రాష్ట్ర ప్రజల, రైతాంగం సమస్యలను పరిష్కరించడానికి ఏప్రిల్ 15 నుండి మే 5వరకు ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రవర్గ ఉపసంఘం సభ్యులైన రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి మరియు కన్నాలక్ష్మీనారాయణ, సూచనల మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించాడు. 20 రోజుల ఈ కార్యక్రమంలో 8 ప్రజాసంబంధ సమస్యలను పరిశీలించి, పరిష్కరిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పనులు, త్రాగునీటి సమస్య, ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసుల అంశాలు, రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్తుపై సమీక్షలు ఉంటాయని ఏప్రిల్ 10న ప్రకటించారు. ఇందులో రచ్చబండ కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తారు. కరువు మండలాలలోని పంటలు నష్టపోయిన రైతులకు 1800 కోట్ల పంపిణీకి ఉద్దేశించారు. ఏప్రిల్ 25లోపు కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ప్రజాపథంలో ధరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బ్యాంకర్స్ సర్వే ప్రకారం 24లక్షల మంది కౌలుదారులుండగా గత సంవత్సరం 7లక్షల మందికే గుర్తింపుకార్డులిచ్చారు. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుండి 10 వరకు ధరఖాస్తులు తీసుకొని ఏప్రిల్ 22 నుండి 25 వరకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఏమేరకు అమలు చేస్తుందో?
ఇంతకు ముందు జనవరి 18 నుండి మార్చి 17 వరకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఇందులో దళిత, గిరిజన భూములకు సంబంధించిన తగాదాలపరిష్కారం, అసైన్డ్, పోరంబోకు భూములు పట్టా నంబర్లవారీగా ప్రకటించడం, కౌలు రైతుల నుండి ధరఖాస్తు స్వీకరణతో పాటు సదస్సులు ముగిసేలోపల గుర్తింపు కార్డులు ఇవ్వడం, 6వ విడత భూపంపిణీకి భూములను గుర్తించడంతో పాటు 5వ విడత పంపిణీ చేసిన భూములను లబ్దిదారులకు స్వాధీనపర్చడం దేవాదాయ, వక్ఫ్‌భూములను పరిశీలించడం, అటవీ హక్కుల కింద భూముల పంపిణీతోపాటు గ్రామ సభలలో వచ్చే ధరఖాస్తులను పరిశీలిస్తామని ప్రకటించారు. ఈ రెండు మాసాల యాత్రల్లో నిర్థేశించిన లక్ష్యాలు చేరలేదు. 2005 సంవత్సరం నుండి యేటా ఏప్రిల్, మే మాసాలలో చైతన్య యాత్రలు జరుగతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని 71,421 జనవాసాలలో ఏనాడూ నిర్థేశించిన లక్ష్యం నెరవేరలేదు. 2008నుండి 2011 వరకు మూడు సంవత్సరాలలో జరిగిన చైతన్య యాత్రల వలన ఆశించిన లక్ష్యం సాధించకపోగా నిధులు మాత్రం వ్యయమైనాయి. 2008`09లో 50,083 గ్రామాలలో 34.41 లక్షల మంది రైతులు, 2009`10లో 31,867 గ్రామాలలో 13.44లక్షల మంది రైతులు, 2010`11లో 36,757 గ్రామాలలో 33.20 లక్షల మంది రైతులను మాత్రమే కలిసి నట్లు 2011 మార్చి 31న విడుల చేసిన కాగ్ నివేదిక పేర్కొంది. రైతు చైతన్య యాత్రల్లో మహిళా రైతుల సంఖ్య 16`17 శాతం వద్ద ఉందని యేడాదిలో రెండు వారాలు రైతుల వద్దకు వ్యవసాయ విస్తరణాధికారులు వెళ్ళడంవలన ఆశించిన ఫలితం ఉండదని కాగ్ తెలిపింది. రైతు చైతన్య యాత్ర నిర్వహించడం కోసం కాగ్ వేసిన అంచనా రు.1.94 కోట్లు కాగా 2008`11 మధ్య కాలంలో 4.43 కోట్లు వ్యయం జరిగింది. రైతు చైతన్య యాత్రలను నిర్వహించాల్సిన తీరుపైన మార్గదర్శకాలు లేవు. ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుండి దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరగలేదని కాగ్ విమర్శించింది. వ్యవసాయ శాఖకు మంత్రిని నియమించడానికి సంవత్సరం పట్టింది.
