ ` ఎరువుల సబ్సిడీ కోత ` సాగునీరు వ్యాపారీకరణ ` వ్యవసాయ విస్తరణ కుదింపు ` ప్రైవేటు మార్కెట్ చట్టం
3) కనీస మద్దతు ధరల నిర్ణయం` తగ్గింపు
4) బడ్జెట్ తగ్గింపు
5) ఎగుమతి`దిగుమతులు
పై సమస్యల అమలులో కేంద్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు అనుకూలంగా పని చేస్తున్నాయి. వారికి అనుకూలంగానే భూ చట్టాలలో సవరణలు సూచిస్తూ చర్చనీయాంశం చేసింది.
భూ సమస్య :
భూసంస్కరణల ద్వారా భూసీలింగ్ తగ్గించి పేదలకు భూపంపిణీ చేస్తామన్నారు. ఇది ఎన్నికల ప్రకటన తప్ప ఆచరణీయం కాదు.
దేశ జనాభాలో 60శాతం మందికి 5శాతం భూమి మాత్రమే ఉంది. 10శాతం మంది చేతిలో నేటికీ 55శాతం పైగా భూమి ఉంది.
1) సాగునీటి భూములకు 5`10 ఎకరాలకు, సాగునీటి వసతిలేని భూములకు 10`15 ఎకరాల పరిమితి ఉండాలి.
2) తోటల పెంపకానికి మత, ట్రస్టీ, పరిశోధన, పారిశ్రామిక సంస్థలకు మినహాయింపులు ఉపసంహరించుకోవాలి. ఎట్టి పరిస్థితులలోను ఒక యూనిట్‌కు మించి భూపరిమితి ఉండరాదు. మిగులు భూముల వివరాలు రాష్ట్రాలు తయారు చేసి ప్రజల తనిఖీకి ఉంచాలి.
3) భూదాన భూములు, ప్రభుత్వ భూములు, మత సంస్థలకు చెందిన భూములు పేదలకు సాగుకు ఇవ్వాలి. వేలం వేసి అందుబాటులో ఉంచాలి.
పై కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడానికి ఏ రాష్ట్రప్రభుత్వమూ సుముఖంగా లేదు.
ప్రస్తుత పరిస్థితి :
ప్రస్తుతం ప్రభుత్వాలు పేదల నుండి బలవంతపు భూసేకరణలు చేస్తున్నాయి. వేలాది మందికి ఎలాంటి పరిహారం చెల్లించకుండానే భూములు తీసుకున్నారు. తమకు కావలసిన భూములన్నీ సేకరించిన తరువాత ఇప్పుడు 2013లో భూసేకరణ చట్టం తెచ్చారు. దీనవలన పేదలకు ఉపయోగంలేదు. ఇప్పటికే పేదలు భూములు కోల్పోయారు.
దేశంలో కౌలుదార్ల సంఖ్య విస్తరిస్తున్నది. కౌలుదార్ల రక్షణకు ఎలాంటి చట్టాలు లేవు. గతంలో వామపక్షప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయనిరాకరిస్తున్నాయి. పంట దిగుబడి ఎంత వస్తుందో అంత కౌలు రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అందువల్ల రుణగ్రస్తులైన కౌలుదారులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గీత కార్మికుల ఆందోళనల ఫలితంగా 1996లో రాష్ట్ర ప్రభుత్వం 560 జీవో ద్వారా ప్రతి గ్రామంలో ఐదెకరాల ప్రభుత్వ భూమిని తాటి`ఈత చెట్ల పెంపకానికి కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఆ విధంగా గీత కార్మికుల ఆదాయ వనరులు శాశ్వత పరుస్తూ కొనుగోలు శక్తిని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ జీవోను కాగితాలకే పరిమితం చేసారు. రాష్ట్రంలో భూమి తగినంత ఉన్నప్పటికీ చేతివృత్తుల వారికి కేటాయించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు.
140 లక్షల భూమి బీడుగా ఉన్నప్పటికీ చేతివృత్తుల వారి వృత్తిపరమైన అవసరాలకు కేటాయించడానికి, వారికి ఇళ్ల నిర్మాణానికి స్థలాలివ్వడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. అదే సందర్భంలో రియల్ ఎస్టేట్ వారికి లక్షల ఎకరాల భూములు కట్టబెడుతున్నారు. ఇప్పటికే గత ముగ్గురు ముఖ్యమంత్రులు 13 లక్షల ఎకరాల భూమిని రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారు. భూసేకరణ జరిగాక కేంద్రం భూ చట్టం తెచ్చింది. ఈ ప్రస్తుత చట్టంలో గ్రామీణ ప్రాంతంలో మార్కెట్ ధరకు నాల్గురెట్లు, పట్టణాల్లో రెండు రెట్లు చెల్లించాలని ఉంది. ఇది 2013 అక్టోబర్ 13 నుండి అమలులోకి వస్తుంది. ఇప్పటికే సేకరించిన భూములకు ఇది వర్తించదు. భూములను పేదల నుండి లాక్కోవడంతోపాటు, పేద ప్రజలకు భ్రమలు కల్పించే విధంగా ఈ చట్టాన్ని వినియోగిస్తున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెచ్చిన చట్టం తప్ప మరొకటి కాదు.
ప్రభుత్వం మద్యంశాఖ నుండి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకుంటుంది. కానీ, గీత కార్మికుల సంక్షేమం కోసం గాని, వారి కొనుగోలు శక్తి పెంచడానికి, ప్రమాదాలకు గురైనవారికి ఎక్స్‌గ్రేషియో చెల్లించడానికి నిధులు లేవని చెప్పుతున్నాయి. ఆర్భాటంగా గీత కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్‌కు ఏనాడు నిధులు తగినన్ని కేటాయించలేదు. నామమాత్రంగా కేటాయింపు వల్ల కమిషన్ పనిచేయకుండా పోతున్నది. ఒక విధంగా కమిషన్‌కు చైర్మన్‌ను నియమించని దుస్థితిలో ఉన్నది. ప్రభుత్వ బడ్జెట్‌కు వస్తున్న ఆదాయంలో గీత కార్మికులకు నిధులు కేటాయించడానికి సుముఖంగా లేదు. గీత సంఘం నుండే 20 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ నిధులు కూడా తిరిగి గీత కార్మికులకు, వారి సంక్షేమం కోసం కేటాయించలేకపోతున్నారు. నేడు ఈ రంగంలో ఇళ్లు లేనివారు, వృత్తి కోల్పోయినవారు, వయస్సు మళ్లినవారి సంఖ్య పెరుగుతున్నది. కనీసం వయస్సు మళ్లినవారికి పెన్షన్ సౌకర్యం కల్పించడానికి కూడా ప్రభుత్వం ఇచ్ఛగించుట లేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఈ విధంగా ఉంది (కోట్లలో)
పై ఎక్సైజ్ శాఖ ఆదాయం ‘‘దుకాణపు పన్ను’’ మాత్రమే. అమ్మకపు పన్ను పేర మరో 12వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఈ విధంగా విదేశీ మద్యాన్ని దిగుమతి చేసుకోవడమే కాక, స్వదేశీ మద్య ఉత్పత్తులు పెంచి సాంప్రదాయంగా వస్తున్న గీత వృత్తిని దెబ్బతీసే ప్రయత్నం ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ సరళీకరణ విధానాల ఫలితంగా గీత వృత్తిలో ఉన్నవారు రుణగ్రస్తులైనవారే కాక, ఆకలి బాధను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల దృష్య్టా రానున్న తరం చేతివృత్తుల్లోకి రావడానికి అయిష్టతను వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు చేతివృత్తుల్లో కూడా ఆ పరిజ్ఞానాన్ని వినియోగించి, వాటిని అభివృద్ది పరచాలి. కానీ అందుకు భిన్నంగా చేతివృత్తుల ఉత్పత్తులను పూర్తిగా బహుళజాతి సంస్థలపరం చేసారు.
సరళీకృత విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేతివృత్తుల వారు, సన్న`చిన్నకారు రైతులు సమైక్యంగా సంఘటితంగా ఉద్యమాలు కొనసాగించి తమ ఉనికిని నిలుపుకోవాలి. తమ కొనుగోలు శక్తిని తగ్గిస్తున్న సంస్కరణలను వ్యతిరేకించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
06.11.2013




No comments:
Post a Comment