రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఒకటవ స్థానాన్ని, పండ్ల ఉత్పత్తిలో రెండవ స్థానాన్ని మరియు పూల ఉత్పత్తిలో మూడవ స్థానాన్ని కలిగి ఉన్నది. మామిడి, ఆయిల్ ఫామ్, నిమ్మ, బొప్పాయి, బత్తాయి, టమాటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాం. 1982 లో 9 లక్షల ఎకరాలలోహార్టికల్చర్ పంటలు సాగు చేయగా 2010`11 నాటికీ 60లక్షల ఎకరాలలో ఈ పంటలు సాగు చేస్తున్నారు. హార్టికల్చర్ శాఖ రైతులను ప్రోత్సహిస్తూ ఈ పంటల విస్తీర్ణం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నది. కానీ ఉత్పత్తి వచ్చాక రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తున్నారు. ఫలితంగా పెట్టిన పెట్టుబడులు రాక రుణగ్రస్తులవుతున్నారు. ఈ పంటల ధరలకు మార్కెట్‌లో స్థిరత్వం లేదు. మార్కెట్ యార్డులో ఎప్పుడు ఏ రేటు ఉంటుందో తెలియదు. ఒకప్పుడు టమాటా కిలో రు. 40 ఉండగా నేడు (16.04.2011) రైతు రెండు రూపాయలకు అమ్ముకుంటున్నాడు. అన్ని కూరగాయల ధరల పరిస్థితి ఈ విధంగానే ఉంది. కోల్డు స్టోరేజిలను ఏర్పాటు చేసి ఈ పంటలను గ్రేడిరగ్ చేసి అవసరమైన ప్రాంతాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించవచ్చు. కానీ రాష్ట్రప్రభుత్వం ముఖ్యంగా హార్టీకల్చర్‌శాఖ నిర్లిప్తంగా ఉంటున్నది. రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మండలం ఎల్లంపేట గ్రామవాసి గోప సత్తయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. అందులో 1.20 ఎకరాల్లో టమాటా, మరో 1.20 ఎకరంలో వరి, ఒక ఎకరంలో దొండ సాగు చేస్తున్నాడు. అయితే మార్కెట్‌లో టమాటా తగ్గడం వల్ల బాకీ తీర్చలేక 16.04.2011న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. యుపి, కర్నాటక రాష్ట్రాలు రైతుల ప్రయోజనాన్ని కాంక్షించి గిట్టుబాటు ధర కల్పించే పథకాలు అమలు చేస్తున్నారు. బెంగుళూరులో సహకార వ్యవస్థ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్లు సాగుతున్నాయి.
మన రాష్ట్రంలో 106 రైతు బజార్లు ఏర్పాటు చేసారు. ఏటా ఈ మార్కెట్ల ద్వారా కోటి క్వింటాళ్ళ కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. రైతుబజార్లు తిరిగి మద్యదళారుల ఆదిపథ్యం కిందికే వచ్చాయి. మార్కెటింగ్ శాఖకు ఒక శాతం పన్ను వసూలు చేస్తున్నారు. రైతుబజార్ల ద్వారా రైతులకు లాభం చేస్తానన్న విధానం విఫలమైంది.
ఒక విధంగా ఆహార దాన్యాలంత ఉత్పత్తి జరుగుతున్నది. సంకరజాతి విత్తనాల వినియోగం వలన తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తికి అవకాశమున్నది. పైగా కుటుంబసభ్యులందరికీ సంవత్సరం పొడవునా ఉపాధి లభిస్తుంది.ప్లాంటేషన్ పంటలనగా జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్‌ఫాం, పోకచెక్కలు, తమలపాకులు మరియు సుగంథ ద్రవ్యాలు అనగా మిరప, పసుపు, అల్లం, చింతపండు, మిరియాలు, వెల్లుల్లి మాత్రమే చేరి ఉన్నాయి. ఈ పంటల అభివృద్ధికి రాష్ట్ర హార్టీకల్చర్ శాఖ తన బడ్జెట్‌లో 2009`10కి రు.130 కోట్లు, 2010`11లో రు.200కోట్లు మరియు 2011`12లో రు.401.48 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2010`11,2011`12 సంవత్సరాలలో రు.60 కోట్ల చొప్పున గ్రాంటుగా ఇచ్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో హార్టీకల్చర్‌పంటల ఉత్పత్తి 5.38 శాతంగానూ ఉంది. ఇంత ఉత్పత్తిని చేస్తున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
2011`12 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖా మంత్రి ఆనంరామనారాయణరెడ్డి మాట్లాడుతూ మనరాష్ట్రం 2010 హార్టీకల్చర్ లీడర్‌షిప్ అవార్డును పొందిందని చెప్పారు. ఆవార్డు ప్రభుత్వానికి వచ్చిందే తప్ప రైతాంగానికి అవార్డు వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. 99,159 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సాగునీటి వ్యవస్థల ఏర్పాటుకు డ్రిప్, స్పింక్లర్ పథకాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. దళిత, గిరిజనులకు 100 శాతం ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. 2003 నుండి 2008 వరకు ఈ పథకం కింద 1153.72 కోట్లు రుణం ఇవ్వగా ఇందులో 708.11 కోట్లు సబ్సిడీగా ఇచ్చారు. 9.50 లక్షల ఎకరాలకు సూక్ష్మ నీటి వసతి కల్పించారు. కానీ ఈ పథకం ద్వారా దళిత, గిరిజనుల కన్నా వారి పేర్లతో ధనిక వర్గమే లబ్దిపొందుతున్నట్లు విచారణలో తేలింది. పైపులు సరఫరా చేసే కార్పోరేటు కంపెనీలు నాణ్యత లేని పరికరాలిచ్చి లాభాలు సంపాదిస్తున్నాయి. తమ కంపెనీకే ఆర్డర్లు ఇవ్వాలని కోర్టులనాశ్రయించారంటే లాభాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కూరగాయల ఉత్పతి గతంలో సన్న, చిన్నకారు రైతులు రోజువారి ఆదాయం పొందుతూ జీవనం కొనసాగించారు. నేడు కొనసాగుతున్న సంస్కరణల ఫలితంగా కూరగాయల వ్యాపారం కార్పోరేటు సంస్థల పరమైంది. రిలయన్స్,ఆదిత్యబిర్లా, స్మార్ట్‌మరియు సఫల్, స్పెన్సర్, క్యాష్‌అండ్‌క్యారీ, మెట్రో, ఫుడ్‌వరల్డు లాంటి సంస్థలు కూరగాయల వ్యాపారంలో కోట్లాది రూపాయల లాభాలు సంపాదిస్తున్నాయి. రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి వినియోగదారులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. రైతుల పొలం వద్దకే వెళ్ళి తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నారు.
పై పట్టికను పరిశీలిస్తే కార్పోరేటు సంస్థలు రైతులను ఎలా లూటీ చేస్తున్నాయో అర్ధమవుతుంది. ప్రస్తుతం కిలో టమాటా ధర రు.3 కు ఉల్లి రు. 3.50లకు రైతులు అమ్ముకుంటున్నారు. రు.80`100 కిలో ఉల్లి అమ్మి కోట్ల లాభాలు సంపాదించారు. నేటి అననుకూల వాతావరణంలోకూడా(ఎండాకాలం) హార్టీకల్చర్ పంటల ధరలు తగ్గడం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నది.
నేడు కూరగాయలు, సుగంధద్రవ్యాలు ఉత్పత్తి చేసే రైతులు ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియని అనిశ్చిత పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ఈ పంటల కింద సాగవుతున్న విస్తీర్ణాన్ని రెట్టింపు చేసే అవకాశమున్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వ పథకాలు లేవు. సన్న, చిన్నకారు రైతులు కార్పోరేటు సంస్థల కబంద హస్తాలలో చిక్కుకుని గిట్టుబాటు కాక పంటల విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. కర్నూలు, చిత్తూరు జిల్లాలలో టమాటా ఉత్పత్తి చేస్తున్న రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి పశువులకు ఆహారంగా పెడుతున్నారు. మరోవైపున ఈ కార్పోరేటు సంస్థలే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను విపరీతంగా పెంచాయి. కూలీ రేట్లు, ట్రాక్టర్‌తో దున్నటం రేట్లు పెరుగుతున్న సందర్భంలో ఉత్పత్తి ధరలు తగ్గడం రైతులను రుణగ్రస్తులను చేస్తున్నవి. ఉపకరణాల ధరల పెంపుదల మరియు ఉత్పత్తుల కొనుగోలు ద్వారా రెండు విధాలా కార్పోరేటు సంస్థలకే లాభాలు వస్తున్నాయి.
గత డిసెంబర్ జనవరి నెలలో వరదల వల్ల హార్టీకల్చర్ పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.
‘‘ గత వారం క్యారట్ ధర రు.34 కు పెరిగింది.కానీ నేను కిలోకు రు. 13లకే అమ్మా’’ అని గణేషప్ప అనే రైతు తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం 2008`09లో సమగ్ర ప్రణాళిక ప్రకటిస్తూ 22 శాఖల బడ్జెట్ రు. 32,074 కోట్లు ఒక చోట చేర్చి ఈ శాఖలన్నింటినీ అభివృద్థిలోకి తెస్తానని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివేదిక విడుదల చుశాడు. అందులో హార్టీకల్చర్‌కు రు 670 కోట్లు కేటాయింపు చూపారు. కానీ ఆ సంవత్సరం ప్రణాళికా బడ్జెట్ కేటాయించింది రు.14 కోట్లు మాత్రమే. ఇదీ మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం. రాష్ట్రంలో 272 మార్కెట్లకు స్థలాలు, గోదాంలు ఉన్నాయి. ఆ స్థలాల్లో కోల్డు స్టోరేజీల ఏర్పాటుకు అవకాశాలున్నాయి. మార్కెట్టుకు రైతులనుండి వచ్చే ఆదాయంతో పాటు బ్యాంకు రుణాల ద్వారా కోల్డు స్టోరేజీల నిర్మాణం చేయాలి. అందులో గ్రేడిరగు, ప్యాకింగు చేసి నాణ్యత గల సరుకును రాష్ట్రంలోనే పారిశ్రామిక ప్రాంతాలకు, అవసరమైన ప్రాంతాలకు ఎగుమతి చేయటం వలన ధరలో స్థిరత్వం, రైతులకు గిట్టుబాటు ధరలభ్యత మరియు వినియోగదారులకు సరసమైన ధరలకు ఈ పంటలను అందించ వచ్చు. దీని వలన వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. బడా ప్రైవేటు కంపెనీలకు లాభాలు చేకూర్చి పెట్టే సంస్కరణల విధానాలను బహిష్కరించినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పని మార్కెటింగ్ శాఖతో పాటు హార్టీకల్చర్ శాఖ మరియు సివిల్‌సప్లైశాఖల సమన్వయంతో జరపాలి. ప్రస్తుతం బెంగుళూరు నుండి పూలు సుగంధ ద్రవ్యాలు ఎగుమతులు సాగుతున్నాయి. హార్టీకల్చర్ ఉత్పత్తులలో ప్రథమ స్థానంలో ఉన్న మన రాష్ట్రం నుండి అరబ్బు దేశాలకు, దేశంలో కొరత ప్రాంతాలకు ఎగుమతికి అవకాశాలున్నాయి.ఈ పంటలు పండిరచే రైతులతో సలహా కమిటీలను జిలా ్లస్ధాయిలో ఏర్పాటు చేసి పథకాలను అమలు చేయాలిప పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు,పంటభూమి సౌకర్యం, పంటల నిల్వసౌకర్యం కల్పించాలి.దీనికి కావలసింది ప్రభుత్వ లక్ష్య
శుద్దిమాత్రమే.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment