1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ బెంగాల్ ప్రభుత్వాన్ని మీర్‌జాఫర్ ద్రోహంతో ఓడిరచి అధికారానికి వచ్చారు. ఆ తరువాత ఈస్టిండియా ప్రభుత్వం డిల్లీలో అధికారం సుస్థిరం చేయడానికి జయచంద్‌ను సామంత రాజును చేశారు. 1757`63 మధ్య నైజా వారసుడు సలాబత్ జంగ్ ప్రెంచివారికి మచిలీపట్నం, కొండవీటు, నిజాంపట్నం, నర్సాపూర్‌లను ఇచ్చివేశాడు. 1765లో ఆంగ్లేయ మద్రాసు ప్రభుత్వంలో దుబాషీగా పని చేస్తున్న కాండ్రేగులు జోగిపంతులు ద్వారా నైజాం సంస్థానంలోని కొంత భాగాన్ని రు.15లక్షలకు ఆంగ్లేయులు కొనుగోలు చేయడానికి తోడ్పడ్డాడు. 1800 సంవ్సరంలో నిజాం బ్రిటీష్‌వారితో సబ్సిడరీ అలయన్స్ కింద అనంతపురం, కడప, కర్నూలు ఆంగ్లేయులకు దత్తత ఇచ్చివేశాడు. ఆ విధంగా దేశాన్ని ముక్కలుముక్కలుగా విదేశీయుల పరం చేశారు. ఆ విధంగా బలపడ్డ ఆంగ్లేయులు భారతదేశాన్ని ద్రోహుల అండతో 190 సంవత్సరాలు ఏకబిగిన పరిపాలించారు. నాటి చరిత్ర నేటికీ కొనసాగుతున్నది. అనేక పోరాటాలు చేసి 1947 ఆగస్టు 15న ఆంగ్లేయులను తరిమివేసిన భారతదేశం నేడు సామ్రాజ్యవాదులకు ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తున్నది. దేశాన్ని, దేశ సంపదను వారికి భోజ్యం చేస్తున్నది. నేడు ఆ చరిత్ర తిరిగి పునరావృతమవుతున్న సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే భారతదేశం తన అస్థిత్వాన్ని క్రమంగా కోల్పోతున్నది. సంస్కరణల పేరుతో, సరళీకృత ఆర్థిక విధానాల అమలు పేరుతో ప్రజల భవిష్యత్తును సామ్రాజ్యవాదులకు తాకట్టు పెడుతున్నది. అందులో ముఖ్యభాగంగా ఈ దిగువ సంఘటనలను పేర్కొనవచ్చు.
4`7 నవంబర్ 2013న హైదరాబాదులోని హైటెక్‌సిటీలో ‘‘ప్రపంచవ్యవసాయఫోరం మహాసభ మరియు వ్యవసాయ సాంకేతిక వ్యాపార సంత’’ ఏర్పాటు చేయబడిరది. దీని నిర్వహణకు అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, అస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు స్పాన్సర్ చేశాయి. స్వయంగా పాల్గొంటున్నాయి. బేర్(జర్మనీ) సంస్థ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. ఈ మహసభల ముఖ్యఉద్ధేశం ‘‘సన్నచిన్నకారు రైతుల భవిష్యత్తు సుస్థిరంగా పున:ఏర్పాటు’’ అను అంశంతో జరుగుతున్నాయి. బేర్ సంస్థ, నోవాస్, మోన్‌శాంటో, ఫాంటెర్రా, ఎర్త్‌వాచ్ మొదలగు పెద్ద సంస్థలు ఈఫోరం నిర్వహణ బాధ్యతల్లో ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించాడు. రాష్ట్రంలో వారి వ్యాపారానికి కావలసిన అన్ని రక్షణలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆరోజే ఈ కార్యక్రమం నిర్ణయించబడిరది. ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ ఫోరం ఛైర్మన్ కెన్నత్ బెకన్ అధ్యక్షతన, మైకెల్ డోయిన(మోన్‌శాంటో వైస్‌ప్రసిడెంట్), థాడ్‌సిమెన్స్(సిఇవో, నోవాస్ అమెరికా), డినైన్‌బూరెల్లా (ఫాంటెర్రా)లలు ప్రధాన వక్తలుగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభం చేస్తారు. వ్యవసాయశాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్‌పవార్ హాజరవుతారు.
ప్రపంచంలో ఆహార సమస్యతో సతమతమవుతున్న వారికి భద్రత కల్పించడమన్న సమస్యపై డబ్ల్యుఎఎఫ్ చైర్మన్ కెన్నత్ ప్రెకర్ ప్రసంగిస్తారు. ఈ రోజు 700 కోట్ల ప్రపంచ జనాభాలో 80 కోట్ల మంది పస్తులతో జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ బహుళజాతి సంస్థలే. నేడు ఆహార కొరతను సృష్టించడానికి అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఆహార పంటల ఉత్పత్తిని తగ్గించాలని ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే నాగార్జునసాగర్ ఆయకట్టు నవీనీకరణకు ప్రపంచబ్యాంకు 2200 కోట్లు రుణ ఒప్పందం కుదుర్చుకుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 2200 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్లుగా పెట్టి కాలువల రిపేర్ చేయాలి. ప్రపంచబ్యాంకు రుణంలోని మొదటి షరతు నాగార్జున సాగర్ ఆయకట్టులో ఆహారదాన్యాల ఉత్పత్తిని 15శాతం తగ్గించాలి. రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలి. ఈ నిబంధనలు అమలు జరపకపోవడం వలన ఆ రుణంలో రెండవ విడత ఇవ్వవలసిన కిస్తును ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే తన నిధులతో రిపేర్లు చేపడుతున్నది. మన రాష్ట్రం నుండి ఆఫ్రికా ఖండానికి వెళ్లి పద్దపెద్ద భూఖండాలను ఆ ప్రభుత్వాల అండతో సేకరించి వ్యవసాయాలు సాగిస్తున్నారు. అయినా మన ప్రభుత్వం బహుళజాతి సంస్థల వెంటపడడం ఆశ్చర్యం కల్గిస్తున్నది.
ప్రపంచబ్యాంకు ప్రవేశం లేకముందు మెక్సికో, సోమాలియా దేశాల్లో ఆహార కొరత లేదు. ప్రపంచబ్యాంకు బహుళజాతి సంస్థల ప్రవేశంతో ఆ దేశాల్లో నేడు తీవ్ర ఆహార కొరత ఏర్పడిరది. వర్ధమానదేశాల్లో ఆహార కొరతను సృష్టించి తమ దేశ మిగులు ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకోవడానికి వీలుగా, తమపై ప్రపంచం ఆధారపడే విధంగా చేయడానికి కుట్రలు సాగుతున్నాయి. అందులో భాగంగానే భారతదేశ ప్రజల ఆహార భద్రతకు ప్రమాథం వాటిల్లే విధంగా నేడు బహుళజాతి సంస్థలు సరళీకరణ విధానాలు, సంస్కరణల విధానాలు అమలు చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి.
2012 మార్చి 5న భారత వ్యవసాయ మరియు సహకార శాఖ ప్రకటన ప్రకారం ‘‘పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్(పిపిపిఐఎడి)’’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని 10 లక్షల సన్న చిన్నకారు రైతులకు వర్తింపచేస్తూ 2012`17 కాలంలో అమలు చేయాలి. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10వేల మంది రైతులు ఉండాలి. ఈ ప్రాజెక్టు కాలం 3`5 సం॥ల వరకు ఉంటుంది. ప్రతి రైతుకు 1లక్ష రూపాయల వరకు పెట్టుబడి ఇస్తారు. ఇందులో భారత ప్రభుత్వం 50శాతం అనగా రు.50వేలకు మించకుండా పెట్టుబడి ఇస్తుంది. డ్రిప్, స్ప్రింక్లర్, యాంత్రీకరణ, గ్రేడిరగ్ లాంటి పథకాలను సబ్సిడీగా ఇస్తారు.
ఈ పథకాన్ని భారత ప్రభుత్వం వ్యవసాయం మరియు కార్పోరేషన్ మరియు ఫిక్కి(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆండ్ ఇండస్ట్రీ) సంస్థలతో జాంయిటుగా ఒప్పందం కుదుర్చుకొని ఈ పథకం అమలు చేస్తారు. జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ(ఎన్.ఎల్.ఎస్.సి) దీనికి ఛైర్‌మెన్‌గా సెక్రటరీ ఉంటాడు. 10 లక్షల మంది రైతులకు వినియోగపడడానికి వీలుగా 12వ ప్రణాళికలో రు.5వేల కోట్లు కేటాయిస్తారు.
దీని ముఖ్య లక్ష్యాలు :
1) ఉత్పత్తి సంబందిత అంశాలతోపాటు పంటలు కోసిన తర్వాత మేనేజ్‌మెంట్ నిర్వహణ, వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తుల పరిశీలన
2) ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, పౌష్టికాహార భద్రత మరియు రైతులకు ఆదాయ పెంపుదల
3) ఉత్పత్తి ఉత్పాదకత పెంపుదలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుట. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ రావడానికి వినియోగదారులకు నేరుగా ప్రాసెస్ చేసి అందించుట.
4) నైపుణ్యం మరియు నైపుణ్యంలేని వారికి ఉపాధి అవకాశాలుమెరుగుపర్చుట. ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించుట.
5) ప్రాసెస్ ద్వారా రైతులకు అదనపు విలువ లాభం కల్గించుట.
7) వ్యవసాయం వ్యాపార రిత్యా లాభదాయకం చేయడం.
పై అంశాల ద్వారా 12వ ప్రణాళికలో ‘‘త్వరగా ఎక్కువ ఉత్పత్తి’’ చేయుటకు ఈ పథకాన్ని ప్రకటించారు.
ఇంత వరకు 17 రాష్ట్రాలలో 34 కంపెనీలు ఆ రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాలో ఐటిసి కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఈ పథకం ప్రకారం కంపెనీలు కోరిన కొన్ని పంటలనే రైతులు పండిరచాలి.
ఆంధ్రప్రదేశ్‌లో సోయా, వేరుశనగ, మిరప, పత్తి, చెరుకు, పాలు, కూరగాయల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐటిసి పొగాకు ఉత్పత్తికి రు.100 కోట్లతో 10 వేల మంది రైతులతో గ్రూపు ఏర్పాటు చేయ పూనుకుంది. శ్రీరాం కంపెనీ ఆంధ్ర, గుజరాత్, మహారాష్ట్రల్లో పండ్లు, కూరగాయల ఉత్పత్తికి 1లక్ష 50 వేల మందిని, మరియు పత్తి, మొక్కజొన్న ఉత్పత్తికి 3లక్షల 50 వేల మందితో గ్రూపులు ఏర్పాటు చేయడానికి ఆయా ప్రభుత్వాలతో అంగీకారం వెలిబుచ్చాయి.
ఆ విధంగా రాష్ట్రంలో సన్న,చిన్నకారు రైతులను భూముల నుండి తరిమివేసే ప్రయత్నంలో భాగమే ప్రస్తుతం నిర్వహిస్తున్న సదస్సు. భారీ యంత్రాలతో వ్యవసాయం చేస్తే లాభం వస్తుందని ఈ సభలలో యంత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వం 5000 మంది రైతులను తమ స్వంత ఖర్చుతో సమీకరించడానికి ప్రయత్నిస్తున్నది. ధనిక దేశాల్లో రోసిపోయి దివాళాతీసిన బహుళజాతి సంస్థల దృష్టి నేడు భారత వ్యవసాయ రంగంపై కేంద్రీకరించబడిరది. ఒకవైపున భారత వ్యవసాయ ఉత్పత్తి రంగం సంక్షోభంలో ఉన్నదని ప్రచారం చేస్తూనే మరోవైపు సంక్షోభాన్ని విస్తృత పరిచే ప్రయత్నాలు చేస్తున్నది.
సన్న ` చిన్నకారు రైతులకు భూములపై హక్కులు లేకుండా చేయడం, సాగునీటికి మీటర్లు పెట్టి పన్ను విధించడం, ఎరువులు`విత్తనాల ధరలు పెంచడం (నాణ్యత లోపించడం), వ్యవసాయ విస్తరణ సేవలను కుదించడం, పంట రుణాలు తగ్గించడం, మార్కెట్లలో కాంట్రాక్ట్ పద్దతులు ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసైనా సన్న`చిన్నకారు రైతులను భ్రమలకు గురిచేసి వారి భూములను ఏక ఖండాలుగా మార్చి కంపెనీ వ్యవసాయం చేయడానికి ఇప్పటికే రాష్ట్రంలో మూడు సార్లు ప్రయత్నం జరిగింది. ఒకసారి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు సహకార కంపెనీ వ్యవసాయం పేరుతో ఇచ్చిన ప్రతిపాదనను రైతులు వ్యతిరేకించారు. రెండవసారి మూడు గ్రామాలను ఎంచుకుని కంపెనీ వ్యవసాయం చేయ నిర్ణయించగా (వరంగల్, మెదక్, అనంతపురం) దానిని రైతులు వ్యతిరేకించారు. మూడవసారి పిపిపిఏఐడి చర్చను కేంద్రం తెచ్చింది. దానిని రైతులు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు ఈ మహాసభల ద్వారా రైతాంగాన్ని నమ్మించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అనేక దేశాల్లో చిన్న కమతాల ద్వారా ఉత్పత్తిపెరుగుతుందని వారికి అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ ఇక్కడ భారీ కమతాలపై నుండి దృష్టిని మరలించలేకుండా రాష్ట్ర`కేంద్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు దాసోహమంటున్నాయి.
1965 నుండి 1985 వరకు సాగిని హరిత విప్లవ కాలంలో వచ్చిన నూతన విత్తన టెక్నాలజీని అనంతరం నేడు విత్తన రంగం పూర్తిగా బహుళజాతి సంస్థలపరమైంది. పంటల మార్పిడితో రైతులకు కావాల్సిన విత్తనాలు మార్కెట్లలో లభ్యంకాకుండా చేసారు. రాష్ట్ర`కేంద్ర ప్రభుత్వాలు కొత్త విత్తనాల ఆవిష్కరణ పరిశోధనలను గత నాలుగైదు సంవత్సరాల నుండి చేయడం లేదు. ఆ విధంగా వ్యవసాయంలో ప్రభుత్వం నిర్దేశించిన 4శాతం వృద్దిరేటును గత దశాబ్దకాలంగా సాధించలేకపోతున్నారు. జనాభా యేటా 2శాతం పెరుగుతుండగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 1 లేదా 1.5 శాతం దాటడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2014 ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తెచ్చి 70శాతం ప్రజలకు వారి అవసరాలలో 50 శాతం ఆహారాన్ని మరియు పౌష్టికాహారాన్ని అందిస్తామని చట్టమే తెచ్చింది. గత రెండు దశాబ్ధాలుగా దేశ అభివృద్దిరేటు పెరిగందని చెబుతున్న ప్రభుత్వాలు, మరోవైపున దారిద్య్ర రేఖకు దిగువనున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. వృద్దిరేటు పెరిగితే దారిద్య్రరేఖకు దిగువనున్నవారి సంఖ్య తగ్గాలి. కానీ పెరుగుతున్నది. రైతుల ఆత్మహత్యలు లక్షల్లో కొనసాగుతున్నాయి. మీడియా ప్రకటించకున్నా ఆకలిచావులు కొనసాగుతున్నాయి. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆహార ఉత్పత్తిని అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కావాల్సిన ఉత్పత్తులను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించి ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకమైన నిర్లక్ష్యాలను చేస్తున్నాయి. దేశీయ వ్యవసాయాభివృద్దికి బహుళజాతి సంస్థల సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరికాదు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న సదస్సులో దేశీయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్ వంటి వారికి అవకాశం కల్పించకపోవడం నిర్వాహకుల దృక్పదాన్ని తెలియపరుస్తున్నాయి. ఉపన్యాసకులంతా బహుళజాతి కంపెనీలవారే. సదస్సును వారే స్పాన్సర్ చేసారు. స్థానిక వ్యవసాయ నిపుణులకు అవకాశం కల్పించకపోవడంలోనే వారి సామ్రాజ్యవాద అనుకూల విధానం బట్టబయలవుతున్నది. సన్న`చిన్నకారు రైతుల ఉపాధిని దెబ్బతీసే విధానాలను సమైక్యంగా ప్రతిఘటించాలి. ఇందుకు రైతులంతా ముక్తకంఠంతో రాష్ట్ర ` కేంద్ర ప్రభుత్వాల సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆ విధంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి ఉధ్యమించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
25.10.2013

No comments:
Post a Comment