రాష్ట్రప్రభుత్వం పత్తి విత్తనాల పాకెట్‌కు రు.180 పెంచుతూ బహుళజాతి సంస్థలకు వ్యాపారులకు లాభాలు కలిగిస్తూ రైతులపై రు.165 కోట్ల భారం వేస్తూ జారీ చేసిన జీ.ఓ ను వెంటనే ఉపసంహరించాలని అఖిలభారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపెల్లి మల్లారెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండు చేశారు. పోరాటాలు చేసి సాధించుకున్న ఫలితాలను రాష్ట్రప్రభుత్వం వమ్ముచేస్తున్నది.నిత్యావసర చట్టంలోకి తెచ్చినా, ఏకపక్షంగా ధరలు పెంచడం జరిగింది.
గత మూడు మాసాలుగా విత్తన ధరల పెంపుదలను నిరసిస్తూ రైతులు, రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. వారికి పెంపుదల చేయనని ఒకవైపున రాష్ట్రప్రభుత్వం హామీ ఇస్తూనే తీరా పంటనాటే కాలం దగ్గరికి రాగానే అకాస్మాత్తుగా ధరలను పెంచి రైతులపై భారాన్ని వేసింది. పాత ధరలకే విత్తనాలు సరఫరా చేస్తామంటూ అనేక కంపెనీలు రైతుల నుండి అడ్వాన్సులు తీసుకుని, అందుకు భిన్నంగా పెంచిన ధరలు రైతుపై వేయడం అత్యంత దుర్మార్గం. పెంచిన రు.180 లో రు.90 కంపెనీల వారికి,మరో రు.90 విత్తన ఉత్పత్తిదారులకు ఇవ్వాలంటూ జీ.ఓ చెప్పింది. కంపెనీల వారు విత్తనోత్పత్తి రైతులనుండి గత దశాబ్దకాలంగా అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ వారిని నష్టాలకు గురిచేశారు. 750 గ్రాముల విత్తన పాకెట్‌ను రు.320 కి కొనుగోలు చేసిన కంపెనీలు ప్రాసెస్ చేసి 450 గ్రాముల పాకెట్‌ను రైతులకు రు.750 కి విక్రయించారు. 2011లో రాష్ట్రంలో 25,322ఎకరాలలో 70.50 లక్షల పాకెట్‌లను విత్తనోత్పత్తి చేయాగా రాష్ట్రంలో 81.82 లక్షల పాకెట్లు అమ్మారు. 2011`12 సంవత్సరానికి 94 లక్షల పాకెట్లు అమ్మడానికి లక్ష్యం నిర్ణయించారు. బిజి`1 పత్తి రోగ నిరోదక శక్తి కోల్పోయిందని బిజి`2ను ఉత్పత్తి చేశారు. బిజి`2 కూడా శనగపచ్చ పురుగుల తాకిడిని తట్టుకోవడంలో వైఫల్యం చెందింది. కంపెనీలు తమ క్రిమిసంహారక మందులు అవాంట్, ట్రేసర్‌లను వినియోగించి పంటలు రక్షించుకోవాలని, 30 శాతం నాన్`బిటి పత్తిని వేయాలని సలహాలిస్తున్నారు. ఎన్‌జి రంగా యునివర్సిటీ రూపొందించిన మల్లిక,నర్సింహలాంటి విత్తనాలను(ఎకరాకు 15 క్వింటాళ్ళ దిగుబడి వచ్చే)మార్కెట్‌నుండి తరిమి వేశారు.
ధరలు పెంచనిచో చాలినంత విత్తనం సరఫరా ఉండదని, ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లుతుందని, ఉత్పత్తి`
ఉత్పాదకత తగ్గిపోతుందని, రైతులకు నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండదని, జిన్నింగ్`టెక్స్‌టైల్స్ దిగుమతులు పెరుగుతాయని, 15 లక్షల మంది ఉపాదిని కోల్పోతారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కంపెనీలు ప్రకటించాయి. విద్యుత్తు, డీజిల్, ఎరువులు,క్రిమిసంహారక మందులు 2006 నుండి నేటికీ 27శాతం పెరిగాయని, కనీస వేతనాలు 226 శాతం పెరిగాయని, అదే సందర్భంలో రైతుకు ఎకరా పత్తి ఉత్పత్తిపై పెట్టుబడిపోగా రు.40 వేలు ఆదాయం వస్తుందని తప్పుడు నివేదికను ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులపై భారం వేశారు.
కంపెనీలకు పెరిగిన విధంగా రైతులు రైతులు వినియోగించే ఉపకరణాల ధరలు 58 శాతం పెరిగినా గత రెండు సంవత్సరాలుగా కనీస మద్దతు ధరలు పెంచలేదు. పత్తి క్వింటాలు రు. 6 వేలకు అమ్మకాలు జరుగుతున్నాయని కంపెనీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.రు.3వేలనుండి రు. 4 వేల మధ్య అమ్మకాలు సాగినా దిగుబడి కంపెనీలు చెప్పినట్లు ఎకరాకు 10 క్వింటాళ్ళు రాకుండా గత సంవత్సరం 5,6 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడులు వచ్చాయి. అప్పుల భారం పెరిగి నేటికీ పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. వాస్తవాలకు భిన్నంగా, కంపెనీల లాభాల కొరకు విత్తనాల ధరలు పెంచి రైతులపై భారాలు వేయడం రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలి. ధరలు తగ్గించుకోవడానికి రైతులందరూ ఐక్యఉద్యమాలు కొనసాగించాలి.
ప్రచురణార్థం తేది.21.05.2011
సారంపల్లి మల్లారెడ్డి, అఖిలభారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు

No comments:
Post a Comment