79 రెవెన్యూ డివిజన్లలో రైతు సదస్సులను నిర్వహించి అమలవుతున్న పథకాలను గుర్తించడంలో ఈ సదస్సులు పూర్తిగా వైఫల్యం చెందాయి. రైతులు ఎదుర్కొనే సమస్యలను పక్కదారి పట్టించడానికి రైతు మిత్ర బృందాల ఏర్పాటు, ఉమ్మడి ప్రయోజన బృందాలను ఏర్పాటు చేశారు. ఆదర్శరైతుల పథకం నిధుల దండగమారి పథకంగా మారింది. రైతుకు శిక్షణ, వ్యవసాయ విస్తరణ కోసం మౌలిక వసతుల ఏర్పాటు మరియు వ్యవసాయాధికారులకు శిక్షణ కల్పించకపోవడం వలన వారి సేవలు రైతులకు అందలేదు. విత్తనాల నాణ్యతను పరీక్షించి నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. మెరుగైన విత్తనాలను గుర్తించడం కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. రాష్ట్ర విత్తన రంగంపై మోన్‌శాంటో లాంటి బహుళజాతి సంస్థలు 80శాతం అధికారం కలిగి ఉన్నాయి. గ్రామ విత్తనోత్పత్తి కమతాలను నమోదు చేయడానికి విత్తనాల చట్టం`1966 కింద రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ గ్రామాలను ఏ అధికారులూ పర్యటించలేదు. జాతీయ వ్యవసాయ భీమాపథకం కింద 2006`11 మధ్యకాలంలో 1.44 కోట్ల మంది రైతులుండగా, 6.26 లక్షల మంది రైతులకు మాత్రమే దీనిని వర్తింప చేశారు. ప్రకృతివైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతుల వివరాల సేకరణ, పరిహారం నిర్ణయం జరపలేదు. 2008 జూన్‌లో పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ 2008`09లో 1.17 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2008`09 క్లేయిమ్‌ల కింద 123.57 కోట్లను 2011 మార్చిలో విడుల చేశారు. 2011 మార్చి నాటికి 120 లక్షల మంది రైతులకుగాను, 10.17 లక్షల మంది రైతులకు(8.47శాతం) పావలా వడ్డీ పథకం లబ్దిని పొందగలిగారు.
జలయజ్ఞం సమీక్షలు ఈ సదస్సులలో జరపలేదు. ప్రస్తుతం 64 భారీ ప్రాజెక్టులు, 97 మధ్యతరహా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్నా ఇంతవరకు ఏ ఒక్కటీ పూర్తికాలేదు. ప్రభుత్వం అట్టహాసంగా నీటి విడుల కార్యక్రమాలు చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు నీరు పొలాలకు చేరలేదు. పంట కాలువలు లేకపోవడం, వాటిని పూర్తిచేయలన్న లక్ష్యం కొరవడడం కొనసాగుతున్నది. 2009`10లో జలయజ్ఞం కింద 17,676 కోట్లు కేటాయించగా 12,267 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. 2010`11లో 15వేల కోట్లు కేటాయించగా 9700 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. 2011`12లో 15012 కోట్లు కేటాయించగా డిసెంబర్ 2011 నాటికి 6642 కోట్లు వ్యయం చేశారు. ప్రాజెక్టు జాప్యంతో అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతున్నది. జలయజ్ఞం ప్రారంభించనప్పటి నుండి నేటికి 72 వేల కోట్లు వ్యయం చేసినట్లు 13 లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించినట్లు గవర్నర్ శాసనసభ ప్రసంగంలో తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో తెలిపిన వ్యయం మాత్రమే వాస్తవం కాగా సాగునీటి కల్పన నమ్మశక్యంగా లేదని శాసనసభలోనే చర్చల సందర్భంగా సభ్యులు తెలిపారు. చివరికి ప్రపంచబ్యాంకు రుణంపై చేపట్టబడ్డ కృష్ణా డెల్టామోడరైజేషన్ పనులు కూడా కొనసాగడం లేదు. మొత్తం మీద ప్రాజెక్టుల పనులు 70 శాతం వరకు నిలిచిపోయాయి.
మరోవైపున ఎరువుల ధరలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మూలకాల ఆధారిత సబ్సిడీ విధానాల ఫలితంగా ఒక్క ఖరీఫ్ పంట కాలంలోనే వందశాతం ధరలు పెరిగాయి. యూరియాపై కంట్రోలు ఎత్తివేస్తానని ప్రధాని పార్లమెంటులో ప్రకటించాడు. అన్ని రకాల సబ్సిడీలను రానున్న సంవత్సరానికి జిడిపిలో 1.7 శాతానికి కుదిస్తానని ప్రధాని ప్రకటించడం గమనించాలి. ఇప్పుడు ఇస్తున్న రాయితీలు 2 శాతం మాత్రమే. ప్రపంచంలోని ఏదేశంలోనైనా రాయితీలు రెండంకెల స్థానంలో ఇస్తున్నారు. వ్యవసాయ రంగానికి రైతులుపెట్టిన పెట్టుబడిలో 25 శాతం నుండి 82 శాతం వరకు వివిధ దేశాలలో రాయితీలిస్తున్నారు. అందువలన అక్కడి రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడడం లేదు. కనీసం వ్యవసాయరంగం నుండి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 10శాతం కూడా కేటాయించలేకపోతున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే 2011`12లో ఆహారధాన్యాలు 14.82 శాతం, నూనె గింజల దిగుబడి 36.09 శాతం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 228 లక్షల టన్నులకు అంచనా వేయగా 173 లక్షల టన్నులకు తగ్గుతున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. దీనికి కరువును కారణంగా చూపుతున్నారు. కరువు నివారణకు మిగులు జలాలను వినియోగించుకోవడానికి ‘‘రాష్ట్ర జలవిధానం’’ రూపొందిచలేదు. ఫలితంగా ఈ కరువు సంవత్సరంలో కూడా 3000 టిఎంసిల నీరు సముద్రంలోకి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం ఎఐబిపి కింద 33 ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం ఇస్తున్నప్పటికీ 13 చిన్న ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆధారిత చెరువుల యాజమాన్య ప్రాజెక్టు’’ కింద రాష్ట్ర ప్రణాళిక నిధుల ద్వారా చిన్న నీటి పారుదల పనులకు కేటాయించిన నిధులు వ్యయం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయరంగంపై క్రమంగా పట్టుకోల్పోతున్నది. కార్పోరేటు సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. 2004`05లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా 25.1 శాతం ఉండగా, 2012`11లో 21.5 శాతానికి తగ్గింది. నిర్థేశిత నాలుగు శాతం లక్ష్యం వృధ్ధి రేటు గత 5 సంవత్సరాలుగా చేరలేదు. 2.5 శాతం దాటడం లేదు.
వ్యవపాయోపకరణాల ధరలను ప్రభుత్వమే పెంచడం అదే సందర్భంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఆ దామాషాలో పెంచకపోవడం వలన రైతులు రుణభారీన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉపకరణాల ధరలు 80 శాతం పెరగగా, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 8 శాతం మాత్రమే పెరిగాయి. ఈ సమస్యలేవీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రలలోగానీ, ప్రగతిపథంలోగానీ చర్చించడం లేదు. హడావిడిగా కొందరు అధికారులు 2,3 జీపులలో వెళ్ళి గంటలో యాత్ర ముగించుకొని మరో గ్రామానికి వెళ్ళడం, ఒకేరోజు 3,4 గ్రామాలు పూర్తిచేయడం ద్వారా నిర్ధేషిత లక్ష్యం నెరవేరుతుందా? ఆ గామంలో సభ జరగబోతున్నట్లు అప్పటికప్పుడు ప్రచారం చేయడం వలన 10 శాతం మంది కూడా హాజరు కావడం లేదు. రైతులు ఎదుర్కొనే సమ్యలే కాకుండా ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఏకరువు పెట్టి, రాజకీయ ప్రచారం చేసి యాత్రలు సాగుతున్నాయి. మండల స్థాయిలో ప్రతి గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమ్యలు పరిష్కరించే దిశగా సదస్సులు, యాత్రలు జరిగినపుడు ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. అందుకనుగుణంగా విస్తృతప్రచారం చేయడంతోపాటు, తగు సమయమిచ్చి చర్చలకు వచ్చిన సమస్యలను, ధరఖాస్తులు చేసుకున్న వారి సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలి. దీనికి ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జిల్లా అధికారులు ఉండాలి. జిల్లా స్థాయిల్లో, మండల స్థాయిలో పిర్యాదులను సమీక్షించడానికి అఖిలపక్ష కమిటీలు ఏర్పాటు చేయాలి. వాటికి చట్టబద్ద బాధ్యత కల్పించాలి.
తేది.12.04.2012
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment